Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. International
  3. అమెరికాలో ఆగని రగడ
ADVERTISEMENT 

అమెరికాలో ఆగని రగడ

International Sakshi User Sakshi Sakshi Time Jun 14, 2025 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
IMMIGRATION-PROTES.jpg

కొనసాగుతున్న ఆందోళనలు, నిరసన కార్యక్రమాలు  

అక్రమ వలసదారుల అరెస్టుల పట్ల ఆగ్రహం  

నేడు భారీ ర్యాలీలకు సిద్ధమవుతున్న నిరసనకారులు  

ఇమిగ్రేషన్‌ దాడులు, డిపోర్టేషన్లు కొనసాగుతాయన్న ట్రంప్‌ ప్రభుత్వం  

వాషింగ్టన్‌/అస్టిన్‌:  అమెరికాలో వలసదారుల ఆందోళనలు, నిరసన కార్యక్రమాలతో ప్రధాన నగరాలు అట్టుడికిపోతున్నాయి. మరోవైపు ఫెడరల్‌ ఇమ్మిగ్రేషన్‌ అండ్‌ కస్టమ్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌(ఐసీఈ) ఆధ్వర్యంలో అక్రమ వలసదారుల అరెస్టులు, గెంటివేతలు కొనసాగుతూనే ఉన్నాయి. రాజధాని వాషింగ్టన్‌ డీసీలో శనివారం భారీ ఎత్తున మిలటరీ పరేడ్‌ జరుగనుంది. విదేశాల నుంచి అతిథులు హాజరు కాబోతున్నారు. 

ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా ‘నో కింగ్స్‌’కార్యక్రమాలు నిర్వహించాలని, నిరసనలు ఉధృతం చేయాలని వలసదారులు నిర్ణయించారు. దాదాపు 2 వేల ప్రాంతాల్లో ర్యాలీలు చేపట్టేలా వ్యూహం రూపొందించారు. ఫిలడెల్ఫియాలో భారీ ర్యాలీకి సిద్ధమవుతున్నారు. దేశవ్యాప్తంగా గత వారం రోజులుగా ఆందోళనలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. కొన్నిచోట్ల శాంతియుతంగానే జరుగుతున్నప్పటికీ, మరికొన్నిచోట్ల హింసాత్మకంగా మారుతున్నాయి.

 లాస్‌ ఏంజెలెస్, స్పాకేన్‌ సిటీలోని సమస్యాత్మక ప్రాంతాల్లో కర్ఫ్యూ కొనసాగుతోంది. ఇదిలా ఉండగా, ఒత్తిళ్లకు లొంగిపోయే ప్రసక్తే లేదని, ఇమ్మిగ్రేషన్‌ రైడ్స్, డిపోర్టేషన్లు యథాతథంగా కొనసాగుతాయని డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రభుత్వం తేలి్చచెప్పింది. అక్రమ వలసదారులు దేశం విడిచి వెళ్లిపోవాలని, లేకపోతే బలవంతంగా పంపించక తప్పదని స్పష్టంచేసింది.  

అధికారులపై రాళ్లు, టపాకాయలతో దాడులు  
అక్రమ వలసదారుల అరెస్టులకు వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనలపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. లాస్‌ వెగాస్‌లో 94 మంది నిరసనకారులను పోలీసులు అరెస్టు చేశారు. వారిపై పలు అభియోగాలు మోపారు. బుధవారం రాత్రి ఇక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దాదాపు 800 మంది వలసదారులు అధికారులపై విరుచుకుపడ్డారు. రాళ్లు, మంచినీటి సీసాలు విసిరారు. ఈ సందర్భంగా జరిగిన ఘర్షణలో నలుగురు అధికారులు గాయపడ్డారు. 

జనాన్ని చెదరగొట్టడానికి పోలీసులు బాష్పవాయువు, రబ్బర్‌ బుల్లెట్లు ప్రయోగించారు. మిషగాన్‌లో గురువారం ఆందోళనలు జరిగాయి. వందలాది మంది పార్క్‌ ప్లాజాలో గుమికూడారు. ట్రంప్‌ ప్రభుత్వ తీరుపై దుమ్మెత్తిపోశారు. తమను బలవంతంగా బయటకు వెళ్లగొట్టాలని చూస్తే చట్టపరంగా పోరాడుతామని హెచ్చరించారు. సియాటెల్‌ డౌన్‌టౌన్‌లో సైతం నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి.

 తమను అడ్డుకొనేందుకు ప్రయత్నించిన పోలీసులపై నిరసనకారులు పెప్పర్‌స్ప్రే చల్లారు. టపాకాయలు, రాళ్లు విసిరారు. ఇమ్మిగ్రేషన్‌ అండ్‌ కస్టమ్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ను రద్దు చేయాలని నినదించారు. వాషింగ్టన్‌ రాష్ట్రంలోని స్పాకేన్‌ సిటీలో 30 మందికిపైగా నిరసనకారులు అరెస్టయ్యారు. టెక్సాస్‌ రాష్ట్రంలోని శాన్‌ ఆంటోనియో, అరిజోనా రాష్ట్రంలోని టక్సన్‌లో ఆందోళనలు శాంతియుతంగా జరుగుతున్నాయి. అలాస్కాలో 40 మంది వలసదారులను పోలీసులు నిర్బంధించారు. 

లాస్‌ ఏంజెలెస్‌లో గత వారం రోజుల్లో 470 మంది అరెస్టయ్యారు. న్యూజెర్సీలో ఫెడరల్‌ ఇమ్మిగ్రేషన్‌ డిటెన్షన్‌ సెంటర్‌ను నిరసనకారులు చుట్టుముట్టారు. ఈ కేంద్రంలో చాలామంది అక్రమ వలసదారులను అధికారులు నిర్బంధించారు. వీరిని వినిపించేందుకు నిరసనకారులు ప్రయత్నించగా అధికారులు అడ్డుకున్నారు. డొనాల్డ్‌ ట్రంప్‌ ఆదేశాలతో న్యూజెర్సీలో వెయ్యి పడకలతో డిటెన్షన్‌ సెంటర్‌ ఏర్పాటు చేశారు. 

శనివారం ఆందోళనలు మరింత ఉధృతరూపం దాల్చే అవకాశం ఉన్నట్లు సంకేతాలు రావడంతో పలు రాష్ట్రాల్లో ముందు జాగ్రత్తగా నేషనల్‌ గార్డు దళాలను మోహరిస్తున్నారు. ‘నో కింగ్స్‌’ర్యాలీలకు అనుమతి లేదని గవర్నర్లు చెబుతున్నారు. హింస, విధ్వంసానికి పాల్పడేవారిపై త్వరగా విచారణ చేపట్టాలని అమెరికా న్యాయ శాఖ అన్ని రాష్ట్రాల అటారీ్నలకు గురువారం సందేశం పంపించింది. చట్టవ్యతిరేక కార్యకలాపాల పట్ల కఠినంగా వ్యవహరించాలని ఆదేశించింది.  

ట్రంప్‌ నిర్ణయానికి కోర్టు మద్దతు  
ఆందోళనలు అణచివేయడానికి లాస్‌ఏంజెలెస్‌కు 4 వేల నేషనల్‌ గార్డు దళాలను, 700 మంది మెరైన్‌ గార్డులను రంగంలోకి దించాలని అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు కాలిఫోరి్నయాకు నేషనల్‌ గార్డు సిబ్బందిని పంపించాలన్న నిర్ణయాన్ని తప్పుపడుతూ ఫెడరల్‌ జడ్జి ఇచ్చిన ఉత్తర్వును తొమ్మిదో యూఎస్‌ సర్క్యూట్‌ కోర్టు ఆఫ్‌ అప్పీల్స్‌ తాత్కాలికంగా నిలిపివేసింది. ట్రంప్‌ నిర్ణయానికి పరోక్షంగా మద్దతు పలికింది. కోర్టు నిర్ణయంతో నేషనల్‌ గార్డు సిబ్బందికి అడ్డంకి తొలగిపోయింది. నిరసనకారులను ఎక్కడికక్కడ అరెస్టు చేయాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది.   
 

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
USA
immigrants
concerns
washington DC
Military Parade
Donald trump
US Immigration and Customs Enforcement
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

హర్ముజ్‌ జలసంధిపై కొత్త ఆధిపత్య పోరు!

హర్ముజ్‌ జలసంధిపై కొత్త ఆధిపత్య పోరు!

మళ్లీ ట్రిగ్గర్‌ నొక్కిన ట్రంప్.. మరింత ముదిరిన యుద్ధం

మళ్లీ ట్రిగ్గర్‌ నొక్కిన ట్రంప్.. మరింత ముదిరిన యుద్ధం

పుతిన్‌ తగ్గేదేలే.. మళ్లీ మంటలు రేపే యుద్ధమా?

పుతిన్‌ తగ్గేదేలే.. మళ్లీ మంటలు రేపే యుద్ధమా?

భీకరంగా మారిన అమెరికా-ఇరాన్‌ యుద్ధం!

భీకరంగా మారిన అమెరికా-ఇరాన్‌ యుద్ధం!

ప్రపంచకప్‌ నుంచి అమెరికా నిష్క్రమణ

ప్రపంచకప్‌ నుంచి అమెరికా నిష్క్రమణ

హార్మూజ్‌పై ఇరాన్ షాకింగ్‌ కామెంట్స్‌.. స్ట్రాంగ్‌ వార్నింగ్

హార్మూజ్‌పై ఇరాన్ షాకింగ్‌ కామెంట్స్‌.. స్ట్రాంగ్‌ వార్నింగ్

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.