Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
search Subscribe Subscribe Epaper icon ఈ-పేపర్ Live TV లైవ్ టీవీ Live TV లైవ్ టీవీ
download app యాప్ download app Download App
మమ్మల్ని అనుసరించండి
  • facebook
  • x
  • instagram
  • youtube
  • whatsapp
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫొటోలు
  • వీడియోలు
  • close logo
  • search
    Epaper icon ఈ-పేపర్ Live TV లైవ్ టీవీ download app యాప్

    విభాగాలు

  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • మమ్మల్ని అనుసరించండి

    facebook x instagram youtube whatsapp whatsapp whatsapp
  • Sakshi Search
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV

Breadcrumb

  1. Home
  2. International
  3. పనామాను వణికించిన భూకంపం.. తొలగిన సునామీ భయం!
ADVERTISEMENT

పనామాను వణికించిన భూకంపం.. తొలగిన సునామీ భయం!

International Sakshi User Sakshi Sakshi Time Oct 10, 2026 08:53 AM IST Sakshi Read Time Read Time: 4 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Google
Panama_Quake_News.jpg

మధ్య అమెరికా దేశం పనామాను భారీ భూకంపం వణికించింది. రిక్టర్‌ స్కేలుపై 7.7 తీవ్రతతో వచ్చిన ప్రకంపనలతో ప్రజలు భయంతో ఇళ్ల నుంచి, ఎత్తైన భవనాల నుంచి బయటకు పరుగులు తీశారు. కొన్ని ప్రాంతాల్లో భవనాలు కూలిపోగా.. రహదారులు దెబ్బతిన్నాయి. తొలుత పనామాతో పాటు పలు దేశాల తీర ప్రాంతాలకు జారీ చేసిన సునామీ హెచ్చరికలను అధికారులు ఆ తర్వాత ఉపసంహరించారు. దీంతో తీర ప్రాంత ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. అయితే భూకంపం వల్ల జరిగిన నష్టంపై అధికారులు అంచనాలు కొనసాగిస్తున్నారు.

భారత కాలమానం ప్రకారం.. శుక్రవారం రాత్రి పనామాను భారీ భూకంపం వణికించింది. హెర్రెరా ప్రావిన్స్‌లోని పిటలోజా అర్రిబా ప్రాంతానికి సమీపంలో ఉన్నట్లు అమెరికా భూగర్భ సర్వే సంస్థ (యూఎస్‌జీఎస్‌) వెల్లడించింది. పనామా రాజధాని పనామా సిటీకి సుమారు 200 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు తెలిపింది. దాదాపు నిమిషం పాటు ప్రకంపనలు కొనసాగడంతో దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో భయాందోళనలు నెలకొన్నాయి.

కోక్లే ప్రావిన్స్‌లోని పెనోనోమే ప్రాంతంలో చారిత్రక చర్చి, గవర్నర్‌ కార్యాలయ భవనం సహా పలు నిర్మాణాలు దెబ్బతిన్నాయి. కొన్ని ప్రాంతాల్లో రహదారులు కూలిపోవడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. హెర్రెరా, లాస్‌ శాంటోస్‌ ప్రాంతాల్లోనూ ఇళ్లు, ఇతర నిర్మాణాలకు నష్టం వాటిల్లినట్లు వార్తలు వెలువడ్డాయి. కొన్ని ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరా, ఫోన్‌కాల్స్‌-ఇంటర్నెట్‌ సేవలకు అంతరాయం కలిగింది.

A massive magnitude 7.7 earthquake struck Panama, shaking buildings more than 100 miles away and prompting evacuations, according to the U.S. Geological Survey. Tremors were felt in Panama City, where buildings shook and people evacuated into the streets. https://t.co/46kFq5wpSV https://t.co/jsr5g6uLDv

— CBS News (@CBSNews) October 9, 2026

80కి పైగా ప్రకంపనలు
ప్రధాన భూకంపం తర్వాత వరుసగా ప్రకంపనలు(ఆఫ్టర్‌ షాక్స్‌) రావడంతో ప్రజలు అప్రమత్తమయ్యారు. వాటిల్లో ఒకటి 6.6 తీవ్రతతో సంభవించింది. పనామా సిటీలో ఎత్తైన భవనాల నుంచి ప్రజలను ఖాళీ చేయించారు. టోకుమెన్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమాన కార్యకలాపాలను కొద్దిసేపు నిలిపివేసి, తనిఖీల అనంతరం తిరిగి ప్రారంభించారు. పనామా కాలువలో మాత్రం కార్యకలాపాలకు అంతరాయం కలగలేదని సమాచారం. భూకంపం కారణంగా ప్రాణనష్టం జరిగినట్లు తొలుత అధికారికంగా ధ్రువీకరించలేదు. అయితే పలువురికి స్వల్ప గాయాలైనట్లు, దెబ్బతిన్న ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నట్లు వార్తా సంస్థలు వెల్లడించాయి. భవనాల నష్టం, రహదారుల పరిస్థితి, ఇతర మౌలిక సదుపాయాలపై అధికారులు అంచనా వేస్తున్నారు.

భయంతో.. 
భూకంప కేంద్రానికి సుమారు 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న రాజధాని పనామా సిటీలోనూ ప్రకంపనల తీవ్రత కనిపించింది. ఎత్తైన భవనాల్లో ఉన్నవారు భయంతో బయటకు పరుగులు తీశారు. 15 అంతస్తుల భవనం నుంచి రెండోసారి బయటకు వచ్చిన సాలమన్‌ ఆండియన్‌ అనే వ్యక్తి.. ఫర్నిచర్‌, మంచం, వంటగదిలోని వస్తువులు బలంగా కదిలాయని వెల్లడించారు.

TERREMOTO EN PANAMÁ ▪️Panamá afectado por este terrible terremoto de 7.6. Se sintió en Ciudad de Panamá, hay Alerta de tsunami; se produjeron varias réplicas. #Terremoto #Panamá #Sismo https://t.co/udnuMfvWiQ

— @ALTOS_NOTICIASpy (@Altosnoticiasp1) October 9, 2026

20 అంతస్తులకు పైగా ఉన్న ఓ భవనం పైకప్పుపై ఏర్పాటు చేసిన స్విమ్మింగ్‌ పూల్‌ నుంచి నీరు కిందకు జారిపడుతున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. పనామా కాలువపై ఉన్న ఓ వంతెన సైతం తీవ్రంగా కంపించినా కూలిపోలేదు. ఆ సమయంలో వాహనాలు వంతెనపై ప్రయాణిస్తున్న దృశ్యాలు ఆందోళన కలిగించాయి.

సునామీ వార్నింగ్‌ ఎత్తివేత
భూకంపం తర్వాత పనామాతో పాటు కొలంబియా, కోస్టారికా, ఈక్వెడార్‌, పెరూ, నికరాగువా, గ్వాటెమాలా, ఎల్‌ సాల్వడార్‌, మెక్సికో తీర ప్రాంతాలకు సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి. అనంతరం సునామీ ముప్పు తొలగిపోయినట్లు అధికారులు ప్రకటించారు. అయినప్పటికీ తీర ప్రాంత ప్రజలు స్థానిక అధికారుల సూచనలు పాటించాలని, భూకంపానంతర ప్రకంపనల(After Shocks) పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

అధ్యక్షుడి ప్రకటన.. విద్యాసంస్థలు బంద్‌
భూకంప తీవ్రతను దృష్టిలో పెట్టుకుని పనామా అధ్యక్షుడు జోస్‌ రౌల్‌ ములినో ప్రజలు ఆందోళన చెందవద్దని, అధికారిక ప్రకటనలను మాత్రమే నమ్మాలని ప్రజలకు పిలుపునిచ్చారు. భూకంపం తర్వాత పరిస్థితిని సమీక్షించేందుకు ఆయన పెనోనోమే ప్రాంతాన్ని సందర్శించారు. దేశవ్యాప్తంగా పాఠశాలల్లో తరగతులను నిలిపివేస్తున్నట్లు విద్యాశాఖ ప్రకటించింది. యూనివర్సిటీ ఆఫ్‌ పనామా సహా విద్యాసంస్థల్లోనూ ముందుజాగ్రత్త చర్యలు చేపట్టారు. ఆసుపత్రులు, ఆరోగ్య కేంద్రాలు, అగ్నిమాపక కేంద్రాల్లోనూ నష్టం నమోదైంది. 17 ఆరోగ్య సంస్థల్లో భవనాలకు సంబంధించిన సమస్యలు గుర్తించగా, కొన్ని ఆసుపత్రుల్లో రోగులను ముందుజాగ్రత్తగా బయటకు తరలించారు. పలు పాఠశాలలు, అగ్నిమాపక కేంద్రాల్లోనూ గోడలకు పగుళ్లు, పైకప్పుల పెచ్చులు ఊడిపోవడం వంటి నష్టం కనిపించింది. అధ్యక్షుడు, అధికారులు నష్టంపై సమీక్ష కొనసాగిస్తుండగా.. పొరుగుదేశాలు, అమెరికా సైతం సహాయానికి ముందుకొచ్చాయి.

గతంలోనూ లాటిన్‌ అమెరికాలో భారీ విధ్వంసం
లాటిన్‌ అమెరికా ప్రాంతం భూకంపాల ముప్పు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఒకటి. భూమి లోపల ఉన్న టెక్టానిక్‌ పలకల కదలికల కారణంగా ఇక్కడ తరచూ తీవ్ర ప్రకంపనలు సంభవిస్తుంటాయి. 2010లో హైతీలో సంభవించిన 7.0 తీవ్రత భూకంపం భయానక విధ్వంసాన్ని సృష్టించింది. అధికారిక అంచనాల ప్రకారం సుమారు 3.16 లక్షల మంది ప్రాణాలు కోల్పోగా, మరో 3 లక్షల మంది గాయపడ్డారు. అదే ఏడాది చిలీలో 8.8 తీవ్రతతో వచ్చిన భూకంపం, దాని తర్వాత సంభవించిన సునామీ కారణంగా 521 మంది మరణించగా, మరో 56 మంది ఆచూకీ లభించలేదు. సుమారు 3.7 లక్షల ఇళ్లు దెబ్బతినడమో లేదంటే పూర్తిగా ధ్వంసమయ్యాయి. అంతకుముందు 1960లో చిలీలో సంభవించిన 9.5 తీవ్రత భూకంపం ఆధునిక చరిత్రలో నమోదైన అత్యంత శక్తిమంతమైన భూకంపంగా గుర్తింపు పొందింది. ఆ భూకంపం, దాని తర్వాత వచ్చిన సునామీ కారణంగా చిలీలోనే సుమారు 1,600 మంది ప్రాణాలు కోల్పోగా, హవాయి, జపాన్‌, ఫిలిప్పీన్స్‌ తదితర ప్రాంతాల్లో మరో 200 మంది మరణించారు. 


ఇదీ చదవండి: ఏకంగా ఐసీసీపైనే అమెరికా ఆంక్షలు

ADVERTISEMENT
ADVERTISEMENT
tags Tags:
world news
panama
Earthquake
Massive Earth Quake
Tsunami Warn
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

జమ్ముకశ్మీర్‌లో భూకంపం.. 3.1 తీవ్రత నమోదు

జమ్ముకశ్మీర్‌లో భూకంపం.. 3.1 తీవ్రత నమోదు

జపాన్‌లో భారీ భూకంపం..6.0 తీవ్రత నమోదు!

జపాన్‌లో భారీ భూకంపం..6.0 తీవ్రత నమోదు!

అఫ్గానిస్థాన్‌లో భూకంపం.. 4.2 తీవ్రత నమోదు!

అఫ్గానిస్థాన్‌లో భూకంపం.. 4.2 తీవ్రత నమోదు!

హైదరాబాద్‌లో భారీ శబ్దాలు, అసలేం జరిగింది?

హైదరాబాద్‌లో భారీ శబ్దాలు, అసలేం జరిగింది?

దక్షిణ పసిఫిక్‌లో భారీ భూకంపం.. రెండుసార్లు ప్రకంపనలు

దక్షిణ పసిఫిక్‌లో భారీ భూకంపం.. రెండుసార్లు ప్రకంపనలు

టిబెట్ లో భారీ భూకంపం కూలిన ఇండ్లు

టిబెట్ లో భారీ భూకంపం కూలిన ఇండ్లు

మరిన్ని వార్తలు

13న ప్రపంచం అంతం? 1960లోనే వెల్లడైన భవిష్యవాణి!

13న ప్రపంచం అంతం? 1960లోనే వెల్లడైన భవిష్యవాణి!

Pakistan: ప్రముఖ టీవీ యాంకర్ దారుణ హత్య!

Pakistan: ప్రముఖ టీవీ యాంకర్ దారుణ హత్య!

షేక్‌ హసీనా సంచలన నిర్ణయం.. బంగ్లాకు పయనం

షేక్‌ హసీనా సంచలన నిర్ణయం.. బంగ్లాకు పయనం

Maya Jama: ‘లవ్‌ ఐలాండ్‌’కు గుడ్‌బై.. కొత్త ప్రయాణానికి అడుగులు...

Maya Jama: ‘లవ్‌ ఐలాండ్‌’కు గుడ్‌బై.. కొత్త ప్రయాణానికి అడుగులు...

yemen: 19 మంది భారతీయులకు విముక్తి.. స్వదేశానికి పయనం!

yemen: 19 మంది భారతీయులకు విముక్తి.. స్వదేశానికి పయనం!

కూలీగా మొదలై.. వందల మందికి బాస్‌గా ఎదిగి!

కూలీగా మొదలై.. వందల మందికి బాస్‌గా ఎదిగి!

  

ADVERTISEMENT
 
 
ADVERTISEMENT
ADVERTISEMENT
 
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Jagati Publications Limited.
Powered by Yodasoft