Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. International
  3. పాక్‌తో బలపడిన బంధం.. అమెరికాకు తొలి భూ ఖనిజాల ఎగుమతి
ADVERTISEMENT 

పాక్‌తో బలపడిన బంధం.. అమెరికాకు తొలి భూ ఖనిజాల ఎగుమతి

International Sakshi User Sakshi Sakshi Time Oct 7, 2025 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
pak-main.jpg

ఇస్లామాబాద్: పాకిస్తాన్‌- అమెరికాల మధ్య బంధం బలపడుతోంది. తాజాగా పాకిస్తాన్- యునైటెడ్ స్టేట్స్‌లు అరుదైన భూ ఖనిజాల ఎగుమతి కోసం కుదుర్చుకున్న ఒప్పందాన్ని అమలు చేసే దిశగా ముందడుగు వేశాయని, దీంతో ఇరు దేశాల ఆర్థిక, వ్యూహాత్మక భాగస్వామ్యం నూతన దశలోకి ప్రవేశిస్తున్నదని వార్తా పత్రిక ‘డాన్’ పేర్కొంది. గత సెప్టెంబర్‌లో పాకిస్తాన్‌తో భూ ఖనిజాల ఎగుమతి కోసం అమెరికా ఒక అవగాహనా ఒప్పందం (ఎంఓయూ)పై సంతకం చేసింది.

ఈ స్ట్రాటజిక్ మెటల్స్ (యూఎస్‌ఎస్‌ఎం) ఒప్పందంలో భాగంగా పాకిస్తాన్‌ తొలిసారిగా ఖనిజ నమూనాలను అమెరికాకు పంపింది. పాకిస్తాన్‌లో ఖనిజ ప్రాసెసింగ్, అభివృద్ధి సౌకర్యాల ఏర్పాటుకు అమెరికన్ సంస్థ దాదాపు 500 మిలియన్‌ డాలర్లు పెట్టుబడిగా పెట్టాలని యోచిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా పారిశ్రామిక వృద్ధికి ఖనిజరంగం కీలకంగా నిలుస్తుంది. ఇప్పుడు ఈ అరుదైన భూ ఖనిజాల రవాణాతో పాకిస్తాన్‌​ మరో ముందడుగు వేసిందని వాషింగ్టన్ వర్గాలు పేర్కొన్నాయి.

ఫ్రాంటియర్ వర్క్స్ ఆర్గనైజేషన్ (ఎఫ్‌డబ్యూఓ) సమన్వయంతో దేశీయంగా తయారైన ఈ  ఖనిజంలో యాంటిమోనీ, రాగి సాంద్రత, నియోడైమియం, ప్రాసోడైమియం వంటి అరుదైన భూమి మూలకాలన్నాయి.  యూఎస్‌ఎస్‌ఎం ఒక ప్రకటనలో  ఈ రవాణాను పాకిస్తాన్-యూఎస్ వ్యూహాత్మక భాగస్వామ్యంలో ఒక మైలురాయిగా అభివర్ణించింది. ఈ ఒప్పందం అన్వేషణ, ప్రాసెసింగ్  మొదలుకొని పాకిస్తాన్ లోపల శుద్ధి కర్మాగారాల స్థాపన వరకు అభివృద్ధి చెందనుంది. ఈ రంగంలో ఇరు దేశాల సహకారం కోసం ఒక రోడ్‌మ్యాప్‌కు రూపకల్పన చేయనున్నారు. ఈ సందర్భంగా యూఎస్‌ఎస్‌ఎం సీఈఓ స్టేసీ డబ్ల్యూ హాస్టీ మాట్లాడుతూ ఈ మొదటి డెలివరీ.. యూఎస్‌ఎస్‌ఎం, పాకిస్తాన్‌ల ఫ్రాంటియర్ వర్క్స్ ఆర్గనైజేషన్ మధ్య సహకారానికి సంబంధించిన నూతన అధ్యాయాన్ని తెరుస్తుందన్నారు.

‘డాన్’ పేర్కొన్న వివరాల ప్రకారం ఈ ఒప్పందంతో పాకిస్తాన్‌ ప్రపంచంలోని కీలక ఖనిజాల మార్కెట్‌పై పట్టు సాధించగలదు. ఆర్థిక పరిపుష్టిని అందుకునేందుకు అవకాశం ఏర్పడుతుంది.  ఇదిలావుండగా పాకిస్తాన్ ప్రతిపక్ష పార్టీ పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పీటీఐ) ఈ ఒప్పందంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. పీటీఐ సమాచార కార్యదర్శి షేక్ వక్కాస్ అక్రమ్ దీనిపై స్పందిస్తూ పాక్‌ ప్రభుత్వం వాషింగ్టన్‌తో రహస్య ఒప్పందం కుదుర్చుకున్నట్లుందని, ఒప్పందపు  పూర్తి వివరాలను బహిరంగంగా విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. ఇటువంటి ఒప్పందాలు దేశంలో ఇప్పటికే ఉన్న అస్థిర పరిస్థితిని మరింత రెచ్చగొడతాయని అక్రమ్ ఆరోపించారు. 

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
Pakistan
USA
MoU
Minerals
Ship
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

పాక్‌కు ముచ్చెమటలు పట్టిస్తున్న ఇరాన్‌ కొత్త ఎత్తుగడ!

పాక్‌కు ముచ్చెమటలు పట్టిస్తున్న ఇరాన్‌ కొత్త ఎత్తుగడ!

భీకరంగా మారిన అమెరికా-ఇరాన్‌ యుద్ధం!

భీకరంగా మారిన అమెరికా-ఇరాన్‌ యుద్ధం!

ప్రపంచకప్‌ నుంచి అమెరికా నిష్క్రమణ

ప్రపంచకప్‌ నుంచి అమెరికా నిష్క్రమణ

హార్మూజ్‌పై ఇరాన్ షాకింగ్‌ కామెంట్స్‌.. స్ట్రాంగ్‌ వార్నింగ్

హార్మూజ్‌పై ఇరాన్ షాకింగ్‌ కామెంట్స్‌.. స్ట్రాంగ్‌ వార్నింగ్

మళ్లీ పాక్‌ కెప్టెన్‌గా బాబర్‌ ఆజం​..!

మళ్లీ పాక్‌ కెప్టెన్‌గా బాబర్‌ ఆజం​..!

బలూచిస్థాన్‌లో ఘోర ప్రమాదం.. 40 మంది దుర్మరణం

బలూచిస్థాన్‌లో ఘోర ప్రమాదం.. 40 మంది దుర్మరణం

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.