Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. International
  3. హంగేరియన్‌ రచయితకు సాహిత్య నోబెల్‌
ADVERTISEMENT 

హంగేరియన్‌ రచయితకు సాహిత్య నోబెల్‌

International Sakshi User Sakshi Sakshi Time Oct 10, 2025 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
nobel2.jpg

రచనల్లో తనదైన ఊహా ప్రపంచాన్ని సృష్టించిన లాస్లో

స్టాక్‌హోం: కటిక చీకట్లోనూ ఆశలు వదులుకో కూడదని, విధ్వంసానికి విచలితమైన సమాజంలో తన అక్షరాలలో హాస్యాన్ని, వ్యంగ్యాన్ని కలగలిపి చైతన్యం రగిలించిన హంగెరీ రచయిత లాస్లో క్రస్నహోర్కాయ్‌కి ప్రతిష్టాత్మక నోబెల్‌ సాహిత్య పురస్కారం లభించింది. 

స్వీడన్‌లోని స్టాక్‌హోంలో గురువారం నోబెల్‌ పురస్కార కమిటీలోని స్వీడిష్‌ అకాడెమీ అధికారి స్టీవ్‌ సెమ్‌ సాండ్‌బెర్గ్‌ 2025 ఏడాదికిగాను లాస్లోకు సాహిత్య నోబెల్‌ ఇవ్వాలని నిర్ణయించినట్టు ప్రకటించారు. ‘నాగరికత విధ్వంసం మధ్యలోనూ కళ శక్తిని పునరుద్ఘాటిస్తూ దూరదృష్టితో లాస్లో చేసిన రచనలకు నోబెల్‌ పురస్కారం అందజేస్తున్నాం’అని స్టీవ్‌ మీడియా సమావేశంలో వెల్లడించారు. నోబెల్‌ పురస్కారం లభించటంపై లాస్లో సంతోషం వ్యక్తంచేశారు. డిసెంబర్‌లో స్టాక్‌హోంలో లాస్లోకు ఈ పురస్కారాన్ని అందజేస్తారు. 

ఇతిహాసాల్లాంటి రచనలు
లాస్లో రచనల్లో ప్రధానంగా అభౌతికమైన, అలౌకికమైన అంశాలే ఉంటాయి. వాటికి తనదైన హాస్య చతురతను జోడించి సమాజంలోని అణచివేతలు, విధ్వంసాలను ఆయన విమర్శించే తీరు అద్భుతంగా ఉంటుంది. అందుకే స్వీడిష్‌ అకాడెమీ లాస్లో రచనలను ఇతిహాసాలుగా అభివర్ణించింది. ‘కోఫ్కా, థామస్‌ బెర్న్‌హార్డ్‌        వంటి గొప్ప రచయితలు అనుసరించిన మధ్య యూరప్‌ సంప్రదాయాన్ని కొనసాగించిన గొప్ప ఇతిహాస రచయిత క్రాస్నహోర్‌కై. అసంబద్ధత, వింతైన ఊహలతో ఆయన రచనలు మూర్తీభవించాయి’అని ప్రశంసించింది. 

కమ్యూనిస్టు రష్యా ప్రభావం
లాస్లో 1954లో హంగెరీలోని గ్యులా ప్రాంతంలో జన్మించారు. హంగెరీలో విప్లవానికి రెండేళ్ల ముందు ఆయన పుట్టారు. ఆ విప్లవాన్ని సోవియట్‌ యూనియన్‌ హింసాత్మకంగా అణచివేసిన తర్వాత హింగెరీలో ఏర్పడిన నాగరికత విధ్వంస పరిస్థితులు లాస్లోపై తీవ్ర ప్రభావం చూపాయి. అందుకే ఆయన రచనల్లో నాగరికత అంతం, ఆ తర్వాత ఊహా ప్రపంచాల ఆవిర్భావం, అందులోని అసంబద్ధమైన వింతలు అధికంగా కనిపిస్తాయి. 

లాస్లో 1985లో తన తొలి రచన ‘సటంటాంగో’ను ప్రచురించారు. మొదటి నవలతోనే ఆయనకు విపరీతమైన గుర్తింపు లభించింది. ఆ తర్వాత రాసిన మెలాంకోలీ ఆఫ్‌ రెసిస్టెన్స్‌ (1989) కూడా మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. ఈ రెండు నవలలను హంగెరీ సినీ దర్శకుడు వెలా తార్‌ ఆ తర్వాత సినిమాలుగా తీశారు. సెజెడ్, బుడాపెస్ట్‌లో ఉన్నతవిద్య అభ్యసించిన లాస్లో.. యూరప్‌ దేశాలన్నీ తిరిగి అక్కడి పరిస్థితులను అధ్యయనం చేసి తన రచనల్లో వాటిని తనదైన ఊహాత్మక శైలితో పొందుపర్చారు. ‘పిచ్చితనంలోనూ వాస్తవికతను పరీక్షించటమే నా రచనల లక్షణం’అని లాస్లో గతంలో పేర్కొన్నారు. 

వార్‌ అండ్‌ వార్, సీబో దేర్‌ బిలో (2008) రచనలు కూడా ఆయనకు మంచి గుర్తింపు తెచ్చాయి. లాస్లో ఇప్పటివరకు 5 నవలలు మాత్రమే రాసినా, అవన్నీ యూరోపి యన్‌ సాహిత్యంలో ఆణిముత్యాల్లా ప్రశంసలు అందుకున్నాయి. 2021లో రాసిన ‘హెర్చెట్‌ 07767’నవల గొప్ప సమకాలీన జర్మన్‌ నవలగా గుర్తింపు పొందింది. ప్రముఖ భారతీయ ఇంగ్లిష్‌ రచయిత ఆర్‌కే నారాయన్‌ రచనల్లో కనిపించే కల్పిత పట్టణం మాల్గుడి మాదిరిగా లాస్లో కూడా తన ప్రతి రచనలోనూ ఓ కల్పిత పట్టణాన్నో, గ్రామాన్నో కేంద్రంగా చేసుకొంటారు. 
 

ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
Nobel Prize
litalature
winner
writer
సంబంధిత పోల్స్
Loading..

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.