Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. International
  3. ఖైదీలపై కాల్పులు 
ADVERTISEMENT 

ఖైదీలపై కాల్పులు 

International Sakshi User Sakshi Sakshi Time Sep 12, 2025 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
Nepal-Prison-Breaks-Escalat.jpg

ముగ్గురి మృతి 

నేపాల్‌లో కొనసాగుతున్న ఖైదీల పరారీపర్వం 

మొత్తంగా 25 జైళ్ల నుంచి బయటపడ్డ 15,000 మంది ఖైదీలు 

కర్ఫ్యూ సమయంలో కాస్త సడలింపు 

ఇంకా భయం గుప్పిట్లో నేపాలీలు 

కాఠ్మండు: నేపాల్‌లో ఓవైపు ఉద్యమం, మరోవైపు ప్రభుత్వం కుప్పకూలడంతో శాంతిభద్రతలు కట్టుతప్పి ఖైదీలు చెలరేగిపోయారు. దేశవ్యాప్తంగా దాదాపు 25 కారాగారాల నుంచి 15 వేల మంది ఖైదీలు జైలు గదులు బద్దలుకొట్టిమరీ బయటపడ్డారు. పరారై బయటికొచ్చి స్వేచ్ఛావాయువులు పీల్చారు. నేరస్తుల పరారీతో అప్రమత్తమైన సైన్యం పలుచోట్ల ఖైదీలను వెంటబడిమరీ పట్టుకుంది. కొన్ని చోట్ల జైలు సిబ్బందిపై ఖైదీలు ఎదురుతిరిగారు. 

మాధేశ్‌ ప్రావిన్సులోని రామెఛాప్‌ జిల్లా కారాగార కేంద్రంలో గురువారం ఉదయం ఒక్కసారిగా ఖైదీలు జైలుసిబ్బందితో ఘర్షణకు దిగారు. జైలు గోడను బద్దలుకొట్టేందుకు ఖైదీలు గ్యాస్‌ సిలిండర్‌ను పేల్చేశారు. దీంతో ఘర్షణ మొదలైంది. పారిపోయేందుకు ప్రయతి్నంచిన వారిని నిలువరించేందుకు సిబ్బంది కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ముగ్గురు ఖైదీలు మరణించారు. పలువురు గాయపడ్డారు. దీంతో సోమవారం మొదలైన హింసాత్మక ఘటనల్లో ఇప్పటిదాకా సంభవించిన మరణాల సంఖ్య గురువారానికి 34కు పెరిగింది. 1,338 మందికి పైగా గాయాలపాలయ్యారు.  

భారత్‌లోకి ఖైదీల చొరబాటు యత్నం 
కల్లోల నేపాల్‌ నుంచి బయటపడే దురుద్దేశంతో ఇప్పటికే జైళ్ల నుంచి పారిపోయిన ఖైదీలు కొందరు ఏకంగా దేశందాటి పారిపోయేందుకు విఫలయత్నంచేశారు. ఉత్తరప్రదేశ్‌లోని బయిర్‌గనియా చెక్‌పోస్ట్‌ సమీప ప్రాంతం గుండా భారత్‌లోకి చొరబడేందుకు యతి్నంచిన 13 మంది నేపాల్‌ ఖైదీలను భారత బలగాలైన సశస్త్ర సీమా బల్‌(ఎస్‌ఎస్‌బీ) విజయవంతంగా అడ్డుకుంది. 

సరిహద్దు సమీపంలోని రౌతహాత్‌ జిల్లా కారాగార కేంద్రం నుంచి ఈ ఖైదీలు పారిపోయారని ఎస్‌ఎస్‌బీ గుర్తించింది. నిబంధనల ప్రకారం వారందరినీ నేపాల్‌ పోలీసులకు ఎస్‌ఎస్‌బీ సైనికులు అప్పగించారు. ఇప్పటిదాకా జైళ్ల నుంచి పారిపోయి సరిహద్దుదాకా చేరుకున్న దాదాపు 60 మంది నేపాలీ ఖైదీలు, ఒక బంగ్లాదేశ్‌ జాతీయుడిని అదుపులోకి తీసుకుని నేపాల్‌ పోలీసులకు అప్పగించామని ఎస్‌ఎస్‌బీ అధికారి వెల్లడించారు. భారత్‌కు తూర్పున నేపాల్‌ వెంట 1,751 కిలోమీటర్ల పొడవునా సరిహద్దు కాపలా, పర్యవేక్షణా బాధ్యతలను ఎస్‌ఎస్‌బీ చూసుకుంటోంది. 
 


పెట్రోల్‌ బంకుల వద్ద చాంతాడంత క్యూలైన్లు 
కర్ఫ్యూ కారణంగా జనజీవనం స్తంభించిపోయింది. సైన్యం రంగంలోకి దిగడంతో హింసాత్మక ఘటనలు సద్దుమణిగాయి. శనివారం ఉదయం ఆరు గంటలదాకా దేశవ్యాప్త కర్ఫ్యూ కొనసాగుతుందని సైన్యం ప్రకటించింది. గురువారం సాయంత్రం ఐదు గంటల నుంచి ఏడింటిదాకా కర్ఫ్యూను సడలించారు. ఇప్పటికే కర్ఫ్యూ కారణంగా వాహనాల రాకపోకలు ఆగిపోయాయి. దీంతో బంకుల్లో పెట్రో నిల్వలు నిండుకున్నాయి. 

అయితే కాస్తంత పెట్రో నిల్వలు ఉన్న బంకుల వద్ద చాంతాడంత క్యూలైన్లు కనిపించాయి.  కానీ జనం ముఖాల్లో భయంఛాయలు పోలేదు. పౌర ప్రభుత్వాన్ని త్వరగా కొలువుతీర్చాలని రచయితలు, విద్యావేత్తలు అధ్యక్షుడిని కోరుతూ లేఖలు రాశారు. అయితే సనాతన ధర్మా న్ని కాపాడాలంటే మళ్లీ రాచరిక వ్యవçస్థను పునరుద్ధరించాలని జ్యోతిష్‌ పీఠం శంకరాచార్య స్వామి అవిముక్తేశ్వరానంద్‌ సరస్వతి డిమాండ్‌చేశారు.  

పూర్తిగా దగ్ధమైన సుప్రీంకోర్టు 
అవినీతి, వారసత్వ రాజకీయాలు, అసమర్థ పాలన, సోషల్‌మీడియాపై నిషేధం కారణాలతో కట్టలు తెంచుకున్న ప్రజాగ్రహజ్వాలల్లో అధికార కేంద్రాలు కాలిపోయాయి. న్యాయవితరణ చేసే ధర్మాసనాలూ దగ్ధమయ్యాయి. సుప్రీంకోర్టు మసిబారింది. అయినాసరే ఆదివారం నుంచి కేసుల విచారణను మొదలెడతామని సుప్రీంకోర్టు న్యాయమూర్తులు తమ నిబద్ధతను చాటారు. 

‘‘నేపాల్‌ న్యాయవ్యవస్థకు సంబంధించిన పత్రాలెన్నో బుగ్గిపాలయ్యాయి’’అని ప్రస్తుత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రకాశ్‌ మాన్‌ రౌత్‌ ఆవేదన వ్యక్తంచేశారు. బనేపా మున్సిపాలిటీలోని నయాబస్తీలో ఎనిమిది బాంబులను సైన్యం గుర్తించి జాగ్రత్తగా నిరీ్వర్యం చేసింది. జైళ్ల నుంచి పారిపోతూ ఖైదీలు ఎత్తుకెళ్లిన డజన్లకొద్దీ ఆయుధాలను సైన్యం తిరిగి స్వా«దీనంచేసుకుంది. మరోవైపు నేపాల్‌లో చిక్కుకుపోయిన భారతీయుల తిరుగుప్రయాణపర్వం మొదలైంది. పలు మార్గాల్లో పలు రాష్ట్రాల ప్రజలు వెనుతిరిగి వస్తున్నారు.  

 

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
Nepal
protests
prisons
Prisoners
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

నేపాల్‌ రాజకీయాల్లో ఊహించని  ట్విస్ట్

నేపాల్‌ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్

నీట్ వివాదం వేళ 19 ఏళ్ల విద్యార్థిని ఆత్మహత్య

నీట్ వివాదం వేళ 19 ఏళ్ల విద్యార్థిని ఆత్మహత్య

నేపాలీ గ్యాంగ్స్‌పై ఆర్జీవీ కన్ను?

నేపాలీ గ్యాంగ్స్‌పై ఆర్జీవీ కన్ను?

మొరాయించిన స్టీరింగ్‌.. లోయలో పడ్డ బస్సు

మొరాయించిన స్టీరింగ్‌.. లోయలో పడ్డ బస్సు

బంగారం కొట్టేసిన నేపాలీ గ్యాంగ్ అరెస్ట్

బంగారం కొట్టేసిన నేపాలీ గ్యాంగ్ అరెస్ట్

భారత మామిడి దిగుమతులను నిషేధించిన నేపాల్‌

భారత మామిడి దిగుమతులను నిషేధించిన నేపాల్‌

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.