Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. International
  3. Monkey Day: అడవులను సృష్టించే ‘కోతి చేష్టలు
ADVERTISEMENT 

Monkey Day: అడవులను సృష్టించే ‘కోతి చేష్టలు

International Sakshi User Sakshi Sakshi Time Dec 14, 2025 Sakshi Read Time Read Time: 3 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
monkey_20day.jpg

కోతులు.. అత్యంత తెలివైన జంతువులు.. వాటికి జీవవైవిధ్యంలో, మానవ సంస్కృతిలో ప్రత్యేకమైన స్థానం ఉంది. సుమారు 60 మిలియన్ సంవత్సరాల క్రితం ఉద్భవించిన  కోతులు భూమిపై గల అత్యంత ముఖ్యమైన జంతు సమూహాలలో ఒకటి. అరణ్యాలలో పర్యావరణ సమతుల్యతను కాపాడటంలో, విత్తనాలను వెదజల్లే ఏజెంట్‌లుగా అవి కీలక పాత్ర పోషిస్తున్నాయి. కోతులు  ప్రపంచంపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతున్నాయి. అందుకే ప్రతి సంవత్సరం డిసెంబర్ 14న కోతుల దినోత్సవం (Monkey Day) జరుపుకుంటారు.  

సరదాగా మొదలై..
కోతుల దినోత్సవం అనేది కేవలం కోతులను మాత్రమే కాకుండా, చింపాంజీలు, గొరిల్లాలు, ఒరంగుటాన్‌లతో సహా అన్ని రకాల సిమియన్‌లను (ప్రైమేట్‌లను) గుర్తుచేస్తుంది. మానవ కుటుంబ వృక్షంలో ప్రైమేట్స్ ఒక భాగం. సుమారు 60 మిలియన్ సంవత్సరాల క్రితం ఉద్భవించిన ఈ జాతుల పట్ల మనకున్న ప్రేమను, గౌరవాన్ని తెలియజేయడానికి ఈ రోజు  మనకు ఒక అవకాశం కల్పిస్తుంది. మొదట్లో సరదాగా ప్రారంభమైన ఈ దినోత్సవం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అవగాహన కల్పించే వార్షికోత్సవంగా మారింది.

కేలండర్‌లో సరదాగా రాయగానే..
ఈ ప్రత్యేక దినోత్సవ ఆవిర్భావం 2000లో జరిగింది. మిచిగాన్ స్టేట్ యూనివర్శిటీకి చెందిన కాసే సారో, ఎరిక్ మిల్లికిన్ అనే విద్యార్థులు ఈ దినోత్సవాన్ని ప్రారంభించారు. డిసెంబర్ నెలలో సెలవు రోజులను వెదుకుతూ వారు క్యాలెండర్‌లో 14వ తేదీన మంకీ డే అని రాశారు. ఈ విషయాన్ని వారు తోటి స్నేహితులకు తెలిపారు. దీంతో వారంతా కోతుల తరహా ప్రత్యేక దుస్తులు ధరించి, గెంతుతూ ఉల్లాసంగా గడిపారు. ఈ విధంగా వినోదంగా మొదలైన ఈ దినోత్సం నేడు ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది.

మంకీ డే నాడే ‘కింగ్‌ కాంగ్‌’ విడుదల
సారో, మిల్లికిన్ ఈ దినోత్సవం సందర్భంగా కొన్ని కళాకృతులు తయారుచేశారు. వీటిని ఆన్‌లైన్‌లో ప్రచురించడం ద్వారా ‘మంకీ డే’ భావన ప్రపంచవ్యాప్తంగా వ్యాపించడానికి దారితీసింది. పీటర్ జాక్సన్ తీసిన ‘కింగ్ కాంగ్’(2005) మంకీ డే ఐదవ వార్షికోత్సవం సందర్భంగా విడుదలైంది. ఇది  మంకీడే ప్రాముఖ్యతను మరింతగా పెంచింది. మొదట సరదాగా ప్రారంభమైన మంకీ డే ఇప్పుడు పూర్తి స్థాయి ప్రపంచ ఆపరేషన్‌గా రూపాంతరం చెందింది. నేషనల్ జియోగ్రాఫిక్, స్మిత్‌సోనియన్ ఇన్‌స్టిట్యూషన్, గ్రీన్‌పీస్ వంటి సంస్థలు ఈ రోజున కోతులు ఎదుర్కొంటున్న ముప్పుపై అవగాహన కల్పిస్తున్నాయి. (Facts About Monkeys In Telugu)
కోతులలో సుమారు 260 జాతులు ఉండగా, వాటిలోని పలు రకాలు అంతరించిపోయే ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నాయి. బార్బరీ మకాక్‌ల జనాభా గత 24 ఏళ్లలో 50 శాతానికి తగ్గింది. మంకీ డే అనేది కేవలం ఉల్లాసానికి మాత్రమే కాకుండా, కోతులు ఎదుర్కొంటున్న సవాళ్లపై అవగాహన కలిగించేందుకు కూడా దోహపదపడుతుంది.

కోతులు.. 10 అద్భుత విషయాలు

విభిన్న జాతులు (Diversity): ప్రపంచవ్యాప్తంగా సుమారు 260కి పైగా రకాల కోతి జాతులు ఉన్నాయి. వీటిని ప్రధానంగా ‘పాత ప్రపంచ కోతులు’ (ఆఫ్రికా, ఆసియా), ‘కొత్త ప్రపంచ కోతులు’ (దక్షిణ, మధ్య అమెరికా)గా విభజిస్తారు.

తోక ప్రాముఖ్యత (Prehensile Tails): కొత్త ప్రపంచ కోతులు (ఉదాహరణకు సాలీడు కోతులు) కొన్నిటికి  ప్రత్యేకమైన తోకలు ఉంటాయి. ఇవి చెట్ల కొమ్మలను పట్టుకోవడానికి లేదా ఆహారాన్ని తీసుకునేందుకు ఒక అవయవంలా పనిచేస్తాయి.

సమాజ జీవనం (Social Lives): కోతులు అత్యంత సామాజిక జీవులు. అవి సమూహాలుగా (ట్రూప్స్) జీవిస్తాయి. కొన్నిచోట్ల వందల కోతులు కలిసివుంటాయి. ఈ సమూహాలలో వాటి మధ్య బంధాలు ఉంటాయి.

శుభ్రం చేసుకోవడం (Grooming): కోతులు తమ సమూహంలోని ఇతర కోతులను శుభ్రం చేస్తుంటాయి. ఇది వాటి సామాజిక బంధాలను, పరస్పర నమ్మకాన్ని బలోపేతం చేయడానికి ఉపయోగపడుతుంది.

బుద్ధి కుశలత (Intelligence): కోతులు చాలా తెలివైనవి. అవి సమస్యలను పరిష్కరించుకుంటాయి. వివిధ పరికరాలను ఉపయోగించగలవు. ఉదాహరణకు పండ్లను, కాయలను ముక్కలు చేసేందుకు రాళ్లను వినియోగిస్తాయి.

వివిధ రకాల ఆహారం (Varied Diet): కోతులు సాధారణంగా పండ్లు, ఆకులు, పువ్వులు, కీటకాలు చిన్న జంతువులను తినే సర్వభక్షకాలు (Omnivores). వాటి ఆహారం జాతిని బట్టి, అవి నివసించే ప్రాంతం ‍ప్రకారం మారుతుంటుంది.

ప్రత్యేకమైన కమ్యూనికేషన్ (Unique Communication): కోతులు వివిధ రకాల శబ్దాలు, ముఖ కవళికలు, శరీర భాష ద్వారా ఒకదానితో ఒకటి సంభాషించుకుంటాయి. ప్రమాదాన్ని సూచించడానికి లేదా ఆహారం గురించి తెలియజేయడానికి ప్రతి జాతికి ప్రత్యేకమైన అరుపులు ఉంటాయి.

చిన్న కోతి (Pygmy Marmoset): పిగ్మీ మార్మోసెట్ అనేది ప్రపంచంలోనే అత్యంత చిన్న కోతి జాతి. ఇది కేవలం 5-6 అంగుళాల పొడవు మాత్రమే ఉంటుంది. 100 గ్రాముల కంటే తక్కువ బరువు ఉంటుంది.

నిద్రించే విధానం (Sleeping Habits): చాలా కోతులు చెట్లపై నిద్రిస్తాయి. మాంసాహార జీవుల నుంచి సంరక్షణకే అవి అలా చేస్తుంటాయి. కొన్ని కోతులు నిద్రించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేసుకుంటాయి.

మానవులకు దగ్గర సంబంధం (Close to Humans): కోతులు, ముఖ్యంగా పాత ప్రపంచ కోతులు (మకాక్‌లు, బబూన్‌లు వంటివి), మానవులకు చాలా దగ్గర సంబంధాన్ని కలిగి ఉంటాయి.

ఇది కూడా చదవండి: Delhi Pollution: తొలగని అంధకారం.. వైద్యుల హెచ్చరికలు

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
monkey
day
forest
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

మెట్రో రైల్ ఎక్కిన కోతి.. చుట్టాలింటికి పోతున్నదేమో

మెట్రో రైల్ ఎక్కిన కోతి.. చుట్టాలింటికి పోతున్నదేమో

అరణ్యరోదన

అరణ్యరోదన

వినూత్నంగా పెళ్లి రోజు వేడుక

వినూత్నంగా పెళ్లి రోజు వేడుక

అవయవదాత కుటుంబాలకు ఘన సన్మానం

అవయవదాత కుటుంబాలకు ఘన సన్మానం

ఆన్‌లైన్‌ ఆంక్షలతో అడవి బిడ్డల ఆవేదన

ఆన్‌లైన్‌ ఆంక్షలతో అడవి బిడ్డల ఆవేదన

రూ. 500 నోట్ల వర్షం.. ఎంత పనిచేసింది!

రూ. 500 నోట్ల వర్షం.. ఎంత పనిచేసింది!

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.