Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. International
  3. జాబిలిపై అణువిద్యుత్‌ సాధ్యమా?
ADVERTISEMENT 

జాబిలిపై అణువిద్యుత్‌ సాధ్యమా?

International Sakshi User Sakshi Sakshi Time Aug 14, 2025 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
NASA.jpg

అక్కడ మానవ ఆవాసాలు ఏర్పడితే అనుక్షణం విద్యుత్‌ అత్యావసరం

అందుకే నిరంతర విద్యుత్‌ ఉత్పత్తే లక్ష్యంగా న్యూక్లియర్‌ ప్లాంట్‌ ఏర్పాటు

మరో ఐదేళ్లలో నిర్మించాలని యోచన

వ్యోమగాములు తమ అంతరిక్ష పరిశో ధనలకు మజిలీగా చందమామను మార్చుకోవాలని భావిస్తున్న తరుణంలో చంద్రునిపై ఏకంగా అణువిద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాన్ని నెలకొల్పాలని నాసా భావిస్తోంది. అయితే 2030కల్లా అక్కడ న్యూక్లియర్‌ ప్లాంట్‌ ఏర్పాటు సాధ్యమా? అనే ప్రశ్న తలెత్తుతోంది. 

ఎక్కువకాలంపాటు వ్యోమగాములు చంద్రునిపైనే స్థిరనివాసం ఏర్పర్చుకుని జీవించాలన్నా, ఎలాంటి విద్యుత్‌ అవాంతరాల లేకుండా శాస్త్రసాంకేతిక పరిశోధనలు కొనసా గించాలన్నా అనుక్షణం విద్యుత్‌ సరఫరా తప్పనిసరి.

 ప్రాణాధార ఉపకరణాలకూ విద్యుత్‌ ఖచ్చితంగా అవసరం. అందుకే ఐదేళ్ల లోపే అణువిద్యుత్‌ కేంద్రాన్ని ఏర్పాటుచేయా లని నాసా భావిస్తోంది. కేంద్రక విచ్చిత్తి (న్యూక్లియర్‌ ఫిజన్‌) సూత్రంపై పనిచేసే అణుప్లాంట్‌ను అక్కడ నెలకొల్పనున్నారు. అయితే నాసాకు పోటీగా సొంత అణువిద్యుత్‌ కేంద్రాలను ఏర్పాటుచేస్తామని చైనా, రష్యాలు సైతం ప్రకటించాయి. మరో పదేళ్లలో ఈ ప్లాంట్‌లను ఏర్పాటుచేస్తామని ఇప్పటికే వెల్లడించాయి. 

అణు విద్యుతే ఎందుకు?
చందమామపై స్థిరనివాసం ఏర్పర్చుకునే వ్యోమగాముల నిరంతర విద్యుత్‌ అవసరా లను సౌరవిద్యుత్‌ ఏమాత్రం తీర్చలేదు. ఎందుకంటే చంద్రునిపై ప్రతిరోజూ సూర్యకాంతి ప్రసారం కాదు. 14 రోజులపాటు ఏకధాటి గా ఎండకాచి తర్వాత 14 రోజులపాటు మైనస్‌ డిగ్రీ సెల్సియస్‌ స్థాయిలో చిమ్మచీకటి నెలకొంటుంది. ఈ చీకటిమయ రోజుల్లో విద్యుత్‌ అవసరాలు తీర్చే ఏకైక ప్రత్యామ్నా యంగా అణువిద్యుత్‌కేంద్రం నిలుస్తోంది. అందుకే ఎంత ఖర్చయినాసరే వ్యయప్రయా సల కోర్చి చంద్రునిపై న్యూక్లియర్‌ ప్లాంట్‌ను ఏర్పాటు చేయాలని నాసా కృతనిశ్చయంతో ఉంది. ఇందుకు సంబంధించిన ప్రతిపాదన లకు సైతం పచ్చజెండా ఊపింది. మరో ఐదేళ్లలో అక్కడ అణువిద్యుత్‌ ప్లాంట్‌ కలను సాకారంచేయాలని కంకణం కట్టుకుంది. 

చిన్నస్థాయిలో మొదలెట్టి
అణువిద్యుత్‌ కేంద్రంలో ఏవైనా ప్రమాదాలు సంభవించినా అక్కడ శూన్యం ఉంటుందికనుక రేడియోధార్మికత అంతటా వ్యాపిస్తుందన్న భయం అక్కర్లేదు. థర్మల్, జల, పవన విద్యుత్‌లతో పోలిస్తే చందమామపై అణువిద్యుత్‌ మాత్రమే ఆచరణ సాధ్యమవుతుంది. సౌరఫలకాలతో సూర్యకాంతిని ఒడిసిపట్టి సౌర విద్యుత్‌ను తయారుచేసినా అది అక్కడి వ్యోమగాముల అవసరాలను ఏమాత్రం తీర్చలేదు. వీటిని పరిగణనలోకి తీసుకుని న్యూక్లియర్‌ ప్లాంట్‌ వైపు శాస్త్రవేత్తలు మొగ్గుచూపుతున్నారు. తొలుత కేవలం 100 కిలోవాట్ల విద్యుత్‌ఉత్పత్తి సామర్థ్యంతో ప్లాంట్‌ను నెలకొల్పనున్నారు. భూమి మీద అయితే ఇదే 100 కిలోవాట్ల విద్యుత్‌తో 80 గృహాల విద్యుత్‌అవసరాలు తీర్చొచ్చు.  దశలవారీగా ప్లాంట్‌ను విస్తరించి గణనీయమైన స్థాయిలో విద్యుత్‌ను ఉత్పత్తిచేస్తారు.
– సాక్షి, నేషనల్‌ డెస్క్‌

సమస్యలెన్నో..
.జల, థర్మల్‌ విద్యుత్‌ ప్లాంట్‌లతో పోలిస్తే అణువిద్యుత్‌ ప్లాంట్‌కు పెద్దగా భూవిస్తీర్ణంతో పనిలేదు. కానీ చంద్రుని మీదకు ఈ మొత్తం అణువిద్యుత్‌ వ్యవస్థ ఉపకరణాలను మోసుకెళ్లాలంటే చాలా చాలా కష్టం. పైగా ఇవి రాకెట్‌లో తరలించేంత తేలికగా ఉండాలి. అత్యధిక బరువులను ఇప్పుడున్న రాకెట్లు అస్సలుమోయలేవు. ఒకవేళ అధిక బరువులను మోసుకెళ్లేలా వ్యోమనౌకలను డిజైన్‌చేసి రూపొందించినా అవి అంత బరువును మోస్తూకూడా జాగ్రత్తగా చంద్రునిపై ల్యాండ్‌ కావాల్సి ఉంటుంది. ఏమాత్రం తేడా వచ్చి అది క్రాష్‌ ల్యాండ్‌ అయినా వేలకోట్ల రూపాయల నష్టం ఖాయం. 

భూమిపై అయితే అణువిద్యుత్‌ కేంద్రాన్ని ఎంతో మంది సాంకేతిక నిపుణులు తీరిగ్గా, నిశితంగా తనిఖీచేసి నిర్మిస్తారు. చంద్రునిపై ఈ ప్లాంట్‌ను నిర్మించాలంటే కార్మిక సిబ్బంది దొరకరు. ఉన్న ఆ కొద్దిపాటి వ్యోమగాములే అణుప్లాంట్‌ ఉన్నతాధికారుల అవతారమెత్తి ప్లాంట్‌ను బిగించాల్సి ఉంటుంది. అణువిద్యుత్‌ ప్లాంట్‌ నుంచి అత్యధిక స్థాయిలో వేడిమి వెలువడుతుంది. దానికి చల్లబరిచే కూలింగ్‌ వ్యవస్థలను ఏర్పాటుచేయాలి. వాటిని కూడా భూమి మీద నుంచే ఆపరేట్‌ చేయాల్సి ఉంటుంది. ఇదంతా ఎంతో శ్రమ, వ్యయంతో కూడిన వ్యవహారం. 

శూన్యస్థితిని తట్టుకునేలా వినూత్న రీతిలో ప్లాంట్‌ను డిజైన్‌ చేయాల్సి ఉంటుంది. రేడియోధార్మిక వ్యర్థ్యాల పారబోత, ప్లాంట్‌ పాడైతే రిపేర్లు వంటి ఎన్నో అవరోధాలు అక్కడి హఠాత్తుగా స్వాగతం పలుకుతాయి.వీటిని తట్టుకుంటూనే ప్లాంట్‌ను నిర్వహించాల్సి ఉంటుంది. ట్రంప్‌ హయాంలో నాసాకు అంతరిక్ష పరిశోధనా బడ్జెట్‌లో భారీ కోత పెట్టిన నేపథ్యంలో ఇతర మార్గాల్లో ఆదాయం సమకూర్చి ఈ ప్రాజెక్ట్‌ను సఫలీకృతం చేయాల్సి ఉంది. ఇన్ని బాలారిష్టాలను దాటుకుని ప్లాంట్‌ ఏర్పాటు సుసాధ్యమైతే జాబిలిపై మానవనివాసం ఎలాంటి జంజాటాలు లేకుండా హాయిగా సాగుతుంది.

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
astronauts
space exploration
Moon
Nuclear power generation
Nuclear Plant
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

చంద్రుడి దారిలో.. 'ఆర్టెమిస్‌-3'

చంద్రుడి దారిలో.. 'ఆర్టెమిస్‌-3'

మూన్‌ మిషన్‌ ట్రయల్‌.. ఈ నలుగురే ఎందుకు?

మూన్‌ మిషన్‌ ట్రయల్‌.. ఈ నలుగురే ఎందుకు?

హైదరాబాద్ లో బ్లడ్‌ మూన్‌ ఇలా కనిపించింది (ఫొటోలు)

హైదరాబాద్ లో బ్లడ్‌ మూన్‌ ఇలా కనిపించింది (ఫొటోలు)

అమెరికాకు చైనా చెక్ పెట్టాలా

అమెరికాకు చైనా చెక్ పెట్టాలా

చందమామ చిక్కేదెవరికి?

చందమామ చిక్కేదెవరికి?

ఆకాశంలో అద్భుతం...మార్చి 3న రక్తంతో ఉండబోయే చంద్రుడు!

ఆకాశంలో అద్భుతం...మార్చి 3న రక్తంతో ఉండబోయే చంద్రుడు!

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.