Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. International
  3. టీనేజ్‌ సెయింట్‌!
ADVERTISEMENT 

టీనేజ్‌ సెయింట్‌!

International Sakshi User Sakshi Sakshi Time Sep 8, 2025 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
CARLO11.jpg

కార్లో అక్యూటిస్‌కు మరణానంతరం ప్రకటించిన పోప్‌ 

వాటికన్‌ సిటీ: కార్లో అక్యూటిస్‌. వీడియో గేమ్స్‌ ఆడుతూ, పెంపుడు జంతువులతో వీడియోలు చేస్తూ సరదాగా గడిపిన టీనేజర్‌. అదే సమయంలో డిజిటల్‌ వేదికల ద్వారా ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవ ప్రచారానికి ఎనలేని కృషి చేసిన ‘దైవ ప్రభావకుడు (గాడ్స్‌ ఇన్‌ఫ్లుయెన్సర్‌)’. లుకేమియా (రక్త కణజాల క్యాన్సర్‌) బారిన పడి 15 ఏళ్ల వయసులోనే కన్నుమూసిన కార్లోకు సెయింట్‌ హోదా కట్టబెట్టి క్యాథలిక్‌ చర్చి పెను సంచలనం సృష్టించింది. 

వాటికన్‌ సిటీలోని సెయింట్‌ పీటర్స్‌ స్క్వేర్‌లో అసంఖ్యాకంగా గుమిగూడిన విశ్వాసుల సాక్షిగా.. కార్లో తల్లిదండ్రులు, కుటుంబీకుల సమక్షంలో పోప్‌ లియో–14 ఆదివారం స్వయంగా సెయింట్‌హుడ్‌ ప్రకటించారు. డిజిటల్‌ వేదిక ద్వారా క్రైస్తవాన్ని లక్షలాది మంది విశ్వాసులకు చేరువ చేసినందుకు గౌరవసూచకంగా కార్లోను ఈ విధంగా గౌరవించుకున్నట్టు వాటికన్‌ వర్గాలు తెలిపాయి. సెయింట్‌ హోదా పొందిన తొలి మిలీనియల్‌గా కార్లో చరిత్ర పుటలకెక్కారు. 

1980–90 మధ్య పుట్టిన వారిని మిలీనియల్స్‌ అంటారన్నది తెలిసిందే. కార్లో లుకేమియా బారిన పడి 2006లో 15 ఏళ్లకే స్వర్గస్థులయ్యారు. దేవునికి అంకితమై కార్లో అప్పటికే తన జీవితంలో ఎన్నో అద్భుతాలను చేశారని సెయింట్‌హుడ్‌ కార్యక్రమంలో పోప్‌ కీర్తించారు. 

ఆయన పోప్‌గా బాధ్యతలు చేపట్టాక ఈ కార్యక్రమం నిర్వహించడం ఇదే తొలిసారి. ‘‘మరణానంతరం కార్లో రెండు అద్భుతాలకు కారకుడయ్యారు. పాంక్రియాటిక్‌ సమస్యతో ఇబ్బంది పడుతున్న ఓ బ్రెజిల్‌ చిన్నారి తల్లిదండ్రులు కార్లోను స్తుతించగా వ్యాధి నయమైంది. ప్రమాదం బారిన పడ్డ ఓ కోస్టారికా విద్యార్థి కార్లోను ప్రారి్థంచి కోలుకున్నాడు’’అని పోప్‌ వెల్లడించారు.

‘అత్యాధునిక’ ఆధ్యాత్మిక కెరటం! 
జీన్స్‌. టీ–షర్ట్‌. స్నీకర్‌ షూ. అల్ట్రా మోడర్న్‌ టీనేజర్‌కు అచ్చమైన ప్రతీక కార్లో. కానీ పయనించిందంతా ఆధ్యాత్మిక మార్గం. ఇంతటి వైరుధ్యానికి మారుపేరుగా నిలిచిన కార్లో 1991లో ఇటాలియన్‌ తల్లిదండ్రులకు లండన్‌లో పుట్టారు. తర్వాత వారి కుటుంబం ఇటలీలోని మిలాన్‌కు మారింది. చిన్నతనంలో అల్లరి పిడుగే అయినా పదేళ్లు దాటకుండానే క్రైస్తవం, క్రీస్తు బోధల పట్ల అచంచల విశ్వాసం పెంచుకున్నారు. 

పక్కింటి పిల్లాడిలా అత్యంత సాదాగా కనిపించినా, అసాధారణ పనులతో క్యాథలిక్‌ ప్రపంచంలో చెరిగిపోని పేరు సంపాదించుకున్నారు. కంప్యూటర్‌ కోడింగ్‌పై కార్లోకు అపారమైన పట్టుంది. క్రీస్తు బోధలను, ఆయన చూపిన అద్భుతాలను ప్రపంచమంతటికీ తెలిపే లక్ష్యంతో ‘క్యాథలిక్‌ ఫెయిత్‌’ ఏకంగా ఓ బహుభాషా వెబ్‌సైట్‌ పెట్టారు. లుకేమియా బారిన పడి మరణించాక ఆయన దేహాన్ని విశ్వాసుల సందర్శనార్థం ఇటలీలోని అసిసీ నగరంలో గాజుపేటికలో భద్రపరిచారు. ఆయన చివరగా ధరించిన జీన్స్, నైక్‌ ట్రైనర్‌ దుస్తుల్లోనే ఉంచడం విశేషం! దాన్ని ఏటా లక్షలాది మంది సందర్శిస్తారు.  
 

ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
teanagers
Influencer
saint declared
Saint
Vatican City
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

ఆ పిక్స్‌ అందుకే పోస్ట్‌ చేయలేదు, కానీ బీచ్‌లో బికినీ కాక..?

ఆ పిక్స్‌ అందుకే పోస్ట్‌ చేయలేదు, కానీ బీచ్‌లో బికినీ కాక..?

ఎలాంటి డైటింగ్‌ చేయకుండానే 9 కిలోలు..! ఆ నాలుగు రూల్స్‌ ..

ఎలాంటి డైటింగ్‌ చేయకుండానే 9 కిలోలు..! ఆ నాలుగు రూల్స్‌ ..

ఒక్క రీల్‌కు రూ. 76 లక్షలు, లంచ్‌కి  రూ. 20 లక్షలు : ఎలా?

ఒక్క రీల్‌కు రూ. 76 లక్షలు, లంచ్‌కి రూ. 20 లక్షలు : ఎలా?

ఒక్క రీల్‌కు రూ. 80 లక్షలు.. షాకిస్తున్న సమయ్ రైనా!

ఒక్క రీల్‌కు రూ. 80 లక్షలు.. షాకిస్తున్న సమయ్ రైనా!

వ్యూస్ కోసం హద్దులు దాటుతున్నారా? సెజల్ పవర్ వైరల్ వీడియో

వ్యూస్ కోసం హద్దులు దాటుతున్నారా? సెజల్ పవర్ వైరల్ వీడియో

నందూస్ స్కాం మిస్టరీ..! బయటపడుతున్న కీలక సీక్రెట్స్

నందూస్ స్కాం మిస్టరీ..! బయటపడుతున్న కీలక సీక్రెట్స్

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.