లండన్‌లోని పెక్హోమ్లో దుకాణాదారుడు ఓ నల్లజాతి మహిళపై అమానవీయంగా ప్రవర్తించాడు. మహిళను గొంతు పట్టుకుని విచక్షణ రహితంగా దాడి చేశాడు. హెయిర్ షాప్‌లో ఇంతకు ముందు తీసుకున్న వస్తువులకు రీఫండ్ చేసే అంశంలో ఇరువురి మధ్య వాగ్వాదం జరిగింది. అనంతరం షాప్ కీపర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు.
పెక్హోమ్లోని రే లేన్‌లో హెయిర్ అండ్ కాస్మెటిక్స్ దుకాణం ఉంది. షాప్‌లోకి ఓ నల్లజాతీయురాలు వచ్చి దుకాణాదారుడితో ఏదో మాట్లాడుతోంది. ఇంతకు ముందు తీసుకున్న వస్తువులపై రీఫండ్ విషయంతో ఇద్దరి మధ్య వాగ్వాదం మొదలైంది. దుకాణాదారుడు నిగ్రహం కోల్పోయాడు. మహిళ గొంతు పట్టుకుని దాడి చేశాడు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. దీనిపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Context: A Black woman in Peckham was refused a refund for hair extensions and went to take something as a personal compensation.
She was refused exit and started violently hitting the shop owner before he proceeded to STRANGLE her. pic.twitter.com/OEYZinoAOH— ᴼᴹᴳ ᶥᵗˢ Adàeze (@nubianbarbieeee) September 12, 2023
సదరు దుకాణాదారుడిపై చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేశారు. నల్లజాతీయురాలిపై దాడి చేసినందుకు ఆ షాప్ ముందు నిరసనకు దిగారు. ఈ వీడియో ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. దోషులకు కఠినంగా శిక్ష విధిస్తామని హామి ఇచ్చారు.
ఇదీ చదవండి: వీడియో: తెలుగు విద్యార్థి జాహ్నవి మృతిపై అధికారి వెకిలి కామెంట్లు, ఆలస్యంగా బయటకు..