ADVERTISEMENT
ఇరాన్‌తో యుద్ధం.. ఐక్యరాజ్యసమితి హెచ్చరిక ఇదే..
పశ్చిమాసియాలో భీకర యుద్ధం కొనసాగుతోంది..
హార్ముజ్ జలసంధి సమీపంలో దాడి రాయల్ థాయ్ నేవీ
- హార్ముజ్ దాడి తర్వాత భారతదేశానికి వెళ్తున్న థాయ్ కార్గో షిప్లో నల్లటి పొగ, మంటలు
- థాయ్ కంపెనీ యాజమాన్యంలోని బల్క్ క్యారియర్ మయూరీ నరీ అనే నౌక భారతదేశంలోని కాండ్లా పోర్టుకు వెళుతుండగా దాడి ఈ దాడికి ఇరాన్ బాధ్యత వహించింది.
11 Mar 2026, 07:05 PM
మోజ్తాబా ఖమేనీకి స్వల్ప గాయాలు, అయినా ఓకే
- మోజ్తాబా ఖమేనీ స్వల్పంగా గాయపడ్డారు.
- స్వల్పంగా గాయపడినప్పటీ ఇరాన్‌కు నాయకత్వం వహిస్తున్నారని అధికారి తెలిపారు.
11 Mar 2026, 06:51 PM
మొజ్తబాకు రక్షణగా ఇరాన్ ‘బ్లాక్ క్లాడ్’ కిల్ స్క్వాడ్ ‘నోపో‘
- ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీకి భారీ భద్రత
- మొజ్తబాకు రక్షణగా ఇరాన్ ‘బ్లాక్ క్లాడ్’ కిల్ స్క్వాడ్ ‘నోపో‘
- బ్లాక్ దుస్తులు ధరించే కౌంటర్‌టెర్రరిజం స్పెషల్ ఫోర్స్ ‘నోపో‘
- మొజ్తబా గాయపడ్డారని ఇటీవల నివేదికలు
- ఆ సమాచారాన్ని ఖండించిన సీనియర్ ఇరానీ నేత
11 Mar 2026, 03:52 PM
ఇరాన్ డ్రోన్ల కూల్చివేత, నలుగురికి గాయాలు
- దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం (DXB) సమీపంలో రెండు డ్రోన్లు కూల్చివేత
- ఒక భారతీయుడు సహా నలుగురికి గాయాలు
- యూఏఈ బహ్రెయిన్, ఖతార్ ,ఇతర గల్ఫ్ దేశాలపై ఇరాన్ డ్రోన్ల దాడి
- మౌలిక సదుపాయాలకు నష్టం, చమురు ఉత్పత్తికి అంతరాయం
- డ్రోన్ దాడులను అడ్డుకుంటున్నాం UAE రక్షణ మంత్రిత్వ శాఖ
11 Mar 2026, 03:14 PM
ఎయిర్‌పోర్టుపై ఇరాన్ దాడి
- దుబాయి ఎయిర్‌పోర్టుపై ఇరాన్ దాడి
- రెండు డ్రోన్లతో ఎయిర్‌పోర్టుపై దాడి
- ఇరాన్ దాడిలో నలుగురికి గాయాలు
- గాయపడ్డ వారితో ఇద్దరు భారతీయులు
11 Mar 2026, 03:06 PM
పోర్టుపై ఇరాన్ డ్రోన్ దాడి
- యూఏఈలో పోర్టుపై ఇరాన్ డ్రోన్ దాడి
- రస్ అల్ ఖైమా పోర్టులో కంటైనర్ షిప్ ధ్వంసం
- యూకే మారిటైమ్ ఆర్గనైజేషన్ వెల్లడి.
A container ship was hit by an unknown projectile about 25 nautical miles northwest of Ras Al Khaimah, UAE, near the entrance to the Strait of Hormuz. pic.twitter.com/2Xex2OaqCl
— Super Flanker's (@NothingN76934) March 11, 2026
11 Mar 2026, 11:11 AM
ఐఆర్జీసీ సంచలన ప్రకటన..
- ఇజ్రాయెల్-అమెరికాపై గతంలో ఎన్నడూలేనంత భీకర దాడి: ఐఆర్జీసీ
- తొలిసారి ఖుర్రంషహ్ర్ దీర్ఘశ్రేణి క్షిపణుల ప్రయోగం
- శత్రువులు పూర్తిగా లొంగిపోయే వరకు దాడులు చేస్తామన్న ఐఆర్జీసీ
11 Mar 2026, 10:33 AM
ఐక్యరాజ్యసమితి కీలక హెచ్చరిక
- ఐక్యరాజ్యసమితి కీలక హెచ్చరిక
- పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో ఐక్యరాజ్యసమితి కీలక హెచ్చరిక
- ఒకవేళ హార్ముజ్ జలసంధి మూతపడితే ఆహార ధరలు, జీవన వ్యయాలు పెరుగుతాయని ఆందోళన
- హార్ముజ్ మీదుగా నౌకలు, ఆయిల్ ట్యాంకర్ల రాకపోకలపై టెన్షన్..
- అంతర్జాతీయ వాణిజ్యం, అభివృద్ధికి గణనీయమైన ముప్పు కలుగుతుందని వార్నింగ్
- యూఎన్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ (యూఎన్‌సీటీఏడీ) నివేదిక విడుదల.
11 Mar 2026, 10:26 AM
ఇజ్రాయెల్ అరాచకం..
- ఇజ్రాయెల్ అరాచకం..
- నలుగురు దౌత్యవేత్తల దారుణ హత్య
- బీరుట్లో నలుగురు దౌత్యవేత్తలను చంపిన ఇజ్రాయెల్
- ఐరాసలో ఇరాన్ ప్రతినిధి తీవ్ర ఆరోపణలు
- ఈ మేరకు ఐరాస ప్రధాన కార్యదర్శికి లేఖలు
- మరోవైపు..అమెరికా-ఇజ్రాయెల్ దాడుల్లో దాదాపు 9,700 ప్రదేశాలు ధ్వంసం
- ఐక్యరాజ్యసమితిలో ఇరాన్ రాయబారి అమీర్ సయీద్ ఇరావానీ
11 Mar 2026, 10:18 AM
అమెరికా దౌత్య కార్యాలయంపై దాడి
- అమెరికా దౌత్య కార్యాలయంపై దాడి
- పశ్చిమాసియాలో కొనసాగుతున్న తీవ్ర యుద్ధం
- అమెరికా స్థావరాలే లక్ష్యంగా ఇరాన్ ప్రతీకార దాడులు
- ఇరాక్ రాజధాని బగ్దాద్‌లోని అమెరికా దౌత్య కార్యాలయంపై ఇరాన్ దాడి
- అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలోని దౌత్య కార్యాలయ లాజిస్టిక్ హబ్‌పై ఇరాన్ అనుమానిత డ్రోన్ దాడి
11 Mar 2026, 09:13 AM
ట్రంప్‌నకు పుతిన్ ఫోన్ కాల్..
- ట్రంప్‌నకు పుతిన్ ఫోన్ కాల్..
- పశ్చిమాసియా సంక్షోభంపై అభిప్రాయాలు పంచుకున్న ఇరువురు నేతలు
- వారిద్దరి మధ్య దాదాపు గంటపాటు సంభాషణ
- ఇరాన్–అమెరికా, ఉక్రెయిన్–రష్యా సంఘర్షణలపై చర్చించినట్లు రష్యా విదేశాంగ విధాన ప్రతినిధి యూరీ ఉషకోవ్ వెల్లడించారు.
- ట్రంప్, పుతిన్ మధ్య సంభాషణ స్వేచ్ఛాయుతంగా, నిర్మాణాత్మకంగా చర్చ జరిగినట్టు ప్రకటన.
- యుద్ధానికి త్వరలోనే ముగింపు పలకనున్నట్టు సమాచారం.
11 Mar 2026, 08:10 AM
అమెరికా సైన్యం యూటర్న్..
- అమెరికా సైన్యం యూటర్న్..
- సౌదీ అరేబియా నుండి తన సైనిక స్థావరాలను ఉపసంహరించుకుంటున్నట్లు అమెరికా ప్రకటన
- యుద్ధ విమానంలో అమెరికా సైనికులు వెళ్తున్న వీడియో వైరల్.
- అమెరికా దళాలు తమ ఆయుధాలతో బయలుదేరి యూఎస్‌కు తిరిగి వెళ్తున్నట్లు కనిపిస్తున్న వీడియో.
- ఇది ఇరాన్ సాధించిన అతిపెద్ద విజయంగా కామెంట్స్..
🚨 BREAKING
The United States announced the withdrawal of its military bases from Saudi Arabia.
In this footage, it is clearly seen that U.S. troops are leaving with equipment and heading back to their country.
This is described as Iran’s biggest victory. pic.twitter.com/ozJzBKQgDa— Iran Mil Updates (@lran_prees) March 10, 2026
11 Mar 2026, 08:07 AM
ఇరాన్‌కు భారీ నష్టం..
- ఇరాన్ సైనిక స్థావరాలు, ఆయుధ సంపత్తిపై అమెరికా-ఇజ్రాయెల్ దాడులు
- ఇరాన్లో సైనిక కమాండ్ సెంటర్లు, మౌలిక సదుపాయాలను ధ్వంసం చేసిన ఇజ్రాయెల్
- ఇరాన్‌లోని నౌకలు, క్షిపణి లాంచ్ ప్యాడ్లపై దాడులు చేసిన అమెరికా
- ఇజ్రాయెల్, అమెరికా దాడులకు ప్రతీకార దాడులు చేసిన టెహ్రాన్
- ఇరాన్ ప్రమాదకరమైన క్లస్టర్ బాంబులతో దాడులు చేస్తున్నట్లు ఆరోపించిన ఇజ్రాయెల్
- నిన్న ఒక్కరోజే ఇరాన్‌లోని 400కుపైగా లక్ష్యాలపై దాడి చేసినట్లు ఐడీఎఫ్ ప్రకటన
- ఇరాన్‌లోని 4 సైనిక ప్రధాన కార్యాలయాలపై వైమానిక దాడులు చేసినట్లు వెల్లడి
11 Mar 2026, 08:07 AM
యుద్ధంపై పెంటగాన్ కీలక ప్రకటన..
- యుద్ధంపై పెంటగాన్ కీలక ప్రకటన..
- యుద్ధంపై ట్రంప్‌దే తుది నిర్ణయం: పెంటగాన్ కీలక ప్రకటన.
- లెబనాన్‌లో మానవతా సంక్షోభం: నిరాశ్రయులైన 7 లక్షల మంది.
11 Mar 2026, 07:16 AM
ఇరాన్ యుద్ధం.. 1940 చేరిన మృతుల సంఖ్య..
- ఇరాన్ యుద్ధం.. 1940 చేరిన మృతుల సంఖ్య.
- మృతుల్లో అత్యధికులు ఇరాన్‌కు చెందినవారే.
- యుద్ధంలో 15వేల మందికిపైగా గాయాలు.
- మృతుల్లో ఏడుగురు అమెరికా సైనికులు, 140 మందికి గాయాలు.
- ఇజ్రాయెల్‌లో 14 మంది మృతి
11 Mar 2026, 07:16 AM
టెహ్రాన్‌లో ఇజ్రాయెల్ బాంబుల వర్షం..
- టెహ్రాన్‌లో ఇజ్రాయెల్ బాంబుల వర్షం..
- బంకర్లలోకి వెళ్లాలని ఇజ్రాయెల్ ప్రజలకు హెచ్చరికలు.
- లెబనాన్‌లో ఇజ్రాయెల్ దాడుల విలయం.
- లెబనాన్‌లో ఒక్కరోజే 95 మంది మృతి
- ట్రెహాన్‌లో నల్లటి వర్షం..
- చమురు సెగలతో పర్యావరణ విపత్తు.
- ఇరాన్‌లోని చారిత్రక నగరం ఇస్ఫహన్పై కూడా దాడులు.
11 Mar 2026, 07:16 AM
పశ్చిమాసియాలో భీకర యుద్ధం..
- పశ్చిమాసియాలో భీకర యుద్ధం.
- 35వ విడత దాడులు మొదలుపెట్టిన ఇరాన్.
- ఇజ్రాయెల్, అమెరికా స్థావరాలే లక్ష్యంగా క్షిపణుల వర్షం.
- సౌదీ, యూఏఈ గగనతలంలోకి ఇరాన్ డ్రోన్లు, బాలిస్టిక్ క్షిపణులు.
11 Mar 2026, 07:16 AM
మరిన్ని వార్తలు
Loading...
ADVERTISEMENT