Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. International
  3. ఉష మతం మారదు: జేడీ వాన్స్‌
ADVERTISEMENT 

ఉష మతం మారదు: జేడీ వాన్స్‌

International Sakshi User Sakshi Sakshi Time Nov 1, 2025 Sakshi Read Time Read Time: 3 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
Ushavance_Religion.jpg

మత విశ్వాసాల విషయంలో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్(JD Vance) చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. తన భార్య ఉషా వాన్స్ హిందూ మతంలో పెరిగినప్పటికీ.. క్రైస్తవ మతం స్వీకరించాలని తనకు ఆశగా ఉందంటూ ఆయన ఓ కార్యక్రమంలో వ్యాఖ్యానించడం తెలిసే ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆయనపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో ఆయన మరోసారి స్పందించారు. ఆయన క్రిస్టియన్‌ కాదని.. ఆమెకు మతం మారే ఉద్దేశం ఏమాత్రం లేదని అన్నారాయన. 

తాను చేసింది అసహ్యమైన వ్యాఖ్య అంటూ కొందరు నన్ను విమర్శించారు. నేను ప్రజల మనిషిని. వాళ్లు వేసే ప్రశ్న నుంచి తప్పించుకోలేను. అయినా మరోసారి స్పష్టత ఇస్తున్నా. ఆమెకు(ఉష) మతం మారే ఉద్దేశం లేదు.  అయినా మతపరమైన విషయాలనేవీ వ్యక్తిగతం. కుటుంబం, స్నేహితులతో చర్చించాల్సిన అంశం అది. క్రిస్టియన్లు తమ విశ్వాసాన్ని ఇతరులతో పంచుకోవాలనుకుంటారు. ఇది సాధారణమైన విషయం. నా వ్యాఖ్యలు కూడా అలాంటి సాధారణ ఆకాంక్షే అని  ఎక్స్‌ పోస్ట్‌లో వివరించారాయన. 

తనపై వస్తున్న విమర్శలను అసహ్యకరమైనవిగా అభివర్ణించిన ఆయన.. క్రిస్టియన్ మతంపై ద్వేషంతోనే వాళ్లు అలా మాట్లాడుతున్నారంటూ మండిపడ్డారు. నా భార్యను నేను ప్రేమగా చూస్తా. అలాగే ఆమె మతాన్ని కూడా గౌరవిస్తా. నేను ఆమె మతాన్ని తక్కువ చేసినట్లు మాట్లాడినట్లుగా భావించి విమర్శలు చేయడం సరికాదు అని అన్నారాయన. 

What a disgusting comment, and it's hardly been the only one along these lines. 

First off, the question was from a person seemingly to my left, about my interfaith marriage. I'm a public figure, and people are curious, and I wasn't going to avoid the question.

Second, my… https://t.co/JOzN7WAg3A

— JD Vance (@JDVance) October 31, 2025

యూనివర్సిటీ ఆఫ్ మిసిసిప్పీలో జరిగిన ఓ ఈవెంట్‌లో జేడీ వాన్స్‌ ప్రసంగిస్తుండగా.. భారత మూలాలున్న ఓ యువతి ఆయనపై ప్రశ్నలు గుప్పించింది. వలసలు, విదేశీ విద్యార్థుల విషయంలో ట్రంప్‌ ప్రభుత్వం అవలంభిస్తున్న కఠిన వైఖరిపై నిలదీస్తూనే.. మరోపక్క మతం గురించి  ఒక ప్రశ్న సంధించారు. దానికి వాన్స్‌ స్పందిస్తూ.. తన భార్య ఉషా, హిందూ మతంలో పెరిగినవారిగా క్రిస్టియన్ మతాన్ని స్వీకరించాలనే ఆశ తనకు ఉందని చెప్పారు. ఆమె చాలా ఆదివారాలు తనతో పాటు చర్చికి వస్తుందని, తాను అనుభవించిన ఆధ్యాత్మిక అనుభూతిని ఆమె కూడా అనుభవిస్తే బాగుంటుందని ఆశిస్తున్నానని అన్నారు. అంతే.. ఆయన్ని తిట్టిపోస్తూ నెటిజన్లు మండిపడ్డారు. 


ఉషా వాన్స్‌ నేపథ్యం.. 

జేడీ వాన్స్‌ సతీమణి, అమెరికా సెకండ్‌ లేడీ ఉషా చిలుకూరి వాన్స్‌. ఈమె తెలుగు మూలాలున్న వ్యక్తి. ఉష తల్లిదండ్రులు ఆంధ్రప్రదేశ్‌ నుంచి వెళ్లి అమెరికాలో స్థిరపడ్డారు. కాలిఫోర్నియాలోని శాండియాగో ప్రాంతంలో ఉషా చిలుకూరి (Usha Chilukuri Vance) పుట్టిపెరిగారు. యేల్‌ యూనివర్సిటీ నుంచి చరిత్రలో బ్యాచిలర్‌ డిగ్రీ పొందారు. కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయం నుంచి తత్వశాస్త్రంలో మాస్టర్స్ పూర్తి చేశారు. 

యేల్‌ లా స్కూల్‌లోనే ఉషా, జె.డి.వాన్స్‌ (JD Vance) తొలిసారి కలుసుకున్నారు. 2014లో కెంటకీలో వారు వివాహం చేసుకున్నారు. ప్రత్యేకంగా హిందూ సంప్రదాయంలోనూ పెళ్లి చేసుకోవడం విశేషం. వీళ్లకు ముగ్గురు సంతానం. ఆమె న్యాయ సంబంధమైన విభాగాల్లో సుదీర్ఘంగా పనిచేశారు. యేల్‌ విశ్వవిద్యాలయంలో లా అండ్‌ టెక్‌ జర్నల్‌కు మేనేజింగ్‌ ఎడిటర్‌గా, యేల్‌ లా జర్నల్‌కు ఎగ్జిక్యూటివ్‌ డెవలప్‌మెంట్‌ ఎడిటర్‌గా పనిచేశారు. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తులు జస్టిస్‌ జాన్‌ రాబర్ట్స్‌, జస్టిస్‌ బ్రెట్‌ కెవానా వద్ద విధులు నిర్వర్తించారు. 2015 నుంచి ఆమె న్యాయ సంబంధిత సంస్థలు ముంగర్‌, టోల్స్‌, ఓస్లాన్‌లో కార్పొరేట్‌ లిటిగేటర్‌గా పనిచేస్తున్నారు. 

విశేషం ఏంటంటే.. అమెరికాలో ఉష లెఫ్ట్‌-వింగ్‌, లిబరల్‌ గ్రూప్స్‌తో కలిసి పనిచేశారు. 2014లో ఆమె డెమోక్రాటిక్‌ పార్టీ కార్యకర్తగా నమోదు చేసుకున్నారు. అయితే.. రిపబ్లికన్‌ అయిన భర్త జేడీ వాన్స్‌ విజయంలో ఉషా కీలక పాత్ర పోషించారు. ఆ మధ్య ఈ కుటుంబం భారత పర్యటనలోనూ సందడి చేశారు.

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
JD Vance
Usha Vance
vice president
USA
Christianity
hindu
NRI
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

భీకరంగా మారిన అమెరికా-ఇరాన్‌ యుద్ధం!

భీకరంగా మారిన అమెరికా-ఇరాన్‌ యుద్ధం!

ప్రపంచకప్‌ నుంచి అమెరికా నిష్క్రమణ

ప్రపంచకప్‌ నుంచి అమెరికా నిష్క్రమణ

హార్మూజ్‌పై ఇరాన్ షాకింగ్‌ కామెంట్స్‌.. స్ట్రాంగ్‌ వార్నింగ్

హార్మూజ్‌పై ఇరాన్ షాకింగ్‌ కామెంట్స్‌.. స్ట్రాంగ్‌ వార్నింగ్

డాలర్‌ డిపాజిట్లపై వడ్డీ రేట్ల పెంపు

డాలర్‌ డిపాజిట్లపై వడ్డీ రేట్ల పెంపు

పాక్‌పై అమెరికా సెనేటర్ల నిప్పులు: లాడెన్‌ను దాచారంటూ ఆగ్రహం!

పాక్‌పై అమెరికా సెనేటర్ల నిప్పులు: లాడెన్‌ను దాచారంటూ ఆగ్రహం!

వాన్స్‌ను ముందుకు నెట్టి.. ట్రంప్‌ సేఫ్‌ గేమ్?

వాన్స్‌ను ముందుకు నెట్టి.. ట్రంప్‌ సేఫ్‌ గేమ్?

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.