Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. International
  3. బీరుట్‌పై దాడులు.. 22కు చేరిన మృతులు
ADVERTISEMENT 

బీరుట్‌పై దాడులు.. 22కు చేరిన మృతులు

International Sakshi User Sakshi Sakshi Time Oct 12, 2024 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
BUIRT.jpg

117 మంది గాయపడ్డారని ప్రకటించిన లెబనాన్‌ ప్రభుత్వం

తమ నేతపై ఇజ్రాయెల్‌ హత్యాయత్నం విఫలమైందన్న హెజ్‌బొల్లా

బీరుట్‌/న్యూఢిల్లీ: లెబనాన్‌ రాజధాని బీరుట్‌పై గురువారం రాత్రి ఇజ్రాయెల్‌ చేపట్టిన వైమానిక దాడుల్లో మరణాల సంఖ్య 22కు చేరుకుంది. తాజా ఘటనలో 117 మంది క్షతగాత్రులుగా మారారని లెబనాన్‌ ఆరోగ్య శాఖ తెలిపింది. బాధితుల వివరాలను మాత్రం వెల్లడించలేదు. సెంట్రల్‌ బీరుట్‌లోని రస్‌ అల్‌–నబా, బుర్జ్‌ అబి హైదర్‌లపై ఏకకాలంలో జరిగిన ఈ దాడుల్లో ఒక చోట ఎనిమిదంతస్తుల భవనం నేలమట్టం కాగా, మరో చోట ఓ భవన సముదాయంలోని దిగువ అంతస్తులు ధ్వంసమయ్యాయి.

 తమ ముఖ్య అధికారి వఫిక్‌ సఫాను చంపేందుకు ఇజ్రాయెల్‌ చేసిన ప్రయత్నం విఫలమైందని హెజ్‌బొల్లాకు చెందిన అల్‌ మనార్‌ టీవీ అనంతరం పేర్కొంది. దాడులు జరిగిన సమయంలో వఫిక్‌ ఆ రెండు భవనాల్లోనూ లేరని స్పష్టం చేసింది. తాజా దాడి, 2006 తర్వాత బీరుట్‌పై ఇజ్రాయెల్‌ చేసిన దాడుల్లో అత్యంత తీవ్రమైందని పరిశీలకులు అంటున్నారు. 

ఇటీవల బీరుట్‌ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇజ్రాయెల్‌ నిర్వహించిన భీకర దాడుల్లో హెజ్‌బొల్లా నేత హస్సన్‌ నస్రల్లా సహా పలువురు కమాండర్లు ప్రాణాలు కోల్పోవడం తెలిసిందే. హెజ్‌బొల్లా గురు వారం ఇజ్రాయెల్‌ ఉత్తర ప్రాంతంపై రాకెట్లు, డ్రోన్లను ప్రయోగించింది. డ్రోన్లను మధ్యలోనే అడ్డుకున్నట్లు ఇజ్రాయెల్‌ ఆర్మీ తెలిపింది. మరో వైపు, భూతల, వైమానిక, క్షిపణి దాడులతో హెజ్‌బొల్లా లక్ష్యాలపై ఇప్పటికే విరుచు కుపడు తున్న ఇజ్రాయెల్‌ సముద్రంపై నుంచి కూడా దాడులకు పాల్పడుతుందని సమాచారం. 

ఇద్దరు లెబనాన్‌ సైనికులు మృతి
లెబనాన్‌లోని బింట్‌ జబెయిల్‌ ప్రావిన్స్‌ కఫ్రాలోని ఆర్మీ చెక్‌ పాయింట్‌లోని భవనంపై శుక్రవారం ఇజ్రాయెల్‌ వైమానిక దాడిలో ఇద్దరు సైనికులు చనిపోగా ముగ్గురు గాయపడ్డారు. 

ఐరాస బలగాలపై మళ్లీ కాల్పులు
లెబనాన్‌లో ఐరాస శాంతి పరిరక్షక దళాల (యూఎన్‌ఐఎఫ్‌ఐఎల్‌)పై ఇజ్రాయెల్‌ బలగాలు శుక్రవారం మరోసారి దాడులకు పాల్పడ్డాయి. నఖౌరా పట్టణంలోని యూఎన్‌ఐఎఫ్‌ఐఎల్‌ ప్రధాన కార్యాలయం అబ్జర్వేషన్‌ పోస్ట్‌పై జరిగిన కాల్పుల్లో ఇద్దరు సభ్యులు గాయపడ్డారు. ఒకరు టైర్‌లోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని ఐరాస తెలిపింది. అదేవిధంగా, దక్షిణ లెబనాన్‌లో ఐరాస గుర్తించిన 120 కిలోమీటర్ల బ్లూలైన్‌ను దాటి ఇజ్రాయెల్‌ ఆర్మీ బుల్డోజర్లు, యుద్ధ ట్యాంకులు చొచ్చుకువచ్చాయని ఐరాస శుక్రవారం తెలిపింది. 

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
lebanon
Beirut
Israel attacks
Hezbollah
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

జాగ్రత్తగా మాట్లాడండి.. మా సైన్యం సిద్ధంగానే ఉంది

జాగ్రత్తగా మాట్లాడండి.. మా సైన్యం సిద్ధంగానే ఉంది

హార్మూజ్‌ మళ్లీ మూసివేత 

హార్మూజ్‌ మళ్లీ మూసివేత 

ఒప్పందం ఉత్తదేనా? 

ఒప్పందం ఉత్తదేనా? 

ఇజ్రాయెల్‌ దాడిలో తాబేళ్ల సంరక్షకురాలు మృతి

ఇజ్రాయెల్‌ దాడిలో తాబేళ్ల సంరక్షకురాలు మృతి

మళ్లీ భీకర దాడులకు దిగిన ఇజ్రాయెల్‌

మళ్లీ భీకర దాడులకు దిగిన ఇజ్రాయెల్‌

భీకర దాడులు ఆపై కాల్పుల విరమణ

భీకర దాడులు ఆపై కాల్పుల విరమణ

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.