Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. International
  3. జుట్టుపట్టి ఈడ్చి.. నిర్బంధించి
ADVERTISEMENT 

జుట్టుపట్టి ఈడ్చి.. నిర్బంధించి

International Sakshi User Sakshi Sakshi Time Oct 6, 2025 Sakshi Read Time Read Time: 1 min
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
gaza.jpg

గాజా సహాయ నౌకాయాత్ర బృందంపై ఇజ్రాయెల్‌ దాడి

గ్రెటా థన్‌బర్గ్‌ నిర్బంధం.. దౌర్జన్యం

పర్యావరణ ఉద్యమ కార్యకర్తల ఆరోపణ

టెల్‌ అవీవ్‌: గాజాకు మానవతా సాయం తీసుకెళ్లిన నౌకాయాత్ర సభ్యురాలైన స్వీడన్‌ పర్యావరణ ఉద్యమకారిణి గ్రెటా థన్‌బర్గ్‌తో ఇజ్రాయెల్‌ అధికారులు అనుచితంగా ప్రవర్తించారని సహ కార్యకర్తలు ఆరోపించారు. ఆమెను నిర్బంధంలోకి తీసుకుని దురుసుగా ప్రవర్తించారని.. ఆ యాత్రలో పాల్గొన్న పలువురు పర్యావరణ ఉద్యమ కార్యకర్తలు తెలిపారు. 

టర్కీ విదేశాంగ మంత్రిత్వ శాఖ కథనం ప్రకారం.. గాజాకు సహాయాన్ని తీసుకెళ్లిన నౌకలో ప్రయాణించిన 137 మంది పర్యావరణ ఉద్యమ కార్యకర్తలను ఇజ్రాయెల్‌ బహిష్కరించింది. వారు శనివారం ఇస్తాంబుల్‌కు చేరుకున్నారు. ఈ బృందంలో 36 మంది టర్కిష్‌ జాతీయులు సహా అమెరికా, యూఏఈ, అల్జీరియా, మొరాకో, ఇటలీ, కువైట్, లిబియా, మలేషియా, మౌరిటానియా, స్విట్జర్లాండ్, ట్యునీషియా, జోర్డాన్‌ తదితర దేశాలకు చెందిన వారు ఉన్నారు.

జంతువుల్లా చూశారు..
గ్రెటా థన్‌బర్గ్‌పై జరిగిన దురుసు ప్రవర్తనను కళ్లారా చూశామని.. మలేషియా జాతీయుడైన హజ్వానీ హెల్మీ, అమెరికన్‌ పౌరుడు విండ్‌ఫీల్డ్‌ బీవర్‌ అనే ఇద్దరు కార్యకర్తలు రాయిటర్స్‌ వార్తా సంస్థకు తెలిపారు. ‘అదొక విపత్తు. మమ్మల్ని జంతువుల్లా చూశారు. గ్రెటా థన్‌బర్గ్‌ను జుట్టు పట్టుకొని లాగి, ఇజ్రాయెల్‌ జెండాను ముద్దు పెట్టుకోమని బలవంతం చేశారు’.. అని 28 ఏళ్ల హెల్మీ ఆవేదన వ్యక్తం చేశారు. శుభ్రమైన ఆహారం, నీరు కూడా ఇవ్వలేదన్నారు.

నల్లులున్న గదిలో బంధించి..: గ్రెటా థన్‌బర్గ్‌ అనుచరులకు స్వీడిష్‌ విదేశాంగ మంత్రిత్వ శాఖ పంపిన ఒక ఈమెయిల్‌లో.. థన్‌బర్గ్‌ను నల్లులున్న గదిలో ఉంచారని, సరైన ఆహారం, నీరు ఇవ్వలేదని పేర్కొన్నట్లు ’ది గార్డియన్‌’ పత్రిక వెల్లడించింది. ‘రాయబార కార్యాలయం గ్రెటా థన్‌బర్గ్‌ను కలవగలిగింది. తనకు నీరసంగా ఉన్నట్లు ఆమె తెలిపింది. తగినంత నీరు, ఆహారం అందలేదు. శరీరమంతా దద్దుర్లు వచ్చాయి.. అవి నల్లుల వల్లే వచ్చాయని అనుమానిస్తున్నట్లు కూడా ఆమె తెలిపింది..’ అని ఈమెయిల్‌లో వెల్లడించారు. అయితే, ఈ ఆరోపణలన్నీ అబద్ధాలని ఇజ్రాయెల్‌ కొట్టిపారేసింది.

ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
Gaza
humanitarian
Sweden
Environmental activists
Greta Thunberg
Israel
intrusion
detention
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

ఆగని 'గ్రేటర్‌ ఇజ్రాయెల్‌' పథకం

ఆగని 'గ్రేటర్‌ ఇజ్రాయెల్‌' పథకం

స్వీడన్ సంచలన నిర్ణయం.. డిజిటల్ చదువులకు గుడ్‌బై!

స్వీడన్ సంచలన నిర్ణయం.. డిజిటల్ చదువులకు గుడ్‌బై!

జాగ్రత్తగా మాట్లాడండి.. మా సైన్యం సిద్ధంగానే ఉంది

జాగ్రత్తగా మాట్లాడండి.. మా సైన్యం సిద్ధంగానే ఉంది

33 మ్యాచ్‌ల్లో వంద గోల్స్‌.. ఆల్‌టైమ్ రికార్డు ఎంతో తెలుసా?

33 మ్యాచ్‌ల్లో వంద గోల్స్‌.. ఆల్‌టైమ్ రికార్డు ఎంతో తెలుసా?

గాజాపై ఇజ్రాయెల్‌ దాడులు.. ఇద్దరు చిన్నారులు సహా ఆరుగురు మృతి

గాజాపై ఇజ్రాయెల్‌ దాడులు.. ఇద్దరు చిన్నారులు సహా ఆరుగురు మృతి

ఇజ్రాయెల్‌ దాడిలో తాబేళ్ల సంరక్షకురాలు మృతి

ఇజ్రాయెల్‌ దాడిలో తాబేళ్ల సంరక్షకురాలు మృతి

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.