Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. International
  3. రెడ్‌ లైన్‌ దాటేసింది.. ఇక తాడోపేడో తేల్చుకుంటాం
ADVERTISEMENT 

రెడ్‌ లైన్‌ దాటేసింది.. ఇక తాడోపేడో తేల్చుకుంటాం

International Sakshi User Sakshi Sakshi Time Jan 12, 2026 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
Trump.jpg

ఆందోళనలతో అట్టుడికిపోతున్న ఇరాన్‌కు అమెరికా మరో సాలిడ్‌ వార్నింగ్‌ ఇచ్చింది. రెడ్‌ లైన్‌ దాటేసిందని.. ఇక తీవ్ర చర్యలు తప్పదన్నట్లుగా తీవ్ర సంకేతాలు పంపించింది. ఈ మేరకు అధ్యక్ష డొనాల్డ్‌ ట్రంప్‌ స్వయంగా కీలక వ్యాఖ్యలు చేశారు. 

ఒకవేళ అమెరికా గనుక ఇరాన్‌ వ్యవహారంలో జోక్యం చేసుకున్నా.. కవ్వింపు చర్యలకు దిగినా.. తాము అమెరికా మిలిటరీ స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడులు జరుపుతామని టెహ్రాన్‌ వర్గాలు హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సోమవారం(భారత కాలమానం ప్రకారం) ట్రంప్‌ మీడియాతో మాట్లాడుతూ ఇలా అన్నారు.. 

‘‘ఇరాన్‌ పరిణామాలను అమెరికా సైన్యం నిశితంగా పరిశీలిస్తోంది. అక్కడి పరిస్థితి అంతకంతకు దిగజారుతోంది. ఆందోళనకారుల పట్ల అక్కడి ప్రభుత్వం అత్యంత కఠినంగా వ్యవహరిస్తోంది. ముందు నుంచి చెబుతున్నట్లు మేం చూస్తూ ఊరుకోం. మేము బలమైన చర్యలపై పరిశీలిస్తున్నాం. గంట గంటకు నివేదికలు తెప్పించుకుంటున్నాం. ఆ నిర్ణయం త్వరలోనే ఉంటుంది’’ అని ట్రంప్‌ ప్రకటించారు. అంతటితో ఆగకుండా.. 

ఇరాన్–అమెరికా మధ్య అణు చర్చల అవకాశాలు ఉన్నాయని వ్యాఖ్యానించిన ట్రంప్‌.. ఇరాన్ ప్రతిపక్షాలు తనతో టచ్‌లో ఉన్నట్లు వెల్లడించారు. అటు అమెరికాలో ఉంటూ ఇరాన్‌ నిరసనలను ప్రొత్సహిస్తున్న బహిష్కృత ఇరాన్‌ యువరాజు రేజా పహ్లవి రేపోమాపో ట్రంప్‌తో భేటీ కాబోతున్నారు. దీంతో ఖమేనీని గద్దె దించేందుకు అమెరికా అధ్యక్షుడు గట్టి ప్రయత్నాలే చేస్తున్నట్లు స్పష్టమవుతోంది. సీనియర్‌ సలహాదారులతో సంప్రదింపులను ముమ్మరం చేసినట్లు వైట్‌హౌజ్‌ వర్గాలు చెబుతున్నాయి. 

కరెన్సీ పతనం, బడ్జెట్‌లో సామాన్యుల నడ్డి విరిచే నిర్ణయాలు, ధరల పెరుగుదల.. ఇలా ఒక్కో నిర్ణయాలు ఖమేనీ పాలనపై అక్కడి ప్రజలకు విరక్తి కలిగించాయి. గతేడాది డిసెంబర్‌ 28న తేదీన టెహ్రాన్‌ సహా ప్రధాన నగరాల్లో ప్రారంభమైన నిరసనలు.. భద్రతా బలగాల అణచివేత చర్యలతో హింసాత్మకంగా మారాయి.   

హక్కుల సంఘాల లెక్క ప్రకారం.. ఇప్పటిదాకా 500 మందికి పైగా మరణించారు. 10,600 మందిని అక్రమ అరెస్ట్‌ చేశారు. అయితే ఇరాన్‌ మాత్రం ఈ ఆందోళనలను విదేశీ కుట్రగా అభివర్ణిస్తోంది. ఆ కథనాలను కూడా వండి వారుస్తున్నట్లు మండిపడింది. ఇరాన్‌పై దాడి జరిగితే, ఇజ్రాయెల్‌తో పాటు అన్ని అమెరికా బేస్‌లు, నౌకలు మా లక్ష్యాలు అవుతాయి అంటూ ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బాకర్ ఖలీబాఫ్ హెచ్చరికలు జారీ చేశారు. అంతేకాదు.. ఇజ్రాయెల్‌, అమెరికాలకు వ్యతిరేకంగా ప్రభుత్వం తరపున దేశవ్యాప్త ర్యాలీలకు పిలుపు ఇచ్చారాయన. 

2022 తర్వాత ఇరాన్‌లో ఉధృతంగా కొనసాగుతున్న ఆందోళనలివే. హిజాబ్‌ ధరించలేదని ఓ యువతిపై మోరల్‌ పోలీసింగ్‌ ప్రయోగించగా.. అనుమానాస్పద రీతిలో ఆమె ఆస్పత్రిలో మరణించింది. దీంతో యువతులు పెద్ద ఎత్తున ఇరాన్‌ వీధుల్లోకి చేరి ఉద్యమించారు. అయితే ఖమేనీ ప్రభుత్వం వాటిని అణచివేసింది. 

ఇరాన్‌పై చర్యలకు అమెరికా ముందున్న ఆప్షన్లు: సైనిక దాడులు, సీక్రెట్‌ సైబర్ ఎటాక్స్‌, ఇరాన్‌పై అత్యంత కఠిన ఆంక్షలు, చివరగా.. అక్కడి ప్రతిపక్ష నేతలకు, నిరసనలు తెలియజేస్తున్న గ్రూపులకు డిజిటల్ మద్దతు ఇవ్వడం. ఇరాన్‌లో ఇంటర్నెట్‌ నిషేధం అమల్లో ఉండడంతో.. అక్కడేం జరుగుతుందో బయటి దేశాలకు తెలియని పరిస్థితి. ఈ క్రమంలో.. టెక్‌ బిలియనీర్‌ ఎలాన్‌ మస్క్‌తో మాట్లాడి స్టార్‌లింక్‌ (శాటిలైట్ ఆధారిత) ద్వారా ఇరాన్‌లో ఇంటర్నెట్ పునరుద్ధరించాలనుకుంటున్నట్లు ట్రంప్‌ చెబుతున్నారు.

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
iran
protests
Donald trump
USA
military action
tehran
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

హర్ముజ్‌లో మళ్లీ అమెరికా బ్లాకేడ్‌.. ఇరాన్‌ సంచలన ప్రకటన

హర్ముజ్‌లో మళ్లీ అమెరికా బ్లాకేడ్‌.. ఇరాన్‌ సంచలన ప్రకటన

హర్ముజ్‌ జలసంధిపై కొత్త ఆధిపత్య పోరు!

హర్ముజ్‌ జలసంధిపై కొత్త ఆధిపత్య పోరు!

మళ్లీ ట్రిగ్గర్‌ నొక్కిన ట్రంప్.. మరింత ముదిరిన యుద్ధం

మళ్లీ ట్రిగ్గర్‌ నొక్కిన ట్రంప్.. మరింత ముదిరిన యుద్ధం

పుతిన్‌ తగ్గేదేలే.. మళ్లీ మంటలు రేపే యుద్ధమా?

పుతిన్‌ తగ్గేదేలే.. మళ్లీ మంటలు రేపే యుద్ధమా?

భీకరంగా మారిన అమెరికా-ఇరాన్‌ యుద్ధం!

భీకరంగా మారిన అమెరికా-ఇరాన్‌ యుద్ధం!

ప్రపంచకప్‌ నుంచి అమెరికా నిష్క్రమణ

ప్రపంచకప్‌ నుంచి అమెరికా నిష్క్రమణ

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.