Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Subscribe Subscribe Epaper Epaper Live TV లైవ్ TV
download app Download App
download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. International
  3. హర్ముజ్‌ జలసంధిపై కొత్త ఆధిపత్య పోరు!
ADVERTISEMENT

హర్ముజ్‌ జలసంధిపై కొత్త ఆధిపత్య పోరు!

International Sakshi User Sakshi Sakshi Time Jul 14, 2026 Sakshi Read Time Read Time: 3 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Google
Hormouz_Fight.jpg

ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హర్ముజ్‌ జలసంధి.. ఉద్రిక్తతలతో పాటు మరోసారి అంతర్జాతీయ రాజకీయాల కేంద్రంగా మారింది. జలసంధి గుండా వెళ్లే ప్రతి కార్గో నౌకపై 20 శాతం టోల్‌ వసూలు చేస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించడం తీవ్ర చర్చనీయాంశమైంది. భారత్‌ సహా పలు దేశాలు ఈ సుంకం చెల్లించాల్సిందేనని అంటున్నారాయన. దానికి ఇరాన్‌ కాస్త ఘాటుగానే బదులిచ్చింది. 

ట్రూత్‌ సోషల్‌లో ట్రంప్‌ చేసిన పోస్టులో.. ఇకపై అమెరికా "ది గార్డియన్‌ ఆఫ్‌ ది హర్ముజ్‌ స్ట్రైట్‌"గా వ్యవహరిస్తుందని ప్రకటించారు. ప్రపంచ వాణిజ్య నౌకలకు భద్రత కల్పించేందుకు అమెరికా భారీ ఖర్చు చేస్తున్నందున, ఆ ఖర్చుకు ప్రతిఫలంగా హర్ముజ్‌ (Strait of Hormuz) గుండా వెళ్లే ప్రతి కార్గోపై 20 శాతం రుసుము వసూలు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఈ ప్రక్రియను వెంటనే ప్రారంభిస్తామని వెల్లడించారు. దీనికి విదేశాంగ మంత్రి సయ్యద్‌ అబ్బాస్‌ అరాఖ్చీ స్పందిస్తూ.. "హర్ముజ్‌కు నిజమైన సంరక్షకులు అమెరికా కాదు.. ఇరానే. 20 శాతం చాలా ఎక్కువ.. మేమైతే న్యాయమైన రుసుమే వసూలు చేస్తాం" అంటూ వ్యంగ్యంగా స్పందించారు.

ఇరాన్‌ ఘాటు కౌంటర్‌
ట్రంప్‌ వ్యాఖ్యలపై ఎక్స్‌ (X) వేదికగా స్పందించిన అరాఖ్చీ.. "వాణిజ్య నౌకలకు సురక్షిత మార్గం కల్పించే వారికి పారితోషికం ఇవ్వాలన్న ట్రంప్‌ మాట సరైనదే. కానీ హర్ముజ్‌కు ఎప్పటినుంచో నిజమైన గార్డియన్‌ ఇరానే. ఇకముందూ అలాగే ఉంటుంది" అన్నారు.  అయితే ట్రంప్‌ ప్రతిపాదించిన 20 శాతం టోల్‌పై సెటైర్‌ వేస్తూ.. "20 శాతం చాలా ఎక్కువ. మేమైతే న్యాయంగా వ్యవహరిస్తాం" అని వ్యాఖ్యానించారు. దీంతో హర్ముజ్‌పై అమెరికా-ఇరాన్‌ మధ్య మాటల యుద్ధం మరింత ముదిరింది.

POTUS is absolutely right. Whoever provides secure and safe passage of commercial vessels through the Strait of Hormuz should be compensated for this service. 

Iran has always been the GUARDIAN of the Strait and will remain so FOREVER.

20% is of course too much. We will be fair

— Seyed Abbas Araghchi (@araghchi) July 13, 2026

మరోసారి అమెరికా సముద్ర దిగ్బంధనం
ఇదే సమయంలో ఇరాన్‌పై అమెరికా మరోసారి సముద్ర దిగ్బంధనాన్ని (Maritime Blockade) అమలు చేయడం ఉద్రిక్తతను పెంచింది. జూలై 14 సాయంత్రం 4 గంటల (ET) నుంచి ఇరాన్‌ పోర్టులకు వచ్చే, వెళ్లే నౌకలపై దిగ్బంధన చర్యలు తిరిగి ప్రారంభిస్తున్నట్లు అమెరికా సెంట్రల్‌ కమాండ్‌ (CENTCOM) ప్రకటించింది. ఇరాన్‌ పోర్టులకు వెళ్తున్న లేదా అక్కడి నుంచి వస్తున్న నౌకలను అమెరికా దళాలు తనిఖీ చేస్తాయని, గల్ఫ్‌ ఆఫ్‌ ఒమన్‌, హర్ముజ్‌ పరిసరాల్లో ప్రయాణించే నౌకలు అమెరికా నౌకాదళంతో నిరంతరం సంప్రదింపులు కొనసాగించాలని సూచించింది.

పాత ఒప్పందం ముగిసిందా?
గతంలో ఏప్రిల్‌ 13 నుంచి జూన్‌ 18 వరకు అమెరికా ఇదే తరహా దిగ్బంధనం అమలు చేసింది. అనంతరం అమెరికా-ఇరాన్‌ మధ్య తాత్కాలిక శాంతి ఒప్పందం కుదరడంతో దానిని ఎత్తివేశారు. అయితే ఇటీవల ఆ ఒప్పందం ఇక అమల్లో లేదని ట్రంప్‌ ప్రకటించడంతో పరిస్థితి మళ్లీ ఉద్రిక్తంగా మారింది. ఇరాన్‌ మాత్రం గత నెల కుదిరిన మధ్యంతర ఒప్పందం ప్రకారం హర్ముజ్‌లో రవాణాను నియంత్రించే హక్కు తమకే ఉందని, అవసరమైతే టోల్‌ కూడా వసూలు చేసే అధికారం ఉందని చెబుతోంది. దీనిని అమెరికా పూర్తిగా తిరస్కరిస్తోంది. అంతర్జాతీయ సముద్ర చట్టాల ప్రకారం ప్రపంచ నౌకలకు స్వేచ్ఛగా ప్రయాణించే హక్కు ఉందని వాషింగ్టన్‌ వాదిస్తోంది.

ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం
ప్రపంచంలో ఉత్పత్తి అయ్యే చమురు, ద్రవీభవించిన సహజ వాయువు (LNG)లో దాదాపు 20 శాతం హోర్ముజ్‌ జలసంధి గుండా రవాణా అవుతుంది. అందువల్ల ఈ మార్గంలో ఏ చిన్న అంతరాయం వచ్చినా ప్రపంచ ఇంధన ధరలపై తీవ్ర ప్రభావం పడుతుంది. విశ్లేషకుల అంచనా ప్రకారం.. ట్రంప్‌ ప్రతిపాదించిన 20 శాతం టోల్‌ అమల్లోకి వస్తే, పూర్తిగా చమురుతో నిండిన ఒక సూపర్‌ ట్యాంకర్‌ దాదాపు 30 మిలియన్‌ డాలర్ల వరకు అదనపు రుసుము చెల్లించాల్సి రావచ్చు. ఇప్పటివరకు ఇరాన్‌ వసూలు చేసినట్లు భావిస్తున్న రుసుము సుమారు 2 మిలియన్‌ డాలర్ల పరిధిలోనే ఉందని అంతర్జాతీయ వర్గాలు చెబుతున్నాయి.

ఇంధన వ్యయం భారీగా పెరగడంతో అమెరికాతో పాటు ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు, రవాణా ఖర్చులు, ద్రవ్యోల్బణంపై కూడా దీని ప్రభావం పడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీంతో హర్ముజ్‌ జలసంధి చుట్టూ అమెరికా-ఇరాన్‌ ఆధిపత్య పోరు మరింత ఉత్కంఠగా మారింది.

ADVERTISEMENT
ADVERTISEMENT
tags Tags:
world news
Strait of Hormuz
Donald trump
iran
toll Fee
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

పాక్‌కు ముచ్చెమటలు పట్టిస్తున్న ఇరాన్‌ కొత్త ఎత్తుగడ!

పాక్‌కు ముచ్చెమటలు పట్టిస్తున్న ఇరాన్‌ కొత్త ఎత్తుగడ!

ఇప్పుడంతా AI.. మరి రేపు ఏంటి?

ఇప్పుడంతా AI.. మరి రేపు ఏంటి?

హర్ముజ్‌లో మళ్లీ అమెరికా బ్లాకేడ్‌.. ఇరాన్‌ సంచలన ప్రకటన

హర్ముజ్‌లో మళ్లీ అమెరికా బ్లాకేడ్‌.. ఇరాన్‌ సంచలన ప్రకటన

మళ్లీ ట్రిగ్గర్‌ నొక్కిన ట్రంప్.. మరింత ముదిరిన యుద్ధం

మళ్లీ ట్రిగ్గర్‌ నొక్కిన ట్రంప్.. మరింత ముదిరిన యుద్ధం

రహస్య కదలికలు.. భూమిపై ఏలియన్స్‌ నిఘా?

రహస్య కదలికలు.. భూమిపై ఏలియన్స్‌ నిఘా?

పుతిన్‌ తగ్గేదేలే.. మళ్లీ మంటలు రేపే యుద్ధమా?

పుతిన్‌ తగ్గేదేలే.. మళ్లీ మంటలు రేపే యుద్ధమా?

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT
Advertisement
 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
 
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.