Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. International
  3. బిగ్‌ ట్విస్ట్‌.. ముగిసిన ఇరాన్‌-ఇజ్రాయెల్‌ యుద్ధం
ADVERTISEMENT 

బిగ్‌ ట్విస్ట్‌.. ముగిసిన ఇరాన్‌-ఇజ్రాయెల్‌ యుద్ధం

International Sakshi User Sakshi Sakshi Time Jun 24, 2025 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
iran-and-israel-war.jpg

పశ్చిమాసియా యుద్ధవాతావరణానికి ఎట్టకేలకు తెరపడింది. ఇజ్రాయెల్‌-ఇరాన్‌ మధ్య 12 రోజులుగా కొనసాగుతున్న యుద్ధం ముగిసింది!. కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చినట్లు ఇరాన్‌ ప్రకటన చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. అంతకుముందు.. ఈ ప్రకటన చేసే చివరి నిమిషం వరకూ ఇజ్రాయెల్‌పై ఇరాన్‌ దాడులు కొనసాగించడం గమనార్హం.

ఇరాన్- ఇజ్రాయెల్‌ (Iran- Israel) మధ్య కాల్పుల విరమణ జరగనున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ఒప్పందంపై సందిగ్ధం నెలకొన్న నేపథ్యంలో ఇరుదేశాల మధ్య ఒప్పందానికి తానే మధ్యవర్తిత్వం వహించానని ట్రంప్‌ చెప్పుకోవడం మొదలుపెట్టారు. ఈ ఒప్పందానికి సంబంధించి తాజాగా ఆయన ట్రూత్‌ సోషల్‌లో ఓ పోస్టు పెట్టారు. 


సీజ్‌ ఫైర్‌ అమల్లోకి వచ్చిందని, ఎవరూ ఉల్లంఘించొద్దంటూ ఆయన పోస్ట్‌ చేశారు. తొలుత ఇరాన్‌, ఆపై ఇజ్రాయెల్‌ కాల్పుల విరమణ పాటిస్తాయని, 24 గంటల్లో ఈ ఒప్పందం పూర్తిగా అమల్లోకి వస్తుందని తెలిపారు. మరోవైపు ఇజ్రాయెల్‌ కాల్పుల విరమణను అధికారికంగా ప్రకటించలేదు. అయితే బంకర్లలో దాక్కున్న తమ దేశ పౌరులను బయటకు రావాలంటూ ఆదేశాలు జారీ చేసింది. దీంతో యుద్ధం ముగిసినట్లేనని స్పష్టమవుతోంది. అంతకు ముందు.. ట్రంప్‌ కాల్పుల విరమణ ఒప్పందంపై ఆసక్తికరమైన పోస్ట్‌ చేశారు.

ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరాన్, ఇజ్రాయెల్‌ దేశాలు ఒకేశారి ‘శాంతి’ అంటూ తన వద్దకు కాళ్లబేరానికి వచ్చాయని ట్రంప్‌ పేర్కొన్నారు. అక్కడ శాంతి అవసరం ఉందని తాను గుర్తించానన్నారు. ఈ కాల్పుల విరమణ ఒప్పందంలో పశ్చిమాసియాతో పాటు ప్రపంచం కూడా నిజమైన విజయం సాధించిందన్నారు. ఇరుదేశాలు భవిష్యత్తులో ప్రేమ, శాంతి శ్రేయస్సును చూస్తాయని తెలిపారు. అలా కాదని వారు నీతిని, సత్య మార్గాన్ని వదులుకుంటే రానున్న రోజుల్లో మరింత కోల్పోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. 

ఈలోపు ఇరాన్‌ ట్విస్ట్‌ ఇచ్చింది. ప్రస్తుతానికి అలాంటిదేమీ లేదంటూనే.. ఒప్పందానికి సుముఖంగా ఉన్నట్లు, ఇజ్రాయెల్‌ దాడులు ఆపితేనే తామూ దాడులు ఆపుతామంటూ ఇరాన్‌ విదేశాంగ మంత్రి సూచనప్రాయంగా పోస్టులు చేశారు. మరోవైపు.. ‘‘ఇజ్రాయెల్‌తో కాల్పుల విరమణ ఒప్పందం కోసం ట్రంప్‌ మా దేశాన్ని వేడుకున్నారు. ఖతార్‌లో అమెరికా వాయు స్థావరాలపై తాము దాడులు చేసిన వెంటనే కాళ్ల బేరానికి వచ్చారు’’ అంటూ ఇరాన్‌ ప్రభుత్వ టీవీ ఛానల్‌ కథన ప్రసారం చేసింది.

ఆపై కొన్ని గంటల్లోనే టెల్‌అవీవ్‌పై టెహ్రాన్‌ క్షిపణులతో దాడులకు దిగింది. ఈ దాడుల్లో పలువురు మరణించారు. దీంతో పశ్చిమాసియలో మళ్లీ ఉద్రిక్తతలు చెలరేగుతాయని భావించేలోపే..  కాసేపటికే ట్విస్ట్‌ ఇస్తూ ఇరాన్‌ కాల్పుల విరమణ మొదలైందంటూ ప్రకటన చేయించడం గమనార్హం. ఇరుదేశాల ఒప్పందం వివరాలు వెల్లడి కావాల్సి ఉన్నాయి.

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
Iran-Israel conflict
ceasefire
iran
Donald trump
Israel
Tel Aviv
tehran
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

హర్ముజ్‌లో మళ్లీ అమెరికా బ్లాకేడ్‌.. ఇరాన్‌ సంచలన ప్రకటన

హర్ముజ్‌లో మళ్లీ అమెరికా బ్లాకేడ్‌.. ఇరాన్‌ సంచలన ప్రకటన

హర్ముజ్‌ జలసంధిపై కొత్త ఆధిపత్య పోరు!

హర్ముజ్‌ జలసంధిపై కొత్త ఆధిపత్య పోరు!

మళ్లీ ట్రిగ్గర్‌ నొక్కిన ట్రంప్.. మరింత ముదిరిన యుద్ధం

మళ్లీ ట్రిగ్గర్‌ నొక్కిన ట్రంప్.. మరింత ముదిరిన యుద్ధం

పుతిన్‌ తగ్గేదేలే.. మళ్లీ మంటలు రేపే యుద్ధమా?

పుతిన్‌ తగ్గేదేలే.. మళ్లీ మంటలు రేపే యుద్ధమా?

భీకరంగా మారిన అమెరికా-ఇరాన్‌ యుద్ధం!

భీకరంగా మారిన అమెరికా-ఇరాన్‌ యుద్ధం!

పాక్‌పై అమెరికా సెనేటర్ల నిప్పులు: లాడెన్‌ను దాచారంటూ ఆగ్రహం!

పాక్‌పై అమెరికా సెనేటర్ల నిప్పులు: లాడెన్‌ను దాచారంటూ ఆగ్రహం!

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.