Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. International
  3. విరుచుకుపడిన ‘మెలిసా’
ADVERTISEMENT 

విరుచుకుపడిన ‘మెలిసా’

International Sakshi User Sakshi Sakshi Time Oct 29, 2025 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
WEATHER.jpg

భీకర తుపాను ధాటికి జమైకా అతలాకుతలం

పలువురి దుర్మరణం ! 

దేశంలో 174 ఏళ్ల తుపాన్ల రికార్డులను తిరగరాసిన మెలిసా

కింగ్‌స్టన్‌: అట్లాంటిక్‌ మహాసముద్రంలో పుట్టి చరిత్రలో అత్యంత శక్తివంతమైన తుపాన్‌లలో ఒకటిగా రూపుదాలి్చన ‘మెలిసా’ తుపాను మంగళవారం జమైకా దేశాన్ని వెన్నులో వణకుపుట్టే స్థాయిలో భీకరంగా తాకింది. జమైకాలో నైరుతి దిశలో ఉన్న ‘న్యూ హోప్‌’ ప్రాంతం వద్ద తుపాను తీరాన్ని తాకి పెను విధ్వంసం సృష్టించింది. గంటకు 295 కిలోమీటర్ల వేగంతో వీచిన పెను గాలుల ధాటికి కరీబియన్‌ ద్వీపదేశం జమైకాలో వేలాదిగా చెట్లు నేలకూలాయి. కొండచరియలు విరిగిపడ్డాయి. విద్యుత్‌ స్తంభాలు కూలిపోయి దేశంలో సగం జనావాసాలకు విద్యుత్‌ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. దీంతో అంతటా అంధకారం అలుముకుంది. రాజధాని నగరం కింగ్‌స్టన్‌లో వీధులన్నీ నిర్మానుష్యంగా మారిపోయాయి.

జమైకాలో తుపాన్‌లను నమోదుచేసే విధానం మొదలైన ఈ 174 ఏళ్లలో ఇంతటి భీకర తుపాను రావడం ఇదే తొలిసారి. కేటగిరీ–5 తుపాన్‌ అయిన మెలిసా ధాటికి మంగళవారం జమైకాలో పలువురు ప్రాణాలు కోల్పోయినట్లు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. కనీవినీ ఎరుగని శక్తివంతమైన తుపాను దెబ్బకు దేశం చరిత్రలో ఎప్పడూ లేనంతటి ఆస్తి నష్టాన్ని చవిచూడబోతోందని ప్రధాని ఆండ్రూ హోల్నెస్‌ ఆవేదన వ్యక్తంచేశారు. ‘‘తుపాను ఇప్పుడే తీరాన్ని తాకింది. వెంటనే దీని పూర్తి నష్ట తీవ్రతను అంచనావేయలేం’’ అని ఆయన అన్నారు. తీరం వెంబడి అలలు 13 అడుగుల ఎత్తులో ఎగసిపడుతున్నాయి. మరోవైపు సహాయక చర్యలను ముమ్మరంచేశారు. తాత్కాలిక శిబిరాలను ఏర్పాటుచేసి లోతట్టు ప్రాంతాల ప్రజలను అక్కడికి తరలించారు. తుపాను కారణంగా హైతీ దేశంలో ముగ్గురు, డొమినికన్‌ రిపబ్లిక్‌ దేశంలో ఒకరు మరణించారు.

ఐక్యరాజ్యసమితి విభాగాలు, పలు స్వచ్ఛంద సంస్థలు ఆహారం, ఔషధాలు, నిత్యవసరాలను జమైకాకు తరలిస్తున్నాయి. సురక్షితమైన తాగునీటిని నిల్వ చేసుకోవాలని, ప్రతి చుక్కా జాగ్రత్తగా వాడుకోవాలని మంత్రి మాథ్యూ సమూడా ప్రజలకు సూచించారు. ఇప్పటికే జమైకాలో అన్ని రకాల ప్రభుత్వ, ప్రైవేట్‌ కార్యకలాపాలను నిలిపేశారు. ఎయిర్‌పోర్ట్‌లు, ప్రజారవాణా స్తంభించిపోయింది. కింగ్‌స్టన్, సెయింట్‌ ఎలిజబెత్, క్లారెండన్‌ నగరాల నుంచి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. తుపాను ప్రభావం క్యూబా, హైతీ, డొమినికన్‌ రిపబ్లికన్, బహమాస్‌పైనా ప్రభావం చూపింది.

క్యూబాలో ఇప్పటికే 6 లక్షల మందికిపైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మరోవైపు తుపాన్‌కు సంబంధించి కృత్రిమ మేధ(ఏఐ)తో సృష్టించిన నకిలీ ఫోటోలు, వీడియోలు సోషల్‌ మీడియాను ముంచెత్తుతున్నాయి. అవి చూసిన తుపాను ప్రభావిత ప్రాంతాల ప్రజల్లో భయాందోళనలు పెరిగాయి. సోషల్‌ మీడియాలో సాగుతున్న తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దని అధికారులు స్పష్టంచేశారు. జమైకాలో ప్రస్తుతం 25,000 మంది విదేశీ పర్యాటకులు ఉన్నారని, వారి రక్షణ కోసం చర్యలు చేపట్టామని ప్రభుత్వం వెల్లడించింది. తూర్పు క్యూబా, బహమాస్‌ల వైపు వెళ్లాక తుపాను కొనసాగే అవకాశముందని అమెరికా హరికేన్‌ విభాగం పేర్కొంది.

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
Hurricane
Jamaica
Kingston
Cyclone
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

ఉత్తర ఒడిశా దగ్గర తీరాన్ని దాటిన వాయుగుండం

ఉత్తర ఒడిశా దగ్గర తీరాన్ని దాటిన వాయుగుండం

మహా ప్రళయం! జంగ్మీ తుఫాను రౌద్రరూపం.. గాలిలో ఎగిరిపడుతున్న కార్లు!

మహా ప్రళయం! జంగ్మీ తుఫాను రౌద్రరూపం.. గాలిలో ఎగిరిపడుతున్న కార్లు!

Cyclone: గంటకు 120 కి.మీ వేగంతో భీకరమైన గాలులు

Cyclone: గంటకు 120 కి.మీ వేగంతో భీకరమైన గాలులు

సంక్రాంతి సంబరాలకు ఎఫెక్ట్‌?.. దూసుకొస్తున్న తుపాన్‌!

సంక్రాంతి సంబరాలకు ఎఫెక్ట్‌?.. దూసుకొస్తున్న తుపాన్‌!

నెల్లూరులో కుండపోత వర్షం (ఫొటోలు)

నెల్లూరులో కుండపోత వర్షం (ఫొటోలు)

కొనసాగుతున్న వాయుగుండం

కొనసాగుతున్న వాయుగుండం

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.