ఓ బారీ ఆకాశహర్మం మంటల్లో చిక్కుకుంది. దీంతో ఒక్కసారిగా వీధుల్లో నిప్పుల వర్షం కురిసింది. ఈ ఘటన హాంకాంగ్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..హాంకాంగ్‌లోని సిమ్ షా సుయ్‌లో 42 అంతస్తుల భారీ ఆకాశహర్మంలో అర్థరాత్రి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో నిర్మాణం లోపల ఏవో పెద్దపెద్దగా పేలుళ్ల శబ్దాలతో అగ్నికీలలు ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయి. దీంతో వెంటనే రంగంలో దిగిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు యత్నించగా..వీధుల్లో కుప్పలు కుప్పులుగా కాలిపోతున్న చెత్త చెదారం ఏదో ఎర్రటి నిప్పుల వర్షం మాదిరి కనిపించాయి.
ఈ ఘటకు ముందు ఇద్దరు అగంతకులు ఇదే భవనంలోని క్వీన్ ఎలిజబెత్ ఆస్పత్రికి చికిత్స కోసం వచ్చినట్లు స్థానికి మీడియా పేర్కొంది. ఐతే ఈ ఘటనలో ఎంత ప్రాణ, ఆస్తి నష్టం జరిగిందనేది తెలియాల్సి ఉంది. ఈ నిర్మాణ స్థలం 1967లో హాంకాంగ్ గవర్నర్ డేవిడ్ ట్రెంచ్ చేత ప్రారంభించబడిన మెరైనర్స్ అనే ఓ క్లబ్ ఉండేది. ఐతే ఈ పాత భవనం 2018లో కూల్చివేసి దాని స్థానంలో ఈ 42 అంతస్థుల కింప్టన్ హోటల్ని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఇది మంటల్లో పూర్తిగా దెబ్బతింది. దీన్ని సుమారు మూడు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించినట్లు సమాచారం. ఇందులో సుమారు 500కి పైగా గదులు ఉంటాయని అంచనా.
Huge fire tears through #HongKong #skyscraper:
Fire hits skyscraper being built on site of old Mariner's Club in Hong Kong's #TsimShaTsui https://t.co/zmG6QrCLhQ pic.twitter.com/3DcPsuIykq— 🛰️ War in Ukraine 🍉 (@EUFreeCitizen) March 2, 2023
(చదవండి: అమెరికా, రష్యా, యూఏఈల వ్యోమగాములతో..)