Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. International
  3. కుప్పకూలిన వేల కోట్ల సామ్రాజ్యం.. తప్పెక్కడ జరిగింది?
ADVERTISEMENT 

కుప్పకూలిన వేల కోట్ల సామ్రాజ్యం.. తప్పెక్కడ జరిగింది?

International Sakshi User Sakshi Sakshi Time Jun 5, 2026 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
Heman_Latest.jpg

అప్పటివరకు యాక్షన్ ఫిగర్లు అంటే ఎక్కువగా సైనికులు, ఫైర్‌ఫైటర్లు లాంటి వాస్తవిక పాత్రలే. ఆ తర్వాత కామిక్‌ పుస్తకాలు.. వాటి ఆధారంగా యానిమేషన్‌ సిరీస్‌లు.. సినిమాలు.. ఆఖరికి బొమ్మలు పిల్లల ఆటల ప్రపంచాన్ని ఆక్రమించేశాయి. అయితే 80వ దశకంలో వినోద పరిశ్రమలో ఒక విప్లవాత్మక ఆలోచన మొదలైంది. ముందుగా ఆడుకునే బొమ్మలను రూపొందించి.. వాటి చుట్టూ కథలను నిర్మించాలన్న ఆలోచన చేసింది మ్యాటెల్‌. అలా పుట్టుకొచ్చిన పాత్రే హీ మ్యాన్‌. 

“మాస్టర్స్ ఆఫ్ ది యూనివర్స్”.. ఆరోజుల్లో అద్భుతమైన ఫాంటసీ లోకం. ఈ ప్రపంచంలో సూపర్‌ హీరో హీ-మ్యాన్‌. అతనికి ఉండే అపార శక్తి, పోరాటాలు.. పిల్లల ఊహల్లో శాశ్వత స్థానం సంపాదించుకున్నాయి.  ముఖ్యంగా.. “గ్రేస్కల్ నాకు శక్తినిచ్చుగాక(బై ద పవర్ ఆఫ్ గ్రేస్‌కల్… ఐ హేవ్ ద పవర్)”.. అంటూ కత్తి దూసి చెప్పే డైలాగ్‌ కొన్నితరాల పిల్లలకు ఒక భావోద్వేగం. 

అప్పటిదాకా బొమ్మల మార్కెట్‌లో ఉన్న సంప్రదాయన్ని తలకిందులు చేసింది అమెరికాకు మ్యాటెల్‌ సంస్థ. ముందుగా బొమ్మలను తయారు చేసి, ఆ తర్వాత వాటి చుట్టూ కథలను, పాత్రలను, యానిమేషన్ ప్రపంచాన్ని నిర్మించడం ప్రారంభించింది. అలా “మాస్టర్స్ ఆఫ్ ది యూనివర్స్” రూపొందించింది. ఇందులో ప్రిన్స్ ఆడమ్‌.. ఓ మంత్రం చెప్పి శక్తివంతమైన హీ-మ్యాన్ రూపం ధరిస్తాడు. రహస్యాలతో నిండిన గ్రేస్‌కల్ కోట, హీమ్యాన్‌ వెంటే ఉండే బ్యాటిల్‌ క్యాట్‌(పిరికి పులి కాస్త పవర్‌ఫుల్‌గా మారడం..) భయంకరమైన శత్రువు స్కలేటర్ అండ్‌ కోతో హీమ్యాన్‌, అతని మిత్రబృందం చేసే పోరాటాలు.. అన్నీ కలిసి ఒక విస్తృతమైన ఫాంటసీ రాజ్యాన్ని సజీవంగా నిలిపాయి. 


1983లో ప్రారంభమైన యానిమేషన్ సిరీస్ ఈ ప్రపంచాన్ని టీవీ తెరపైకి తీసుకువచ్చి, ప్రతి ఎపిసోడ్‌ను ఒక బొమ్మల ప్రకటనలా మార్చేసింది మ్యాటెల్‌. వెరసి అతితక్కువ టైంలో వేల కోట్ల సామ్రాజ్యంతో సంచలనాలకు నెలవు అయ్యింది. ఒకానొక టైంలో మార్వెల్‌ లాంటి కొండను సైతం ఢీ కొడుతుందనే అంచనాలు నెలకొన్నాయి.  కానీ ఈ విజయ యాత్ర ఎంత వేగంగా సాగిందో.. అంతే వేగంగా కుప్పకూలింది. 

కాస్ట్‌లీ మిస్టేక్‌
కామిక్‌ సిరీస్‌ సూపర్‌ సక్సెస్‌తో మ్యాటెల్‌ నేల మీదకు దిగిరాలేదు. ఎడాపెడా బొమ్మల్ని ఉత్పత్తి చేసింది. ఈ క్రమంలో.. మార్కెట్‌లో డిమాండ్‌ను సరిగా అంచనా వేయలేక తడబడింది. దీంతో దుకాణాల్లో సరుకు పేరుకుపోయి నిల్వలు అధికమయ్యాయి. అదే సమయంలో ట్రాన్స్‌ఫార్మర్స్, జీఐ జాయ్‌ లాంటి పోటీ ఫ్రాంచైజీలు మరింత ఆధునిక డిజైన్లు, రూపాంతరం చెందే బొమ్మల కాన్సెప్ట్‌లతో పిల్లలను ఆకట్టుకోవడం ప్రారంభించాయి. ఈ మార్పుల మధ్య హీ-మ్యాన్ ఆకర్షణ క్రమంగా తగ్గుతూ వచ్చింది.


మార్కెటింగ్‌ తప్పిదాల వల్ల జరిగిన పొరపాట్లు చాలవన్నట్లు.. జీతాల విషయంలోనూ మ్యాటెల్‌ ఎచ్చులకు పోయింది. ఎంత ఎక్కువ ప్రొడక్టులు తయారు చేస్తే అంత బోనస్‌లు అంటూ చేసిన ప్రకటన.. నిండా ముంచేసింది. ఫలితంగా.. అవసరానికి మించి బొమ్మలు మార్కెట్‌లోకి వెళ్లాయి. సరఫరా డిమాండ్‌ను మించిపోయి ధరలు పడిపోయాయి. రిటైలర్లు నమ్మకం కోల్పోయారు. టోటల్‌గా.. బ్రాండ్ వాల్యూ ఘోరంగా దెబ్బతింది, పుండు మీద కారంలా.. 1987లో వచ్చిన హీ మ్యాన్‌ లైవ్ యాక్షన్ చిత్రం కూడా బాక్సాఫీస్‌ వద్ద ఘోరంగా బోల్తా కొట్టింది. ఆపై వరుసపెట్టి సినిమాలు, సిరీస్‌లు వచ్చిన ఆకట్టుకోలేకపోయాయి. 

ఈ వరుస దెబ్బలతో.. కార్టూన్ సిరీస్ కూడా సరైన ముగింపు లేకుండానే అకస్మాత్తుగా ఆగిపోయింది. ఆ తరువాత జరిగిన పునరుద్ధరణ ప్రయత్నాలు కొంత ఆసక్తిని రేపినా.. పాత స్థాయి క్రేజ్‌ తేలేకపోయింది. ఇప్పుడు.. ఈ 2026లో కొత్త లైవ్ యాక్షన్ సినిమాతో హీ-మ్యాన్ మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఎర్లీ రివ్యూస్‌ అయితే పాజిటివ్‌గానే వచ్చాయి. ఈసారి మిగిలిన ప్రశ్న ఒక్కటే.. ఈ కొత్త ప్రయత్నం నిజంగా ఆ పాత “శక్తిని” తిరిగి తీసుకురాగలదా? లేకుంటే.. నాస్టాల్జియా మీద ఆధారపడిన మరో ప్రయోగంగానే మిగిలిపోతుందా?.. వెయిట్‌ అండ్‌ సీ..

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
he
Nostalgia
Animation
Super Hits
business
Web Special
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

ఇప్పుడంతా AI.. మరి రేపు ఏంటి?

ఇప్పుడంతా AI.. మరి రేపు ఏంటి?

బ్రిటన్‌కు ఎంతోమంది పీఎంలు వస్తుంటారు.. పోతుంటారు!

బ్రిటన్‌కు ఎంతోమంది పీఎంలు వస్తుంటారు.. పోతుంటారు!

చివరి క్షణాల్లో.. ‘అన్నీ సర్దేసి’ వెళ్లిపోతున్నారు!

చివరి క్షణాల్లో.. ‘అన్నీ సర్దేసి’ వెళ్లిపోతున్నారు!

ఫిఫా క్రేజ్‌: చూస్తే కిక్‌ రాదు.. అసలు మజా అందులోనే!

ఫిఫా క్రేజ్‌: చూస్తే కిక్‌ రాదు.. అసలు మజా అందులోనే!

ట్రంప్‌–మెలోనీ.. ఎక్కడ చెడింది?.. ఆ ఐదే కారణమా?

ట్రంప్‌–మెలోనీ.. ఎక్కడ చెడింది?.. ఆ ఐదే కారణమా?

జూలై 15 నుంచి భారత్‌-బ్రిటన్‌ ఫ్రీ ట్రేడ్ ఒప్పందం అమలు

జూలై 15 నుంచి భారత్‌-బ్రిటన్‌ ఫ్రీ ట్రేడ్ ఒప్పందం అమలు

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.