Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. International
  3. చంద్రుని పుట్టుక కోసం..
ADVERTISEMENT 

చంద్రుని పుట్టుక కోసం..

International Sakshi User Sakshi Sakshi Time Nov 25, 2025 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
Germany-Scientists.jpg

భూగోళం పుట్టుక కోసం రాలిన సురగోళాలెన్నో అంటూ అత్యంత కవితాత్మకంగా పలవరించాడు దాశరథి. చంద్రుని పుట్టుక కోసం నిజంగానే ఓ భారీ సురగోళం రాలి కనుమరుగైందట! అవున్నిజమే. భూమికి ఏకైక ఉపగ్రహమైన చందమామ ఆవిర్భావానికి సంబంధించిన అత్యంత ఆసక్తికరమైన అంశాన్ని తాజా అధ్యయనం ఒకటి వెలుగులోకి తెచి్చంది. 

చాలాకాలం క్రితం, అంటే ఏకంగా 450 కోట్ల ఏళ్ల నాడు మన సౌరకుటుంబంలో అటూఇటుగా అంగారకుని సైజుతో కూడిన థెయా అనే భారీ గ్రహం కూడా ఉండేదట. ఆ లెక్కన పరిమాణంలో దాన్ని భూమికి అక్క వంటిదన్నమాట! అది కాస్తా (తొలి)నాటి భూమితో ఢీకొట్టి ముక్కలు చెక్కలైందట. వాటిలో చిన్నాచితకా ముక్కలన్నీ నామరూపాల్లేకుండా పోగా, మిగిలిపోయిన అతి పెద్ద భాగమే మన చందమామగా రూపుదిద్దుకుంది!

 అంటే చంద్రునికి జన్మనిచ్చే క్రమంలో దాని తల్లి ఏకంగా ప్రాణత్యాగమే చేసిందన్నమాట. అంతేకాదు, థెయా ఢీకొన్న ఫలితంగా భూ అక్షం కూడా భారీ మార్పుచేర్పులకు లోనై ఇప్పుడున్న క్రమంలోకి మారింది. దాంతో జీవకోటి ప్రాదుర్భావానికి, అందుకు అనువైన వాతావరణం అమరేందుకు భూమి మరింత వీలుగా మారిందట. అలా థెయా తాను కనుమరుగైపోతూ కూడా ఇటు భూమికి ఎనలేని సాయం చేయడమే గాక, అటు చంద్రునికి ఏకంగా ఉనికినే ఏర్పరచింది. 

గుట్టు విప్పిన ఐసోటోపులు 
థెయా ఉనికిని ఖగోళ శాస్త్రవేత్తలు చాలాకాలం క్రితమే దాదాపుగా నిర్ధారించారు. అయితే అది ఎంత పరిమాణంలో ఉండేది, దాని మూలాలేమిటి, కూర్పు ఎలాంటిది వంటి ప్రశ్నలకు ఇంకా జవాబులు లభించాల్సే ఉంది. వీటికి సమాధానాలు కనిపెట్టేందుకు జర్మనీలోని మాక్స్‌ ప్లాంట్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ సోలార్‌ రీసెర్చ్, యూనివర్సిటీ ఆఫ్‌ షికాగో ఒక భారీ ప్రయోగానికి తెరతీశారు. 

అందులో భాగంగా ఇనుము, రాళ్లు తదితరాలతో పాటు అపోలో అంతరిక్ష యాత్రలో భాగంగా చంద్రుని పై నుంచి, పలు సమీప ఉల్కల నుంచి వ్యోమగాములు తెచి్చన ఆరు నమూనాల ఐసోటోపులను పరీక్షించారు. ముఖ్యంగా భూమి, చంద్రుడు, ఉల్కల తాలూకు ఐసోటోపుల పరస్పర నిష్పత్తిని రివర్స్‌ ఇంజనీరింగ్‌గా పేర్కొనే ప్రక్రియ ద్వారా పోల్చి చూశారు. 

చందమామ ఎలా పుట్టాడంటే..?

థెయా మన సౌరకుటుంబ లోపలి భాగంలోనే ఏర్పడిందని, అందులోనూ భూమి కంటే సూర్యునికి దగ్గరగా ఉండేదని తేల్చారు. అంతేగాక సౌరమండలంలో భూ గ్రహం ఉన్న అకర్బన మండల పరిధిలోనే థెయా కూడా ఉండేదని అధ్యయన సారథి తిమో హాప్‌ వివరించారు. ‘‘భూమి కంటే కూడా సూర్యునికి థెయా దగ్గరగా ఉండేది గనుక మరింత వేడిగా, వాయుమయంగా ఉండేదన్నది వాస్తవం. 

భూమితో పోలిస్తే చంద్రుడు చాలా పొడిగా ఉండేందుకు ఇది కూడా ముఖ్య కారణమే’’ అని ఆయన వివరించారు. బుధ, శుక్ర గ్రహాల నుంచి కూడా నమూనాలను సేకరించగలిగిన నాడు థెయాకు సంబంధించి మరిన్ని ఆసక్తికరమైన అంశాలు కచి్చతంగా వెలుగులోకి వస్తాయని అభిప్రాయపడ్డారు. ఈ వివరాలను సైన్స్‌ జర్నల్‌ తాజా సంచికలో ప్రచురించారు.

– సాక్షి, నేషనల్‌ డెస్క్‌  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
Moon
Astronomers
Germany scientists
University of Chicago
planet
Earth
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

చంద్రుడి దారిలో.. 'ఆర్టెమిస్‌-3'

చంద్రుడి దారిలో.. 'ఆర్టెమిస్‌-3'

భూమి వైపు దూసుకొస్తున్న మహా ప్రళయం, టోటల్ బ్లాక్అవుట్!

భూమి వైపు దూసుకొస్తున్న మహా ప్రళయం, టోటల్ బ్లాక్అవుట్!

చింతగింజలతో మైక్రోప్లాస్టిక్‌కి చెక్‌..!

చింతగింజలతో మైక్రోప్లాస్టిక్‌కి చెక్‌..!

హైదరాబాద్ లో బ్లడ్‌ మూన్‌ ఇలా కనిపించింది (ఫొటోలు)

హైదరాబాద్ లో బ్లడ్‌ మూన్‌ ఇలా కనిపించింది (ఫొటోలు)

అమెరికాకు చైనా చెక్ పెట్టాలా

అమెరికాకు చైనా చెక్ పెట్టాలా

చందమామ చిక్కేదెవరికి?

చందమామ చిక్కేదెవరికి?

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.