Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. International
  3. Foula: ఆరున క్రిస్మస్‌.. 13న న్యూ ఇయర్‌!!
ADVERTISEMENT 

Foula: ఆరున క్రిస్మస్‌.. 13న న్యూ ఇయర్‌!!

International Sakshi User Sakshi Sakshi Time Jan 14, 2025 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
foula.jpg

మరెన్నో విశేషాల సమాహారంగా బ్రిటన్‌ బుల్లి దీవి ‘ఫౌలా’

2025 ఏడాది మొదలై ఇప్పటికే రెండు వారాలు పూర్తయింది. ప్రపంచవ్యాప్తంగా కొత్త తీర్మానాలతో, ఆనందక్షణాలతో బంధుమిత్రుల సమక్షంలో జనమంతా నూతన సంవత్సరానికి స్వాగతం పలికేసి తమతమ పనుల్లో బిజీ అయిపోయారు. కానీ బ్రిటన్‌లోని ‘ఫౌలా’ద్వీపంలో మాత్రం అత్యంత ఆలస్యంగా అంటే సోమవారం (జనవరి 13) రోజు ఘనంగా కొత్త ఏడాది వేడుకలు జరిగాయి. 

అందరూ డిసెంబర్‌ 31 రాత్రి నుంచే సెలబ్రేషన్లు మొదలెట్టి ముగించేస్తే వీళ్లేంటి ఇంత ఆలస్యంగా వేడుకలు చేస్తున్నారని ఆశ్చర్యపోకండి. వాళ్ల దృష్టిలో జనవరి 13వ తేదీనే అసలైన కొత్త ఏడాది. ఎందుకంటే వాళ్లు మనలా ఆధునిక గ్రెగోరియన్‌ క్యాలెండర్‌ను పాటించరు. ప్రాచీనకాలంనాటి సంప్రదాయ జూలియన్‌ క్యాలెండర్‌ను మాత్రమే అనుసరిస్తారు. జూలియన్‌ క్యాలెండర్‌ స్థానంలో నాలుగు శతాబ్దాల కిందట కొత్తగా గ్రెగరీ క్యాలెండర్‌ వచ్చిన సంగతి తెల్సిందే. 

400 సంవత్సరల క్రితం నాటి 13వ పోప్‌ గ్రెగరీ కొత్త క్యాలెండర్‌ను రూపొందించారు. ఈ కొత్త క్యాలెండర్‌ ఆయన పేరిటే తర్వాత కాలంలో గ్రెగోరియన్‌ క్యాలెండర్‌గా స్థిరపడిపోయింది. కానీ ఫౌలా ద్వీపవాసులు మాత్రం తన ఐలాండ్‌లో వేడుకలను పాత జూలియన్‌ క్యాలెండర్‌ను అనుసరించి మాత్రమే జరుపుకుంటారు. అందుకే జూలియన్‌ క్యాలెండర్‌ ప్రకారం కొత్త ఏడాదిని జనవరి 13వ తేదీన మాత్రమే జరుపుకున్నారు. దీంతో ఆదివారం ద్వీపంలో సంబరాలు అంబరాన్ని తాకాయి. క్రిస్మస్‌ను సైతం వాళ్లు జూలియన్‌ క్యాలెండర్‌ ప్రకారమే చేసుకుంటారు. అందరూ డిసెంబర్‌ 25న క్రిస్మస్‌ చేసుకుంటే వీళ్లు మాత్రం జనవరి ఆరో తేదీన క్రిస్మస్‌ను అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు.  

ఎక్కడుందీ ఫౌలా? 
బ్రిటన్‌లోని అత్యంత మారుమూల ద్వీపంగా గుర్తింపు పొందిన ఈ ఫౌలా.. షెట్‌ల్యాండ్‌ అనే ప్రధాన ద్వీపానికి 16 మైళ్ల దూరంలో ఉంది. ఫౌలా ద్వీపం పొడవు కేవలం ఐదు మైళ్లు. ప్రధాన భూభాగం నుంచి ఇక్కడికి విద్యుత్‌లైన్ల వ్యవస్థ లేదు. అందుకే ఇక్కడ జనం సొంతంగా విద్యుత్‌ వ్యవస్థను ఏర్పాటుచేసుకున్నారు. పవన విద్యుత్, చిన్నపాటి జల విద్యుత్‌ వ్యవస్థ, సౌర ఫలకాలతో సౌర విద్యుత్‌ను సమకూర్చుకుంటున్నారు.

 ప్రధాన ద్వీపసముదాయమైన షెట్లాండ్‌లోని టింగ్‌వాల్‌ విమానాశ్రయం నుంచి ఇక్కడికి విమాన సర్వీసులు ఉన్నాయి. బ్రిటన్‌లోని అత్యంత మారుమూల ద్వీపాల్లో ఒకటైన ఫౌలాలో అత్యంత పురాతన నార్న్‌ భాషను మాత్రమే మాట్లాడతారు. ఇక్కడి జనాభా కేవలం 40 మంది మాత్రమే. ప్రస్తుతం 36 మంది మాత్రమే ఉంటున్నారు. పని చేయడానికి బయటి నుంచి ఎవరూ రారు. మన పని మనం చేసుకోవాల్సిందే. ప్రకృతిని ఆస్వాదిస్తూనే ఇక్కడి జనమంతా పనుల్లో బిజీగా ఉంటారు.  

రెండూ అద్భుతమైనవే: రాబర్ట్‌ స్మిత్‌ 
రెండు వారాల వ్యవధిలో రెండు క్రిస్మస్‌లు, రెండు నూతన సంవత్సర వేడుకలు రావడం నిజంగా బాగుంటుందని 27 ఏళ్ల రాబర్ట్‌ స్మిత్‌ వ్యాఖ్యానించారు. విద్యాభ్యాసం కోసం కొంతకాలం షెట్లాండ్‌ ద్వీపసముదాయంలో ఉన్న రాబర్ట్‌.. మళ్లీ ఫౌలాకు వచ్చేశారు. అందరు ద్వీపవాసుల మాదిరిగానే ఆయనా అనేక పనులు చేస్తాడు. పడవను నడపడం, నీటి శుద్ధి కర్మాగారంలో పనిచేయడం, టూర్లు, అవసరమైతే ఉత్తరాలు అందించడం అన్ని పనుల్లో పాలు పంచుకుంటాడు. ‘‘ఉరుకుల పరుగుల షెట్లాండ్‌ లైఫ్‌ను చూశా. ప్రశాంతమైన ఫౌలా జీవితాన్ని గడుపుతున్నా. ఆస్వాదించగలిగే మనసున్న ఫౌలా స్వాగతం పలుకుతోంది.

 ఇక్కడ అందరం ఒకే కుటుంబంలా నివసిస్తాం. ఎప్పుడూ సంగీతం వింటాం. సాధారణంగా ఏ ద్వీపంలోనైనా వృద్ధులు, మధ్యవయస్కులు ఉంటారు. కానీ ఫౌలాలో ఎక్కువ మంది యువత, చిన్నారులే. గతంలో ఇక్కడి మెజారిటీ జనాభా పక్షుల వేటనే ప్రధాన వృత్తిగా ఎంచుకునేది. పక్షులను కొట్టి తెచ్చి కూర వండుకుని తినేయడమే. ఇప్పుడంతా మారిపోయింది. ఎన్నో వృత్తులు వచ్చాయి. తోటపని, చేపలు పట్టడం, కళాకారునిగా పనిచేయడం ఇలా...’’అని రాబర్ట్‌ అన్నారు. ‘‘ఇక్కడి వాళ్లు అందరితో కలుపుగోలుగా ఉంటారు. ప్రతి ఒక్కరి ఇంటికీ వెళ్తాం. ఆనందంగా పాడతాం. ఆడతాం. రాబర్ట్‌ గతంలో గిటార్‌ వాయించేవాడు. తర్వాత మాండలీన్‌ పట్టుకున్నాడు. ఇప్పుడేమో ఫిడేల్‌ నేర్చుకుంటున్నాడు’అని ద్వీపంలోని మరో వ్యక్తి చెప్పారు. 
   
 – సాక్షి, నేషనల్‌ డెస్క్‌  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
Britain
Island
New Year Celebrations
new calendar
Gregorian calendar
Christmas celebrations
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

బ్రిటన్‌కు ఎంతోమంది పీఎంలు వస్తుంటారు.. పోతుంటారు!

బ్రిటన్‌కు ఎంతోమంది పీఎంలు వస్తుంటారు.. పోతుంటారు!

రష్యా నుంచి భారత్‌కు చమురు.. నావికుడు అరెస్టు

రష్యా నుంచి భారత్‌కు చమురు.. నావికుడు అరెస్టు

హమ్మయ్యా.. శాస్త్రవేత్తల భయం తప్పింది!

హమ్మయ్యా.. శాస్త్రవేత్తల భయం తప్పింది!

కొత్త రూల్స్.. పిల్లల భవిష్యత్తు కోసం కఠిన చర్యలు!

కొత్త రూల్స్.. పిల్లల భవిష్యత్తు కోసం కఠిన చర్యలు!

లండన్‌లో దారుణం.. భారత సంతతి వ్యక్తి హత్య

లండన్‌లో దారుణం.. భారత సంతతి వ్యక్తి హత్య

సముద్రంలో స్వర్గం.. దూరం కాదు, మన పక్కనే! (ఫొటోలు)

సముద్రంలో స్వర్గం.. దూరం కాదు, మన పక్కనే! (ఫొటోలు)

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.