Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. International
  3. మన నగరాలకు ఫారిన్‌ అమ్మాయి రేటింగ్‌!
ADVERTISEMENT 

మన నగరాలకు ఫారిన్‌ అమ్మాయి రేటింగ్‌!

International Sakshi User Sakshi Sakshi Time Oct 25, 2025 Sakshi Read Time Read Time: 3 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
Foreign-Solo.jpg

విదేశీయుల నోట్ల మన దేశం గొప్పదనం గురించి మనం చాలాసార్లు వినే ఉంటాం. అద్భుతమైన సంస్కృతి అని.. పండుగలు, ఆహారపానీయాలు తమను ఎంతగానో ఆకట్టుకున్నాయని చెబుతూంటే విని గర్వంగా ఫీల్‌ అవుతూంటాము కూడా. కానీ.. మహిళల భద్రతకు సంబంధించిన అంశానికి వచ్చేసరికి మన గర్వం కాస్తా పటాపంచలవుతుంది. 

విదేశీ టూరిస్టులను మరీ ముఖ్యంగా మహిళలను వెకిలిచేష్టలతో ఇబ్బంది పెట్టే పోకిరిలు, సెల్ఫీల కోసం బలవంత పెట్టేవారు.. పిల్లికూతలతో వేధించే ఆకతాయిలు.. లైంగికదాడులకు పాల్పడే దుర్మార్గులు చాలామందే కనిపిస్తారు. థాయ్‌లాండ్‌కు చెందిన ఓ సోలో ట్రావెలర్‌ ఎమ్మా కూడా ఇదే చెబుతోంది. భారతదేశం అద్భుతమైన దేశమే కానీ.. మహిళల భద్రత విషయంలో ఒక్కో నగరం తీరు ఒక్కోలా ఉందని తేల్చేసింది. అంతేకాకుండా.. దేశం మొత్తమ్మీద పలు నగరాల్లో పర్యటించిన తరువాత ఒక్కో నగరానికి ర్యాకింగ్‌ కూడా ఇచ్చింది. 

@discoverwithemma_ ఇన్‌స్టాగ్రామ్‌ హ్యాండిల్‌తో ఈ ర్యాంకింగ్స్‌ను పోస్ట్‌ చేసింది. ‘‘గొప్పలు చెప్పడం లేదు.. నిజాయితీగా నా అనుభవాలు ఇవి’ అన్న శీర్షికతో చేసిన ఆ పోస్ట్‌ ఇప్పటికే వైరల్‌గా మారింది. ఎమ్మా నిజాయితీని మెచ్చుకున్న వారు కొందరు... సహజంగానే విమర్శించిన వారు మరెందరో! ఇంతకీ ఎమ్మా తన పోస్టులో ఏ నగరానికి ఏ ర్యాంక్‌ ఇచ్చిందంటే...

దేశంలోని 29 రాష్ట్రాల్లోనూ మహిళల భద్రత విషయంలో ఎమ్మాకు బాగా నచ్చేసిన రాష్ట్రం కేరళ. పదికి పది మార్కులేసేసింది. ప్రశాంతంగా ఉంటుందని, ఇతరుల పట్ల గౌరవం కనపరుస్తారని, విదేశీయులను మనస్ఫూర్తిగా స్వాగతించే లక్షణం కేరళీయులదని కొనియాడింది. కేరళ తరువాత ఎనిమిది మార్కులతో రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌ రెండోస్థానంలో నిలిచింది. ఈ నగరంలో భద్రతకు ఏం ఢోకాలేదన్న భావనతో గడిపానని చెప్పుకొచ్చింది. అద్భుతమైన సీన్లు ఈ నగరం సొంతమని, హడావుడి, పరుగులు లేనేలేవంది. దక్షిణాదిలోని గోవా విషయాన్ని ప్రస్తావిస్తూ.. ఇక్కడ సరదాగానే గడిచింది కానీ.. రాత్రివేళల్లో కొన్ని ప్రాంతాల్లో తిరగాలంటే బెరుకుగా అనిపించిందని స్పష్టం చేసింది. ఈ కారణంగా గోవాకు ఎమ్మా వేసిన మార్కులు ఏడు. రాజస్థాన్‌లోని పుష్కర్‌, జైపూర్‌లు ఎమ్మా జాబితాలో నాలుగు, ఐదు స్థానాల్లో నిలిచాయి. పుష్కర్‌ ఆధ్యాత్మిక శోభతో అలరారితే.. కొన్ని సంఘటనలు చాలా అసౌకర్యమూ కలిగించాయని తెలిపింది. 

 

A female foreigner, discoverwithemma, who travelled to India, rated popular Indian cities on the basis of safety:

Delhi : -1/10
Agra : 3/10
Jaipur : 5/10
Pushkar : 6/10
Udaipur: 8/10
Mumbai : 6.5/10
Goa : 8/10
Kerala : 9/10 pic.twitter.com/FwVSsjKE9e

— Mini Nair (@minicnair) October 24, 2025

నిర్మాణశైలి విషయంలో జైపూర్‌ ఒక అద్భుతమైనప్పటికీ స్థానికులు కొంచెం తొందరపాటు మనుషులని తెలిపింది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో భద్రతకు సంబంధించి మంచి, చెడూ రెండూ కనిపించాయని తెలిపింది. ఈ నగరం చాలా బిజీ.. గందరగోళాలతో కూడిందని తెలిపింది. ప్రపంచ అద్భుతం తాజ్‌మహల్‌ ఉన్న ఆగ్రా తనను మైమరిపించిన మాట వాస్తవమైనప్పటికీ.. అక్కడ శబ్ధ కాలుష్యం చాలా ఎక్కువని, అలాగే విదేశీయులను దోచుకునే స్కాములకూ లెక్కలేదని వివరించింది. ఆఖరుగా... ఎమ్మా దృష్టిలో ఈ దేశం మొత్తమ్మీద అధ్వాన్నమైన నగరం... మన రాజధాని ఢిల్లీ నగరం! ఒంటరి మహిళ పర్యాటకులు ఈ నగరానికి రాకపోవడమే మంచిదని సూచిస్తోంది ఎమ్మా. 

ఇకనైనా మేలుకోండి..
ఎమ్మా ర్యాంకింగ్స్‌పై సోషల్‌ మీడియాలో బోలెడన్ని ప్రతిక్రియలు వ్యక్తమయ్యాయి. నిక్కచ్చిగా, నిజాయితీగా తన అభిప్రాయాలను వ్యక్తం చేసినందుకు చాలామంది ఎమ్మాను మెచ్చుకున్నారు. వివిధ రాష్ట్రాల టూరిజమ్‌ బోర్డులు కూడా ఎమ్మా ర్యాంకింగ్‌లపై స్పందించాయి. పరిస్థితులను మెరుగు పరిచేందుకు పనిచేస్తామని హామీ ఇచ్చాయి. మరికొందరు భద్రత అనేది చాలా అంశాలపై ఆధారపడి ఉంటుందని, వ్యక్తుల ప్రవర్తనను బట్టి కూడా మారుతూంటుందని విమర్శించిన వారూ లేకపోలేదు. ప్రియా శర్మ అనే పర్యాటకురాలు మాట్లాడుతూ విదేశీ పర్యాటకుల అభిప్రాయాలకు, అనుభవాలకు విలువ ఇవ్వాల్సిన సమయం ఆసన్నమైందని, పర్యాటక రంగం వృద్ధి చెందాలంటే ఎమ్మా పోస్టును ఒక మేలు కొలుపుగా తీసుకోవాలని తెలిపారు. ఆసక్తికరమైన అంశం ఏమిటంటే.. ఎమ్మా పోస్టు తరువాత పర్యాటక భద్రతకు సంబంధించిన అప్లికేషన్లు, మహిళలకు మాత్రమే ప్రత్యేకమైన హాస్టళ్లు, ఒంటరి మహిళ పర్యాటకులకు గైడెడ్‌ టూర్లు వంటి అంశాలపై ఇంటర్నెట్‌లో వెతకడం ఎక్కువ కావడం!.

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
tourist
indian cities
saftey
rankings
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

పేటెంట్లలో టాప్‌కి దూసుకెళ్లిన జియో ప్లాట్‌ఫార్మ్స్

పేటెంట్లలో టాప్‌కి దూసుకెళ్లిన జియో ప్లాట్‌ఫార్మ్స్

ఈ యూరప్‌ సిటీకి వెళ్లేవారిపై ఇక మరింత ట్యాక్స్‌!

ఈ యూరప్‌ సిటీకి వెళ్లేవారిపై ఇక మరింత ట్యాక్స్‌!

వరల్డ్‌ నంబర్‌వన్‌ జైస్మీన్‌

వరల్డ్‌ నంబర్‌వన్‌ జైస్మీన్‌

 IWD ప్రతీ అడుగు కన్నీటి మడుగు

IWD ప్రతీ అడుగు కన్నీటి మడుగు

టీనేజ్‌ డ్రైవర్‌ : విషాదాంతమైన గోవా టూర్‌, వీడియో వైరల్‌

టీనేజ్‌ డ్రైవర్‌ : విషాదాంతమైన గోవా టూర్‌, వీడియో వైరల్‌

పచ్చందనమే పచ్చదనమే..!

పచ్చందనమే పచ్చదనమే..!

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.