బ్యాంకాక్: థాయిలాండ్‌లో ఘోర అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. దేశ రాజధాని బ్యాంకాక్‌లోని ఒక బార్లో హఠాత్తుగా మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో అప్పటివరకూ పార్టీలో ఎంజాయి చేస్తున్న ప్రజలు ఒక్కసారిగా భయాందోళనలకు గురయ్యారు. ఈ ఘోర ప్రమాదంలో 27 మంది మరణించగా, 63 మంది గాయపడ్డారు. అగ్నిప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమని అధికారులు భావిస్తున్నారు.
దీంతో వెంటనే వివరాలు తెలుసుకున్న అగ్మిమాపక సిబ్బంది అక్కడికి చేరుకొని మంటలను ఆర్పేయత్నం చేసింది. గాయపడ్డ వారందరినీ ఆసుపత్రికి తరలించారు. అగ్నిప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు కొనసాగుతుందని అధికారులు తెలిపారు. సుమారు 30 నిమిషాల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చినప్పటికీ, అప్పటికే భవనంలో అధిక భాగం కాలిపోయిందని పేర్కొన్నారు.
అయితే ప్రమాదసమయంలో అక్కడే ఉన్న ఓ సంగీతకారుడు మాట్లాడుతూ" కరెంట్ పోవడానికి కొద్దిసేపటి ముందు, వేదిక దగ్గర ఉన్న సర్క్యూట్ బ్రేకర్ నుండి పొగ రావడం సంభవించింది. ఆ వెంటనే పెద్ద పేలుడు సంభవించడంతో, పబ్ మొత్తం ఒక్కసారిగా పొగతో నిండిపోయింది. దీంతో చాలా మంది భవనం వెనుక ఉన్న మరుగుదొడ్డిలోకి పారిపోయారు. అక్కడ కొంతమంది అక్కడ ఊపిరాడక మరణించారు అని చెప్పారు.
అయితే పొగరావడం గమనించిన వెంటనే స్పందించిఉంటే ఇంత పెద్దఎత్తున ప్రాణనష్టం సంభివించి ఉండేది కాదని అక్కడి ప్రజలు భావిస్తున్నారు. ప్రమాద ఘటన స్థలాన్ని థాయ్ ప్రధానమంత్రి అనుటిన్ చార్న్విరాకుల్ సంఘటనా స్థలాన్ని సందర్శించినట్లు ఆ దేశ మీడియా కథనాలు పేర్కొన్నాయి.