Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. International
  3. మరణం అంచున గాజా 
ADVERTISEMENT 

మరణం అంచున గాజా 

International Sakshi User Sakshi Sakshi Time Aug 23, 2025 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
gaza.jpg

అక్కడ అత్యంత తీవ్రమైన కరువు 

యూఎన్‌ డబ్ల్యూఎఫ్‌పీ చీఫ్‌ అధికారిక ప్రకటన 

తక్షణం స్పందించకపోతే మరింత విస్తరిస్తుందని హెచ్చరిక 

గాజా స్ట్రిప్‌: రెండేళ్ల యాజన్‌.. గాజా నగరంలోని బీచ్‌లో ఉన్న శరణార్థి శిబిరంలో ఉన్నాడు. ఆ శిబిరానికి రెండు నెలలుగా పిండే కాదు.. ఎలాంటి ఆహార సహాయం అందడం లేదు.  విశాలమైన అతని కళ్లు.. ఆహారం కోసం ఎదురుచూసి.. చూసి.. అలసటతో బరువెక్కాయి. ఎముకలు తేలిన శరీరం అతని ఆకలిని చెబుతోంది. ఏడవడానికి కాదు కదా.. చివరికి తిండి తినడానికి కూడా ఓపికలేక.. చిరిగిపోయిన పరుపుపై జీవచ్ఛవంలా కూర్చున్నాడు. 

ఇది ఒక్క యాజన్‌ స్థితి కాదు.. గాజా స్ట్రిప్‌లోని పిల్లలందరి సామూహిక దుంఖః. ప్రస్తుతం గాజాలో పోషకాహార లోపం వేగంగా వ్యాపిస్తోంది. గాజా నగరంలో ఆకలి మరణాలు ఫిబ్రవరి నుంచి నాలుగు రెట్లు పెరిగాయి. ప్రస్తుతం గాజాలో 5లక్షల మంది తీవ్రమైన కరువును ఎదుర్కొంటున్నారని ఐక్యరాజ్యసమితి ప్రపంచ ఆహార కార్యక్రమం (డబ్ల్యూఎఫ్‌పీ) ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ సిండీ మెక్‌ కెయిన్‌ హెచ్చరించారు. మధ్యప్రాచ్యంలో అధికారికంగా కరువు నిర్ధారించడం ఇదే మొదటిసారి. 

రాబోయే రోజుల్లో ఇది గాజా గవర్నరేట్‌ నుంచి డెయిర్‌ అల్‌ బలాహ్, ఖాన్‌ యూనిస్‌కు వ్యాపిస్తుందని ఆందోళన వ్యక్తంచేసింది. ‘రోజుల తరబడి తినడానికి ఏమీ లేక లక్షలాది మంది బతుకీడిస్తున్నారు. పోషకాహార లోపం స్థాయి వేగంగా పెరుగుతోంది. ఆకలి మరణాలు పెరుగుతున్నాయి. ఈ సమయంలో తక్షణ, పూర్తి స్థాయి మానవతా సాయం అవసరమని ప్రపంచ ఆహార కార్యక్రమం, ప్రపంచ ఆరోగ్య సంస్థ నొక్కి చెప్పాయి. కరువును ఎలాగైనా ఆపాలని ఆమె పిలుపునిచ్చారు. ఆ ప్రజల ప్రాణాలు కాపడేందుకు అడ్డంకులు లేని మానవతా సహాయం, తక్షణ కాల్పుల విరమణ అవసరమని సూచించారు. లేని పక్షంలో సెప్టెంబర్‌ చివరి నాటికి, గాజా స్ట్రిప్‌ అంతటా దాదాపు 7 లక్షల మంది కరువును ఎదుర్కొంటారని ఆమె హెచ్చరించారు.  

ప్రాణాంతకంగా మారిన పోషకాహార లోపం 
రెండు సంవత్సరాల సంఘర్షణ ప్రజలను పదేపదే నిరాశ్రయులను చేస్తే.. మానవతా సాయంపై ఆంక్షలు ప్రజలను ఆకలిలోకి నెట్టాయి. ఇక్కడ ఆహారం దొరకడం లేదు. జూలై, మే నెలతో పోలిస్తే ప్రజలు రెట్టింపు సంఖ్యలో ఆకలితో అలమటిస్తున్నారు. ఇక గాజా నగరంలో మూడు రెట్లు ఎక్కువైంది. ప్రతి ముగ్గురిలో ఒకరికి రోజుల తరబడి ఆహారం దొరకడం లేదు. దొరికిన కొద్ది మొత్తంతో పిల్లల కడుపు నింపి, పెద్దలు పస్తులుంటున్నారు. పిల్లల్లో పోషకాహార లోపం వేగంగా పెరుగుతోంది. నలుగురిలో ఒకరు తీవ్రమైన పోషకాహార లోపంతో బాధపడుతున్నారు. అది అత్యంత ప్రాణాంతకం.

 జూన్‌ 2026 చివరి నాటికి పోషకాహార లోపం వల్ల మరణించే ప్రమాదం ఉన్న పిల్లల సంఖ్య 14,100 నుంచి 43,400 కు అంటే మూడు రెట్లు పెరుగుతుంది. ప్రస్తుతం ఆ ప్రాంతంలో 98 శాతం పంట భూములు దెబ్బతిన్నాయి. వ్యవసాయం లేదు. ప్రతి పది కుటుంబాల్లో తొమ్మిది కుటుంబాలు నిరాశ్రయులయ్యారు. జూలై నుంచి గాజాలోకి వచ్చే ఆహారం, సహాయ సామగ్రి పెరిగింది. కానీ.. అవసరంతో పోలిస్తే అది చాలా తక్కువ. సహాయ ట్రక్కుల నుంచి ఆహారం దోచుకుంటున్నారు. వంట చేసుకోవడానికి నీళ్లు కూడా లేవంటే పరిస్థితిని ఊహించొచ్చు.  

మనుషులు సృష్టించిన కరువు  
అయితే ఈ కరువు మనుషులు సృష్టించిందని, అవకాశం ఉన్నా నివారించలేకపోవడం వెంటాడే విషయమని ఐక్యరాజ్యసమితి సహాయ అధిపతి టామ్‌ ఫ్లెచర్‌ అన్నారు. జెనీవాలో మీడియాతో మాట్లాడిన ఆయన  ఇజ్రాయెల్‌ విధిస్తున్న అడ్డంకుల కారణంగా పాలస్తీనా భూభాగానికి ఆహారం చేరుకోలేకపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ‘మమ్మల్ని అనుమతిస్తే మనం నివారించగలిగే కరువు ఇది. ఇజ్రాయెల్‌ అడ్డంకుల కారణంగానే సరిహద్దుల వద్ద ఆహారం నిల్వలు నిలిచిపోయాయి’ అని తెలిపారు. 

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
Gaza
Malnutrition
Hunger deaths
united nations of organisation
World Food Programme
famine
middle east
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

గాజాపై ఇజ్రాయెల్‌ దాడులు.. ఇద్దరు చిన్నారులు సహా ఆరుగురు మృతి

గాజాపై ఇజ్రాయెల్‌ దాడులు.. ఇద్దరు చిన్నారులు సహా ఆరుగురు మృతి

73వేలకు చేరిన గాజా మరణాలు

73వేలకు చేరిన గాజా మరణాలు

ట్రంప్‌ను కాదని ఇరాన్‌పై విరుచుకుపడ్డ నెతన్యాహు

ట్రంప్‌ను కాదని ఇరాన్‌పై విరుచుకుపడ్డ నెతన్యాహు

సూపర్‌ ఎల్‌–నినోకు సిద్ధం కండి 

సూపర్‌ ఎల్‌–నినోకు సిద్ధం కండి 

కాళ్లు, చేతులు తీసేస్తే తప్ప : కర్ణాటక హైకోర్టు వ్యాఖ్యల దుమారం

కాళ్లు, చేతులు తీసేస్తే తప్ప : కర్ణాటక హైకోర్టు వ్యాఖ్యల దుమారం

ప్రతీకారంతో రగిలిపోతున్న ఇరాన్.. ఇజ్రాయెల్ పై బాంబుల వర్షం

ప్రతీకారంతో రగిలిపోతున్న ఇరాన్.. ఇజ్రాయెల్ పై బాంబుల వర్షం

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.