Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. International
  3. ఇల్లు.. కట్టొచ్చు, ప్రింట్‌ చేయవచ్చు..!
ADVERTISEMENT 

ఇల్లు.. కట్టొచ్చు, ప్రింట్‌ చేయవచ్చు..!

International Sakshi User Sakshi Sakshi Time Jun 2, 2026 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
58.jpg

ఇల్లు కట్టి చూడు.. పెళ్లి చేసి చూడు అంటారు. కానీ..  

కాలం మారిపోయింది. పెళ్లి పనులన్నీ ఇప్పుడు... ఈవెంట్‌ మేనేజర్లు చూసుకుంటున్నారు. మరి ఇంటి సంగతేమిటి?  

ఇదీ కొత్త పుంతలు తొక్కుతోంది. ఈకాలంలో ఇళ్లు కట్టి చూడవచ్చు.. కాదంటే ప్రింట్‌ చేసుకోవచ్చు.. 

ఇదీ వద్దనుకుంటే... నట్లు బోల్టులేసుకుని బిగించుకోనూ వచ్చు!

ఈ మధ్య ఫ్రాన్స్‌లో ఓ అపార్ట్‌మెంట్‌ కట్టారు. కట్టారు అనడం కంటే ప్రింట్‌ చేశారనడం కరెక్ట్‌. ఎందుకంటే పన్నెండు పోర్షన్లు ఉన్న ఈ మూడంతస్తుల బిల్డింగ్‌లో గోడలన్నీ త్రీడీ ప్రింటింగ్‌ టెక్నాలజీతో పూర్తి చేసినవే మరి. అక్కడక్కడ స్తంభాలు పాతి... కాలమ్స్, పైకప్పులు అమర్చి సిద్ధం చేశారు. ఆ తరువాత తలుపులు, కిటికీలు, వైరింగ్, బాత్రూమ్‌ ఫిట్టింగ్‌ వంటివి అమర్చడంతో సాధారణ పద్ధతుల్లో కట్టేదాని కంటే మూడు నెలల ముందుగానే ‘విలియా స్ప్రింట్‌’పూర్తయింది. 

ఫ్రాన్స్‌లోని చారిత్రక నగరం రీమ్స్‌లోని బెజాన్స్‌ ప్రాంతంలో విలియా స్ప్రింట్‌ నిర్మాణం జరిగింది. ఒక్కో అపార్ట్‌మెంట్‌ సుమారు 800 చదరపు మీటర్ల వైశాల్యంతో ఉంది. ప్రత్యేకమైన, ఫైబర్‌ కలిపిన కాంక్రీట్‌ వాడి గోడలు కూడా నిర్మాణం తాలూకూ బరువును మోసేలా చేశారు. దీనివల్ల స్తంభాల సంఖ్య గణనీయంగా తగ్గింది. త్రీడీ ప్రింటింగ్‌ టెక్నాలజీ వాడటం పుణ్యమా అని కాంక్రీట్‌ను సమర్థంగా వినియోగించుకోగలిగారు. 

పది శాతం వరకూ ఆదా చేయగలిగారు. గత ఏడాది మార్చిలో త్రీడీ ప్రింటింగ్‌ మొదలై 34 రోజుల్లో ముగిస్తే ఆ తరువాత మిగిలిన పనులన్నీ పూర్తి చేసుకుని ఈ భవనం ఈ ఏడాది ఏప్రిల్‌లో గృహప్రవేశానికి సిద్ధమైంది. విలియా స్ప్రింట్‌ నిర్మాణానికి కోబోడ్‌ బాడ్‌–2 అనే భారీ త్రీడీ ప్రింటర్‌ను వినియోగించారు. ఇదే మెషీన్‌ గతంలో భూకంపాలను తట్టుకోగల ఇల్లు, డేటా సెంటర్‌ను త్రీడీ ప్రింటింగ్‌ టెక్నాలజీతో పూర్తి చేసిన విషయం ఇక్కడ చెప్పుకోవాలి. 

సూపర్‌ స్పెషల్‌ ఏర్పాట్లు... 
త్రీడీ టెక్నాలజీ వాడటం ఒక్కటే విలియా స్ప్రింట్‌ ప్రత్యేకత కాదు. ఇంకా చాలానే ఉన్నాయి. హోల్‌సిమ్‌ అనే సంస్థ నిర్మాణ స్థలంలోనే కాంక్రీట్‌ను తయారు చేసి ఇవ్వడం ద్వారా ఖర్చులు గణనీయంగా తగ్గాయి. అలాగే సుమారు 5400 చదరపు అడుగుల విస్తీర్ణంలో సౌర శక్తి ఫలకాలు, హైబ్రిడ్‌ గ్యాస్‌/హీట్‌ పంప్‌ వ్యవస్థలు కూడా ఇందులో ఉన్నాయి. ఇవన్నీ ఈ భవన విద్యుత్తు అవసరాలను 60 శాతం వరకూ తీరుస్తాయి. 

ప్రస్తుతానికి ప్రపంచంలోనే అతిపెద్ద త్రీడీ అపార్ట్‌మెంట్‌ బిల్డింగ్‌గా విలియా స్ప్రింట్‌ రికార్డు నెలకొల్పింది. కాకపోతే ఈ బిల్డింగ్‌ డెవలపర్‌ ప్లూరియల్‌ నోవిలియా త్వరలోనే రెండు త్రీడీ ప్రింటర్లను వాడి ఏకకాలంలో 40 అపార్ట్‌మెంట్లను కట్టే ఆలోచనలో ఉన్నందున ఈ రికార్డు ఎక్కువ కాలం నిలవకపోవచ్చు. ఇదిలా ఉంటే 2030 నాటికి 25 శాతం ఇళ్లను త్రీడీ ప్రింటింగ్‌ టెక్నాలజీతో పూర్తి చేసేందుకు దుబాయ్‌ ప్రయత్నిస్తోంది.  

భారత్‌లోనూ ఊపందుకుంటోంది... 
త్రీడీ ప్రింటింగ్‌ టెక్నాలజీ అనేది అటు తయారీ రంగంలో.. ఇటు గృహనిర్మాణ రంగంలోనూ ఊపందుకుంటోంది. యూరోపియన్‌ దేశాల మాదిరిగా మరీ విస్తృతంగా కాకున్నా బుడిబుడి అడుగులైతే పడుతున్నాయి. ఐదేళ్ల క్రితం మద్రాస్‌ ఐఐటీ ‘త్వస్త’పేరుతో తొలి త్రీడీ ప్రింటెడ్‌ ఇంటి నిర్మాణం పూర్తి చేసిన విషయం తెలిసిందే. ఆరువందల చదరపు అడుగుల విస్తీర్ణమున్న ఈ ఇల్లు అప్పట్లో అందరి దృష్టిని ఆకర్శించింది కూడా. త్వస్తతోపాటు ప్రఖ్యాత ఇంజినీరింగ్‌ సంస్థ ఎల్‌ అండ్‌ టీ కూడా గృహనిర్మాణాన్ని వేగంగా, చౌకగా పూర్తి చేసేందుకు త్రీడీ ప్రింటింగ్‌ టెక్నాలజీని ఉపయోగిస్తున్నాయి. మరోవైపు ఈ టెక్నాలజీని దేశవ్యాప్తంగా ప్రధానమంత్రి ఆవాస్‌ యోజనలోనూ ఉపయోగించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆసక్తి కనబరుస్తోంది. 

– సాక్షి, నేషనల్‌ డెస్క్‌

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
france
Apartments Construction
3D Printing
housing
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

ఫ్రాన్స్‌ అధ్యక్షుడికి తృటిలో తప్పిన ప్రమాదం

ఫ్రాన్స్‌ అధ్యక్షుడికి తృటిలో తప్పిన ప్రమాదం

ఎంబపే జోరు.. క్వార్టర్‌ ఫైనల్లో మొరాకో, ఫ్రాన్స్‌

ఎంబపే జోరు.. క్వార్టర్‌ ఫైనల్లో మొరాకో, ఫ్రాన్స్‌

 వందో మ్యాచ్‌లో ఎంబాపె రికార్డు గోల్స్‌.. నాకౌట్‌కు ఫ్రాన్స్‌

వందో మ్యాచ్‌లో ఎంబాపె రికార్డు గోల్స్‌.. నాకౌట్‌కు ఫ్రాన్స్‌

హీట్‌వేవ్ హై అలర్ట్‌.. వేడుకల్లో మద్యం బంద్‌

హీట్‌వేవ్ హై అలర్ట్‌.. వేడుకల్లో మద్యం బంద్‌

ఈ పీతను చూస్తే ఫ్రాన్స్‌కు భయం, ఎందుకో తెలుసా?

ఈ పీతను చూస్తే ఫ్రాన్స్‌కు భయం, ఎందుకో తెలుసా?

నాతో ఫొటో కోసం మెలోనీ అడుక్కున్నారు 

నాతో ఫొటో కోసం మెలోనీ అడుక్కున్నారు 

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.