Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. International
  3. లాస్‌ ఏంజెలెస్‌ రణరంగం
ADVERTISEMENT 

లాస్‌ ఏంజెలెస్‌ రణరంగం

International Sakshi User Sakshi Sakshi Time Jun 10, 2025 Sakshi Read Time Read Time: 3 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
IMMIGRATION-RAIDS-LOS-ANGEL.jpg

నగరమంతటా ఆగ్రహ జ్వాలలు

ఆందోళనకారుల దాడిలో అగి్నకి ఆహుతైన సెల్ఫ్‌ డ్రైవింగ్‌ కార్లు 

పోలీసుల రబ్బర్‌ బుల్లెట్లు, భాష్పవాయు గోళాల ప్రయోగం 

కొనసాగుతున్న అక్రమవలసదారుల అరెస్ట్‌లు 

మరింత తీవ్రరూపం దాల్చిన ఉద్యమం 

నేషనల్‌ గార్డ్‌ల రాకతో గాడితప్పిన శాంతిభద్రతలు 

ట్రంప్‌ నిర్ణయంపై కోర్టుకు: కాలిఫోర్నియా గవర్నర్‌

లాస్‌ ఏంజెలెస్‌: అధ్యక్షుడు ట్రంప్‌ తన అసాధారణ అధికారాలను ఉపయోగించి నేషనల్‌ గార్డ్‌లను రంగంలోకి దింపడంతో మరింత పేట్రేగిపోయిన ఆందోళనకారులు తమ ఉద్యమాన్ని ఉదృతంచేశారు. రోడ్లపై కనిపించిన కారునల్లా దహనంచేసి ఉద్యమాగి్నజ్వాలల్ని మరింత రగిలించారు. దీంతో లాస్‌ ఏంజెలెస్‌ నగర వీధులు ఒక్కసారిగా రణరంగంగా మారిపోయాయి. 

అక్రమవలసదారులను ఫెడరల్‌ ఏజెంట్లు, ఎఫ్‌బీఐ, పోలీసులు అరెస్ట్‌చేయడాన్ని వేలాది మంది ఆందోళనకారులు నిరసించడంతో మొదలైన ఉద్యమం నెమ్మదిగా ఉగ్రరూపం దాల్చుతోంది. ఓవైపు సరైన డాక్యుమెంట్లులేని వలసదారులను అధికారులు అదుపులోకి తీసుకుంటూ, ఆ అధికారులు, ప్రభుత్వ భవనాలకు రక్షణగా నేషనల్‌ గార్డ్‌లను ట్రంప్‌ సర్కార్‌ రంగంలోకి దింపడంతో నిరసనకారులు మరింతగా రెచ్చిపోయారు.  

ఫ్రీవే మూసివేత 
పారామౌంట్‌ పట్టణంలోని ప్రధాన రహదారిని దిగ్బంధించారు. దక్షిణదిశలో వాహనాల రాకపోకలకు ఉపయోగించే 101 నంబర్‌ ఫ్రీవే రహదారిని మూసేశారు. అడ్డుకునేందుకు వచ్చిన కాలిఫోర్నియా హైవే పెట్రోల్‌ అధికారులపైకి నిరసనకారులు చేతికొచ్చిన వస్తువుతో విరుచుకుపడ్డారు. కాంక్రీట్‌ ముక్కలు, రాళ్లు, ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ విడిభాగాలు, బాణసంచాను అధికారులపైకి విసిరేశారు. 

వేలాదిగా ఆందోళనకారులు గుమికూడడంతో వెంటనే అందరూ ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని లేదంటే అరెస్ట్‌లు తప్పవని పోలీసులు మెగాఫోన్‌లో ప్రకటించారు. అక్రమవలసల ఏరివేత కోసం నేషనల్‌ గార్డ్‌లను ఉపయోగించబోమని, కేవలం అధికారులు, డిటెన్షన్‌ సెంటర్‌ భవనాల రక్షణ నిమిత్తమే వాళ్లను రప్పించామని లాస్‌ఏంజెలెస్‌ పోలీస్‌ చీఫ్‌ జిమ్‌ మెక్‌డొనెల్‌ చెప్పారు. డజన్ల కొద్దీ ఆందోళనకారులను అరెస్ట్‌చేశామని తెలిపారు. పెట్రోల్‌ బాంబు విసిరినందుకు ఒకరిరి, అధికారులను బైక్‌తో ఢీకొట్టినందుకు మరొకరిని అరెస్ట్‌చేశారు. 

ఫేస్‌ మాస్క్ లు ధరించొద్దు 
ఫేస్‌మాస్క్‌ ధరించి ఆందోళనల్లో పాల్గొంటే ఉపేక్షించేది లేదని అధ్యక్షుడు ట్రంప్‌ స్పష్టంచేశారు. ఫేస్‌మాస్క్‌తో ఎవరు కనిపించినా అరెస్ట్‌ చేయండని అధికారులకు ట్రంప్‌ తన సొంత సోషల్‌ మీడియా మాధ్యమం ‘ట్రూత్‌ సోషల్‌’ ద్వారా సూచించారు. ఉదయాన్నే నేషనల్‌ గార్డ్‌లు రావడంతో ఆందోళనకారుల్లో ఆవేశం కట్టలు తెంచుకుంది. రాష్ట్ర పోలీసులు ఉండగా ఫెడరల్‌ సాయుధవిభాగమైన మీకు ఇక్కడేం పని అంటూ అందోళనకారులు వారితో వాగ్వాదానికి దిగారు. ‘‘ సిగ్గులేదు. ఇంటికి పొండి’’ అంటూ ఎద్దేవాచేశారు. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు బలగాలు పొగబాంబులు, భాష్పవాయుగోళాలు, ఫ్లాష్‌బ్యాంగ్‌ గ్రనేడ్లను ప్రయోగించారు.

 దీంతో వాహనాల రాకపోకలను ఆందోళనకారులు 101 ఫ్రీవేపై నిలిపేశారు. సాయంత్రంకల్లా రాష్ట్ర పెట్రోల్‌ అధికారులు వారిని చెదరగొట్టి రహదారిపై రాకపోకలను పునరుద్దరించారు. దీంతో ఆగ్రహించిన నిరననకారులు అక్కడే నిలిపి ఉంచిన నాలుగు స్వయంచోదిత(సెల్ఫ్‌ డ్రైవింగ్‌) వేమో సంస్థ కార్లకు నిప్పంటించారు. మంటలు అంతటా అంటుకోవడంతో ఆ కార్ల నుంచి పేలుడు శబ్దాలు వినిపించాయి. గూగుల్‌కు చెందిన ఈ కార్లు రోబోట్యాక్సీ సేవలందిస్తున్నాయి. ఉద్యమకారులు రెచ్చిపోతుండటంతో అధికారులు వెంటనే లాస్‌ఏంజెలెస్‌ డౌన్‌టౌన్‌ ప్రాంతాల్లో జనసంచారంపై నిషేధాజ్ఞలు విధించారు. గుమికూడితే అరెస్ట్‌చేస్తామని అనౌన్స్‌మెంట్‌ ఇచ్చారు. 

సమాఖ్య విధానాన్ని కాలరాయడమే 
‘‘ కాలిఫోర్నియా రాష్ట్రంలో ఉద్యమాలు వెల్లువెత్తితే సద్దుమణిగేలా చేసే బాధ్యత ఆ రాష్ట్రానిదే. మా రాష్ట్రంలో సమస్యలుంటే మేం పరిష్కరించుకుంటాం. నేషనల్‌ గార్డ్‌లను రంగంలోకి దింపాల్సిన అవసరమేంటి?. గార్డ్‌లను దింపి సమాఖ్య విధానానికి ట్రంప్‌ సర్కార్‌ తూట్లుపొడుస్తోంది. ఇది రాష్ట్రాల సార్వ¿ౌమత్వానికి తీవ్ర విఘాతం కల్గించడమే. అధ్యక్షుడి నిర్ణయాన్ని నేను న్యాయస్థానంలో సవాల్‌ చేస్తా’’ అని డెమొక్రటిక్‌ పార్టీ నేత, కాలిఫోర్నియా గవర్నర్‌ గవిన్‌ నూసమ్‌ ఆగ్రహం వ్యక్తంచేశారు. గవర్నర్‌ అనుమతి, ఆమోదంలేకుండా కాలిఫోర్నియా రాష్ట్రంలోకి నేషనల్‌ గార్డ్‌లను కేంద్రప్రభుత్వం రప్పించడం ఇటీవలి దశాబ్దాల్లో ఇదే తొలిసారి. 

చివరిసారిగా 1965లో నాటి దేశాధ్యక్షుడు లిండన్‌ బి.జాన్సన్‌ అలబామాలో పౌరహక్కుల ఉద్యమాన్ని అదుపులోకి తెచ్చేందుకు అమెరికాసైన్యంలో రిజర్వ్‌ బలగాలైన ‘నేషనల్‌ గార్డ్‌’లను రప్పించారు.  ‘‘ఆందోళనకారులు శాంతించాలి. నేషనల్‌ గార్డ్‌లను తీసుకొచ్చి ఆందోళనకారుల ఆగ్రహజ్వాలలను ట్రంప్‌ మరింత రాజేశారు. ప్రజలకు రక్షణగా వాళ్లను రప్పించినట్లు కనిపించట్లేదు. ట్రంప్‌కు మరేదో ఎజెండా ఉన్నట్లుంది’’ అని లాస్‌ ఏంజెలెస్‌ నగర మహిళా మేయర్‌ కరెన్‌ బాస్‌ వ్యాఖ్యానించారు. ఆందోళనలు తొలుత లాస్‌ ఏంజెలెస్‌ డౌన్‌టౌన్‌లో మొదలు తర్వాత పారామౌంట్‌ పట్టణానికి పాకి ప్రస్తుతం సమీప కాంప్టన్‌ పట్టణంలో విస్తరిస్తున్నాయి. గత వారంతానికి 100 మందికిపైగా అక్రమవలసదారులను ఫెడరల్‌ ఏజెంట్లు అరెస్ట్‌చేసి డిటెన్షన్‌ సెంటర్‌లకు తరలించారు. శాన్‌ ఫ్రాన్సిస్కోలో 60 మందిని అరెస్ట్‌చేశారు.

విదేశీ జర్నలిస్ట్‌లకు గాయాలు 
డౌన్‌టౌన్‌ లాస్‌ఏంజెలెస్‌లోని మెట్రోపాలిటన్‌ డిటెన్షన్‌ సెంటర్‌ నుంచి వలసదారులను విడిచిపెట్టాలని ఉద్యమకారులు నినాదాలుచేశారు. అప్పుడు అక్కడ ఆ్రస్టేలియాకు చెందిన 9న్యూస్‌ టీవీఛానెల్‌ మహిళా పాత్రికేయురాలు లారెన్‌ థామస్‌ రిపోరి్టంగ్‌ చేస్తున్నారు. అదే సమయంలో ఉద్యమకారులను చెదరగొట్టేందుకు నగర పోలీసులు, నేషనల్‌ గార్డ్‌ బలగాలు రబ్బర్‌ బుల్లెట్ల గన్‌లను పేల్చారు. దీంతో ఒక రబ్బర్‌ బుల్లెట్‌ లారెన్‌కు తగిలింది. ప్రత్యక్ష ప్రసారం వేళ ఈ ఘటన జరిగింది. విలవిల్లాడుతున్న ఆమెను వెంటనే ఆస్పత్రికి తరలించారు. బ్రిటిష్‌ ఫొటోజర్నలిస్ట్‌ నిక్‌ స్టెర్న్‌కు సైతం రబ్బర్‌ బుల్లెట్‌ తగలి ఐదు సెంటీమీటర్ల లోతు గాయమైంది. 

ట్రంప్‌ రెండోసారి అధికార పగ్గాలు స్వీకరించాక దేశవ్యాప్తంగా 1,00,000 మందిని అరెస్ట్‌చేసినట్లు ఇమిగ్రేషన్, కస్టమ్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌(ఐసీఈ) విభాగం ప్రకటించింది. ట్రంప్‌ అధ్యక్షుడైన తొలి 100 రోజుల్లో రోజుకు 660 మంది చొప్పున అరెస్ట్‌చేశారు. గురువారంనాటికి డిటెన్షన్‌ సెంటర్లలో ఏకంగా 54,000 మంది వలసదారులున్నారు. నేషనల్‌ గార్డ్‌లను రప్పించడానికి శ్వేతసౌధం సమరి్థంచుకుంది. కాలిఫోర్నియా గవర్నర్‌ గవిన్‌ అసమర్థ పాలన కారణంగా ఇమిగ్రేషన్‌ అధికారులకు రక్షణ కరువైంది. అందుకే గార్డ్‌లను అనుమతించాం’’ అని శ్వేతసౌధం మీడియా కార్యదర్శి కరోలిన్‌ లెవిట్‌ చెప్పారు. లాస్‌ ఏంజెలెస్‌లో కొన్ని చోట్ల ఆందోళనకారులు దుకాణాలను లూటీచేశారని పోలీసులు చెప్పారు. పరిస్థితి చేయిదాటితే 500 మంది నేవీ మెరైన్‌లను రప్పిస్తామని యూఎస్‌ నార్తర్న్‌ కమాండ్‌ హెచ్చరించింది.   

ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
los angeles
USA
Battlefield
Donald trump
illegal immigrants
protest
Smoke bombs
Tear gas
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

హర్ముజ్‌ జలసంధిపై కొత్త ఆధిపత్య పోరు!

హర్ముజ్‌ జలసంధిపై కొత్త ఆధిపత్య పోరు!

మళ్లీ ట్రిగ్గర్‌ నొక్కిన ట్రంప్.. మరింత ముదిరిన యుద్ధం

మళ్లీ ట్రిగ్గర్‌ నొక్కిన ట్రంప్.. మరింత ముదిరిన యుద్ధం

పుతిన్‌ తగ్గేదేలే.. మళ్లీ మంటలు రేపే యుద్ధమా?

పుతిన్‌ తగ్గేదేలే.. మళ్లీ మంటలు రేపే యుద్ధమా?

భీకరంగా మారిన అమెరికా-ఇరాన్‌ యుద్ధం!

భీకరంగా మారిన అమెరికా-ఇరాన్‌ యుద్ధం!

ప్రపంచకప్‌ నుంచి అమెరికా నిష్క్రమణ

ప్రపంచకప్‌ నుంచి అమెరికా నిష్క్రమణ

హార్మూజ్‌పై ఇరాన్ షాకింగ్‌ కామెంట్స్‌.. స్ట్రాంగ్‌ వార్నింగ్

హార్మూజ్‌పై ఇరాన్ షాకింగ్‌ కామెంట్స్‌.. స్ట్రాంగ్‌ వార్నింగ్

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.