Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. International
  3. అమల్లోకి ‘బిగ్‌ బ్యూటిఫుల్‌’ చట్టం 
ADVERTISEMENT 

అమల్లోకి ‘బిగ్‌ బ్యూటిఫుల్‌’ చట్టం 

International Sakshi User Sakshi Sakshi Time Jul 6, 2025 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
trump.jpg

తన కలల బిల్లుపై సంతకం చేసి చట్టంగా తీసుకొచ్చిన ట్రంప్‌

వాషింగ్టన్‌: పన్ను చెల్లింపుదారులపై ట్యాక్స్‌ భారం తగ్గించడం, వలసచట్టాల అమలుకు కావాల్సిన నిధులను సేకరించడం, రక్షణరంగ బడ్జెట్‌ పెంపు వంటి ఎన్నో లక్ష్యాలతో రూపొందించిన కీలక ‘వన్‌ బిగ్‌ బ్యూటిఫుల్‌’బిల్లు ఎట్టకేలకు అమెరికాలో చట్టంగా అమల్లోకి వచ్చింది. అమెరికా సెనేట్, ప్రతినిధుల సభలో సుదీర్ఘ చర్చలు, ఉత్క ంఠతో కూడిన ఓటింగ్‌ల నడుమ ఆమోదం పొందిన ఈ బిల్లుపై అమెరికా కాలమానం ప్రకారం శుక్రవారం సాయంత్రం ట్రంప్‌ శ్వేతసౌధంలో సంతకంచేశారు.

 రెండో దఫా అధ్యక్షుడయ్యాక రిపబ్లికన్‌ పార్టీపై తన పట్టు సడలలేదని తాజా బిల్లు ద్వారా ట్రంప్‌ నిరూపించుకున్నారు. మరో దశాబ్దకాలంలో అమెరికా ఆర్థికలోటును మరో 3.3 ట్రిలియన్‌ డాలర్లు పెంచేసే చట్టంగా అపవాదును మూటగట్టుకున్న దాదాపు 870 పేజీల ఈ కొత్త చట్టంలోని కొన్ని కీలక అంశాలపై క్లుప్తంగా.. 

2017నాటి పన్నుల్లో కోత కొనసాగింపు 
ట్రంప్‌ తొలిదఫా అధ్యక్షునిగా ఎన్నికైనప్పుడు ప్రజలు చెల్లించాల్సి పన్ను రేటును తగ్గించారు. పరిశ్రమలకూ దీనిని వర్తింపజేశారు. ప్రభుత్వానికి తక్కువ పన్ను చెల్లించిన కారణంగా తమ వద్ద మిగిలిపోయిన సొమ్మును జనం ఖర్చుచేస్తారు. ఇలా వస్తుసేవల వినియోగం పెరిగి ఆర్థికాభివృద్ది ఊపందుకుంటుందని ట్రంప్‌ ఆశిస్తున్నారు.    

వైద్యసాయంపై భారీ కోత 
ఏ ప్రభుత్వమైనా కొత్త పథకం తెస్తే అందులో వైద్య ప్రయోజనాలు పెరుగుతాయి. కానీ ఈ బిల్లు ప్రస్తుతం అందుబాటులో ఉన్న వైద్య ప్రయోజనాలకు గండికొడుతోంది. తక్కువ ఆదాయం ఉన్న వ్యక్తులు/కుటుంబాలు/ వికలాంగులకు మెడికల్‌ ఎయిడ్‌ ప్రయోజనాలు దూరంకానున్నాయి. దీంతో మెడికల్‌ ఇన్సూరెన్స్‌ రక్షణలేక లక్షలాది మంది తమ సొంత డబ్బులను వైద్యం కోసం ఖర్చుచేయాల్సిఉంటుంది.  ఎక్కువ గంటలు పనిచేసే వ్యక్తులకే అధిక మెడిక్‌ఎయిడ్‌ నిబంధనను చేర్చారు.  ప్రస్తుతం అమెరికాలో 7.1 కోట్ల మంది ప్రభుత్వ వైద్య బీమా సదుపాయాన్ని పొందుతున్నారు. కొత్త చట్టం కారణంగా 1.7 కోట్ల మందికి ఈ సదుపాయం దూరమవుతుంది. 

పెన్షన్లు, గౌరవ భృతిపై పన్నుల తగ్గింపు 
రిటైర్డ్‌ ఉద్యోగులు, వికలాంగులు, ఇతర పెన్షనర్లపై విధించే సామాజిక భద్రతా ఆదాయ పన్నును తగ్గించారు. 65 ఏళ్లు పైబడిన వాళ్లకు అందే పెన్షన్, ఇతర ప్రయోజనాలపై మూలఆదాయం వద్ద కోతను 4,000 డాలర్లకు పరిమితం చేశారు.   

తగ్గనున్న ఫుడ్‌ కూపన్ల లబి్ధదారులు 
బైడెన్‌ హయాంలో అందించిన పునరుత్పాదక ఇంధన వనరుల ప్రోత్సాహక ప్రయోజనాలకు ప్రభుత్వం ఈ చట్టం ద్వారా కోతపెట్టింది. సౌర, పవన విద్యుత్‌ సంస్థలకు ఇచ్చే పన్ను ప్రయోజనాలను తగ్గించి ఆ మేరకు బొగ్గు, చమురు సంస్థలకు ప్రయోజనం కల్పించనున్నారు. కార్లు కొనేందుకు వాహనరుణం తీసుకుంటే అందుకు చెల్లించే వడ్డీని సైతం తగ్గించారు. తక్కువ ఆదాయవర్గాలకు అందించే ఫుడ్‌ కూపన్లు(టోకెన్లు) తగ్గించనున్నారు. ప్రస్తుతం 4 కోట్ల మంది ఈ ఫుడ్‌ టోకెన్లను ఉపయోగించుకుంటున్నారు. కొత్త చట్టం కారణంగా 47 లక్షల మంది ఆ అర్హతను కోల్పోతారు.  

భారీగా రక్షణ బడ్జెట్‌ 
రక్షణ బడ్జెట్‌ను మరో 150 బిలియన్‌ డాలర్లు పెంచనున్నారు. సరిహద్దు గోడనిర్మాణం, అక్రమంగా చొరబడిన విదేశీయుల కోసం మొత్తంగా 1,00,000 పడకలతో నిర్బంధ కేంద్రాలను నిర్మించనున్నారు. 
 

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
big beautiful bill
Donald trump
USA
Senate
defense budget
white house
Republican Party
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

హర్ముజ్‌ జలసంధిపై కొత్త ఆధిపత్య పోరు!

హర్ముజ్‌ జలసంధిపై కొత్త ఆధిపత్య పోరు!

మళ్లీ ట్రిగ్గర్‌ నొక్కిన ట్రంప్.. మరింత ముదిరిన యుద్ధం

మళ్లీ ట్రిగ్గర్‌ నొక్కిన ట్రంప్.. మరింత ముదిరిన యుద్ధం

పుతిన్‌ తగ్గేదేలే.. మళ్లీ మంటలు రేపే యుద్ధమా?

పుతిన్‌ తగ్గేదేలే.. మళ్లీ మంటలు రేపే యుద్ధమా?

భీకరంగా మారిన అమెరికా-ఇరాన్‌ యుద్ధం!

భీకరంగా మారిన అమెరికా-ఇరాన్‌ యుద్ధం!

ప్రపంచకప్‌ నుంచి అమెరికా నిష్క్రమణ

ప్రపంచకప్‌ నుంచి అమెరికా నిష్క్రమణ

హార్మూజ్‌పై ఇరాన్ షాకింగ్‌ కామెంట్స్‌.. స్ట్రాంగ్‌ వార్నింగ్

హార్మూజ్‌పై ఇరాన్ షాకింగ్‌ కామెంట్స్‌.. స్ట్రాంగ్‌ వార్నింగ్

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.