Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. International
  3. ప్రభుత్వ యంత్రాంగ ప్రక్షాళనకో శాఖ..సారథులుగా మస్క్, వివేక్‌
ADVERTISEMENT 

ప్రభుత్వ యంత్రాంగ ప్రక్షాళనకో శాఖ..సారథులుగా మస్క్, వివేక్‌

International Sakshi User Sakshi Sakshi Time Nov 14, 2024 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
Trump.jpg

కీలక బాధ్యతలు అప్పగించిన ట్రంప్‌ 

వారి సారథ్యంలో బ్యూరోక్రసీ ప్రక్షాళన 

వాషింగ్టన్‌: ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్, భారత మూలాలున్న రిపబ్లికన్‌ నేత వివేక్‌ రామస్వామిలకు కీలక బాధ్యతలు అప్పగించాలని అమెరికా కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ నిర్ణయించారు. యంత్రాంగంలో సమూల ప్రక్షాళన కోసం వారి సారథ్యంలో డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ గవర్నమెంట్‌ ఎఫీషియెన్సీ (డోజ్‌) ఏర్పాటును ప్రకటించారు. 

‘‘ప్రభుత్వ యంత్రాంగ ప్రక్షాళన, మితిమీరిన నిబంధనలకు కోత, అనవసర ఖర్చు తగ్గింపు, ఫెడరల్‌ ఏజెన్సీల పునర్‌ వ్యవస్థీకరణ తదితరాలను ఈ శాఖ పర్యవేక్షించనుంది. ఇందుకు ‘ది గ్రేట్‌’ మస్క్, ‘అమెరికా దేశభక్తుడు’ వివేక్‌ నాయకత్వం వహిస్తారు. తమ అమూల్య సలహాలతో సేవ్‌ అమెరికా ఉద్యమానికి మార్గదర్శనం చేస్తారు’’ అని పేర్కొన్నారు. 

అమెరికా స్వాతంత్య్ర ప్రకటనకు 250 ఏళ్లు నిండే 2026 జూలై 4వ తేదీకల్లా ప్రక్షాళన ప్రక్రియను పూర్తి చేయాలని మస్క్, వివేక్‌లకు డెడ్‌లైన్‌ విధించారు. ‘డోజ్‌’ను ఈ కాలపు మన్‌హాటన్‌ ప్రాజెక్టుగా ట్రంప్‌ అభివరి్ణంచారు. రెండో ప్రపంచ యుద్ధ కాలంలో అణుబాంబుల నిర్మాణానికి చేపట్టిన ప్రతిష్టాత్మక ప్రాజెక్టు ‘మన్‌హాటన్‌’. డోజ్‌ పనితీరుపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. 

ఇది ఫెడరల్‌ అడ్వైజరీ కమిటీ చట్టం పరిధిలోకి రావచ్చంటున్నారు. ప్రభుత్వోద్యోగులు ఆస్తులు తదితర వివరాలను ఎప్పటికప్పుడు వెల్లడించాల్సి ఉంటుంది. అయితే మస్క్, రామస్వామి ప్రభుత్వంలో చేరకుండా బయటి నుంచే పనిచేస్తారని ట్రంప్‌ చెప్పడంతో ఆ నిబంధన వారికి వర్తించే అవకాశం లేదు. గతంలోనూ అమెరికా అధ్యక్షులు ఇలా ప్రత్యేక కమిషన్లు ఏర్పాటు చేశారు. రిపబ్లికన్‌ పార్టీకే చెందిన రొనాల్డ్‌ రీగన్‌ 1981–1989 మధ్య ‘గ్రేస్‌ కమిషన్‌’ను స్థాపించారు. 
ఇక ప్రకంపనలే: మస్క్‌ 
డోజ్‌ ఏర్పాటును మస్క్‌ స్వాగతించారు. ఇది ప్రభుత్వ వ్యవస్థలో ప్రకంపనలు సృష్టిస్తుందన్నారు. ప్రభుత్వ వృథా ఖర్చులను తగ్గించడంలో ప్రజలందరూ భాగస్వాములు కావచ్చన్నారు. పారదర్శకత కోసం డోజ్‌ చర్యలన్నింటినీ ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచుతామని వెల్లడించారు. ప్రజా ధనం వృ«థాను అరికట్టేందుకు లీడర్‌ బోర్డ్‌ ఏర్పాటవుతుందని  తెలిపారు. 

ట్రంప్‌ టీమ్‌లో తొలి భారత అమెరికన్‌ 
ట్రంప్‌ 2.0 టీమ్‌లో చోటు సంపాదించిన తొలి భారత అమెరికన్‌గా 39 ఏళ్ల వివేక్‌ నిలిచారు. డోజ్‌ ఏర్పాటుపై ఆయన హర్షం వెలిబుచ్చారు. ప్రభుత్వ యంత్రాంగ ప్రక్షాళనలో సున్నితంగా వ్యవహరించబోమని స్పష్టం చేశారు. కాలం చెల్లిన పలు ఫెడరల్‌ ఏజెన్సీలను తొలగించాలంటూ ప్రచార పర్వంలో రిపబ్లికన్లు తరచూ ఉపయోగించిన నినాదం ‘షట్‌ ఇట్‌ డౌన్‌’ను ఈ సందర్భంగా రీ పోస్ట్‌ చేశారు. అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్‌కు వివేక్‌ పూర్తిస్థాయిలో మద్దతివ్వడం తెలిసిందే. ట్రంప్‌ విజయానంతరం పలు టీవీ షోల్లో మాట్లాడుతూ ఆయన్ను ఆకాశానికెత్తారు. 

వివేక్‌ 1985 ఆగస్టు 9న ఒహాయోలోని సిన్సినాటిలో జని్మంచారు. ఆయన తల్లిదండ్రులు తమిళనాడుకు చెందిన కేరళ బ్రాహ్మణులు. ఆయన ఒహాయోలోని రోమన్‌ కాథలిక్‌ స్కూల్లో చదివారు. హార్వర్డ్‌ నుంచి జీవశాస్త్రంలో పట్టా పొందారు. యేల్‌ లా స్కూల్‌ నుంచి పట్టభద్రుడయ్యారు. హెడ్జ్‌ ఫండ్‌ ఇన్వెస్టర్‌గా చేశారు. యేల్‌లో డిగ్రీ పూర్తవకముందే మిలియన్ల కొద్దీ సంపాదించానని చెప్పుకుంటారు. 2014లో ఓ బయోటెక్‌ కంపెనీని స్థాపించారు. 2023 నాటికే వివేక్‌ సంపద ఏకంగా 63 కోట్ల డాలర్లని ఫోర్బ్స్‌ అంచనా వేసింది. 

18 ఏళ్లకే అద్భుత ప్రసంగం 
హైసూ్కల్‌ విద్యారి్థగా సెయింట్‌ 18 ఏళ్ల వయసులో జేవియర్‌ స్కూల్లో వివేక్‌ చేసిన ప్రసంగ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. ప్రసంగం పొడవునా ఆయన కనబరిచిన ఆత్మవిశ్వాసం, భవిష్యత్తును గురించి మాట్లాడిన తీరు అందరినీ            ఆకట్టుకుంటున్నాయి.   
 

Congratulations to @elonmusk and @VivekGRamaswamy on this historic achievement! $DOGE #DonaldJTrump #ElonMusk #MAGA #TrumpVance2024 #VivekRamaswamy pic.twitter.com/6b98v4hyyO

— Brock W. Mitchell (@BrockWMitchell) November 13, 2024

ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
Donald trump
elon musk
vivek ramaswamy
NRI News
NRI
USA President
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

హర్ముజ్‌ జలసంధిపై కొత్త ఆధిపత్య పోరు!

హర్ముజ్‌ జలసంధిపై కొత్త ఆధిపత్య పోరు!

మళ్లీ ట్రిగ్గర్‌ నొక్కిన ట్రంప్.. మరింత ముదిరిన యుద్ధం

మళ్లీ ట్రిగ్గర్‌ నొక్కిన ట్రంప్.. మరింత ముదిరిన యుద్ధం

మస్క్ ప్రసంశలు.. ఏఐ రంగంలో వారే టాప్!

మస్క్ ప్రసంశలు.. ఏఐ రంగంలో వారే టాప్!

పుతిన్‌ తగ్గేదేలే.. మళ్లీ మంటలు రేపే యుద్ధమా?

పుతిన్‌ తగ్గేదేలే.. మళ్లీ మంటలు రేపే యుద్ధమా?

భీకరంగా మారిన అమెరికా-ఇరాన్‌ యుద్ధం!

భీకరంగా మారిన అమెరికా-ఇరాన్‌ యుద్ధం!

రూ. 62 కోట్ల లాటరీ గెలిచిన భారత మహిళ

రూ. 62 కోట్ల లాటరీ గెలిచిన భారత మహిళ

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.