Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. International
  3. పుతిన్, ట్రంప్‌ భేటీ 15న 
ADVERTISEMENT 

పుతిన్, ట్రంప్‌ భేటీ 15న 

International Sakshi User Sakshi Sakshi Time Aug 10, 2025 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
tr_0.jpg

వేదిక అలస్కా

నాలుగేళ్ల తర్వాత జరుగబోతున్న ముఖాముఖి చర్చలు  

ఉక్రెయిన్‌పై యుద్ధాన్ని ముగించేలా పుతిన్‌పై ఒత్తిడి పెంచే అవకాశం  

వాషింగ్టన్‌:  ప్రపంచ దేశాలు ఆసక్తికరంగా ఎదురు చూస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్, రష్యా అధినేత పుతిన్‌ భేటీకి వేదిక, తేదీ ఖరారయ్యాయి. ఈ నెల 15వ తేదీన అలస్కాలో ఇరువురు నేతలు సమావేశం కాబోతున్నారు. డొనాల్డ్‌ ట్రంప్‌ ఈ విషయం స్వయంగా వెల్లడించారు. పుతిన్‌తో తన భేటీ గురించి శనివారం సోషల్‌ మీడియాలో పోస్టు చేశారు. వచ్చే శుక్రవారం రష్యా అధ్యక్షుడిని కలుసుకోబోతున్నట్లు తెలిపారు. ఇద్దరు నేతలు ముఖాముఖి సమావేశం అవుతుండడం నాలుగేళ్ల తర్వాత ఇదే మొదటిసారి కావడం విశేషం.

 ఉక్రెయిన్‌–రష్యా యుద్ధాన్ని ముగించే దిశగా పుతిన్‌ను ట్రంప్‌ ఒప్పిస్తారా? అనేది చర్చనీయాంశంగా మారింది. రష్యా నుంచి ముడిచమురు కొనుగోలు చేస్తున్నందుకు భారత్‌పై ట్రంప్‌ టారిఫ్‌ల మోత మోగించారు. భారత ఉత్పత్తులపై ఏకంగా 50 శాతం సుంకాలు విధించారు. అంతేకాకుండా రష్యా ప్రత్యర్థి దేశమైన ఉక్రెయిన్‌పై సైనిక సాయం భారీగా పెంచబోతున్నట్లు ప్రకటించారు. ఈ తరుణంలో ట్రంప్, పుతిన్‌ భేటీ విశేష ప్రాధాన్యం సంతరించుకుంది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత యూరప్‌లో సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న అతిపెద్ద యుద్ధం ఉక్రెయిన్‌–రష్యా సమరమే. దీనికి సాధ్యమైనంత త్వరగా తెరదించాలని ట్రంప్‌ పట్టుదలతో ఉన్నారు. పుతిన్‌ను కలుసుకోబోతున్నట్లు ఇటీవల హఠాత్తుగా ప్రకటించి, అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు.  

ఒకప్పటి రష్యా భూభాగమే అలస్కా  
పుతిన్, ట్రంప్‌ సమావేశానికి అలస్కా వేదిక అవుతుండడం మరో విశేష పరిణామం. అలస్కా 1867 దాకా రష్యా సామ్రాజ్యంలో అంతర్భాగమే. అప్పటి జార్‌ చక్రవర్తి అలెగ్జాండర్‌–2 ఈ ప్రాంతాన్ని అమెరికాకు విక్రయించారు. బ్రిటిష్‌ సైన్యం దీన్ని ఆక్రమిస్తుందన్న భయంతో అప్పటికప్పుడు అమ్మకానికి పెట్టారు. ఎకరాకు ఒక డాలర్‌ చొప్పున అమ్మేసినట్లు చెబుతుంటారు. 19వ శతాబ్దంలో ప్రపంచంలో ఇది అతిపెద్ద రియల్‌ ఎస్టేట్‌ లావాదేవీల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. ప్రస్తుతం అలస్కా భూభాగం విలువ 10 బిలియన్‌ డాలర్లు(రూ.8.75 లక్షల కోట్లు) ఉంటుందని అంచనా. బంగారం సహా సహజ వనరులకు లోటులేని ప్రాంతం అలస్కా. అమెరికా విస్తీర్ణంలో ఐదింట ఒక వంతు అలాస్కా ఉంటుంది. అలస్కాతో రష్యాకు విడదీయరాని అనుబంధం ఉంది.  

ఆగస్టు 15న సమావేశం ఎందుకు?   
ఇక ఇద్దరు కీలక నాయకుల భేటీ కోసం నిర్ణయించిన తేదీకి కూడా చెప్పుకోదగ్గ ప్రాధాన్యం ఉంది. ఆగస్టు 15వ తేదీ భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన తేదీ అని మనకు తెలుసు. కానీ, ఎక్కువ మందికి తెలియని సంగతి ఏమిటంటే.. రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన తేదీ ఆగస్టు 15. జపాన్‌ చక్రవర్తి హిరోహితో లొంగుబాటు ప్రకటనతో ఈ యుద్ధం ముగిసింది. ఈ ఏడాది ఆగస్టు 15న రెండో ప్రపంచ యుద్ధానికి 80 ఏళ్లు పూర్తికాబోతున్నాయి. 1945 ఆగస్టు 15న రెండో ప్రపంచ యుద్ధానికి తెరపడగా సరిగ్గా రెండేళ్లకు ఇండియాకు స్వాతంత్య్రం లభించింది. జపాన్‌లో మిత్రదేశాల సైన్యాన్ని లార్డ్‌ లూయిస్‌ మౌంట్‌బాటెన్‌ ముందుండి నడిపించారు. విజయం చేకూర్చి పెట్టారు. అదే మౌంట్‌బాటెన్‌ ఇండియా గవర్నర్‌ జనరల్‌ హోదాలో 1947లో స్వాతంత్య్ర దినాన్ని ఆగస్టు 15గా నిర్ణయించారు. అది ఆయనకు ఇష్టమైన తేదీ కావడమే ఇందుకు కారణం. ప్రస్తుతం ఆగస్టు 15వ తేదీన పుతిన్, ట్రంప్‌ కలుసుకోబోతున్నారు.  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
Donald trump
Russia president
Vladimir Putin
meeting
Alaska
face to face discussion
Ukraine-Russia
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

హర్ముజ్‌ జలసంధిపై కొత్త ఆధిపత్య పోరు!

హర్ముజ్‌ జలసంధిపై కొత్త ఆధిపత్య పోరు!

మళ్లీ ట్రిగ్గర్‌ నొక్కిన ట్రంప్.. మరింత ముదిరిన యుద్ధం

మళ్లీ ట్రిగ్గర్‌ నొక్కిన ట్రంప్.. మరింత ముదిరిన యుద్ధం

పుతిన్‌ తగ్గేదేలే.. మళ్లీ మంటలు రేపే యుద్ధమా?

పుతిన్‌ తగ్గేదేలే.. మళ్లీ మంటలు రేపే యుద్ధమా?

భీకరంగా మారిన అమెరికా-ఇరాన్‌ యుద్ధం!

భీకరంగా మారిన అమెరికా-ఇరాన్‌ యుద్ధం!

కేంద్రమంత్రి ఖట్టర్‌తో.. సీఎం రేవంత్ భేటీ

కేంద్రమంత్రి ఖట్టర్‌తో.. సీఎం రేవంత్ భేటీ

వాన్స్‌ను ముందుకు నెట్టి.. ట్రంప్‌ సేఫ్‌ గేమ్?

వాన్స్‌ను ముందుకు నెట్టి.. ట్రంప్‌ సేఫ్‌ గేమ్?

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.