Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. International
  3. అమెరికా ‘గ్రీన్‌ల్యాండ్‌’ కలలకు  చెక్‌ పెట్టిన డెన్మార్క్‌! 
ADVERTISEMENT 

అమెరికా ‘గ్రీన్‌ల్యాండ్‌’ కలలకు  చెక్‌ పెట్టిన డెన్మార్క్‌! 

International Sakshi User Sakshi Sakshi Time Feb 2, 2025 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
OZEMPIC.jpg

గ్రీన్‌ల్యాండ్‌ స్వాదీనం కోసం డెన్మార్క్‌కు అగ్రరాజ్యం బెదిరింపులు.. కొన్ని లక్షల మంది ఊబకాయులున్న అమెరికాపైనే ప్రభావం చూపించనున్నాయి. బెదిరింపులకు, ఊబకాయులకు సంబంధమేంటనే సందేహం వస్తోంది కదూ.. అయితే ఇది తెలుసుకోవాల్సిందే! 

గ్రీన్‌ల్యాండ్‌పై ఆధిపత్యం కోసం అగ్రరాజ్యం అమెరికా, యూరప్‌ దేశం డెన్మార్క్‌ ప్రచ్ఛన్న పోరు కొనసాగుతోంది. గ్రీన్‌ల్యాండ్‌ ఖనిజ సంపదపై కన్నేసిన డోనాల్డ్‌ ట్రంప్‌ అధ్యక్షునిగా ఎన్నికైన నాటినుంచే కొనుగోలు ఆలోచనను తెరపైకి తెచ్చారు. అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన చర్యలను వేగవంతం చేశారు. గ్రీన్‌ల్యాండ్‌పై అధికారాలున్న డెన్మార్క్‌పై బెదిరింపులకు పాల్పడుతున్నారు. 

తమ ప్రతిపాదనకు అంగీకరించకపోతే అధిక సుంకాలు విధిస్తామంటూ డెన్మార్క్‌ను హెచ్చరించారు. అవసరమైతే సైనిక చర్యకు కూడా వెనుకాడబోమనే సంకేతాలూ ఇచ్చారు. అయినా గ్రీన్‌ల్యాండ్‌ అమ్మకానికి లేదంటూ డెన్మార్క్‌ స్పష్టం చేసింది. అమెరికా టారిఫ్‌ బెదిరింపులు డెన్మార్క్‌ను ప్రభావితం చేయడం ప్రశ్నార్థకమే. ఎందుకంటే అమెరికాను ఎదుర్కోవడానికి డెన్మార్క్‌ దగ్గర కీలక ఆయుధాలున్నాయి. వీటిలో మొదటిది ఊబకాయాన్ని తగ్గించే ఔషదం ఓజెంపిక్, రెండోది పిల్లలకు ఇష్టమైన లెగో బొమ్మల ఎగుమతులు.  

ప్రపంచంలోనే అత్యధిక ఊబకాయులు అమెరికాలోనే..  
ప్రపంచంలోనే అత్యధిక ఊబకాయం రేటు అమెరికాలో ఉంది. ఓ నివేదిక ప్రకారం.. 23 అమెరికన్‌ రాష్ట్రాల్లో, ముగ్గురు పెద్దల్లో ఒకరి కంటే ఎక్కువ మంది (35%) ఊబకాయంతో బాధపడుతున్నారు. డానిష్‌ ఫార్మా దిగ్గజం నోవో నోర్డిస్క్‌ తయారు చేసిన ఓజెంపిక్, వెగోవి మందులు.. అమెరికాలో ఊబకాయం, డయాబెటిస్‌ చికిత్సలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాయి. జర్నల్‌ ఆఫ్‌ ది అమెరికన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ నిర్వహించిన ఓ అధ్యయనం ప్రకారం.. 2021 నుంచి 2023 వరకు అమెరికాలో ఓజెంపిక్‌ ఉపయోగిస్తున్నవారి సంఖ్య 400 శాతం పెరిగింది. ఇప్పటికే అమెరికన్లు ఒక ఓజెంపిక్‌ ప్యాకెట్‌ కోసం దాదాపు వెయ్యి డాలర్లు చెల్లిస్తున్నారు. 

బీమా, డిస్కౌంట్లు లేకుండా అది కాస్తా 1300 డాలర్లు అవుతుంది. ఒకవేళ అమెరికా ఈ మందులు తయారు చేయాలనుకున్నా.. ఓజెంపిక్, వెగోవిలకు అవసరమైన సెమాగ్లుటైడ్‌ డెన్మార్క్‌లోనే తయారవుతుంది. ఇతర దేశాలతో పోలిస్తే అమెరికాలో ఇప్పటికే ఈ మందుల ధర ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో ట్రంప్‌ డెన్మార్క్‌పై భారీ సుంకాలు విధిస్తే ఓజెంపిక్, వెగోవి ధరలు పెంచే అవకాశం ఉంది. ఆ ఒక్కటే కాదు.. ట్రేడింగ్‌ ఎకనామిక్స్‌ డేటా ప్రకారం 2023లో డెన్మార్క్‌ నుంచి 5.7 బిలియన్‌ డాలర్ల విలువైన మందులు, వ్యాక్సిన్లు మరియు యాంటీబయాటిక్స్‌ను అమెరికా దిగుమతి చేసుకుంది.  

డెన్మార్క్‌ కేంద్రంగా లెగో గ్రూప్‌... 
ప్రపంచంలోనే అతిపెద్ద బొమ్మల తయారీ సంస్థ లెగో గ్రూప్‌ కూడా డెన్మార్క్‌ కేంద్రంగానే పనిచేస్తోంది. ఈ బొమ్మలకు అమెరికాలో ప్రజాదరణ ఎక్కువ. అంతేకాదు.. అమెరికాకు వినికిడి పరికరాల సరఫరాలో కూడా డెన్మార్క్‌దే అగ్రస్థానం. ఇలాంటి పరిస్థితుల్లో ట్రంప్‌ టారిఫ్‌ బెదిరింపులు.. తిరిగి అమెరికాకు తలనొప్పులు తెచ్చే అవకాశం ఉంది.
    
– సాక్షి, నేషనల్‌ డెస్క్‌

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
Greenland
USA
Denmark
cold war
Obesity people
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

భీకరంగా మారిన అమెరికా-ఇరాన్‌ యుద్ధం!

భీకరంగా మారిన అమెరికా-ఇరాన్‌ యుద్ధం!

ప్రపంచకప్‌ నుంచి అమెరికా నిష్క్రమణ

ప్రపంచకప్‌ నుంచి అమెరికా నిష్క్రమణ

హార్మూజ్‌పై ఇరాన్ షాకింగ్‌ కామెంట్స్‌.. స్ట్రాంగ్‌ వార్నింగ్

హార్మూజ్‌పై ఇరాన్ షాకింగ్‌ కామెంట్స్‌.. స్ట్రాంగ్‌ వార్నింగ్

పాక్‌పై అమెరికా సెనేటర్ల నిప్పులు: లాడెన్‌ను దాచారంటూ ఆగ్రహం!

పాక్‌పై అమెరికా సెనేటర్ల నిప్పులు: లాడెన్‌ను దాచారంటూ ఆగ్రహం!

వాన్స్‌ను ముందుకు నెట్టి.. ట్రంప్‌ సేఫ్‌ గేమ్?

వాన్స్‌ను ముందుకు నెట్టి.. ట్రంప్‌ సేఫ్‌ గేమ్?

జీడీపీ వృద్ధికి సవాళ్లు..!

జీడీపీ వృద్ధికి సవాళ్లు..!

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.