Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. International
  3. ‘ఎప్‌స్టీన్’ ఆరోపణలు.. దలైలామా ఏమన్నారంటే..
ADVERTISEMENT 

‘ఎప్‌స్టీన్’ ఆరోపణలు.. దలైలామా ఏమన్నారంటే..

International Sakshi User Sakshi Sakshi Time Feb 8, 2026 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
lama.jpg

ధర్మశాల: లైంగిక వేధింపుల కేసులో నిందితుడైన జెఫ్రీ ఎప్‌స్టీన్‌తో ఆధ్యాత్మిక గురువు దలైలామాకు సంబంధాలు ఉన్నాయంటూ వస్తున్న వార్తలను ఆయన కార్యాలయం తీవ్రంగా ఖండించింది. ఆదివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో  దలైలామా ఎన్నడూ ఎప్‌స్టీన్‌ను కలవలేదని స్పష్టం చేసింది. అంతేకాకుండా ఆయన తరపున మరెవరూ కూడా ఎప్‌స్టీన్‌తో సమావేశం అయ్యేందుకు ఎటువంటి అనుమతులు ఇవ్వలేదని కార్యాలయం పేర్కొంది. సోషల్ మీడియాలో వస్తున్న ఆరోపణలు  అవాస్తవాలని, వాటిలో ఎటువంటి నిజం లేదని తేల్చి చెప్పింది.

అమెరికాలో సంచలనం సృష్టించిన ఎప్‌స్టీన్ ఫైల్స్ బహిర్గతం కావడంతో పలువురు ప్రముఖుల పేర్లు వెలుగులోకి వస్తున్నాయి. ఈ పత్రాల్లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న సెలబ్రిటీలు, రాజకీయ నేతలు, ఉన్నత స్థాయి వ్యక్తులకు ఎప్‌స్టీన్తో ఉన్న సంబంధాలు, సంభాషణల వివరాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే దలైలామా పేరు కూడా ప్రస్తావనకు రావడంతో చర్చ మొదలైంది. అయితే తమ గౌరవానికి భంగం కలిగించేలా సాగుతున్న ఈ ప్రచారాన్ని దలైలామా కార్యాలయం తోసిపుచ్చింది.
 

Press Statement

Some recent media reports and social media posts concerning the “Epstein files” are attempting to link His Holiness the Dalai Lama with Jeffrey Epstein.

We can unequivocally confirm that His Holiness has never met Jeffrey Epstein or authorised any meeting or… pic.twitter.com/QtV6B3Wr0u

— Dalai Lama (@DalaiLama) February 8, 2026

అమెరికా డిపార్ట్‌మెంట్ ఆఫ్ జస్టిస్ ఇటీవల  జెఫ్రీ ఎప్‌స్టీన్‌కు సంబంధించిన సుమారు 30 లక్షల ఫైళ్లను విడుదల చేసింది. ఇందులో 2,000కు పైగా వీడియోలు, దాదాపు లక్షా ఎనభై వేల ఫోటోలు ఉన్నట్లు సమాచారం. ఈ పత్రాల్లో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్, ప్రముఖ వ్యాపారవేత్త ఎలాన్ మస్క్ తదిర ప్రముఖుల పేర్లు ఉన్నాయి.

పేర్లు ఉన్నంత మాత్రాన వారు తప్పు చేసినట్లు కాదని అధికారులు చెబుతున్నప్పటికీ, ఈ జాబితాలో దలైలామా పేరు ఉండటం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. జెఫ్రీ ఎప్‌స్టీన్ అమెరికాకు చెందిన ఒక సంపన్న ఆర్థికవేత్త, బాలికలు, యువతులపై  లైంగిక వేధింపులు, అక్రమ రవాణా కేసుల్లో దోషిగా తేలి జైలుకు వెళ్లాడు. 2008లో ఫ్లోరిడాలో మొదటిసారి శిక్ష అనుభవించిన ఆయన, 2019లో ఫెడరల్ దర్యాప్తులో తిరిగి అరెస్టయ్యాడు. అయితే విచారణ ఎదుర్కొంటున్న సమయంలో జైలులోనే ఆయన  స్థితిలో ఆత్మహత్య చేసుకున్నాడు.

ఇది కూడా చదవండి: ఓపెన్ ఏఐ మరో షాక్‌.. ఇక స్మార్ట్‌ ఫోన్‌లకు చెక్‌!

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
Epstein Files
dalai lama
refuse
link
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

మోదీ గుట్టు ట్రంప్‌కు తెలుసు

మోదీ గుట్టు ట్రంప్‌కు తెలుసు

ఎప్‌స్టీన్‌ ఫైల్స్‌ : మైనర్‌పై దారుణం, ట్రంప్‌కు మరో షాక్‌

ఎప్‌స్టీన్‌ ఫైల్స్‌ : మైనర్‌పై దారుణం, ట్రంప్‌కు మరో షాక్‌

నేను ఏ తప్పూ చేయలేదు: క్లింటన్‌

నేను ఏ తప్పూ చేయలేదు: క్లింటన్‌

బికినీ అమ్మాయిల‌తో స్టీఫెన్ హాకింగ్‌

బికినీ అమ్మాయిల‌తో స్టీఫెన్ హాకింగ్‌

ఎప్ స్టీన్ కేసులో కొత్త ట్విస్ట్.. ట్రంప్ ఫైళ్లు మాయం?

ఎప్ స్టీన్ కేసులో కొత్త ట్విస్ట్.. ట్రంప్ ఫైళ్లు మాయం?

తప్పు చేశా.. క్షమించండి 

తప్పు చేశా.. క్షమించండి 

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.