Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. International
  3. కండోమ్‌, గర్భనిరోధక మాత్రలపై అమల్లోకి వచ్చిన వ్యాట్‌
ADVERTISEMENT 

కండోమ్‌, గర్భనిరోధక మాత్రలపై అమల్లోకి వచ్చిన వ్యాట్‌

International Sakshi User Sakshi Sakshi Time Jan 2, 2026 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
Condom-Tax.jpg

ప్రపంచంలో అత్యధిక జనాభా ఉన్న దేశానికి సరికొత్త సమస్య వచ్చి పడింది. జననాల సంఖ్య‌ దారుణంగా పడిపోతుండడంతో జ‌నాభాను పెంచేందుకు చైనా ప్ర‌భుత్వం నానాపాట్లు పడుతోంది. ఈ క్రమంలో కొత్త ఏడాది.. అందునా మొదటి రోజే ఓ కీలక నిర్ణయం ప్రకటించింది. కండోమ్‌ సహా గర్భ నిరోధక మాత్రలు, ఇతర సంబంధిత ఔషధాలపై 13 శాతం పన్ను విధించి.. తీవ్ర చర్చకు దారి తీసింది.

చైనా ప్రభుత్వంలో ఈ తరహా నిర్ణయాలు తీసుకోవడానికి కారణాలు ఉన్నాయి. అక్కడ గత మూడేళ్లుగా జననాల సంఖ్య తగ్గుతూ వస్తోంది. 2024లో కేవలం కోటి మంది పిల్లలు మాత్రమే పుట్టారు. ఇది గత దశాబ్దం కాలంనాటి గణాంకాల్లో సగం కావడం గమనార్హం. వృద్ధ జనాభా, ఆర్థిక మందగమనం కారణంగా ప్రభుత్వం త్వరగా పెళ్లి చేసుకుని ఎక్కువ పిల్లలు కనాలని అక్కడి యువతను కోరుకుంటోంది. ఈ క్రమంలో.. 

గర్భనిరోధక వస్తువులు (కండోమ్‌లు, మాత్రలు, IUDలు)లపై పన్నులు పెంచగా, చైల్డ్‌కేర్ సేవలు (పిల్లల సంరక్షణ), వివాహ సంబంధిత సేవలు, వృద్ధుల సంరక్షణ సేవల వస్తువులపై పన్నులు తగ్గించింది. తల్లిదండ్రులకు ఎక్కువ పేరెంటల్ లీవ్.. క్యాష్ హ్యాండౌట్లు (ఆర్థిక సహాయం) వంటి ప్రోత్సహాకాలు అందిస్తోంది. 2026 జనవరి 1 నుండి కండోమ్‌లు, గర్భనిరోధక మాత్రలు, IUDలు వంటి వస్తువులపై 13 శాతం వ్యాట్‌ అమల్లోకి తెచ్చింది. 1993 నుంచి ఈ వస్తువులు వ్యాట్‌ కేటగిరీ నుంచి మినహాయింపు పొందుతూ వచ్చాయి. కానీ.. 

నిపుణులు ఏం చెబుతున్నారంటే..

కండోమ్‌ల ధర పెరగడం వల్ల జననాల సంఖ్య పెరగడం అసాధ్యమని నిపుణులు అభిప్రాయవ్యక్తం చేస్తున్నారు. అసలు సమస్య పిల్లల పెంపకం ఖర్చులు ఎక్కువగా ఉండటమేనని చెబుతున్నారు. చైనాలో కండోమ్‌లపై పన్నులు పెరగడం వల్ల వాటి ధరలు పెరిగితే, ప్రజలు వాటిని తక్కువగా ఉపయోగించే అవకాశం ఉందని ప్రభుత్వం చెబుతుండగా.. ఇది హెచ్‌ఐవీ వ్యాప్తి ప్రమాదాన్ని పెంచుతుందని డబ్ల్యూహెచ్‌వో హెచ్చరిస్తోంది. గతంలో కొన్ని దేశాల్లో ఎదురైన పరిస్థితులనూ ఈ సందర్భంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రస్తావిస్తోంది. అదే సమయంలో చైనాలో హెచ్‌ఐవీ కేసులు.. గత దశాబ్దంలో తగ్గినా, యువతలో కొత్త కేసులు ఇంకా నమోదవుతున్నాయనే విషయాన్ని గుర్తు చేస్తోంది.

ట్రోలింగ్‌.. 
జననాల రేటు పెంచేందుకు చైనా ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయాలపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. యువత ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఒకవైపు ప్రభుత్వం పెళ్లి చేసుకుని పిల్లలు కనమని చెబుతోంది. మరోవైపు గర్భనిరోధక వస్తువులను ఖరీదుగా చేస్తోందంటూ మండిపడుతున్నారు.

మరోవైపు.. ఈ నిర్ణయంపై సోషల్‌ మీడియాలో ట్రోలింగ్‌ నడుస్తోంది. కండోమ్స్ ధరలు పెంచడం అంటే.. ముందుగానే రెండు,మూడేళ్లకు ముందే కండోమ్స్ కొనుగోలు చేయమని చెబుతున్నారా? అంటూ చైనా యువత సెటైర్లు సంధిస్తున్నారు. కండోమ్ ధరలు పెంచటం ద్వారా పిల్లల సంఖ్య పెరుగుతుందనే ఆలోచన రావటమే సూపర్‌..  మనం పిల్లల్ని కనటానికి మన కంటే ప్రభుత్వమే చాలా ఎక్కువగా కష్టపడుతుందంటూ నెటిజన్లు పంచ్‌ల మీద పంచ్‌లు వేస్తున్నారు.

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
condoms
china
World Health Organisation (WHO)
birth
rate
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

అమెరికాపై చైనా ప్రతీకారం.. 46 కంపెనీలపై నిషేధం

అమెరికాపై చైనా ప్రతీకారం.. 46 కంపెనీలపై నిషేధం

కొన్ని గంటలపాటు గాల్లో ప్రాణాలు.. ఏకంగా 60 మీటర్ల ఎత్తులో

కొన్ని గంటలపాటు గాల్లో ప్రాణాలు.. ఏకంగా 60 మీటర్ల ఎత్తులో

ప్రాణాంతక వ్యాధి లాస్ట్‌ స్టేజ్‌..ఐనా రోజుకు 12 గంటలు..!

ప్రాణాంతక వ్యాధి లాస్ట్‌ స్టేజ్‌..ఐనా రోజుకు 12 గంటలు..!

చైనా ముప్పు మరింత పెరిగింది

చైనా ముప్పు మరింత పెరిగింది

చైనాకు కౌంటర్‌ : రూ. 1.5 లక్షల కోట్ల భారత్ సియాంగ్ ప్రాజెక్ట్

చైనాకు కౌంటర్‌ : రూ. 1.5 లక్షల కోట్ల భారత్ సియాంగ్ ప్రాజెక్ట్

యుద్ధం మొదలవుతుంది..!చైనా వాడు పాకిస్థాన్ ను కుక్కలా పెంచుకుంటున్నాడు..!

యుద్ధం మొదలవుతుంది..!చైనా వాడు పాకిస్థాన్ ను కుక్కలా పెంచుకుంటున్నాడు..!

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.