Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. International
  3. బంగ్లా బీఎన్‌పీదే 
ADVERTISEMENT 

బంగ్లా బీఎన్‌పీదే 

International Sakshi User Sakshi Sakshi Time Feb 14, 2026 Sakshi Read Time Read Time: 3 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
bnp.jpg

పార్లమెంటు ఎన్నికల్లో ఘనవిజయం 

మూడింట రెండొంతుల మెజారిటీ 

భారత్‌ వ్యతిరేక జమాతే ఓటమి 

ప్రధాని కానున్న తారిఖ్‌ రహ్మాన్‌ 

రేపు ప్రమాణం చేసే అవకాశం 

మోదీ అభినందనలు, బీఎన్‌పీ కృతజ్ఞతలు

ఢాకా: బంగ్లాదేశ్‌ సాధారణ ఎన్నికల్లో బంగ్లాదేశ్‌ నేషనలిస్ట్‌ పార్టీ (బీఎన్‌పీ) దుమ్మురేపింది. శుక్రవారం వెల్లడైన ఫలితాల్లో ఏకంగా మూడింట రెండొంతులకు పైగా మెజారిటీతో ఘనవిజయం సాధించింది. మొత్తం 300 స్థానాలకు గాను 297 చోట్ల ఫలితాలను ఎన్నికల సంఘం ప్రకటించింది. వాటిలో బీఎన్‌పీ 209 సీట్లు గెలుచుకుంది! కరడుగట్టిన భారత వ్యతిరేకిగా, పాక్‌ తాబేదారుగా ముద్రపడ్డ జమాతే ఇస్లామీ పార్టీ 68 సీట్లకు పరిమితమైంది. దానితో జట్టుకట్టిన 10 ఇతర పారీ్టలు దాదాపుగా మట్టికరిచాయి. 

2024 ఆందోళనల అనంతరం విద్యార్థుల ఆధ్వర్యంలో పుట్టుకొచ్చిన జమాతే సంకీర్ణ భాగస్వామి నేషనల్‌ సిటిజన్‌ పార్టీ కేవలం 6 స్థానాల్లో నెగ్గగా 7 చోట్ల స్వతంత్రులు విజయం సాధించారు. ప్రధాన ప్రతిపక్షమైన షేక్‌ హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్‌ను ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధించడం తెలిసిందే. రెండు పార్లమెంటు స్థానాల్లో ఫలితాల వెల్లడిపై హైకోర్టు నిషేధం విధించగా అభ్యర్థి మృతి కారణంగా ఒక స్థానంలో ఎన్నిక వాయిదా పడింది. ఓట్ల లెక్కింపులో భారీ అక్రమాలు జరిగినట్టు జమాతే ఆరోపించింది. ఫలితాలను బీఎన్‌పీకి అనుకూలంగా మార్చేందుకు వాటి వెల్లడిని ఈసీ ఉద్దేశపూర్వకంగానే ఆలస్యం చేసిందని మండిపడింది. 
   
20 ఏళ్ల తర్వాత అధికారం 
ఎన్నికల్లో ఘనవిజయం నేపథ్యంలో బీఎన్‌పీ చైర్మన్‌ తారిఖ్‌ రహ్మాన్‌ (60) తొలిసారి దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఆయన ఆదివారం ప్రమాణస్వీకారం చేసే అవకాశముంది. బీఎన్‌పీ ఏకంగా 20 ఏళ్ల సుదీర్ఘ విరామం అనంతరం అధికార పగ్గాలు చేపట్టనుండటం విశేషం. ఎన్నికల విజయంపై రహ్మాన్‌కు ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు తెలియజేశారు. ఫలితాలపై స్పందించిన తొలి దేశాధినేత ఆయనే కావడం విశేషం. ఇందుకు మోదీకి బీఎన్‌పీ కృతజ్ఞతలు తెలిపింది. బంగ్లాదేశ్‌ మాజీ అధ్యక్షుడు జియావుర్‌ రహ్మాన్, మాజీ ప్రధాని ఖలీదా జియా కుమారుడైన రహ్మాన్‌ 19 ఏళ్ల ప్రవాసం నుంచి ఇటీవలే బంగ్లాకు తిరిగి రావడం విశేషం.

 షేక్‌ హసీనా సర్కారును కుప్పకూల్చిన దేశవ్యాప్త ఆందోళనల నేపథ్యంలో బంగ్లాదేశ్‌లో ఏడాదిన్నరకు పైగా కొనసాగుతున్న కల్లోలం బీఎన్‌పీ విజయంతో సద్దుమణిగి రాజకీయ స్థిరత్వం నెలకొంటుందన్న ఆశాభావం వ్యక్తమవుతోంది. దేశవ్యాప్తంగా గురువారం జరిగిన ఎన్నికల్లో 59.44 శాతం పోలింగ్‌ నమోదైంది. బంగ్లాలో ఇవి 13వ సాధారణ ఎన్నికలు. 

విద్యార్థుల ముసుగులో 2024 ఆగస్టులో పెచ్చరిల్లిన ఆందోళనలు హసీనా 15 ఏళ్ల పాలనకు తెరదించడం, ఆమె ఉన్నపళంగా దేశం వీడి భారత్‌లో ఆశ్రయం పొందుతుండటం తెలిసిందే. నాటినుంచీ ఒకరకంగా బంగ్లాలో రాజకీయ శూన్యమే నెలకొంది. దేశ పాలన వ్యవహారాలను ఏడాదిన్నరకు పైగా నోబెల్‌ గ్రహీత మహమ్మద్‌ యూనుస్‌ సారథ్యంలోని మధ్యంతర ప్రభుత్వమే చూస్తూ వస్తోంది. అయితే దేశంలో అస్థిరతకు చెక్‌ పెట్టడంలో, ముఖ్యంగా హిందువులు తదితర మైనారిటీలపై దేశవ్యాప్తంగా పెచ్చరిల్లుతున్న దాడులను అడ్డుకోవడంలో పూర్తిగా విఫలమైందన్న చెడ్డపేరు మూటగట్టుకుంది.  
   
సంస్కరణలకు ‘జై’
బంగ్లాదేశ్‌లో భారీ ప్రజాస్వామిక సంస్కరణలకు ప్రజలు జైకొట్టారు. ఇందుకోసం సాధారణ ఎన్నికలతో పాటుగా నిర్వహించిన రెఫరెండానికి అనుకూలంగా తీరి్పచ్చారు. రెఫరెండంలో భాగంగా ప్రతిపాదించిన సంస్కరణల ప్యాకేజీకి మద్దతు పలికారు. రెఫరెండానికి అనుకూలంగా ఏకంగా 60.26 శాతం ఓట్లు పడ్డట్టు ఎన్నికల సంఘం ప్రకటించింది. 4.81 కోట్ల మంది ‘అవును’అని ఓటేయగా 2.26 కోట్ల మంది ‘కాదు’బటన్‌ నొక్కినట్టు తెలిపింది. హసీనా పదవీచ్యుతి అనంతరం తాత్కాలికంగా పాలన పగ్గాలు చేపట్టిన యూనుస్‌ గతేడాది ఈ సంస్కరణలను ప్రతిపాదించారు.

ఏడుగురుమహిళల విజయం 
బంగ్లా పార్లమెంటు ఎన్నికల్లో ఏడుగురు మహిళా అభ్యర్థులు విజయం సాధించారు. వారిలో ఆరుగురు అధికార పగ్గాలు చేపట్టబోతున్న బీఎన్‌పీ నుంచే నెగ్గారు. మరొకరు స్వతంత్ర అభ్యరి్థగా గెలిచారు. బీఎన్‌పీ ఈసారి మొత్తం 10 మంది మహిళలకు టికెట్లిచ్చింది.  

ముగ్గురు హిందువుల విజయం! 
బంగ్లాదేశ్‌ పార్లమెంటు ఎన్నికల్లో ముగ్గురు హిందూ అభ్యర్థులు గెలుపొందడం విశేషం! పైగా వారంతా బీఎన్‌పీ టికెట్‌పై పోటీ చేసినవారే! సీనియర్‌ నాయకుడు జ్ఞానేశ్వర్‌ చంద్ర రాయ్‌ ఢాకా–3 నియోజకవర్గం నుంచి ఏకంగా 99,163 ఓట్లు సాధించి జమాతే ఇస్లామీ అభ్యర్థి మహ్మద్‌ షహీనుర్‌ ఇస్లాంపై విజయఢంకా మోగించారు. బీఎన్‌పీ ఉపాధ్యక్షుడు నితాయ్‌ రాయ్‌ చౌధురి మగురా–2 నుంచి, దీపేన్‌ దివాన్‌ రంగమతి నుంచి గెలుపొందారు. జమాతే తరఫున ఏకైక హిందూ అభ్యర్థి కృష్ణ నంది ఓటమి చవిచూశారు.

దశాబ్దాల అనంతరంమహిళా సారథులు లేకుండా 
బంగ్లాలో దశాబ్దాల విరామం తర్వాత ప్రధాన పారీ్టలకు మహిళా సారథులు లేకుండా జరిగిన తొలి ఎన్నికలు ఇవే కావడం విశేషం. గత 30 ఏళ్లకు పైగా షేక్‌ హసీనా నాయకత్వంలోని అవామీ లీగ్, బేగం ఖలీదా జియా సారథ్యంలోని బీఎన్‌పీ ప్రధాన పారీ్టలుగా తలపడుతూ వస్తున్నాయి. జియా అనారోగ్యంతో గత డిసెంబర్‌లో కన్నుమూయడం తెలిసిందే.  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
Bangladesh elections
Bangladesh Nationalist Party
BNP
Tarique Rahman
takes charge
new prime minister
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

హనీమూన్‌ ముగిసి సవాళ్ల దశలోకి!

హనీమూన్‌ ముగిసి సవాళ్ల దశలోకి!

బంగ్లాదేశ్‌లో అలా..  నేపాల్‌లో ఇలా

బంగ్లాదేశ్‌లో అలా.. నేపాల్‌లో ఇలా

నెదర్లాండ్స్‌కు యువ సారథి 

నెదర్లాండ్స్‌కు యువ సారథి 

మ్యూచువల్‌ ఫండ్స్‌.. ‘న్యూ ఆఫర్స్‌’..

మ్యూచువల్‌ ఫండ్స్‌.. ‘న్యూ ఆఫర్స్‌’..

మోదీ స్నేహ హస్తం.. బంగ్లాదేశ్ స్పందన

మోదీ స్నేహ హస్తం.. బంగ్లాదేశ్ స్పందన

బంగ్లాలో యూనస్‌ ఔట్‌.. భారత్‌ కీలక నిర్ణయం!

బంగ్లాలో యూనస్‌ ఔట్‌.. భారత్‌ కీలక నిర్ణయం!

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.