Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. International
  3. భారత్‌తో టెన్షన్‌ వేళ పాక్‌కు షాక్‌.. ఊహించని దెబ్బకొట్టిన బీఏల్‌ఏ
ADVERTISEMENT 

భారత్‌తో టెన్షన్‌ వేళ పాక్‌కు షాక్‌.. ఊహించని దెబ్బకొట్టిన బీఏల్‌ఏ

International Sakshi User Sakshi Sakshi Time May 4, 2025 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
Baloch.jpg

క్వెట్టా: పహల్గాం ఘటన తర్వాత భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ దాయాది దేశానికి మరో ఎదురుదెబ్బ తగిలింది. పాకిస్తాన్ సైన్యానికి బలోచ్ లిబరేషన్ ఆర్మీ నుంచి ఊహించని షాక్‌ తగిలింది. పాక్‌ సైన్యానికి సవాల్‌ విసురుతూ కీలకమైన మంగుచోర్ పట్టణాన్ని బీఎల్ఏ స్వాధీనం చేసుకుంది. ఇదే సమయంలో సైనిక, ప్రభుత్వ అధికారులను సైతం బందీలుగా పట్టుకుంది. అలాగే, బీఎల్‌ఏ బలగాలు.. క్వెట్టా నగరం దిశగా వెళ్తున్నట్టు తెలుస్తోంది.

వివరాల ప్రకారం.. ఇటీవలి కాలంలో పాకిస్తాన్‌ ప్రభుత్వం, సైన్యాన్ని టార్గెట్‌ చేసిన బీఎల్‌ఏ దాడులు చేసింది. ఇక, తాజాగా పాక్‌ సైన్యంపై తిరుగుబాటు చేసింది. పాకిస్తాన్ ప్రభుత్వం, సైన్యంపై బలోచ్ లిబరేషన్ ఆర్మీ సవాల్ విసిరింది. కీలకమైన మంగుచోర్ పట్టణాన్ని బీఎల్ఏ స్వాధీనం చేసుకుంది. బీఎల్ఏకు చెందిన అత్యంత క్రూరమైన, ప్రత్యేక శిక్షణ పొందిన 'డెత్ స్క్వాడ్' బృందం ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నట్లు సమాచారం. ఈ బృందం మంగుచోర్ పట్టణంలోకి చొచ్చుకెళ్లి, అక్కడ ఉన్న అన్ని ప్రభుత్వ కార్యాలయాలను, భద్రతా సంస్థల ప్రాంగణాలను తమ అదుపులోకి తీసుకుంది. ఇంతటితో ఆగకుండా, పట్టణంలో విధులు నిర్వహిస్తున్న కొంతమంది ఉన్నత స్థాయి సైనిక, ప్రభుత్వ అధికారులను సైతం బందీలుగా చేసుకుంది.

బలుచిస్తాన్‌ను ప్రత్యేక దేశంగా ప్రకటించాలని బీఎల్‌ఏ పోరాడుతోంది. ఈ క్రమంలో బీఎల్‌ఏ వరుస దాడులతో బలూచిస్తాన్‌పై పాకిస్తాన్‌ నియంత్రణ కోల్పోతోంది. ఇక, ఇప్పటికే బీఎల్‌ఏ దాడుల్లో వందలాదిమంది పాక్‌ సైనికులు మృతి చెందారు. కొన్ని రోజుల క్రితం పాక్‌ సైనికులు వెళుతున్న ట్రైన్‌ని హైజాక్‌ చేసిన బీఎల్‌ఏ.. పాక్‌ సైనికులను హతమార్చింది. కొద్ది రోజుల క్రితం బీఎల్‌ఏ పాక్‌ సైన్యం కాన్వాయ్‌పై ఐఈడీ దాడి చేయడంతో ఏకంగా 10 మంది పాకిస్తాన్ సైనికులు మరణించారు. ఈ పరిణామాల నేపథ్యంలో వారు ఎంత దూకుడుగా వ్యవహరించడానికి సిద్ధంగా ఉన్నారో పాక్ ప్రభుత్వానికి హెచ్చరికలు చేస్తున్నారు.

Baloch sarmachars are roaming openly through Mangocher city, seizing control of banks, as well as government and military assets. 

Certain handles suggest that government personnel have been forced to evacuate, and that several state institutions are no longer operational.… https://t.co/h9KewE0JZc pic.twitter.com/P4mdw3l6aG

— Char (@cqc_coffee_guns) May 3, 2025

ఇదిలా ఉండగా.. పాకిస్తాన్‌లోని నైరుతి ప్రాంతమే బలూచిస్తాన్‌. ఇది పాక్‌లో ఒక ప్రావిన్స్‌గా ఉంది. పాకిస్తాన్‌ మొత్తం విస్తీర్ణంలో 44 శాతం బలూచిస్తాన్ ఉంటుంది. విస్తీర్ణంపరంగా పాకిస్థాన్‌లో అతి పెద్ద ప్రావిన్స్‌గా బలూచిస్తాన్‌ ఉంది. అలాగే మిగతా అన్ని ప్రావిన్స్‌లో కెల్లా అతి తక్కువ జనాభా ఉన్న ప్రావిన్స్‌ కూడా బలూచిస్తానే. బలూచిస్తాన్‌లో చమురు, బొగ్గు, బంగారం, రాగి, సహజ వాయువు వనరులు పుష్కలంగా ఉన్నాయి. బ్రిటిష్‌ ఇండియాలో విలీనం చేయకముందువరకు బలూచిస్తాన్‌ స్వతంత్ర దేశంగానే ఉండేది. బ్రిటిష్‌ వారి నుంచి మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత దేశ విభజన తర్వాత పాకిస్తాన్‌లో భాగమైంది. ఆ తర్వాత కొంత కాలానికి స్వతంత్ర దేశం కోసం బలూచిస్తాన్‌ నుంచి డిమాండ్‌ పుట్టుకొచ్చింది.


అలాగే ఆ ప్రావిన్స్‌లో పాక్‌ సాగిస్తున్న మారణకాండ కూడా తిరుగుబాటుకు మరో కారణం. 2011 నుంచి 2024 జనవరి వరకు పాక్‌లో మొత్తం 10,078 మంది అదృశ్యం అయ్యారు. అదృశ్యమైనవారిలో 2,752 మంది బలూచ్‌ పౌరులే. 2001-2017 మధ్య 5,228 మంది బలూచ్‌ పౌరులు అదృశ్యం కావడం గమనార్హం. ప్రస్తుతం బీఎల్‌ఏ యాక్టివ్‌గా వేర్పాటువాద కార్యకలాపాలు సాగిస్తోంది. బలూచిస్తాన్‌ స్వతంత్ర దేశం కావాలనే డిమాండ్‌తో బీఎల్‌ఏ ఏర్పాటైంది. దశాబ్ద కాలంగా పాకిస్తాన్ ప్రభుత్వంపై తిరుగుబాటు చేస్తోంది. 

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
Balochistan
Baloch activists
Pakistan
quetta
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

పాక్‌కు ముచ్చెమటలు పట్టిస్తున్న ఇరాన్‌ కొత్త ఎత్తుగడ!

పాక్‌కు ముచ్చెమటలు పట్టిస్తున్న ఇరాన్‌ కొత్త ఎత్తుగడ!

మళ్లీ పాక్‌ కెప్టెన్‌గా బాబర్‌ ఆజం​..!

మళ్లీ పాక్‌ కెప్టెన్‌గా బాబర్‌ ఆజం​..!

బలూచిస్థాన్‌లో ఘోర ప్రమాదం.. 40 మంది దుర్మరణం

బలూచిస్థాన్‌లో ఘోర ప్రమాదం.. 40 మంది దుర్మరణం

జోరు కొనసాగించాలని... 

జోరు కొనసాగించాలని... 

బిత్తర పోయిన పాక్‌ ప్రధాని.. అమెరికాకు ఘోర అవమానం!

బిత్తర పోయిన పాక్‌ ప్రధాని.. అమెరికాకు ఘోర అవమానం!

భారత్‌తో యుద్ధానికైనా రెడీ.. పాక్ మంత్రి సంచలన ప్రకటన

భారత్‌తో యుద్ధానికైనా రెడీ.. పాక్ మంత్రి సంచలన ప్రకటన

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.