Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. International
  3. ఇరాన్‌ నూతన సారథి మొజ్తబా!
ADVERTISEMENT 

ఇరాన్‌ నూతన సారథి మొజ్తబా!

International Sakshi User Sakshi Sakshi Time Mar 5, 2026 Sakshi Read Time Read Time: 3 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
305675-01-02AAA.jpg

సుప్రీం నేతగా ఎన్నికైనట్టు వార్తలు 

ఖమేనీ రెండో కుమారునికే పట్టం 

నియామకంలో కీలకంగా ఐఆర్‌జీసీ

దుబాయ్‌: ఇరాన్‌ నూతన సుప్రీం నేతగా అయతొల్లా అలీ ఖమేనీ రెండో కుమారుడు మొజ్తబా హొసేనీ ఖమేనీ నియుక్తులైనట్టు తెలుస్తోంది. 88 మంది మతపెద్దలతో కూడిన కమిటీ (అసెంబ్లీ ఆఫ్‌ ఎక్స్‌పర్ట్స్‌) మంగళవారం ఆయనను ఎన్నుకున్నట్టు సమాచారం. విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ ఇరాన్‌ ఇంటర్నేషనల్‌ వార్తా సంస్థ బుధవారం ఈ మేరకు పేర్కొంది. దీన్ని ఇరాన్‌ అధికారికంగా ధ్రువీకరించాల్సి ఉంది. 

ఇరాన్‌ రాజధాని టెహ్రాన్‌పై గత శనివారం ఇజ్రాయెల్, అమెరికా జరిపిన భీకర దాడుల్లో ఖమేనీ మరణించడం తెలిసిందే. 56 ఏళ్ల మొజ్తబా ఆయన రెండో కుమారుడు. ఆయనకు పాలనానుభవమేదీ లేదు. ఇప్పటిదాకా తెర వెనకే తండ్రి తరఫున వ్యవహారాలను చక్కబెడుతూ వచ్చారు. వారసత్వ రాజకీయాలకు ప్రస్తుత ఇరాన్‌ పాలక వర్గం పూర్తిగా వ్యతిరేకమన్నది తెలిసిందే. 

ఈ నేపథ్యంలో మొజ్తబా ఎన్నికపై కమిటీలో పలువురు అభ్యంతరం వెలిబుచ్చినట్టు తెలుస్తోంది. అయితే ఇరాన్‌లో సర్వశక్తిమంతమైన ఇస్లామిక్‌ రివల్యూషనరీ గార్డ్‌ కార్ప్స్‌ (ఐఆర్‌జీసీ) తీవ్ర ఒత్తిడితో చివరికి ఆయన నియామకానికి పచ్చజెండా ఊపినట్టు ఇరాన్‌ ఇంటర్నేషనల్‌ పేర్కొంది. ఐఆర్‌జీసీపై మొజ్తబాకు పూర్తిస్థాయిలో పట్టుంది. దాని వ్యవహారాలను చాలా ఏళ్లుగా పూర్తిగా ఆయనే చూసుకుంటున్నట్టు చెబుతారు. వారసత్వ పాలనను వ్యతిరేకిస్తూ రాచరికాన్ని కూలదోసిన 1979 నాటి ఇస్లామిక విప్లవంలో ఖమేనీ కీలక పాత్ర పోషించడం తెలిసిందే. 

ఈ నేపథ్యంలో ఆయన కుమారుడు వారసత్వంగా పాలన పగ్గాలు చేపట్టడాన్ని ఇరాన్‌ ప్రజలు ఏ మేరకు ఆమోదిస్తారన్నది చూడాలి. ఇరాన్‌లో అధ్యక్షునిగా ఎవరున్నా సర్వం సహా అధికారాలు మాత్రం సుప్రీం నేత చెప్పుచేతల్లోనే ఉంటాయి. సైన్యంతో పాటు అత్యంత శక్తిమంతమైన ఐఆర్‌జీసీ కూడా పూర్తిగా ఆయన కనుసన్నల్లోనే పని చేస్తుంది. శనివారం నాటి దాడుల్లో 86 ఏళ్ల ఖమేనీతో పాటు మొజ్తబా భార్య జహ్రా హదద్‌ ఆదెల్, ఆయన చిన్న కుమారుడు కూడా ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత మొజ్తబా ఒక్కసారి కూడా బహిరంగంగా కని్పంచలేదు. ఇజ్రాయెల్, అమెరికా దాడుల నేపథ్యంలో అజ్ఞాతంలో ఉంటూ ఇరాన్‌ ప్రతి దాడులను పర్యవేక్షిస్తున్నట్టు చెబుతున్నారు. 
 
తెర వెనక ‘సుప్రీం’
మొజ్తబా. అయతొల్లా ఖమేనీ రెండో కుమారునిగానే తప్ప బయటి ప్రపంచానికి పెద్దగా పరిచయం లేని పేరు. అయితే తెర వెనక మాత్రం దశాబ్దాలుగా ఆయన పూర్తిస్థాయి అధికారాలు చలాయిస్తూ వస్తున్నట్టు చెబుతారు. ఒకరకంగా రాజకీయ, ఆర్థిక, భద్రతా వ్యవహారాలన్నింటినీ శాసించారంటారు. ఆ క్రమంలో ఖమేనీ వారసునిగా చాలా ఏళ్లుగా మొజ్తబా పేరే వినిపిస్తోంది. ఆయన్ను సుప్రీం నేతగా నియమిస్తున్నట్టు ఏడాది క్రితమే వార్తలొచ్చినా అప్పట్లో అది కార్యరూపం దాల్చలేదు. ఇరాన్‌ రాజకీయ వ్యవహారాల్లో మొజ్తబా ‘అదృశ్య శక్తి’గానే ఉంటూ వస్తున్నారు.

 


 

 ఆయన 1969లో మషాద్‌ నగరంలో జని్మంచారు. నాటి పాలకుడు మహమ్మద్‌ రెజా పహ్లావీ పాలనపై తన తండ్రి ఖమేనీ తిరుగుబాటును చూస్తూ పెరిగారు. కోమ్‌ నగరంలో షియా మత విద్య అభ్యసించినా క్లెరికల్‌ హోదాతో సరిపెట్టుకున్నారు. కీలకమైన ఆయతుల్లా హోదాకు చేరలేకపోయారు. పహ్లవీ పాలన అంతమయ్యాక తన తండ్రి ఖమేనీ ఇరాన్‌ రాజకీయాల్లో కీలక శక్తిగా ఎదుగుతున్న క్రమంలోనే మొజ్తబా సైన్యంలో చేరారు. ఇరాక్‌పై పోరులో ఐఆర్‌జీసీ విభాగమైన హబీబ్‌ ఇబ్న్‌ మజాహిర్‌ బెటాలియన్‌కు సారథ్యం వహించారు. అక్కణ్నుంచీ ఐఆర్‌జీసీతో ఆయన బంధం బలంగా పెనవేసుకుంటూ వచ్చింది. 

1989లో ఖమేనీ సుప్రీం లీడర్‌ అయ్యాక మొజ్తబా ప్రాధాన్యం విస్తరిస్తూ వచ్చింది. ముఖ్యంగా ఇరాన్‌ వ్యాపార వ్యవహారాలను పూర్తిగా ఆయనే నియంత్రిస్తూ వచ్చారు. ఆ క్రమంలో ఇంటా బయటా బిలియన్ల కొద్దీ డాలర్ల ఆస్తులు కూడబెట్టారంటారు. 2000 నాటి వికీలీక్స్‌ కూడా మొజ్తబానే ఇరాన్‌లో నిజమైన అధికార శక్తిగా పేర్కొంది. 2019లో ట్రంప్‌ తొలి హయాంలో మొజ్తబాపై అమెరికా కఠిన ఆంక్షలు విధించింది. 2005లో తనకు అనుకూలుడైన మతవాది అహ్మదీ నెజాద్‌ అధ్యక్ష ఎన్నికల్లో నెగ్గేలా మొజ్తబా పావులు కదిపినట్టు చెబుతారు.

సుప్రీం నేతగా ఎవరు ఎన్నికైనా అంతం చేసేస్తాం: ఇజ్రాయెల్‌ 
జెరూసలేం: ఇరాన్‌ సుప్రీం నేతగా ఎవరు ఎన్నికైనా తక్షణమే అంతం చేసేస్తామని ఇజ్రాయెల్‌ ప్రకటించింది. ఈ మేరకు సైన్యానికి ఇప్పటికే పూర్తిస్థాయి ఆదేశాలిచ్చినట్టు ఇజ్రాయెల్‌ రక్షణ మంత్రి కట్జ్‌ బుధవారం తెలిపారు. తమ అంతమే లక్ష్యంగా పని చేసే అలాంటి వారిని ఉపేక్షించే ప్రసక్తే ఉండబోదని పేర్కొన్నారు.  

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
iran israel war
iran
Supreme Leader of Iran
second son
Mojtaba Hosseini Khamenei
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

హర్ముజ్‌లో మళ్లీ అమెరికా బ్లాకేడ్‌.. ఇరాన్‌ సంచలన ప్రకటన

హర్ముజ్‌లో మళ్లీ అమెరికా బ్లాకేడ్‌.. ఇరాన్‌ సంచలన ప్రకటన

హర్ముజ్‌ జలసంధిపై కొత్త ఆధిపత్య పోరు!

హర్ముజ్‌ జలసంధిపై కొత్త ఆధిపత్య పోరు!

భీకరంగా మారిన అమెరికా-ఇరాన్‌ యుద్ధం!

భీకరంగా మారిన అమెరికా-ఇరాన్‌ యుద్ధం!

హార్మూజ్‌పై ఇరాన్ షాకింగ్‌ కామెంట్స్‌.. స్ట్రాంగ్‌ వార్నింగ్

హార్మూజ్‌పై ఇరాన్ షాకింగ్‌ కామెంట్స్‌.. స్ట్రాంగ్‌ వార్నింగ్

పాక్‌పై అమెరికా సెనేటర్ల నిప్పులు: లాడెన్‌ను దాచారంటూ ఆగ్రహం!

పాక్‌పై అమెరికా సెనేటర్ల నిప్పులు: లాడెన్‌ను దాచారంటూ ఆగ్రహం!

వాన్స్‌ను ముందుకు నెట్టి.. ట్రంప్‌ సేఫ్‌ గేమ్?

వాన్స్‌ను ముందుకు నెట్టి.. ట్రంప్‌ సేఫ్‌ గేమ్?

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.