Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. International
  3. Iron Dome: రక్షణ కవచాన్ని చీల్చుకుని మరీ..
ADVERTISEMENT 

Iron Dome: రక్షణ కవచాన్ని చీల్చుకుని మరీ..

International Sakshi User Sakshi Sakshi Time Jun 14, 2025 Sakshi Read Time Read Time: 3 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
Israel_Iron_Dome_Iran.jpg

దాడులు చేయడమే తప్ప.. దెబ్బ తినడం తెలియని ఇజ్రాయెల్‌కు మరోసారి చేదు అనుభవం ఎదురైంది. ఇజ్రాయెల్‌ ఆయుధాల పేరు చెబితే తొలుత గుర్తుకొచ్చేది దుర్భేద్యమైన ఐరన్‌ డోమ్‌(Iron dome). నిప్పుల వర్షంలా ప్రత్యర్థులు రాకెట్లు ప్రయోగిస్తున్నా.. ఉక్కు కవచంలా ఆ దాడులను అడ్డుకొంటుంది. అలాంటిది ఆ వ్యవస్థ మరోసారి విఫలమైందనే చర్చ నడుస్తోంది. 

ఇరాన్‌ అణు ముప్పును తప్పించేందుకు ఆపరేషన్‌ రైజింగ్‌ లయన్‌ చేపట్టినట్లు ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజిమన్‌ నెతన్యాహు శుక్రవారం ప్రకటించారు. ఈ క్రమంలో ఇరాన్‌పై 24 గంటల వ్యవధిలోనే రెండుసార్లు వైమానిక దాడులకు పాల్పడింది ఇజ్రాయెల్‌ సైన్యం(IDF). ప్రతిగా ఇరాన్‌ కూడా దాడులు జరిపింది. డ్రోన్లతో జరిపిన దాడులను ఐడీఎఫ్‌ తిప్పికొట్టగలిగింది కానీ.. క్షిపణుల దాడిలో మాత్రం దెబ్బ తింది. ఏకంగా రాజధాని టెల్‌ అవీవ్‌లో.. అదీ రక్షణ ప్రధాన కార్యాలయంపై దాడి జరగ్గా.. ఏ రక్షణ వ్యవస్థ అడ్డ్డుకోలేకపోయింది.

#BreakingNews 
Iron Dome Blasts Iranian Drone Out Of The Sky#Israel #Iran #IsraeliranWar #israil #Tehran #Teheran #TelAviv #deathtoamerica #irannucleardeal #AsadabadRegion #IronDome pic.twitter.com/wEV5FsM2qD

— Shekhar Pujari (@ShekharPujari2) June 14, 2025

ఆకాశంలో క్షిపణులు దూసుకొస్తున్నా ఇజ్రాయెల్‌ ప్రజలు ఏమాత్రం వణికిపోకుండా తమ పని తాము చేసుకుంటారు. ఎందుకంటే ఐరన్‌ డోమ్‌ ఉందనే ధైర్యం. కానీ, శనివారం భీకర యుద్ధంలో ఇరాన్‌ వందలాది బాలిస్టిక్‌ క్షిపణులను ఇజ్రాయెల్‌ పైకి ప్రయోగించింది. ఈ క్రమంలో రక్షణ వ్యవస్థ ఐరన్‌ డోమ్‌ను చీల్చుకుంటూ మరి మిస్సైల్స్‌ దూసుకెళ్లాయి. 

Last night strike on Tel aviv.

Follow us for for all latest updates #middleeast #riyadh #jeddah #IranNuclearSecrets #USA #Israel #SaudiArabia #UAE #iran #tehran #tahran #russia #ukraine#telAviv #MissileAttack #Irondome 

pic.twitter.com/sRvxNzvXPy

— Bharat - As it is (@NewBharatVoice) June 14, 2025

పెద్ద శబ్దంతో.. దూసుకొచ్చిన మిస్సైల్‌ సెకన్ల వ్యవధిలోనే భవనాన్ని తాకింది. ది టైమ్స్‌ ఈ 19 సెకన్ల వీడియోను ధృవీకరించింది. బ్యాక్‌గ్రౌండ్‌లో టెల్‌ అవీవ్‌కు తలమానికంగా భావించే కీర్యా ప్రాంతంను చూడొచ్చు. ఇరాన్‌ మిస్సైల్స్‌ను ఐరన్‌ డోమ్‌ అడ్డుకుంటుందని భావించినప్పటికీ అది జరగలేదు. మిస్సైల్‌ నేరుగా రక్షణ కార్యాలయాన్ని ఢీ కొట్టింది. అయితే అక్కడ జరిగిన నష్టం వివరాలు తెలియాల్సి ఉంది.

ఇజ్రాయెల్‌ ఐరన్‌ డోమ్‌ రక్షణ వ్యవస్థను వినియోగిస్తోంది. ఇతర భూభాగాల నుంచి రాకెట్లను ఇజ్రాయెల్‌పై ప్రయోగిస్తే రాడార్‌ వ్యవస్థ దాన్ని అధ్యయనం చేస్తుంది. అనంతరం క్షిపణులు వెళ్లి ఆ రాకెట్‌ను అడ్డుకుంటాయి. అయితే శనివారం నాడు నిమిషాల వ్యవధిలోనే వేలాది రాకెట్లను ఇరాన్‌ ప్రయోగించింది. కానీ, వాటిని అడ్డుకోవడంలో ఈ వ్యవస్థ పవిఫలమైంది. 

ఐరన్‌ డోమ్‌ ఉండేది అక్కడే..
ఇజ్రాయెల్‌ ఎయిర్‌ డిఫెన్స్‌ వ్యవస్థ ఒకే దశలో ఉండదు. ఇందులో మూడు దశలు ఉంటాయి. యారో-2, యారో-3 సిస్టమ్స్‌ను బాలిస్టిక్‌ క్షిపణులను అడ్డుకోవడానికి వినియోగిస్తారు. ఇవి ఆకాశంలోనే బాలిస్టిక్‌ క్షిపణులను పేల్చేసి.. వాటి శకలాల నుంచి ముప్పును దూరం చేస్తాయి. ఆపై డేవిడ్‌ స్లింగ్‌ మధ్యశ్రేణి రక్షణ వ్యవస్థగా పనిచేస్తుంది. 100-200 కిలోమీటర్ల స్వల్పశ్రేణి బాలిస్టిక్‌ క్షిపణులను ఎదుర్కోవడానికి వాడతారు. అంతేకాదు.. యుద్ధ విమానాలు, డ్రోన్లను కూల్చేయడంలోనూ దీనిదే కీలక పాత్ర.

ఇరాన్ పై విరుచుకుపడ్డ ఇజ్రాయెల్

ఇక.. చిట్టచివరి దశలో ఐరన్‌ డోమ్‌ ఉంటుంది. దీనిని ఇజ్రాయెల్‌ విస్తృతంగా వాడుతుంది. హమాస్‌, హెజ్‌బొల్లా ప్రయోగించిన వేల రాకెట్లు, వందల డ్రోన్లను కూల్చేసింది. ఇజ్రాయెల్‌కు అసలైన రక్షణ కవచంగా నిలిచింది. దూసుకొచ్చే ఒక్కో  ముప్పును పేల్చేయడానికి రెండు క్షిపణులను ఐరన్‌ డోమ్‌ ప్రయోగిస్తుంది. ఒక్కో క్షిపణిని అడ్డుకోవడానికి సుమారు 50 వేల డాలర్లు ఖర్చవుతుందని అంచనా. 

పని చేసేది ఎలాగంటే..
ఐరన్‌ డోమ్‌ను స్థానికంగా కిప్పాట్‌ బర్జెల్‌గా వ్యవహరిస్తారు. ఇది స్వల్పశ్రేణి ఆయుధాలను అడ్డుకొంటుంది. దీనిలో రాడార్‌, కంట్రోల్‌ సెంటర్‌, మిసైల్‌ బ్యాటరీ ఉంటాయి. రాడార్‌ తొలుత దూసుకొస్తున్న ముప్పును పసిగడుతుంది. అది ఎక్కడ నేలను తాకుతుందో అంచనావేస్తుంది. అక్కడ ఎటువంటి నిర్మాణాలు లేకపోతే.. వదిలేస్తుంది. అదే జనావాసాలు అయితే మాత్రం. రాకెట్‌ను ప్రయోగించి దానిని ధ్వంసం చేస్తుంది. ఈ వ్యవస్థ తయారీలో ఇజ్రాయెల్‌కు చెందిన ఎల్టా, ఎంప్రెస్ట్‌ సిస్టమ్‌, రఫెల్‌ సంస్థలు పనిచేశాయి.

సక్సెస్‌ రేటుపై అనుమానాలా?
2006లో హెజ్‌బొల్లా-ఇజ్రాయెల్‌ మధ్య ఘర్షణ చోటు చేసుకొంది. నాడు వేల రాకెట్లను ఆ సంస్థ టెల్‌ అవీవ్‌ పై ప్రయోగించింది. దీంతో భారీగా ప్రాణనష్టం చోటు చేసుకొంది. దీంతో ఇజ్రాయెల్‌ ఐరన్‌ డోమ్‌కు తయారీకి నిర్ణయించింది. దీనికి అమెరికా పూర్తిగా సాయం చేసింది. 2008 నాటికి టమిర్‌ క్షిపణులను పరీక్షించింది. 2009లో ప్రాథమిక ప్రయోగాలు పూర్తి చేసింది. 2011 నాటికి అందుబాటులోకి తెచ్చింది. ఐరన్‌ డోమ్‌ సక్సెస్‌ రేటు 90శాతానికి పైగానే ఉంది. ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థల్లో ఇదో అద్భుతం. అయితే 2023 అక్టోబర్‌ 7 నాటి హమాస్‌ దాడులను, తాజా ఇరాన్‌ క్షిపణి దాడులను అడ్డుకోవడంలో ఈ ఐరన్‌ డోమ్‌ వ్యవస్థ తడబడింది. 

ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
Tel Aviv
Operation Rising Lion
iran
Israel
Missile attack
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

హర్ముజ్‌లో మళ్లీ అమెరికా బ్లాకేడ్‌.. ఇరాన్‌ సంచలన ప్రకటన

హర్ముజ్‌లో మళ్లీ అమెరికా బ్లాకేడ్‌.. ఇరాన్‌ సంచలన ప్రకటన

హర్ముజ్‌ జలసంధిపై కొత్త ఆధిపత్య పోరు!

హర్ముజ్‌ జలసంధిపై కొత్త ఆధిపత్య పోరు!

భీకరంగా మారిన అమెరికా-ఇరాన్‌ యుద్ధం!

భీకరంగా మారిన అమెరికా-ఇరాన్‌ యుద్ధం!

పాక్‌పై అమెరికా సెనేటర్ల నిప్పులు: లాడెన్‌ను దాచారంటూ ఆగ్రహం!

పాక్‌పై అమెరికా సెనేటర్ల నిప్పులు: లాడెన్‌ను దాచారంటూ ఆగ్రహం!

వాన్స్‌ను ముందుకు నెట్టి.. ట్రంప్‌ సేఫ్‌ గేమ్?

వాన్స్‌ను ముందుకు నెట్టి.. ట్రంప్‌ సేఫ్‌ గేమ్?

అమెరికా డీల్‌ను నెతన్యాహు చెడగొడుతున్నారా?

అమెరికా డీల్‌ను నెతన్యాహు చెడగొడుతున్నారా?

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.