Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. International
  3. హీత్రూలో విమాన సేవలు పునరుద్ధరణ
ADVERTISEMENT 

హీత్రూలో విమాన సేవలు పునరుద్ధరణ

International Sakshi User Sakshi Sakshi Time Mar 23, 2025 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
LONDON.jpg

అగ్ని ప్రమాదంతో 18 గంటలు నిలిచిన రాకపోకలు

లండన్‌: అగ్ని ప్రమాదం కారణంగా దాదాపు 18 గంటలపాటు మూతబడిన లండన్‌లోని హీత్రూ విమానాశ్రయంలో విమానాల రాకపోకలు తిరిగి మొదలయ్యాయి. శనివారం ఉదయం నుంచి పూర్తి స్థాయిలో కార్యకలాపాలను పునరుద్ధరించినట్లు హీత్రూ విమానాశ్రయం ఒక ప్రకటనలో తెలిపింది. అయితే, విమానాల రాకపోకలకు కలిగిన అంతరాయం ప్రభావం మరికొన్ని రోజులపాటు కొనసాగుతుందని పేర్కొంది.

‘టెర్మినల్స్‌ వద్ద అదనంగా వందల సంఖ్యలో సిబ్బందిని సిద్ధంగా ఉంచాం. శనివారం అదనంగా మరో పది వేల మంది ప్రయాణికులను పంపించేందుకు విమానాల షెడ్యూల్‌ను తయారు చేశాం’అని హీత్రూ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ థామస్‌ వోల్డ్‌బై ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ‘ప్రమాద ఘటనకు ఎయిర్‌పోర్టు కారణం కాదనే విషయం గుర్తుంచుకోవాలి. అంతేకాదు, రోజులపాటు మూసివేయలేదు, హీత్రూ కేవలం కొన్ని గంటలు మూతబడిందంతే. బ్యాకప్‌ వ్యవస్థను కూడా అత్యవసరాల్లో మాత్రమే ఉపయోగపడేలా డిజైన్‌ చేశారు. అది కూడా మొత్తం విమానాశ్రయాన్ని నడిపేందుకు సరిపోదు. హీత్రూకు ఒక చిన్న నగరానికి సరిపడా విద్యుత్‌ అవసరమవుతుంది. ఇతర విమానాశ్రయాల్లోనూ గతంలో ఇటువంటి ఘటనలు చోటుచేసుకున్నాయి’అని ఆయన వివరించారు.

అయితే, ఎయిర్‌పోర్టుకు బయలుదేరే ముందు సంబంధిత ఎయిర్‌లైన్స్‌ నుంచి వివరాలను చెక్‌ చేసుకోవాలని ప్రయాణికులను కోరారు. శనివారం హీత్రూ నుంచి రాకపోకలు సాగించాల్సిన తమ 600 విమాన సర్వీసులకు గాను 85 శాతం మేర పునరుద్ధరించినట్లు బ్రిటిష్‌ ఎయిర్‌వేస్‌ తెలిపింది. అనూహ్యంగా చోటుచేసుకున్న ఘటన తర్వాత తిరిగి పూర్తిస్థాయిలో సేవలను పునరుద్ధరించడం ఎంతో క్లిష్టమైన వ్యవహారమని పేర్కొంది. హీత్రూకు 2 మైళ్ల దూరంలోని విద్యుత్‌ సబ్‌స్టేషన్‌లో గురువారం అర్ధరాత్రి చోటుచేసుకున్న భారీ అగ్ని ప్రమాదంతో విమానాశ్రయంలో కరెంటు సరఫరా నిలిచిపోయింది.

దీని కారణంగా 1,300కు పైగా విమానాలు రద్దు కాగా ఆ ప్రభావం 2 లక్షల మంది ప్రయాణికులపై పడింది. శుక్రవారం రాత్రికి స్వల్ప సంఖ్యలో విమానాల రాకపోకలను పునరుద్ధరించగలిగారు. అయితే, తమకు కలిగిన తీవ్ర అసౌకర్యంపై హీత్రూ విమానాశ్రయం అధికారులపై ప్రయాణికులు మండిపడుతున్నారు. అగ్ని ప్రమాదం వెనుక కుట్ర కోణం లేదంటున్న పోలీసులు..సబ్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విద్యుత్‌ పరికరాలపైనే దృష్టి పెట్టినట్లు తెలిపారు. ప్రపంచంలోనే అత్యంత రద్దీ కలిగిన విమానాశ్రయాల్లో ఒకటైన హీత్రూ నుంచి గతేడాది 8.39 కోట్ల మంది ప్రయాణికులు రాకపోకలు సాగించారు.  

ఎయిరిండియా సేవలు ప్రారంభం
న్యూఢిల్లీ: లండన్‌లోని హీత్రూ ఎయిర్‌పోర్టుకు విమానాల రాకపోకలను ప్రారంభించినట్లు ఎయిరిండియా శనివారం తెలిపింది. దేశ రాజధాని ఢిల్లీ నుంచి ఎయిరిండియాతోపాటు వర్జిన్‌ అట్లాంటిక్, బ్రిటిష్‌ ఎయిర్‌వేస్‌ విమానాలు శనివారం షెడ్యూల్‌ ప్రకారం నడిచాయి. శుక్రవారం హీత్రూ మూతబడటంతో దేశంలోని వివిధ నగరాల నుంచి పెద్ద సంఖ్యలో విమానాలు రద్దు కావడం తెల్సిందే. ఢిల్లీ విమానాశ్రయం నుంచి ఎయిరిండియా నిత్యం ఆరు విమానాలను హీత్రూకు నడుపుతోంది. బ్రిటిష్‌ ఎయిర్‌వేస్‌కు చెందిన మొత్తం 8 విమానాలు హీత్రూ ఢిల్లీ, ముంబైల మధ్య రాకపోకలు సాగిస్తుంటాయి. వర్జిన్‌ అట్లాంటిక్‌ కూడా ఢిల్లీ, ముంబై, బెంగళూరుల నుంచి హీత్రూకు ఐదు సర్విసులను నడుపుతోంది.  

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
Heathrow airport
airport
Fire Accident
Flights cancelled
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

పరవాడ ఫార్మా సిటీ అగ్నిప్రమాదంపై వైఎస్‌ జగన్‌ దిగ్భ్రాంతి

పరవాడ ఫార్మా సిటీ అగ్నిప్రమాదంపై వైఎస్‌ జగన్‌ దిగ్భ్రాంతి

లక్నో అగ్నిప్రమాదం: మరణంలోనూ వీడని స్నేహబంధం!

లక్నో అగ్నిప్రమాదం: మరణంలోనూ వీడని స్నేహబంధం!

లక్నో అగ్ని ప్రమాదం: భవనం వెనుక విస్తుపోయే నిజాలు!

లక్నో అగ్ని ప్రమాదం: భవనం వెనుక విస్తుపోయే నిజాలు!

అగ్నిప్రమాదంపై ప్రధాని విచారం.. ఎక్స్‌గ్రేషియా ప్రకటన

అగ్నిప్రమాదంపై ప్రధాని విచారం.. ఎక్స్‌గ్రేషియా ప్రకటన

కోచింగ్‌ సెంటర్‌లో ఘోర అగ్ని ప్రమాదం.. 14మంది మృతి

కోచింగ్‌ సెంటర్‌లో ఘోర అగ్ని ప్రమాదం.. 14మంది మృతి

ఆర్టీసీ ఎలక్ట్రిక్‌ బస్సు దగ్ధం

ఆర్టీసీ ఎలక్ట్రిక్‌ బస్సు దగ్ధం

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.