Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. International
  3. పని ఒత్తిడి.. పట్టరాని ఆవేశం 
ADVERTISEMENT 

పని ఒత్తిడి.. పట్టరాని ఆవేశం 

International Sakshi User Sakshi Sakshi Time Aug 24, 2025 Sakshi Read Time Read Time: 3 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
us-acc.jpg

తీవ్రస్థాయి నిర్ణయాలకు జైకొడుతున్న యువత

క్రీట్‌ (గ్రీస్‌): తొమ్మిది నెలల క్రితం అమెరికాలో జరిగిన ఒక హత్య మిగతా అన్ని నేరాల మాదిరిగా ఒకటి, రెండు రోజులు మీడియాలో పతాకశీర్షికలకెక్కి కనుమరుగుకాలేదు. హత్య చేసిన హంతకుడిని శిక్షించాలనే డిమాండ్లకు బదులు అతడిని కీర్తిస్తూ లక్షలాది మంది ప్రత్యక్షంగా, పరోక్షంగా మద్దతు పలకడం యావత్‌ ప్రపంచాన్ని విస్మయపరిచింది. హత్యను ఖండించాల్సిందిపోయి అతడికి బెయిల్‌ ఇవ్వాల్సిందేనని ఆన్‌లైన్‌లో ఒక ఉద్యమమే మొదలైంది. 

2024 డిసెంబర్‌లో అమెరికాలో అత్యంత సంపన్న ఆరోగ్యబీమా సంస్థ అయిన ‘యునైటెడ్‌ హెల్త్‌కేర్‌’సీఈఓ బ్రియాన్‌ థాంప్సన్‌ను షూట్‌చేసి చంపేసిన లిగి మాంజియోన్‌ అనే యువకుడి గురించే ఇదంతా. హత్య వంటి తీవ్రస్థాయి హింసను ఒక సగటు మనిషి తప్పుబట్టాల్సిందిపోయి వెనకేసుకురావడం వెనకున్న అంతరార్థం ఏమిటనే దానిపై ఇప్పుడు మానసిక వైద్యరంగంలో చర్చమొదలైంది. 

పనిచేసే చోట నెలకొన్న తీవ్రస్థాయి ఒత్తిడి వాతావరణమే యువత మానసిక అలసటకు గురై, పట్టరాని కోపం, అసహనం, ఉద్రేకం దిశగా పయనింపజేస్తోందని పలువురు మనోవిజ్ఞాన శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. థాంప్సన్‌ను హత్యచేయడం సబబేనని ఆన్‌లైన్‌లో నిర్వహించిన సర్వేలో 41 శాతం యువత వ్యాఖ్యానించడం మారుతున్న యువత ఆలోచన ధోరణులకు అద్దంపడుతోందని మనోవిజ్ఞాన శాస్త్రజ్ఞలు చెబుతున్నారు.  

అవినీతి, దురాశపై పట్టరాని కోపం 
తాము పనిచేసే సంస్థలో జరిగే అవినీతి, సంస్థ ఉన్నతాధికారులు, యాజమాన్యం దురాశను నేటి యువత ఏమాత్రం సహించట్లేదు. తీవ్రస్థాయి పని ఒత్తిడి, అనుక్షణం మారుతున్న సంస్థలో పని విధానాలు, ఆధునిక పని వాతావరణం సైతం యువతలో అసంతృప్తి జ్వాలలను రాజేస్తూ చివరకు వారిలో పట్టరాని ఆవేశాన్ని మరింత ఎగదోస్తోంది. అన్ని రంగాలకు సంబంధించి యువ ఉద్యోగులు, కార్మికుల మనసులో గూడు కట్టుకుంటున్న అసంతృప్తి తాలూకు వివరాలతో ఏపీఏ ‘సైకాలజీ ఆఫ్‌ వయలెన్స్‌’జర్నల్‌ ‘హింస్మాతక పిడివాదం’పేరిట ప్రత్యేక సంచికను వెలువర్చింది. గ్రీస్‌లోని క్రెటే విశ్వవిద్యాలయంలోని ప్రొఫెసర్‌ అలెక్సియోస్‌ అర్వాంటిస్‌ సారథ్యంలో ఈ పరిశోధన జరిగింది.  

ఎన్నింటికో దారి తీస్తున్న మానసిక అలసట 
పనిప్రదేశంలో విపరీతమైన ఒత్తిడి కారణంగా మానసిక అలసట పెరిగిపోయి చివరకు భ యం, బాధ, అసంతృప్తి, అసహనం కట్టలు తెంచుకుంటున్నాయి. తమకు అన్యాయం జరి గిపోతోందనే భావన యువతలో పెరిగిపోతోంది. దీంతో అన్యాయానికి హింసతోనే ముగింపు పలకాలనే ధోరణి ఎక్కువవుతోంది. అధ్యయనంలో భాగంగా పరిశోధకులు వందలాది మంది యువ ఉద్యోగుల రోజువారీ మానసిక స్థితిని అంచనావేశారు. మానసిక అలసట, మానసిక స్థితి, హింసాత్మక ఆలోచన స్థాయిలను క్రీడీకరించారు. అతిగా మానసికంగా అలసిపోయినప్పుడు తీవ్రస్థాయి ఆలోచనలు మంచివేనన్న భావన వారిలో పెరిగిపోతోంది. అన్యాయాన్ని అంతమొందించాలంటే హింసే అత్యుత్తమ మార్గమని వాళ్లు భావిస్తున్నారు. ప్రతిరోజూ ఇలాగే మానసిక అలసటకు గురైతే ఆ స్థాయిలో వారిలో బాధ ఎక్కువవుతోంది. వీటిని మూడురకాల సిద్ధాంతాలతో వర్గీకరించవచ్చని మానసిక నిపుణులు చెబుతున్నారు. 

సాధారణ బాధ సైతం... 
సాధారణ బడలిక సిద్ధాంతం ప్రకారం ప్రతిరోజూ అతిపనితో విసిగిపోయిన సందర్భాల్లో ప్రతికూల ఆలోచనలు వెల్లువెత్తుతాయి. ఇక రెండోసిద్ధాంతం ప్రకారం.. చేస్తున్న పనిలో సంతృప్తిలోపించినప్పుడు సైతం మానసిక అలసట, విసుగు పెరుగుతాయి. ఇక మూడో సిద్ధాంతం ప్రకారం తాము ఎంతగా కష్టపడుతున్నా సరైన ప్రాధాన్యత, ఉన్నతాధికారుల నుంచి ప్రశంస దక్కని సందర్భాల్లోనూ మానసి అలసట ఎక్కువై చివరకు హింసాత్మక ఆలోచనలు ఆ యువ ఉద్యోగులను చుట్టుముడుతున్నాయి. ఈ మూడు రకాల సందర్భాల్లోనూ మెజారిటీ యువత తమ వృత్తిలో తమకు సరైన గౌరవం దక్కనప్పుడు, తమ శ్రమకు తగ్గ ఫలితం లభించనప్పుడు తమకు నచి్చన మార్గంలో సంతృప్తి సాధించేందుకు హింసాత్మక ఆలోచనలకు జై కొడుతున్నారని సర్వేలో తేలింది.

వ్యవస్థీకృత మార్పుతో.. 
ఈ పెడపోకడలపై బహుళజాతి అంతర్జాతీయ సంస్థలు తక్షణం మేల్కొనాలి. సంస్థ అభ్యున్నతి కోసం అవిశ్రాంతంగా కష్టపడుతున్న ఉద్యోగులకు తగు ప్రాధాన్యతనిస్తే తోటి ఉద్యోగుల్లో సైతం సంస్థ పట్ల గౌరవం, వారిలో అంకితభావం అనూహ్యంగా పెరుగుతాయి. అప్పుడు ఇలాంటి హింసాత్మక ఆలోచనల వైపు యువత అస్సలు మళ్లదు. అప్పుడు మానసిక అలసట అనే ఊసే ఉండదు. పనిచేసే చోట పారదర్శకత కనిపించేలా చేయడం సంస్థల విద్యుక్తధర్మం. 

తాము ఎంతగా సంస్థ కోసం కష్టపడినా గౌరవం దక్కట్లేదని భావించే వారిని మేనేజర్లు వీలైనంత త్వరగా గుర్తించి దిద్దుబాటు చర్యలు చేపడితే మొత్తం సంస్థలోనే ప్రతికూలవాతావరణం అనేది మటుమాయం అవుతుంది. ఆ మేరకు ఉన్నతాధికారులు, మేనేజర్లకు సైతం శిక్షణనివ్వాలి. కేవలం సంస్థలో ఉన్నప్పుడు ఉద్యోగి పడే ఆవేదనగా దీనిని తేలిగ్గా తీసుకుంటే మొత్తం సమాజంపైనే ఇది చాన్నాళ్ల తర్వాత ప్రతికూల ప్రభావం చూపుతుంది. 

సంస్థల దురాశపై ధ్వజమెత్తాలనే పెడపోకడలు ఎక్కువై విప్లవవాదం మరింతగా సమాజంలో వేళ్లూనుకుంటుంది. మానసిక అలసటకు గురైన ఉద్యోగి తమ సంస్థ నుంచే సాంత్వన కోరుకుంటాడు. అక్కడి అది దక్కని నాడు సంస్థ మాత్రమే కాదు సమాజం సైతం దాని దుష్ప్రభావాలను ఎదుర్కోక తప్పదని మనోవిజ్ఞాన శాస్త్రజ్ఞులు హెచ్చరిస్తున్నారు.  

హింసాత్మకం.. సాధారణం 
తమ పరిశోధనపై వైద్యనిపుణులు మరో స్పష్టతనిచ్చారు. ‘‘యువతలో మానసిక అలసటకు గురైన ప్రతి ఒక్కరూ ఇలా హింసాత్మక మార్గంలో పయనిస్తున్నారని మేం చెప్పట్లేదు. కానీ ఆ దిశగా అడుగులేసే అవకాశాలు బాగా పెరుగుతున్నాయనేది సుస్పష్టం. ఇది చివరకు హింసాత్మకంగా వ్యవహరించం తప్పు కాదు అనే స్థాయికి యువత ఆలోచన ధోరణి నెమ్మది నెమ్మదిగా మారుతోంది. ఇది అత్యంత ఆందోళనకరం’’అని నిపుణులు ఆవేదన వ్యక్తంచేశారు. ‘‘నేడు ప్రతి నలుగురిలో ముగ్గురు అతి పనిఒత్తిడి బారిన పడుతున్నారు. దీంతో శ్రామికలోకంలో మెజారిటీ యువత తమకు తెలీకుండానే అతివాదానికి మద్దతుపలుకుతోంది.

 అధిక పనిఒత్తిడి కారణంగా మానసికఅలసటకు గురైన వారిలో చాలా మందిలో అసహనం పెరిగిపోతోంది. దీంతో విధ్వంసకర ఆలోచనలు మొగ్గ తొడుగుతున్నాయి. ఇవి ప్రజాస్వామ్యయువత విలువలు, చక్కటి, సుహృద్భావ పనివాతావరణానికి గొడ్డలిపెట్టుగా మారుతున్నాయి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చూస్తే పనిఒత్తిడి కారణంగా హింసాత్మక ఘటనలు చాలా అత్యల్పస్థాయిలో ఉన్నప్పటికీ వాటి దు్రష్పభావాలు మాత్రం స్థిరంగా పెరుగుతూ పోతున్నాయి’’అని మనోవిజ్ఞాన శాస్త్ర నిపుణులు అభిప్రాయపడ్డారు.  

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
CEO
shoot
stress
youth
Mental
online survey
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

అడవి ఆమెను సీఈఓ చేసింది...

అడవి ఆమెను సీఈఓ చేసింది...

80 గంటల పని.. అమెజాన్‌ అనుభవాలు చెప్పిన సీఈవో!

80 గంటల పని.. అమెజాన్‌ అనుభవాలు చెప్పిన సీఈవో!

సాఫ్ట్‌వేర్ ఉద్యోగులకు సీఈవో వింత గిఫ్ట్‌లు

సాఫ్ట్‌వేర్ ఉద్యోగులకు సీఈవో వింత గిఫ్ట్‌లు

కొత్త డేటింగ్ పఫర్ ఫిషింగ్ డేటింగ్ అంటే ఏంటో తెలుసా ?

కొత్త డేటింగ్ పఫర్ ఫిషింగ్ డేటింగ్ అంటే ఏంటో తెలుసా ?

పాకిస్థాన్‌లో కాల్పులు.. పదేళ్ల విదేశీ చిన్నారి మృతి

పాకిస్థాన్‌లో కాల్పులు.. పదేళ్ల విదేశీ చిన్నారి మృతి

‘మెటాలో ఇక భారీ తొలగింపులు ఉండకపోవచ్చు’

‘మెటాలో ఇక భారీ తొలగింపులు ఉండకపోవచ్చు’

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.