Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
search Subscribe Subscribe Epaper icon ఈ-పేపర్ Live TV లైవ్ టీవీ Live TV లైవ్ టీవీ
download app యాప్ download app Download App
మమ్మల్ని అనుసరించండి
  • facebook
  • x
  • instagram
  • youtube
  • whatsapp
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫొటోలు
  • వీడియోలు
  • close logo
  • search
    Epaper icon ఈ-పేపర్ Live TV లైవ్ టీవీ download app యాప్

    విభాగాలు

  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • మమ్మల్ని అనుసరించండి

    facebook x instagram youtube whatsapp whatsapp whatsapp
  • Sakshi Search
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV

Breadcrumb

  1. Home
  2. International
  3. 10,500 ఏళ్ల కిందటే ఇళ్లు.. జర్మనీలో షాకిస్తున్న ఆధారాలు!
ADVERTISEMENT

10,500 ఏళ్ల కిందటే ఇళ్లు.. జర్మనీలో షాకిస్తున్న ఆధారాలు!

International Sakshi User Sakshi Sakshi Time Oct 6, 2026 10:56 AM IST Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Google
germany.jpg

జర్మనీలోని ఓ సరస్సులో ఇటీవల బయటపడిన 10,500 ఏళ్ల నాటి చెక్క అవశేషాలు సంచలన విషయాలను వెల్లడిస్తున్నాయి. ఇవి యూరప్‌లో మానవులు శాశ్వత నివాసాలు ఏర్పరచుకున్న కాలంపై ఇప్పటివరకు ఉన్న అంచనాలను తలకిందులు చేసే అవకాశం ఉందని పురావస్తు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సరస్సులోని సుమారు 65 అడుగుల లోతులో అత్యంత భద్రంగా ఉన్న చెక్క దిమ్మెలు, పలకలను పరిశోధకులు గుర్తించారు. వాటిపై కనిపించిన కోత గుర్తులు మానవులు రూపొందించి ఉండొచ్చనే ఆధారాలను అందిస్తున్నాయి.

సరస్సులో 10,500 ఏళ్ల నాటి ఆనవాళ్లు
జర్మనీలోని లేక్ అరెండ్‌సీలో ఈ పురాతన చెక్క అవశేషాలు బయటపడ్డాయి. సాక్సోనీ-అన్హాల్ట్ రాష్ట్ర వారసత్వ నిర్వహణ, పురావస్తు కార్యాలయానికి చెందిన పరిశోధకులు వీటిని గుర్తించారు. ఆ కాలానికి చెందిన రాతి పనిముట్లు, జంతువుల ఎముకలు సాధారణంగా లభిస్తుంటాయని, అయితే ఇంత పురాతన కాలానికి చెందిన చెక్క అవశేషాలు చాలా అరుదుగా లభ్యమవుతాయని పురావస్తు శాస్త్రవేత్త హరాల్డ్ మెల్లర్ తెలిపారు. ఈ చెక్కలు అప్పటి వేటగాళ్లు-సేకరణదారుల జీవన విధానంపై కొత్త ఆధారాలను అందించవచ్చని పరిశోధకులు భావిస్తున్నారు.

ఐదు అడుగుల చెక్క దిమ్మె
సరస్సులోని అవశేషాలు సుమారు 65.6 అడుగుల లోతులో పలుచటి మట్టి పొర కింద ఉండటంతో ఇంతకాలం దాదాపు చెక్కుచెదరకుండా ఉన్నాయి. అక్కడ ఐదు అడుగులకు పైగా పొడవున్న ఓ చెక్క దిమ్మెతో పాటు, 4.3 అడుగుల వరకు పొడవున్న చెక్క పలకలను పరిశోధకులు వెలికితీశారు. దిమ్మెపై చెట్లను నరికిన గుర్తులు కనిపించాయి. పలకల ఆకృతి కూడా అవి సహజంగా విరిగిన చెక్క ముక్కలు కాకుండా, మనుషులు మార్చి ఉపయోగించి ఉండవచ్చనే అనుమానాలకు బలం చేకూరుస్తోంది.

భవన నిర్మాణానికి ఉపయోగించారా?
ఈ చెక్కలను అప్పటి వేటగాళ్లు, సేకరణదారులు తయారు చేసి ఉండొచ్చని పరిశోధకులు భావిస్తున్నారు. అవి నిజంగా శాశ్వత నిర్మాణాల్లో ఉపయోగించినవిగా నిర్ధారణ అయితే, మధ్య జర్మనీలోని మెసోలిథిక్ కాలానికి సంబంధించి ఇప్పటివరకు ఉన్న అవగాహనలో కీలక మార్పు రావచ్చు. ఇప్పటివరకు ఆ కాలంలో నిర్మాణాలకు సంబంధించిన ఆధారాలు ప్రధానంగా నేలపై కనిపించే రంగు మార్పులు లేదా మట్టి ఆనవాళ్ల రూపంలోనే గుర్తించారు. తాజాగా లభించిన చెక్క అవశేషాలు మాత్రం మరింత ప్రత్యక్ష ఆధారాలను అందిస్తున్నాయి.

రైతులకంటే ముందే శాశ్వత నివాసాలా?
మెసోలిథిక్ కాలం పాలియోలిథిక్ వేటగాళ్లు, సేకరణదారుల జీవన విధానానికి, తరువాతి నియోలిథిక్ రైతుల సమాజాలకు మధ్య ఉన్న మార్పు దశగా పరిగణిస్తారు. సాధారణంగా మధ్య యూరప్‌లో శాశ్వత నివాసాలు, వ్యవసాయ ఆధారిత సాంస్కృతిక భూభాగాల ఏర్పాటును సుమారు క్రీస్తుపూర్వం 5,500 ప్రాంతంలో వచ్చిన తొలి నియోలిథిక్ రైతులతో అనుసంధానిస్తారు. అయితే లేక్ అరెండ్‌సీలో లభించిన చెక్కలు శాశ్వత నిర్మాణాలకు చెందినవిగా తేలితే, అలాంటి నిర్మాణాలు అప్పటికే 10,500 ఏళ్ల క్రితమే ఉండే అవకాశం కనిపిస్తోంది. అంటే ఇప్పటివరకు భావించిన దానికంటే సుమారు 3,000 ఏళ్ల ముందే అవి ఏర్పడి ఉండొచ్చు.

పురాతన మానవ సమాజంపై కొత్త ప్రశ్నలు
శాశ్వత భవనాలు లేదా ఎక్కువ కాలం ఉపయోగించిన నివాస ప్రాంతాలు 10,500 ఏళ్ల క్రితమే ఉన్నట్లు నిర్ధారణ అయితే, అప్పటి వేటగాళ్లు, సేకరణదారుల గురించి ఉన్న ప్రస్తుత అవగాహన మారుతుందని ప్రాజెక్టు మేనేజర్ మార్సెల్ వైస్ తెలిపారు. అంతేకాకుండా ఆధునిక సాంస్కృతిక భూభాగాల మూలాలను అర్థం చేసుకునే విధానంపైనా ఈ పరిశోధన ప్రభావం చూపవచ్చని పేర్కొన్నారు. అయితే చెక్క అవశేషాలు నిజంగా ఏ నిర్మాణానికి చెందినవో, వాటిని ఎవరు, ఏ ప్రయోజనం కోసం ఉపయోగించారో నిర్ధారించేందుకు మరిన్ని పరిశోధనలు అవసరమన్నారు.

ఇదీ చదవండి: నోబెల్ బరిలో ట్రంప్‌కు షాక్‌.. అనూహ్యంగా తెరపైకి ఐఎస్‌ఎస్‌!

ADVERTISEMENT
ADVERTISEMENT
tags Tags:
german
lake
history
Human
homes
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

ఆరావళిలో వినిపించిన మృదుల రవళి...

ఆరావళిలో వినిపించిన మృదుల రవళి...

మానవాభివృద్ధి లేని ఆర్థిక వృద్ధి!

మానవాభివృద్ధి లేని ఆర్థిక వృద్ధి!

కూతురును కాపాడేందుకు తండ్రి పోరాటం.. చివరకు ఇద్దరూ!

కూతురును కాపాడేందుకు తండ్రి పోరాటం.. చివరకు ఇద్దరూ!

మిగతా ఖనిజాలకు లేనిది.. బంగారానికే ఎందుకు?

మిగతా ఖనిజాలకు లేనిది.. బంగారానికే ఎందుకు?

అక్టోబర్‌ 31 రాత్రి ఆత్మలు వస్తాయా? ఈ నమ్మకం వెనుక కథేంటి?

అక్టోబర్‌ 31 రాత్రి ఆత్మలు వస్తాయా? ఈ నమ్మకం వెనుక కథేంటి?

భూసారంతోనే బుద్ధి బలం!

భూసారంతోనే బుద్ధి బలం!

మరిన్ని వార్తలు

13న ప్రపంచం అంతం? 1960లోనే వెల్లడైన భవిష్యవాణి!

13న ప్రపంచం అంతం? 1960లోనే వెల్లడైన భవిష్యవాణి!

Pakistan: ప్రముఖ టీవీ యాంకర్ దారుణ హత్య!

Pakistan: ప్రముఖ టీవీ యాంకర్ దారుణ హత్య!

షేక్‌ హసీనా సంచలన నిర్ణయం.. బంగ్లాకు పయనం

షేక్‌ హసీనా సంచలన నిర్ణయం.. బంగ్లాకు పయనం

Maya Jama: ‘లవ్‌ ఐలాండ్‌’కు గుడ్‌బై.. కొత్త ప్రయాణానికి అడుగులు...

Maya Jama: ‘లవ్‌ ఐలాండ్‌’కు గుడ్‌బై.. కొత్త ప్రయాణానికి అడుగులు...

yemen: 19 మంది భారతీయులకు విముక్తి.. స్వదేశానికి పయనం!

yemen: 19 మంది భారతీయులకు విముక్తి.. స్వదేశానికి పయనం!

కూలీగా మొదలై.. వందల మందికి బాస్‌గా ఎదిగి!

కూలీగా మొదలై.. వందల మందికి బాస్‌గా ఎదిగి!

  

ADVERTISEMENT
 
 
ADVERTISEMENT
ADVERTISEMENT
 
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Jagati Publications Limited.
Powered by Yodasoft