Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Guest Columns
  3. స్వయంసేవా మార్గ నిర్మాత
ADVERTISEMENT 

స్వయంసేవా మార్గ నిర్మాత

Guest Columns Sakshi User Sakshi Sakshi Time Mar 30, 2025 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
Keshav-Baliram-Hedgewar.jpg

సంద‌ర్భం

రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌ (ఆర్‌ఎస్‌ఎస్‌) 1925లో విజయ దశమి పర్వదినాన నాగపూర్‌లో స్థాపితమయ్యింది. నేడు శత వసంతాలు జరుపుకొంటున్న ఈ సంస్థను డాక్టర్‌ కేశవ బలిరామ్‌ హెడ్గేవార్‌ (Keshav Baliram Hedgewar) నాగపూర్‌లో స్థాపించారు. ఇదే నగరంలో ఆయన 1889 ఉగాది రోజున జన్మించారు. ప్లేగ్‌ వ్యాధి వల్ల చిన్నతనంలోనే  తల్లితండ్రులను కోల్పోయి వీధిన పడ్డారు. అయినా కష్టపడి చదివారు. నాగపూర్‌లోని నీల్‌ సిటీ స్కూల్లో 9వ తరగతి చదువుతున్నప్పుడు ఒక బ్రిటిష్‌ అధికారి స్కూల్‌ పర్యవేక్షణకు వచ్చినప్పుడు చిన్నారి కేశవుడు ‘వందేమాతరం’ అని నినదించాడు. దీంతో కేశవుని స్కూల్‌ నుంచి బహిష్కరించారు. తర్వాత యవత్‌మాల్‌లోని రాష్ట్రీయ విద్యా లయంలో చేరి పాఠశాల విద్యను పూర్తి చేశారు.

మాతృభూమిని విదేశీయుల కబంధ హస్తాల నుంచి తొలగించడానికి కలకత్తాలోని సాయుధ విప్లవకారులతో కలిసి పని చేయాలని భావించి 1910లో కలకత్తా (Kolkata) మెడికల్‌ కళాశాలలో చేరారు. విప్లవకారులైన శ్యామ్‌ సుందర చక్రవర్తి, మోతీలాల్‌ ఘోష్‌ వంటి వారితో కలిసి ‘అనుశీలన సమితి’ ద్వారా దేశ స్వాతంత్య్రానికి కృషి చేశారు. 1914లో మెడికల్‌ విద్యను పూర్తి చేసిన తర్వాత బ్యాంకాక్‌లో మంచి ఉద్యోగానికి ఎంపికయ్యారు. అయితే జీవితాన్ని దేశ సేవకే అంకితం చేయాలని అప్పటికే నిర్ణయించుకున్నందు వలన ఆ ఉద్యోగాన్ని తిరస్కరించారు.

నాగపూర్‌కు తిరిగి వచ్చిన తర్వాత లోకమాన్య తిలక్‌ స్థాపించిన ‘రాష్ట్ర సేవ మండల్‌’లో చేరి శివాజీ జయంతి, గణేష్‌ ఉత్సవం, శాస్త్ర పూజ, సంక్రాంతి మహోత్సవం వంటి కార్యక్రమాలను ఉత్సాహంతో నిర్వహించేవారు. ఈ సందర్భంగా ఆ కార్యక్రమాల్లో ఆయన చేసిన ప్రసంగాలకు ఆంగ్ల ప్రభుత్వం రాజద్రోహాన్ని మోపి ఒక సంవత్సరం కారాగార శిక్ష విధించింది. అదేవిధంగా 1930లో మహాత్మా గాంధీ పిలుపునిచ్చిన సత్యాగ్రహానికి మద్దతుగా పాల్గొని తొమ్మిది నెలల జైలు జీవితాన్ని గడిపారు. మహాత్మా గాంధీ, మదన్‌ మోహన్‌ మాలవీయ, నేతాజీ సుభాష్‌ చంద్రబోస్, అప్పాజీ జోషీ వంటి నాయకులను కలిసి సంఘ కార్యం ఆవశ్యకతను వారికి తెలియజేశారు. ‘సంఘ’ శాఖను వీక్షించిన మహాత్మా గాంధీ (Mahatma Gandhi) డాక్టర్‌జీతో ‘మీరు నిజంగానే ఒక అద్భుతమైన సంస్థను నిర్మించారు. నేను స్వయంగా చేద్దామనుకుంటున్న పనిని మీరు నిశ్శబ్దంగానే చేసేశారు’ అని పేర్కొన్నారు.  

కాళ్లకు స్థానికంగా కుట్టిన చెప్పులు, ఒంటిపై సాధారణమైన ధోవతి, చొక్కా, కాలర్‌ ఉన్న కోటు, నెత్తి మీద ఎత్తుగా ఉండే టోపీ ఆయన వేషధారణ. తాను స్వీకరించిన మహాకార్యానికి సంపూర్ణంగా జీవితాన్ని అంకితం చేసేందుకు ఆయన ఆజన్మ బ్రహ్మచర్యాన్ని స్వీకరించారు. ఆసేతు హిమాచలం సంఘ కార్యాన్ని విస్తరింప చేయడానికి ప్రయాణం చేసేవారు. ఈ విధంగా చేస్తూ ఆయన అనారోగ్యం బారిన పడి 1940 జూన్‌ 21వ తేదీన యాభై ఒక్క సంవత్సరాల వయసులోనే అంతిమ శ్వాస విడిచారు. 

చ‌ద‌వండి: ప్ర‌జ‌లు భ‌య‌ప‌డే ప‌రిస్థితి క‌ల్పిస్తే దిక్కెవ‌రు?

ఆయన స్థాపించిన ఆర్‌ఎస్‌ఎస్‌ (RSS) నేడు దేశ విదేశాలలో విస్తరించింది. ఎటువంటి సభ్యత్వ నమోదూ లేకుండా దాదాపు కోటి మంది స్వయం సేవకులను, నలభై అయిదు లక్షల సంఘ శాఖలను, యాభై అనుబంధ సంఘాలను, ఐదు వేల మంది పూర్తి సమయ స్వయం సేవకులను (ప్రచారకులు) ఆర్‌ఎస్‌ఎస్‌ కలిగి ఉంది. భారతదేశంలోనే కాక అమెరికా, ఇంగ్లండ్, జపాన్, జర్మనీ, ఫ్రాన్స్‌ వంటి దాదాపు 50 దేశాలలో వివిధ రకాల పేర్లతో సేవా కార్యక్రమాలను ఆర్‌ఎస్‌ఎస్‌ నిర్వహిస్తోంది.

- ప్రొఫెస‌ర్ వై.వి. రామిరెడ్డి 
శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్‌
(మార్చి 30న‌ ఆర్‌ఎస్‌ఎస్‌ వ్యవస్థాపకులు హెడ్గేవార్‌ జయంతి)

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
rashtriya swayamsevak sangh
RSS
hindutva
Birth anniversary
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

రాజ్‌నాథ్‌ నివాసంలో రహస్య భేటీ?

రాజ్‌నాథ్‌ నివాసంలో రహస్య భేటీ?

ఆస్తులు బ‌య‌ట‌పెట్టండి.. దాచ‌డానికి ఏమీ లేదు

ఆస్తులు బ‌య‌ట‌పెట్టండి.. దాచ‌డానికి ఏమీ లేదు

సువేందు స్కెచ్‌కు ఆర్‌ఎస్‌ఎస్‌ బ్రేక్‌!

సువేందు స్కెచ్‌కు ఆర్‌ఎస్‌ఎస్‌ బ్రేక్‌!

కరుణానిధి జయంతి వేళ స్టాలిన్ భావోద్వేగం

కరుణానిధి జయంతి వేళ స్టాలిన్ భావోద్వేగం

ఏయూలో టెన్షన్.. టెన్షన్‌

ఏయూలో టెన్షన్.. టెన్షన్‌

సంఘ్ కోరితే తప్పుకుంటా.. RSS చీఫ్ కీలక వ్యాఖ్యలు

సంఘ్ కోరితే తప్పుకుంటా.. RSS చీఫ్ కీలక వ్యాఖ్యలు

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.