Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Guest Columns
  3. ప్రజలే బుద్ధి చెబుతారు!
ADVERTISEMENT 

ప్రజలే బుద్ధి చెబుతారు!

Guest Columns Sakshi User Sakshi Sakshi Time Sep 6, 2024 Sakshi Read Time Read Time: 3 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
floods_0.jpg

అభిప్రాయం

భారతదేశం నదీ నాగరికతల దేశం. అసలు ఇక్కడ నదులను దేవతలుగా కొలవడం సంస్కృతిలో భాగం. ఈ సంస్కృతికి మూల విరాట్టులు ఆదివాసీలూ, దళితులే. అడవులు, నదీతీరాలు వీరి ఆవాసాలుగా ఉన్నప్పుడు వాటికి ఏ ఇబ్బందులూ కలగలేదు. ఎప్పుడైతే పారిశ్రామిక విప్లవం వచ్చి, వస్తూత్పత్తి వాణిజ్య స్థాయిలో అవ్వడం ప్రారంభమయ్యిందో... అప్పుడే ప్రకృతి వనరులను విచక్షణా రహితంగా దోచుకోవడం ప్రారంభమయ్యింది. 

పట్టణాలు, నగరాలు విస్తరించాయి. చివరికి నదులు, కాలువలు, చెరువులు, అడవులు అన్నింటినీ ఆధిపత్య వర్గాలవారు కబ్జా చేశారు. వీరి చేతుల్లోనే భూమి, మూలధనం కేంద్రీ కృతమై ఉన్నందున వీరే పరిశ్రమలు, ఇతర వ్యాపారాలను స్థాపించి పేరాశతో డబ్బు, అధికార దర్పాలతో కబ్జాలకు తెరలేపారు. తత్ఫలితమే విజయవాడ, ఖమ్మం వంటి చోట్ల ఇవ్వాళ నదులు లేదా ఏరులు సృష్టించిన విలయాలు! 

ఈ నేపథ్యంలో విజయవాడను చుట్టుముట్టిన వరదలను చూడాలి. ఇక్కడ ప్రజల కడగండ్లకు ప్రధాన కారణం బుడమేరు కాలువ/ వాగు. జలవనరుల శాఖ పరిభాషలో ఇది ఒక మేజర్‌ డ్రెయిన్‌. ఎన్టీఆర్,కృష్ణా జిల్లాల్లో పంట పొలాల్లోని మిగులు నీరు ప్రవహించే ఒక వాగు. ఖమ్మం జిల్లాలో పుట్టిన ఈ వాగు మైలవరం నియోజకవర్గంలో ఎన్టీఆర్‌ జిల్లాలోకి ప్రవేశిస్తుంది. రెడ్డిగూడెం, మైలవరం, కొండూరు మండలాల్లోని పులివాగు, భీవ్‌ువాగు, లోయవాగును కలుపుకొని ముందుకు సాగుతుంది. 

విస్సన్నపేట, తిరువూరు నుంచి వచ్చే కొన్ని ఏరులు కూడా దీనిలో కలుస్తాయి. ఇవన్నీ కలిశాక, వెలగలేరు మీదుగా విజయవాడ శివారులోని సింగ్‌నగర్, గూడవల్లి, గన్నవరం, బాపులపాడు, గుడివాడ, నందివాడ వైపు సాగి చివరకు కొల్లేరులో కలుస్తుంది. బుడమేరు గరిష్ఠ నీటి ప్రవాహ సామర్థ్యం 11 వేల క్యూసెక్కులు మాత్రమే. దీని ఉద్ధృతి తగ్గించేందుకు 1970ల్లో
నాటి ప్రభుత్వం జి. కొండూరు మండలం వెలగలేరు వద్ద ఒక రెగ్యులేటరీని నిర్మించింది. అక్కడ చిన్న జలాశయాన్ని తలపిస్తుంది. 

ఈ హెడ్‌ రెగ్యులేటరీ ద్వారా కిందకు వరద ప్రవాహాన్ని నియంత్రించే వారు. తర్వాత దీన్నుంచి మళ్లింపు కాలువ (బుడ మేరు డైవర్షన్‌ ఛానెల్‌– బీడీసీ)ని తవ్వారు. అధికంగా వచ్చే వరద ఈ ఛానెల్‌ ద్వారానే ప్రవహించి, ఇబ్రహీంపట్నం సమీపంలో కృష్ణా నదిలో కలుస్తుంది. వీటీపీఎస్‌లోని వృథా నీటిని కూడా దీని ద్వారానే కృష్ణాలోకి పంపిస్తారు. దీని సామర్థ్యం చాలా తక్కువ.

కాలువ సామర్థ్యం పెంపు ప్రతిపాదనల్లో ఉండ గానే బుడమేరుకు 2005లో సుమారు 70 వేల క్యూసెక్కుల వరద పోటెత్తి, విజయవాడను ముంచెత్తింది. వరదను అరికట్టాలంటే మళ్లింపు కాలువ విస్తరణే మార్గమని ప్రతిపాదన వచ్చింది. తర్వాత పోలవరం కుడి కాలువను బుడమేరులో కలిపారు. అంటే పోలవరం నుంచి వచ్చే నీటిని కృష్ణా నదిలో కలిపేందుకు దీన్నొక అనుసంధాన కాలువగా మలిచారు. 

పోలవరం కుడి కాలువను 37,500 క్యూసెక్కుల సామర్థ్యంతో డిజైన్‌ చేయగా, ప్రస్తుత సామర్థ్యం 8,500 క్యూసెక్కులు మాత్రమే. గత ఏడెనిమిదేళ్లుగా పట్టిసీమ నీళ్లు ఈ కాలువ ద్వారానే కృష్ణాలోకి వస్తున్నాయి. భవిష్యత్తులో పోలవరం కాలువను విస్తరించేందుకు అవకాశ ముంది. ఆ మేరకు బీడీసీ సామర్థ్యం కూడా ఇప్పుడున్న 10 వేల క్యూసెక్కుల నుంచి పెంచాల్సిన అవసరముంది. 

సహజమైన నదీ తీరాన్ని ఇవ్వాళ  ధ్వంసం చేసి పెద్ద పెద్ద అంతస్తులతో భవనాలు కట్టి నదీ గమనానికి అడ్డుగా నిలవడమే కాక నదీజలాలు కలుషితం కావడానికి కూడా కారణమవుతున్నారు బడాబాబులు. విజయవాడకు ఇంతటి పెనుముప్పు రావడానికి ఇదే ప్రధాన కారణం. కృష్ణా నది కరకట్ట మీద పెత్తందారుల అక్రమ కట్టడాల వల్లే ఇది జరిగింది. ఈ కరకట్ట మీద ఉన్న ముఖ్యమంత్రి  నివాసం, కొంతమంది వైద్యం పేరుతో వ్యాపారం చేస్తున్న వారి కట్టడాలు ఉన్నాయి. వాటిని  కూలుస్తామనే మాట పాలకులు చెప్పడం లేదు. 

ఈనాడు తెలంగాణలో ‘హైడ్రా’ చెరువులు కబ్జా చేసిన వారి అక్రమ కట్టడాలను కూల్చి వేస్తున్నట్లు అన్ని రాష్ట్రాలలో కూల్చివేయాలి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో ఈ కూల్చివేతల అవసరం ఎంతైనా ఉంది. ఇక ప్రజలు ప్రాకృతిక, సామాజిక, సాంస్కృతిక, రాజకీయ పునరుజ్జీవనం గురించి ఆలోచించవలసిన సమయం వచ్చింది. ప్రజల్లో అలముకున్న నిరాశ, నిస్పృహల స్థానంలో సమకాలీన పరిస్థితుల పట్ల స్పష్టమైన అవగాహన నింపాలి. అప్పుడే వారు పెత్తందార్లకు బుద్ధి చెబుతారు. ప్రజలే చరిత్ర నిర్మాతలు కదా!

డా‘‘ కత్తి పద్మారావు 
వ్యాసకర్త దళితోద్యమ నాయకులు ‘ 98497 41695

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
vijayawada
krishna river
katti padma rao
Guest Column
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

CI నాగరాజు మామూలోడు కాదు.. ఈ కేసు వెనుక పెద్ద మాఫియా

CI నాగరాజు మామూలోడు కాదు.. ఈ కేసు వెనుక పెద్ద మాఫియా

ఆధ్యాత్మిక జ్వాల..

ఆధ్యాత్మిక జ్వాల..

ఎంతలో ఎంత మార్పు!

ఎంతలో ఎంత మార్పు!

అక్కడికే ఎక్కువమంది!

అక్కడికే ఎక్కువమంది!

కోర్టు కార్యకలాపాలు – ప్రాంతీయ భాషలు

కోర్టు కార్యకలాపాలు – ప్రాంతీయ భాషలు

ప్రైవేటీకరణపై మున్సిపల్‌ కార్మికుల శంఖారావం

ప్రైవేటీకరణపై మున్సిపల్‌ కార్మికుల శంఖారావం

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.