Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
search Subscribe Subscribe Epaper icon ఈ-పేపర్ Live TV లైవ్ టీవీ Live TV లైవ్ టీవీ
download app యాప్ download app Download App
మమ్మల్ని అనుసరించండి
  • facebook
  • x
  • instagram
  • youtube
  • whatsapp
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫొటోలు
  • వీడియోలు
  • close logo
  • search
    Epaper icon ఈ-పేపర్ Live TV లైవ్ టీవీ download app యాప్

    విభాగాలు

  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • మమ్మల్ని అనుసరించండి

    facebook x instagram youtube whatsapp whatsapp whatsapp
  • Sakshi Search
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV

Breadcrumb

  1. Home
  2. Guest Columns
  3. బ్రిక్స్‌ను చైనా హైజాక్‌ చేస్తుందా?
ADVERTISEMENT

బ్రిక్స్‌ను చైనా హైజాక్‌ చేస్తుందా?

Guest Columns Sakshi User Sakshi Sakshi Time Oct 7, 2026 03:54 PM IST Sakshi Read Time Read Time: 4 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Google
BRICS.jpg

‘బ్రిక్స్‌’ను చైనా హైజాక్‌ చేస్తుందా అంటూ గతంలోనూ ఉండిన చర్చ, ఆ సంస్థ ఢిల్లీ సమావేశాల సందర్భంగా మీడియాలో మరోసారి జరిగింది. ఆ పని నిజంగా జరగవచ్చునా? ఒక్క మాటలో చెప్పాలంటే, అది చైనా కోరుకున్నా సాధ్యమయ్యేది కాదు; హైజాక్‌ చేయాలన్న ఆలోచన వారి వ్యూహంలోనూ భాగం కాదు. హైజాక్‌ అంటే ఏమిటి? ఒక వ్యవస్థను, లేక ఒక కార్యక్రమాన్ని, ఒక వాహనాన్ని తన ప్రయోజనాల కోసం దాని మార్గం నుంచి అక్రమంగా, బలవంతంగా దారి మళ్లించటం.

ఈ నిర్వచనం చెప్పుకున్న తర్వాత చర్చలోకి వెళదాం. 2006లో ఏర్పడి, 2009లో లాంఛనప్రాయంగా రూపుతీసుకున్న ఈ సంస్థ వ్యవస్థాపక సభ్యులు బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా. తర్వాత 2011లో దక్షిణాఫ్రికా చేరింది. 

సంస్థ ప్రాథమిక లక్ష్యాలు ముఖ్యమైన వర్ధమాన దేశాల మధ్య ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక సహకారాన్ని పెంపొందించటం, వాణిజ్యాభివృద్ధి, అంతర్జాతీయ సంస్థల సంస్కరణ కోసం ప్రయత్నించటం వంటివి. తర్వాత కాలంలో, పరస్పరం స్థానిక కరెన్సీలలో చెల్లింపులు, అందుకోసం వ్యవస్థల ఏర్పాటు, ప్రత్యేక బ్యాంకు స్థాపన వంటివి అజెండాలోకి వచ్చాయి. వర్ధమాన దేశాలపై జరిగే అన్యాయపు దాడులను  విమర్శించటమూ ఆరంభించారు. 

ముడివడిన ప్రయోజనాలు
ఇవి అన్నీ ఉమ్మడి లక్ష్యాలు అయినందున బ్రిక్స్‌ దేశాలన్నిటి స్వీయ ప్రయోజనాలు పరస్పరం ముడిపడి ఉన్నాయన్నమాట. అటువంటపుడు వారు ఈ ఉమ్మడి లక్ష్యాల కోసం కలిసి పని చేయటం ద్వారానే సంస్థ విజయవంతంగా ముందుకు సాగుతుంది. ఆ విధంగా అందరి ప్రయోజనాలు నెరవేరుతాయి. చైనావి కూడా. ఆ స్థితిలో చైనా తక్కిన దేశాలతో కలిసి పని చేయవలసి ఉంటుంది. అందుకు భిన్నంగా వ్యవహరిస్తే సంస్థ భంగపడి తన ప్రయోజనాలు కూడా దెబ్బతింటాయి. ఇది మౌలిక స్థితి. గమనించవలసింది మరొకటి ఉంది.

‘బ్రిక్స్‌’లోని దేశాలు మొదటగాని, తర్వాత చేరినవిగాని ఏవీ చిన్నవి, బలహీనమైనవి కావు. దేనికది శక్తిమంతమైనదే. స్వతంత్రంగా, బలంగా ఎదగాలన్న స్వతంత్రేచ్ఛతో స్వచ్ఛందంగా సంస్థలో చేరుతున్నవే.  పాశ్చాత్య దేశాల ఆధిపత్యాన్ని, ఏకపక్ష నిర్ణయాలను, వివిధ అంతర్జాతీయ సంస్థలపై నియంత్రణలను, ఆ సంస్థలలోకి ఇతరులను రానివ్వకపోవటాన్ని నిరసిస్తున్నవే. ఉదాహరణకు, భారత విదేశాంగ మంత్రి జైశంకర్‌ను ఒక పాశ్చాత్య విలేఖరి ‘మీకెందుకు ఈ బ్రిక్స్‌ క్లబ్‌?’ అంటూ ఒకసారి ప్రశ్నించగా, ‘వాళ్లకు (పాశ్చాత్యులని భావం) వాళ్ల క్లబ్బులున్నాయి. వాటిలోకి మమ్మల్ని రానివ్వటం లేదు. మా క్లబ్‌ మేం పెట్టుకున్నాం’ అని జవాబిచ్చారు.

నిజానికి జైశంకర్‌ అనలేదు గాని, వాళ్లకు వారి క్లబ్బులు ఉన్నవి వారి ప్రయోజనాలకు మాత్రమే! కనుకనే ఇతరులను రానివ్వరు. వాటిపై పూర్తి నియంత్రణ వారిదే అవుతుంది. అందుకే బ్రిక్స్‌ సమావేశాలు కజాన్‌ నుంచి ఢిల్లీ వరకు, ప్రపంచ బ్యాంకు, ఐఎంఎఫ్‌ వంటి సంస్థల అధ్యక్షులు ప్రతిసారి పాశ్చాత్యులే కావాటాన్ని అంగీకరించబోమని స్పష్టం చేస్తూ వస్తున్నాయి. విషయం ఏమంటే, ఈ విధంగా వివిధ సంస్థల వ్యవహారాలపై ఏకపక్ష ఆధిపత్యాలను వ్యతిరేకిస్తూ ఏర్పడిన ‘బ్రిక్స్‌’పై చైనా ఆధిపత్యాన్ని, హైజాకింగ్‌ను ఎవరైనా ఎందుకు సమ్మతిస్తారు? సమ్మతించనపుడు హైజాకింగ్‌ ఎలా సాధ్యపడుతుంది? ఆ పని బలవంతంగా చేయబూనితే బ్రిక్స్‌ భంగపడుతుంది, చైనా లక్ష్యాలు నెరవేరవు. 

ఎందుకు చేయజూడదు?
ఇక్కడ మరొకటి గుర్తించాలి. బ్రిక్స్‌ సభ్యులందరి రాజకీయ, ఆర్థిక వ్యవస్థలు ఒకే విధమైనవి కావు. ప్రజాస్వామ్యాలు, కమ్యూనిజాలు, రాచరికాలు, మతపర వ్యవస్థలు ఉన్నాయి. కొన్నింటిమధ్య తీవ్రమైన పరస్పర వివాదాలున్నాయి. పాశ్చాత్య కూటమికి అనుకూలమైనవి, వ్యతిరేకమైనవి, తటస్థమైనవి ఉన్నాయి. కొన్నింటిని బ్రిక్స్‌కు వ్యతిరేకంగా మార్చేందుకు పాశ్చాత్య శిబిరం ప్రయత్నాలు సాగుతున్నాయి.

ఇటువంటి పరిస్థితులు ఉన్నపుడు సంస్థలో కొంత పెళుసుతనం కూడా చోటుచేసుకోవటం సహజం. అటువంటపుడు చైనా గాని, మరొకరు గాని ఎంతో జాగరూకతతో వ్యవహరించవలసి ఉంటుంది. హైజాక్‌ చేసేందుకు ప్రయత్నించకపోవటం సరికదా, అవసరమైనపుడు కొంత రాజీ పడటం కూడా అవసరమవుతుంది. తమ కారణంగా సంస్థ విఫలమై, భంగపడిందనే నిందను తెచ్చుకోవటం ఎవరికీ ఇష్టం ఉండదు. కనుక, బ్రిక్స్‌ను చైనా హైజాక్‌ చేయ గోరుకోదు, కోరుకున్నా అది వీలయేది కాదు.

ఇదంతా చెప్పుకున్న తర్వాత, చైనా ఎందుకు హైజాక్‌ చేయజూడదో అర్థం చేసుకునేందుకు మరో బలమైన కారణం ఉంది. అసలు ఈ హైజాక్‌ చర్చ తలెత్తటానికి కారణం బ్రిక్స్‌ దేశాలన్నింటిలో చైనా అత్యంత శక్తిమంతమైనది కావటం. సాధారణంగా ఏ సంస్థలలోనైనా శక్తిమంతుడిది ఎంతోకొంత ఆధిక్యతవటం మామూలే. నాటోలో అమెరికాది, ‘సార్క్‌’లో ఇండియాది అయినట్లు. అయితే, సహజ శక్తి కారణంగా కొంత ఆధిక్యత ఉండటం వేరు, దాని ఆధారంగా ఆధిపత్యం చలాయించటం వేరు. ఈ సూత్రీకరణ ప్రకారం బ్రిక్స్‌లో శక్తిమంతమైన చైనా ఆధిపత్యాన్ని చలాయించి హైజాక్‌ చేయవచ్చుననే సందేహాలు కలగటం సహజం. కాని, చైనా ఆ పని చేయజూడదని, చేయటం సాధ్యం కూడా కాదని పైన కొన్ని చెప్పుకొన్న తర్వాత, మరొకటి చూడటం అవసరం.

కాలం వాళ్లదైనప్పుడు...
‘బ్రిక్స్‌’తో నిమిత్తం లేకుండా చైనాకు తనదైన దీర్ఘకాలిక వ్యూహం ఒకటి ఉన్నది. అందులో మొదటి భాగం, తన స్వీయచరిత్రలోని అవమానాల శతాబ్దం (1839 నల్లమందు యుద్ధాల నుంచి 1949 విప్లవం వరకు) నుంచి,  ఆ తర్వాత శతాబ్ద కాలాన్ని (2049 వరకు) ‘పునరుజ్జీవన శతాబ్దంగా నిర్వచించుకున్నందున, సర్వతోముఖ అభివృద్ధిపై దృష్టిని కేంద్రీకరించటం. ఇది మొదటి భాగం కాగా, ఇది నెరవేరాలంటే అందుకు భంగం కలిగించగలæఅమెరికన్‌ కూటమి ఆధిక్యత నియంత్రణలో ఉండటం, వీలైనంత బలహీనపడుతూ పోవటం అవసరం. 

అట్లా జరగాలంటే ఆ కూటమికి బయటి దేశాలు వీలైనంత ఒకటి కావాలి, వీలైనంతగా అభివృద్ధి చెందాలి, వీలైనంత స్వతంత్రంగా వ్యవహరించాలి, పాశ్చాత్యులకు ఆధిపత్యం గల సంస్థలపై, రంగాలపై ఆ కూటమి నియంత్రణ వీలైనంత తగ్గుతూపోవాలి. ఆ విధంగా పాశ్చాత్య శిబిరం చాపకింద నీరు చేరుతుండాలి. ఇది దీర్ఘకాలిక వ్యూహం. అందుకు బ్రిక్స్‌ కూడా ఒక సాధనమవుతుంది.

చైనా చక్రవర్తుల వేల సంవత్సరాల యుద్ధ నీతుల నుంచి, సున్‌జూ యుద్ధ వ్యూహాల నుంచి అనేకం నేర్చుకున్న ఆధునిక నాయకత్వాలు, తమ దీర్ఘకాలిక లక్ష్యాలు నెరవేరటం ప్రధానమనుకుంటారు. అందుకవసరమైన నేర్పును, ఓర్పునంతా చూపుతారు. అవసరమైతే తగ్గి ఉంటారు. అంతే తప్ప, తాము శక్తిమంతులం కదా అని తొందరపడి బ్రిక్స్‌ను హైజాక్‌ చేయజూడరు. తమ దీర్ఘకాలిక సాధనాన్ని భంగపరచరు. ముఖ్యంగా చరిత్ర గమనం తమ వెంట ఉందని నమ్మినపుడు.

-టంకశాల అశోక్‌
వ్యాసకర్త సీనియర్‌ సంపాదకుడు

ADVERTISEMENT
ADVERTISEMENT
tags Tags:
Sakshi Guest Column
brics
china
hijack
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

గంటల లెక్కన కుక్కల బుకింగ్‌.. ఇదేం ఐడియా బాసూ!

గంటల లెక్కన కుక్కల బుకింగ్‌.. ఇదేం ఐడియా బాసూ!

చైనా సరిహద్దుల్లో వాయుసేన పాగా! 

చైనా సరిహద్దుల్లో వాయుసేన పాగా! 

హర్మూజ్ జలసంధిలో భారత్‌, చైనాకు ఇరాన్ కీలక మినహాయింపు

హర్మూజ్ జలసంధిలో భారత్‌, చైనాకు ఇరాన్ కీలక మినహాయింపు

హార్మూజ్ విషయంలో భారత్‌కు భారీ ఊరట

హార్మూజ్ విషయంలో భారత్‌కు భారీ ఊరట

ఆయుధమా? వైన్‌ బాటిలా? అసలేం జరుగుతోంది?

ఆయుధమా? వైన్‌ బాటిలా? అసలేం జరుగుతోంది?

అమెరికా నిఘా కెమెరాకు చిక్కిన చైనా రహస్య అంతరిక్ష విమానం!

అమెరికా నిఘా కెమెరాకు చిక్కిన చైనా రహస్య అంతరిక్ష విమానం!

మరిన్ని వార్తలు

బియ్యం ధరల పెరుగుదల మతలబు

బియ్యం ధరల పెరుగుదల మతలబు

శ్రీకాకుళ గిరిజనోద్యమం ఏం నేర్పింది?

శ్రీకాకుళ గిరిజనోద్యమం ఏం నేర్పింది?

వారి ప్రస్తావన లేకపోవడం యాదృచ్ఛికమా లేక డిప్లమసీనా?

వారి ప్రస్తావన లేకపోవడం యాదృచ్ఛికమా లేక డిప్లమసీనా?

యాదృచ్ఛికమా లేక డిప్లమసీనా?

యాదృచ్ఛికమా లేక డిప్లమసీనా?

ఆఫ్రికాలో పాగా వేయటానికి పోటీ

ఆఫ్రికాలో పాగా వేయటానికి పోటీ

వ్యవస్థల సంక్షోభంతోనే తిరుగుబాట్లు

వ్యవస్థల సంక్షోభంతోనే తిరుగుబాట్లు

  

ADVERTISEMENT
 
 
ADVERTISEMENT
ADVERTISEMENT
 
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Jagati Publications Limited.
Powered by Yodasoft