Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Guest Columns
  3. ఏ విధిరాత వైపు పయనిస్తున్నాం?
ADVERTISEMENT 

ఏ విధిరాత వైపు పయనిస్తున్నాం?

Guest Columns Sakshi User Sakshi Sakshi Time Feb 20, 2023 Sakshi Read Time Read Time: 4 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
Untitled-4.jpg

భారత చరిత్రపై తాజాగా వచ్చిన ‘ఎ న్యూ హిస్టరీ ఆఫ్‌ ఇండియా’ ఆర్యన్ల మూలాల గురించి సరికొత్త వ్యాఖ్యానాన్ని అందజేసింది. ఆర్యన్లు భారత్‌ మూలాలను కలిగి ఉన్నారనే వాదనను ఖండిస్తూ, వీరు మధ్యాసియా నుంచి వచ్చినవారని చెబుతోంది. భారత ముస్లిం పాలకులందరూ మతమార్పిడి పట్ల ఉత్సుకత కలిగి ఉన్న ఉద్రేకపరులు అని విశ్వసించేందుకు ఎలాంటి ఆధారమూ లేదని తేల్చి చెబుతోంది. ఔరంగజేబును పవిత్ర ముస్లింగా పేర్కొంటూనే, అత్యధిక హిందువులను ఉన్నత పదవుల్లో నియమించడానికి అది అడ్డురాలేదని పేర్కొంటోంది. ప్రస్తుతం మెజారిటీ వర్గ ఆధిపత్యం దిశగా దేశం పయనిస్తోందని కూడా పుస్తకం అభిప్రాయపడింది.

ఎట్టకేలకు, 450 కోట్ల సంవత్సరాల క్రితం భౌగోళిక కాలం ప్రారంభమైన నాటి నుంచి నేటి నరేంద్ర మోదీ వరకు భారత చరిత్రను ఒకే సంపుటిలో వివరించిన  పుస్తకం ఇప్పుడు వచ్చింది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, దీన్ని రాసిన ముగ్గురు రచయితలు– రుద్రాంక్షు ముఖర్జీ, శోభిత పంజా, టోబీ సిన్‌ క్లెయిర్‌– పుస్తకాన్ని ‘ఎ న్యూ హిస్టరీ ఆఫ్‌ ఇండియా’(భారతదేశ కొత్త చరిత్ర) అని చెబుతున్నారు. వారు ఈ విశేషణం ఎందుకు ఉపయోగించారో నాకైతే తెలీదు కానీ ఈ పుస్తకంలోని విషయాలు, చేసిన వ్యాఖ్యలు నన్ను కట్టిపడేశాయి. ఉదాహరణకు, ఇది మీకు తెలుసా? ‘‘హరప్పా నగరాల్లోని ఇళ్లు లేదా సమాధులు సంపద ఆడంబరానికి సంబంధించిన ఎలాంటి చిహ్నాలనూ ప్రదర్శించేవి కావు.... రాజమందిరం అని గుర్తించే ఎలాంటి భవనాలు లేవు... అలాగే ఈజిఫ్టు, చైనా, లేక మెసొపొటేమియాలో కనిపించినట్లు భారీ సమాధులు లేదా భవంతులు లేదా పాలకుల విగ్ర హాలు కనబడవు.’’ కాబట్టి ఇవి పాక్షిక సామ్యవాద గణతంత్రాలా?

ఆర్యుల గురించి రచయితలు ఇలా చెబుతారు. ‘‘మధ్య ఆసియా నుంచి ఉత్తర భారతానికి వలస వచ్చారు, స్థానిక ప్రజలతో కలిసి పోయారు, క్రమంగా వారిని తమలో కలుపుకున్నారు... మరోలా చెప్పాలంటే, ఆర్యన్లు ఉత్తర భారతదేశాన్ని ఆక్రమించలేదు, ద్రవిడి యన్లను దక్షిణాభిముఖంగా తరమలేదు.’’ ఇది కచ్చితంగా వివాదా స్పదమైంది. ఆర్యన్లు భారత్‌లోనే జన్మించినవాళ్లనే వాదనను ఇది ఖండిస్తుంది. అర్య సంస్కృతికి సంబంధించి, ఈ పుస్తక రచయితలకు నిర్దిష్టమైన అభిప్రాయం ఉంది. ‘‘ఇది తరచుగా భారతీయ సంప్ర దాయం, సమాజానికి సంబంధించినదిగా చూడబడుతోంది’’ అని నొక్కి చెబుతూనే, దాన్ని ‘‘కులీనమైనది, ఇంకా అనితరమైనది’’ అని వర్ణిస్తారు. ‘‘ఇది ఉత్తర భారత జనాభాలోని విస్తృతమైన వర్గాలను స్పష్టంగా విస్మరించింది. అలాగే భారత ద్వీపకల్పం (వింధ్యకు ఆవలి భూమి)లో నివసిస్తున్న మొత్తం జనాభాను దూరం పెట్టేసింది.’’ పైగా ‘‘కులవ్యవస్థ పునాదులు’’ రుగ్వేద కాలంలోనే ఉన్నాయని వీరు చెబుతున్నారు. ఇది మోహన్‌ భాగవత్‌ అభిప్రాయానికి కచ్చితంగా భిన్నమైనట్టిదే.

ఇప్పుడు నన్ను ఔరంగజేబు వైపు దృష్టి మళ్లించనివ్వండి. ఆయనపై ఈ పుస్తక రచయితల అభిప్రాయం ప్రస్తుత మన కేంద్ర ప్రభుత్వం కంటే ఆద్రే త్రూష్కే(అమెరికా చరిత్రకారిణి) అభిప్రాయాలకు దగ్గరగా ఉంటోంది. ‘‘ఔరంగజేబు పవిత్రమైన, పరి శుద్ధమైన ముస్లిం’’ అని వీరు పేర్కొంటున్నారు. ‘‘కానీ ఆయన మతో న్మాది కాదు’’ అంటున్నారు. దీనికి సాక్ష్యంగా, ఔరంగజేబు వ్యక్తిగత మత దృక్పథం అధిక సంఖ్యలో హిందూ మునసబుదార్లను నియమించకుండా ఆయనను అడ్డుకోలేదని వీరు పేర్కొంటున్నారు. ‘‘షాజహాన్‌ పాలనలో 1,000 జాత్‌(ర్యాంకు) లేదా అంతకు మించిన ర్యాంకు కలిగిన మునసబుదారుల్లో హిందువులు 22 శాతంగా ఉండేవారు. ఔరంగజేబు హయాంలో ఈ సంఖ్య 32 శాతానికి పెరిగింది.’’

విస్తృతమైన ముస్లిం పాలనలో అంటే 13వ శతాబ్ది నాటి సుల్తాన్‌ల నుంచి మొఘలుల అంతం వరకు చూస్తే ఈ కాలాన్ని 1,200 సంవత్సరాల బానిసత్వ సంవత్సరాలుగా పరిగణిస్తుంటారు. కానీ ఈ పుస్తకం మాత్రం దీనికి విరుద్ధమైన దృక్పథాన్ని కలిగి ఉంది. ‘‘ముస్లింలందరూ లేక ముస్లిం పాలకులందరూ మతమార్పిడి పట్ల ఉత్సుకత కలిగి ఉన్న ఇస్లామిక్‌ ఉద్రేకపరులు, ఉత్సాహవంతులు అని విశ్వసించేందుకు ఎలాంటి ఆధారమూ లేదు. ముస్లిం పాలకులు పెద్ద సంఖ్య లో ముస్లిమేతరులను ఉద్యోగాల్లో నియమించారు, వారికి అత్యున్నత పదవులను కూడా కట్టబెట్టారన్న వాస్తవాన్ని బట్టే ముస్లిం పాలకులందరూ మతమార్పిడి ఉన్మాదులు కారని తెలుస్తోంది’’ అని ఈ పుస్తకం తేల్చి చెబుతోంది.

ఇస్లాం పాలకుల హయాంలో కళలు, నిర్మాణ కళ, సంస్కృతి, మతం వంటి అంశాల్లో జరిగిన అభివృద్ధి గురించి పుస్తకం చర్చించింది. భక్తి సంప్రదాయం, సూఫీతత్వం మధ్య ఈ పుస్తకం గుర్తించిన లంకెలను చూసి నేను నిరుత్తరుడినయ్యాను. ‘‘ఇస్లాంతో సన్నిహిత సంబంధం, ఇస్లాం రాకముందు భారత్‌లో ఉనికిలో ఉన్న భక్తిరూపాల వల్ల భక్తి ఉద్యమం పురుడు పోసుకుందని చెబితే అది మరీ అతిశయోక్తి కాజాలదు... భక్తి మార్మిక సంప్రదాయాలు, సూఫిజం మధ్య గొప్ప అతివ్యాప్తి, కలయిక ఉంది.’’ ఈ పుస్తకంలోని అత్యంత ఆసక్తికరమైన విషయాలు కొన్ని దాని అపురూపమైన వివరాల్లో ఉన్నాయి. ‘‘వ్యభిచారులపై పన్ను విధించాలి’’ అని కౌటిల్యుడు విశ్వసించాడు. అది చాలా ప్రగతిశీలమైందని నేను చెబుతాను. ‘‘అశోకుడు తన సోదరులను చంపేశాడు. ఉన్న వారిలో మొత్తం 97 మందిని చంపేశాడు.’’ అంటే కళింగులకు చాలా కాలం క్రితమే ఆయన ఈ చంపడంలో మునిగివున్నాడు. అలాగే సిపా యిల తిరుగుబాటు ‘‘1857 మే 10న అపరాహ్న వేళ... దాదాపు 5 గంటల సమయంలో’’ మొదలైంది. అయితే అది మీరట్‌ కంటోన్మెంట్‌లో సాయంత్రం తేనీటికి కచ్చితంగా అంతరాయం కలిగించివుంటుంది.

మన ప్రస్తుత ప్రధానికి సంబంధించి ఈ పుస్తకం రెండు అభిప్రాయాలను కలిగివుంది.›‘‘నరేంద్ర మోదీ తాను చేసిన అన్ని వాగ్దానాలను ఇంకా నెరవేర్చలేదు’’ అని చెబుతూనే, ‘‘ఆయన ఒక కొత్త విశ్వాసాన్ని, ఉల్లాసాన్ని తీసుకొచ్చారు’’ అని పొడుపుగా జోడించింది. అయితే ఆ తర్వాత, ఈ పుస్తకం ‘‘మోదీ నాయకత్వంలో మెజారిటీ వర్గ ఆధిపత్యం, మైనారిటీల పట్ల తీవ్ర అసహనం, అసమ్మతి వైపుగా ఒక సహజ ప్రవృత్తి బలపడిపోయింది. ఈ మెజారిటీ వైపు మలుపు మన సమాజాన్ని వేర్పాటుతత్వంతో విభజించివేసింది’’ అని అభిప్రాయపడింది. చివరగా, ఈ పుస్తకం చివరి వాక్యాన్ని చాలా తెలివిగా, కాకపోతే జిత్తులమారితనంతో రూపొందించారు.‘‘మార్పు, మథనానికి సంబంధించిన లోతైన, ప్రాథమిక ప్రవాహాలు భారత్‌ను ఒక కొత్త విధి రాత (ట్రిస్ట్‌ విత్‌ డెస్టినీ) వైపు లాగుతున్నాయి.’’ ఒక విరుద్ధమైన ఫలితాన్ని ముందుచూపుతో సూచిస్తూ, నెహ్రూ సుప్రసిద్ధ వాక్యాన్ని ఇక్కడ చమత్కారంగా ఉపయోగించారు.



కరణ్‌ థాపర్‌ , వ్యాసకర్త సీనియర్‌ జర్నలిస్ట్‌ 

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
book
Indian History
New Delhi
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

ఎన్డీఏతో కలిసి పనిచేస్తాం: కుండబద్దలుకొట్టిన టీఎంసీ రెబల్ ఎంపీ

ఎన్డీఏతో కలిసి పనిచేస్తాం: కుండబద్దలుకొట్టిన టీఎంసీ రెబల్ ఎంపీ

పుస్తకాలు పూసే ఊరు

పుస్తకాలు పూసే ఊరు

ఢిల్లీలో కాక్రోచ్ జనతా పార్టీ నిరసనలు

ఢిల్లీలో కాక్రోచ్ జనతా పార్టీ నిరసనలు

కదం తొక్కిన కాక్రోచ్‌.. జంతర్‌ మంతర్‌ వద్ద ధర్నా (చిత్రాలు)

కదం తొక్కిన కాక్రోచ్‌.. జంతర్‌ మంతర్‌ వద్ద ధర్నా (చిత్రాలు)

మనోళ్ల భద్రతే ముఖ్యం

మనోళ్ల భద్రతే ముఖ్యం

కుప‍్పకూలిన సుఖోయ్ యుద్ధ విమానం.. ఇద్దరు పైలట్లు మృతి

కుప‍్పకూలిన సుఖోయ్ యుద్ధ విమానం.. ఇద్దరు పైలట్లు మృతి

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.