Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Guest Columns
  3. ఏఐ రంగంలో పోటాపోటీ.. ఐపీ అడ్రస్‌ చోరీ అవుతుందా?
ADVERTISEMENT 

ఏఐ రంగంలో పోటాపోటీ.. ఐపీ అడ్రస్‌ చోరీ అవుతుందా?

Guest Columns Sakshi User Sakshi Sakshi Time Feb 8, 2025 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
Artificial-Intelligence.jpg

‘డీప్‌ సీక్‌ ఆర్‌–1’ అనే ఓపెన్‌ సోర్స్‌ ఏఐ మోడల్‌ను ‘డీప్‌ సీక్‌’ అనే చైనా స్టార్టప్‌ సంస్థ ఇటీవల విడుదల చేసింది. అది వచ్చీ రాగానే ఏఐ మార్కెట్‌లో సంచలనాత్మకమైన పరిణామాలను సృష్టించింది. ఒకటిన్నర సంవత్సరంగా ‘చాట్‌ జీపీటీ’ (Chat GPT) మోడల్‌ అందరికీ ఉప యోగకరమైన ఏఐ మోడల్‌గా గుర్తింపు తెచ్చు కుంది. ‘ఓపెన్‌ ఏఐ’ (Open AI) సంస్థ దీనిని తయారు చేయటానికి కొన్ని బిలియన్‌ డాలర్లను పెట్టు బడిగా పెట్టింది. అయితే డీప్‌ సీక్‌ ఆర్‌–1ను కేవలం రెండు నెలల్లోనే ఆరు మిలియన్‌ డాలర్ల పెట్టుబడితో చైనా స్టార్టప్‌ సంస్థ డీప్‌సీక్‌ తయారు చేసింది. 

గూగుల్‌ జెమినీ (Google Gemini), బైదు ఏర్ని, క్యాన్వ (Canva) వంటి సంస్థలు... డీప్‌ సీక్‌ కంటే ముందుగానే మార్కెట్‌లోకి వచ్చినా చాట్‌ జీపీటీకి పోటీ ఇవ్వలేకపోయాయి. చాట్‌ జీపీటీకి డీప్‌ సీక్‌ సరి సమానంగా పని చేయడం, ఎలాంటి సబ్‌స్క్రిప్షన్‌ లేకుండా ఉచితంగా ఓపెన్‌ సోర్స్‌లో ఫైన్‌ ట్యూన్‌ చేసుకునేలా ఉండడం.. ముఖ్యంగా డీప్‌ సీక్‌ ఏపీఏ ధరలు చాట్‌ జీపీటీతో పోలిస్తే 90 శాతం వరకు తక్కువగా ఉండటం వలన విడుదలైన వారంలోనే ఆపిల్‌ స్టోర్‌లో డౌన్‌లోడ్స్‌లో మొదటి స్థానం సంపాదించి ఒకేరోజు దాదాపు 20 లక్షల మంది యూజర్లకి చేరువయ్యింది.

డీప్‌ సీక్‌ విడుదలతో ఏఐ ఆధారిత కంపెనీల స్టాక్‌లు భారీగా పతనం అయ్యాయి. డీప్‌ సీక్‌ (DeepSeek) వంటి మోడల్స్‌ను అభివృద్ధి చేయడానికి అవసరమైన అధునాతన జీపీయూలు, సెమీ కండక్టర్‌లను అమెరికాలోని ఎన్‌వీఐడీఐఏ సంస్థ తయారుచేస్తోంది. ఇలాంటి జీపీ యూలు, అధునాతన చిప్స్‌ను అమెరికా నుండి వేరే దేశాలకు వెళ్లకుండా ఆదేశం అనేక ఆంక్షలను పెట్టింది. అయినప్పటికీ డీప్‌ సీక్‌ తయారీకి ఎన్‌వీఐడీఐఏ జీపీయూలను సింగపూర్‌ నుండి చైనా రాబట్ట గలిగిందనే వదంతులతో... ఇన్వెస్టర్లు ఎన్‌వీఐడీఐఏపై నమ్మకం కోల్పోవడం వలన 20 బిలియన్‌ డాలర్ల మేర కంపెనీ విలువ పడిపోయింది. ఇతర ఏఐ సెమీ కండక్టర్‌లను తయారుచేసే కంపెనీల షేర్లు కూడా దాదాపు 15 నుండి 20 శాతం పడి పోయాయి.

ఈ నేపథ్యంలో డీప్‌ సీక్‌ ‘ఐపీ అడ్రస్‌ను తస్కరిస్తుంది’ అనే వదంతి వినిపిస్తోంది. అలాగే డీప్‌ సీక్‌పై భారీ సైబర్‌ దాడి జరగటం వలన వ్యక్తిగత వివరాల లీక్‌ ముప్పుఉండటం, డీప్‌ సీక్‌ మోడల్‌లో చైనీస్‌ సెన్సార్‌ షిప్‌ ఉండటం (ఉదాహరణకు చైనాలో జరిగిన నిరసనలు భారత్‌కి సంబంధించిన అరుణాచల్‌ ప్రదేశ్, లద్దాఖ్‌ గురించి అడిగినప్పుడు సరైన సమాచారం ఇవ్వదు ఈ మోడల్‌). అలాగే కొన్ని ప్రాంతాలకు చైనా అనుకూలంగా ఉండే సమాధానం ఇవ్వటం ఈ మోడల్‌పై అనుమానాలు కలిగిస్తున్నాయి.

డీప్‌ సీక్‌ రావటం ఒక విధంగా మంచిదే అని టెక్‌ సంస్థలు చెబుతున్నాయి. ఇలా తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయోజనం ఇవ్వగలిగే మోడల్స్‌ని తయారు చేయటానికి మార్కెట్‌లో అనువైన కాంపిటీషన్‌ రాబోతుందనీ, దీనివల్ల వినియోగదారులు అతి తక్కువ ధరలకే ఏఐ సర్వీసులు పొందవచ్చనీ చెబుతున్నారు. ఇప్పటికే అంతర్జాతీయ వేదికపై అమెరికా, చైనా అన్ని అంశాలలో సై అంటే సై అంటూ పోటీ పడుతున్న విషయం తెలిసినదే. ట్రంప్‌ 2.0లో ఏఐ ఇండస్ట్రీ అభివృద్ధికి ఏటా వంద బిలియన్‌ డాలర్లు ఖర్చు పెడతామనీ, అమెరికాను ఏఐ అగ్రగామిగా చేస్తామనీ చెప్పిన మరుసటి రోజే... మేమేమీ తక్కువ కాదన్నట్లు డీప్‌ సీక్‌ను విడుదల చేసి అమెరికాకు చైనా గట్టి సమాధానమే ఇచ్చింది.

చ‌ద‌వండి: అమెరికా వాణిజ్య యుద్ధంతో అందరికీ నష్టమే!

ఏఐని అందరికీ అందుబాటులోకి తేవటం, దాన్ని అన్ని రంగాలలో సమీకృతం చేయటం పరిశ్రమల ముందు ఉన్న పెను సవాళ్ళు. ఈ సవాళ్లకు మొదటి మెట్టుగా చాట్‌ జీపీటీ, డీప్‌ సీక్‌లను మనం చూడవచ్చు. భవిష్యత్తులో ఏఐ పరిశ్రమ మరింతగా ఎదిగి మానవ జీవనాన్ని సుగమం, సౌకర్యవంతం చేస్తుందని ఆశిద్దాం.

– శ్రీరామ్‌ సుదర్శన్‌ 
ఏఐ పరిశోధక విద్యార్థి 

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
Deepseek
ChatGPT
OpenAI
Artificial Intelligence (AI)
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

ఇప్పుడంతా AI.. మరి రేపు ఏంటి?

ఇప్పుడంతా AI.. మరి రేపు ఏంటి?

సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు కనుమరుగవుతాయ్!?

సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు కనుమరుగవుతాయ్!?

మస్క్ ప్రసంశలు.. ఏఐ రంగంలో వారే టాప్!

మస్క్ ప్రసంశలు.. ఏఐ రంగంలో వారే టాప్!

భారత్‌కు సొంత ‘డీప్‌సీక్‌’ ఉండాలి

భారత్‌కు సొంత ‘డీప్‌సీక్‌’ ఉండాలి

భారీగా పెరగనున్న స్మార్ట్‌ఫోన్‌ ధరలు: కారణం ఇదే!

భారీగా పెరగనున్న స్మార్ట్‌ఫోన్‌ ధరలు: కారణం ఇదే!

ఇది సాధారణ బొమ్మ కాదు.. మినీ రోబో స్నేహితుడు!

ఇది సాధారణ బొమ్మ కాదు.. మినీ రోబో స్నేహితుడు!

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.