Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Guest Columns
  3. 'ఉపవాసం' అంటే.. అసలు అర్థమేంటో తెలుసా!?
ADVERTISEMENT 

'ఉపవాసం' అంటే.. అసలు అర్థమేంటో తెలుసా!?

Guest Columns Sakshi User Sakshi Sakshi Time Jul 23, 2024 Sakshi Read Time Read Time: 1 min
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
fasting.jpg

ఉపవాసం అంటే పస్తు ఉండటం, నిరాహారంగా ఉండటం అని వాడుక. కానీ ‘ఉప–వాసం’ అనే పదబంధానికి ఆహారంతో సంబంధం కనిపించదు. ‘ఉప’ అంటే ‘సమీపం’, ‘వాసం’ అంటే ‘నివాసం’. కాబట్టి ‘ఉపవాసం’ అంటే దగ్గరగా ఉండటం. దేనికి దగ్గరగా ఉండటం? ఉపవాసం చేసే సాధకుడు దేనికి దగ్గరగా ఉండాలనుకొంటున్నాడో దానికి!

ఉదాహరణకు, ఒక భక్తుడు కొంత సమయం పాటు, ఎప్పటికంటే ఎక్కువగా, మనో–వాక్‌–కాయ–కర్మల ద్వారా తన ఇష్ట దైవానికి సన్నిహితంగా ఉండాలని సాధన చేస్తే, అది ఉపవాస సాధన అవుతుంది. శరీరాన్ని వీలయినంత ఎక్కువ సమయం భగవన్మూర్తికి దగ్గరగా ఉంచుతూ, ఇతర లౌకిక విషయాలకు దూరంగా ఉంచటం శారీరకమైన ఉపవాసం.

వాక్కును కొంతకాలం పాటు భగవత్‌ స్తోత్రాలకూ, భగవద్వి షయమైన చర్చలకూ పరిమితం చేయటం వాక్కుపరమైన ‘ఉపవాసం’. మనసును ఆహార విహారాల లాంటి ఇంద్రియ విషయాల మీదనుంచి కొంతసేపు మళ్ళించి, దైవం మీద నిలిపి ఉంచటం మానసికమైన ఉపవాసం. అలాగే లౌకికమైన పనులకు కొంతకాలం సెలవిచ్చి, ఆ సమ యాన్ని పూజలకూ, ఆరాధనలకూ, అభిషేకాలకూ, వ్రతాలకూ వెచ్చించడం... కర్మల పరంగా దైవానికి సమీపంగా ఉండే ‘ఉపవాసం’.

ఈ దేహమూ, ఇంద్రియాలూ, మనస్సు– ఇవే ‘నేను’ అన్న మిధ్యా భావనలో మునిగిపోయి, వీటికి అతీతంగా వెలుగుతుండే ఆత్మజ్యోతి తన అసలు రూపం అని మరిచిపోయిన జీవుడు, కొంతకాలం పాటన్నా దేహేంద్రియ వ్యవహారాలకు దూరంగా, తన స్వ స్వరూపానికి దగ్గరగా వెళ్ళి దానిని గుర్తించేందుకు చేసే సాధన ‘ఉపవాసం’ అని వేదాంతులు వివరణ ఇచ్చారు.

మామూలుగా రోజూ తినే ఆహారం మీద నుంచి దృష్టి మళ్ళించేసి, ఒక్కపూట మరేదయినా ఆహారం పుచ్చుకొంటే ఇహానికీ పరానికీ మంచిదన్న భావనతో, దాని మీద దృష్టి పెట్టడం కూడా ‘ఉపవాసమే’. కానీ అది మనో వాక్‌ కాయ కర్మలన్నిటి ద్వారా, ఆ కొత్త ఆహారానికి ‘సమీపంగా ఉండటం’ మాత్రమే అవుతుంది. – ఎం. మారుతి శాస్త్రి

ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
Guest Column
family
Life style
fasting
m maruthi shasthri
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

'దటీజ్‌ మహాలక్ష్మి' ఎంత ముద్దుగుందో..!

'దటీజ్‌ మహాలక్ష్మి' ఎంత ముద్దుగుందో..!

ఆటిజం పిల్లలను పెంచే పేరెంటింగ్‌ టిప్స్..! వైరల్‌గా ఓ తల్లి గైడెన్స్‌..

ఆటిజం పిల్లలను పెంచే పేరెంటింగ్‌ టిప్స్..! వైరల్‌గా ఓ తల్లి గైడెన్స్‌..

ఆధ్యాత్మిక జ్వాల..

ఆధ్యాత్మిక జ్వాల..

ఎంతలో ఎంత మార్పు!

ఎంతలో ఎంత మార్పు!

అక్కడికే ఎక్కువమంది!

అక్కడికే ఎక్కువమంది!

కోర్టు కార్యకలాపాలు – ప్రాంతీయ భాషలు

కోర్టు కార్యకలాపాలు – ప్రాంతీయ భాషలు

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.