Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Guest Columns
  3. ఇందిరమ్మ ఇళ్లకు ఆధార్‌.. అతిపెద్ద సమస్య!
ADVERTISEMENT 

ఇందిరమ్మ ఇళ్లకు ఆధార్‌.. అతిపెద్ద సమస్య!

Guest Columns Sakshi User Sakshi Sakshi Time Jan 29, 2025 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
Telangana-Ration-Card-Appli.jpg

అభిప్రాయం

ఏడాది పాలనలోనే కాంగ్రెస్‌ ప్రభుత్వ వైఫల్యాల్ని తెలంగాణ (Telangana) ప్రజలు గుర్తించారు. పథకాల అమలులో జరుగుతున్న అవకతవకలను, సాచివేత ధోరణిని ప్రశ్నిస్తూ రేవంత్‌ రెడ్డి సర్కార్‌ను నిలదీస్తు న్నారు. ప్రభుత్వ భూసేకరణపై లగచర్ల (Lagcherla) లాంటి గ్రామాలు కదం తొక్కాయి. ఏకంగా కలెక్టర్‌ సహా ఉన్నతాధికారులను అడ్డుకొని తమ నిరసన తెలియజేశారు. కేసులు, జైళ్లను లెక్కచేయకుండా ప్రభుత్వం వెనక్కి తగ్గే వరకూ ఊరుకోలేదు. రేషన్‌ కార్డులు, (Ration Cards) ‘రైతు భరోసా’, ‘ఆత్మీయ భరోసా’, ‘ఇందిరమ్మ ఇండ్లు’... ఇలా అనేక పథకాల లబ్ధిదారుల ఎంపికకు గ్రామసభల్లోనే (Grama Sabha) దరఖాస్తులు తీసుకోవటం వల్ల గందరగోళం ఏర్పడుతుందన్న కనీస ఆలోచన ప్రభుత్వానికి లేదు.

కేవలం వీటి గురించే కాకుండా ప్రజలు కాంగ్రెస్‌ ఇచ్చిన ‘ఆరు గ్యారంటీ’ల గురించీ నిలదీస్తున్నారు. ‘కల్యాణ లక్ష్మి’ స్థానంలో తీసుకవచ్చిన ‘తులం బంగారం’ పథకం ఎప్పుడు అమలు చేస్తారని ఎమ్మెల్యేలను ప్రశ్నిస్తున్నారు. ‘రైతు భరోసా’, రుణమాఫీ, ‘మహాలక్ష్మి’ పథకం ఇంకా అమలు చేయకుండా ఎందుకు తాత్సారం చేస్తున్నారో చెప్పాలని ప్రజలు అడిగితే ఎమ్మెల్యేలు నీళ్లు నములుతున్నారు. గ్రామ సభల్లోంచి ఎమ్మెల్యేలు మధ్యలోనే వెళ్లిపోవటం ప్రభుత్వం దుఃస్థితికి అద్దం పడుతోంది. పోలీసు పహారా మధ్య సభల్ని నిర్వహించినా ప్రజలు ఏమాత్రం భయపడటం లేదు. ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారు. ఏడాది పాలనకే ఇంతలా భయపడితే స్థానిక సంస్థల ఎన్నికల నాటికి ఆ పార్టీ నాయకులు ప్రచారం కోసం గ్రామాల్లోకి వెళ్ల గలరా అన్నది ప్రశ్న.

లబ్ధిదారుల ఎంపిక చూస్తే... లోపభూయిష్ఠంగా ఉంది. ఇందిరమ్మ ఇళ్లకు ఆధార్‌ కార్డును ఆధారంగా చేసుకోవటం అతిపెద్ద సమస్య. ఇంటి జాగా గ్రామంలో ఉండి... వాళ్లు పట్టణంలో నివసించి, ఆధార్‌ కార్డు పొందితే వాళ్లు అనర్హులవుతారు. ఈ కారణంగా గ్రామసభల్లో ఆందోళనలు జరుగుతున్నాయి. ప్రజాపాలనలో, కులగణనలో తీసుకున్న వివరాల ఆధారంగా లబ్ధిదారుల ఎంపిక చేయకుండా మళ్లీ దరఖాస్తులు తీసుకోవటం కేవలం కాంగ్రెస్‌ కార్యకర్తలకు ప్రయోజనం కల్గించటానికేనని ప్రజలు అనుమానిస్తున్నారు.

ఇక ‘ఆత్మీయ భరోసా’ విధివిధానాలపై పల్లె జనం భగ్గుమంటున్నారు. గత సంవత్సరంలో 20 రోజులు ‘ఉపాధి హామీ’ పనికి వెళ్లిన వారికే భరోసా ఇస్తామంటున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రైతు కూలీలందరికీ ఇస్తామని చెప్పినకాంగ్రెస్‌ నాయకులు ఇప్పుడు మోసం చేస్తున్నారన్న ఆవేదన రైతు కూలీల్లో ఉంది. మున్సి పాల్టీల్లో విలీనమైన గ్రామాలకు ఉపాధి హామీ పథకం వర్తించదు. కానీ ఇప్పటికీ ఆ ప్రాంతాల్లోని వాళ్లు వ్యవసాయంపై ఆధారపడే జీవిస్తున్నారు. వీళ్లు ఏరకంగా ఆత్మీయ భరోసాకు అనర్హులవుతారో ముఖ్యమంత్రే చెప్పాలి. ఆధార్, బ్యాంకు లింక్‌ లేని కారణంగా చాలా కార్డులు తొలగింపునకు గురయ్యాయి. లక్షలాదిమంది దగ్గరలోని పట్టణాలు, హైదరాబాద్‌లో మెరుగైన కూలీ కోసం తాత్కాలికంగా వెళ్లిన వలసకూలీలు ఉపాధి పనులకు వెళ్లలేదు. కొందరు వర్షాకాలం, యాసంగి పంటలకు మాత్రమే ఊళ్లోకి వస్తారు. జీవనపోరాటంలో తలమునకలవుతున్న వీళ్లంతా ఏవిధంగా అనర్హులవుతారు?

చ‌ద‌వండి:  ఆహార భద్రతకు ఆ ఆదాయమే కీలకం

దేశంలో ఏ రాష్ట్రంలోనూ అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే ఇన్ని నిరసనలు ఏ ప్రభుత్వమూ ఎదుర్కొని ఉండదు. పాలనలో ఎలాంటి అనుభవం లేని రేవంత్‌ రెడ్డి ఈ నిరసనల్ని ఎదుర్కోవటానికి పోలీసుల్ని ఆశ్రయించటమే పెద్ద సమస్య. ఏ ప్రజాపోరాటాల్నీ, నిరసనల్నీ బల ప్రయోగం ద్వారా ఎదుర్కోలేమన్న విషయాన్ని ఆయన గుర్తించాలి. తెలంగాణ గడ్డపై పుట్టిన ప్రతివాడూ ఆకలినైనా సహిస్తాడు, కానీ మోసాన్ని ఎండగడతాడు!

- డాక్ట‌ర్‌ బీఎన్‌ రావు 
బీఎన్‌ రావు ఫౌండేషన్‌ ఫౌండర్‌ ప్రెసిడెంట్‌ 

ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
grama sabhalu
Ration card applications
Indiramma house
Telangana
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

బండి సంజయ్‌ కాన్వాయ్‌కు స్వల్ప ప్రమాదం

బండి సంజయ్‌ కాన్వాయ్‌కు స్వల్ప ప్రమాదం

18న సరూర్‌నగర్‌లో యువ సంగ్రామ సదస్సు: కేటీఆర్‌

18న సరూర్‌నగర్‌లో యువ సంగ్రామ సదస్సు: కేటీఆర్‌

ప్రశాంతంగా చనిపోయాడు.. కాల్చి కాల్చి చంపాల్సింది..!

ప్రశాంతంగా చనిపోయాడు.. కాల్చి కాల్చి చంపాల్సింది..!

శంషాబాద్‌ వద్ద ఘోర ప్రమాదం.. భారీగా ట్రాఫిక్‌ జామ్‌

శంషాబాద్‌ వద్ద ఘోర ప్రమాదం.. భారీగా ట్రాఫిక్‌ జామ్‌

‘స్లీప్‌’ డేంజర్‌!

‘స్లీప్‌’ డేంజర్‌!

 ప్రియుడి మోజులో భర్త హత్య

ప్రియుడి మోజులో భర్త హత్య

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.