Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Family
  3. Family Home
ADVERTISEMENT 

జెప్టో జెట్‌ స్పీడ్‌

Family Sakshi User Sakshi Sakshi Time Jan 12, 2024 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
Aadit-Palicha.jpg

ఇరవై ఏళ్ల వయసు దాటని వారు ఏదైనా కీలక నిర్ణయం తీసుకోవడానికి రెడీ అవుతున్నప్పుడు ‘ఈ వయసులో ఎందుకు?’ అనే మాట వినిపించడం సాధారణం. కైవల్య వోహ్ర, అదిత్‌ పలిచా ‘జెప్టో’ స్టార్టప్‌కు శ్రీకారం చుట్టినప్పుడు కూడా ఇలాంటి మాటలు కాస్త గట్టిగానే వినబడ్డాయి. అయితే ఈ మిత్రద్వయం వెనక్కి తగ్గలేదు. ‘జెప్టో’తో సూపర్‌ హిట్‌ కొట్టింది. ‘సక్సెస్‌కు వయసుతో పనిలేదు’ అని మరోసారి నిరూపించింది. ఆన్‌లైన్‌ గ్రాసరీ డెలివరీ ప్లాట్‌ఫామ్‌ ‘జెప్టో’ సూపర్‌ సక్సెస్‌ కావడమే కాదు యూనికార్న్‌ స్టేటస్‌ సాధించింది. నడక నుంచి పరుగు వరకు ‘జెప్టో’ నుంచి యువతరం నేర్చుకోవాల్సిన పాఠాలు ఎన్నో ఉన్నాయి....

పాఠం నెం 1: క్లారిటీ

స్టాన్‌ఫర్డ్‌లో కంప్యూటర్‌ సైన్స్‌ చదువును వదిలేసి స్వదేశానికి తిరిగి వచ్చిన కైవల్య, అదిత్‌ల ముందుకు వచ్చి నిలబడిన ప్రశ్న...‘మీరు ఏం చేయాలనుకుంటున్నారో క్లారిటీ ఉందా?’

హండ్రెడ్‌ పర్సంట్‌. లాక్‌డౌన్‌ సమయంలో వచ్చిన ఐడియాను స్టార్టప్‌ రూపంలో రోడ్డు ఎక్కించాలంటే ఉత్సాహం మాత్రమే సరిపోదు. సబ్జెక్ట్‌పై క్లారిటీ ఉండాలి. దీని కోసం ఇ–కామర్స్‌ ఇండస్ట్రీకి సంబంధించిన సమాచారాన్ని కాచి వడబోసినంత పని చేశారు కైవల్య, ఆదిత్‌లు.

పాఠం నెం 2:  నమ్మకం

చిన్న వయసు కావడం వల్ల కైవల్య, అదిత్‌లను ఇన్వెస్టర్‌లు నమ్మడం అంత తేలికైన విషయం కాదు. ఫండింగ్‌ విషయంలో ఇది ఇబ్బందిగా మారుతుంది. ‘మీకు ఎలాంటి అనుభవం లేదు కదా. ఎలా నమ్మడం?’ అంటారు. అయితే సక్సెస్‌ అన్ని సమస్యలకు జవాబు చెబుతుంది. మనపై ఇతరులకు నమ్మకం కలిగిస్తుంది. తొలి అడుగుల్లోనే ‘జెప్టో’ గెలుపు జెండా ఎగరేయడం వల్ల ఫండింగ్‌ విషయంలో ఇబ్బంది కాలేదు.

పాఠం నెం 3: ధైర్యం

‘ఈ పని రాదు అని మేము ఎప్పుడూ భయపడలేదు. ఎందుకు రాదు...ప్రయత్నించి చూద్దాం అనుకొని ముందుకు వెళ్లాం. ఈ క్రమంలో పెద్ద కంపెనీల నుంచి పోటీ ఎదురైంది. ఆ పోటీ నుంచి కూడా ఎన్నో విషయాలను నేర్చుకున్నాం. మేము భయం దగ్గరే ఆగిపోయి ఉంటే మా ప్రయాణం కొనసాగేది కాదు’ అంటాడు ‘జెప్టో’ కో–ఫౌండర్, సీయివో కైవల్య వోహ్ర. స్టార్టప్‌ మొదలు పెట్టినప్పుడు పెద్ద కంపెనీలతో పోల్చి మాట్లాడుతుంటారు చాలామంది. వారి మాటలకు చిక్కితే భయమే మిగులుతుంది. భయం అనేది అపజయానికి క్లోజ్‌ఫ్రెండ్‌.

పాఠం నెం 4: టీమ్‌ స్ట్రెంత్‌

స్టీవ్‌ జాబ్స్‌ను అభిమానించే కైవల్య, అదిత్‌లకు ఆయన నోటి నుంచి వచ్చిన ‘వ్యాపారంలో గొప్ప విజయాలు అనేవి ఒక వ్యక్తి వల్ల వచ్చేవి కాదు. అది సమష్టి కృషి’ అనే మాట తెలియనిదేమీ కాదు. అందుకే తమ మీద తమకు ఆత్మవిశ్వాసం ఉన్నా అది హద్దులు దాటకుండా చూసుకున్నారు. టీమ్‌ స్ట్రెంత్‌ను నమ్ముకున్నారు. వారి నుంచి సలహాలు తీసుకున్నారు.

పాఠం నెం 5: రీసెట్‌ డీఎన్‌ఏ

తమ కంపెనీ తక్కువ టైమ్‌లోనే ఘన విజయాన్ని సాధించిన సంతోషంలో ‘జెప్టో స్పీడ్‌’ అనే టర్మ్‌ను కాయిన్‌ చేశాడు ‘జెప్టో’ కో–ఫౌండర్, సీయివో అదిత్‌ పలిచా. అయితే ఈ జెప్టో స్పీడ్‌కు స్పీడ్‌ బ్రేకర్లు ఎదురొచ్చిన సందర్భాలు ఉన్నాయి. అలాంటి క్లిష్ట సమయాల గురించి అదిత్‌ పలిచా ఇలా స్పందిస్తాడు ‘మరింత క్రమశిక్షణతో ఉండాలనుకున్న సమయం, సుస్థిరమైన ఎదుగుదల మార్గాలపై మరింత దృష్టి పెట్టాలని అనుకున్న సమయం, కంపెనీ డీఎన్‌ఏను రీసెట్‌ చేయాలనుకున్న సమయం అది.’

 

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
Startup
Online Grocery Business
online delivery
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

సాఫ్ట్‌వేర్ ఉద్యోగులకు సీఈవో వింత గిఫ్ట్‌లు

సాఫ్ట్‌వేర్ ఉద్యోగులకు సీఈవో వింత గిఫ్ట్‌లు

ఒక్క వాట్సాప్ మెసేజ్.. ఐటీ ఇంటర్న్‌పై వేటు!

ఒక్క వాట్సాప్ మెసేజ్.. ఐటీ ఇంటర్న్‌పై వేటు!

అంకిత అద్భుత విజయం

అంకిత అద్భుత విజయం

దీపిందర్ గోయల్ కొత్త స్టార్టప్‌లో ఉద్యోగాలు

దీపిందర్ గోయల్ కొత్త స్టార్టప్‌లో ఉద్యోగాలు

నకిలీ రెజ్యూమెతో కంపెనీకి కుచ్చుటోపీ

నకిలీ రెజ్యూమెతో కంపెనీకి కుచ్చుటోపీ

ఇ​క స్టార్టప్‌ అంటే రూ. 200 కోట్లు!

ఇ​క స్టార్టప్‌ అంటే రూ. 200 కోట్లు!

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.