Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Family
  3. Family Home
ADVERTISEMENT 

గంగే మాం పాహి

Family Sakshi User Sakshi Sakshi Time Mar 4, 2024 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
iStock-1408894834.jpg

వాగ్గేయకార వైభవం

విష్ణుమూర్తి స్పర్శచేత పరమపావనియైన గంగలో స్నానం చేస్తే సకల పాపాలు పోతాయన్నది సనాతన ధర్మ విశ్వాసం. అంటే... పాపాలు చేసి గంగలో మునిగి వాటిని పోగొట్టుకోవచ్చని అర్థం చేసుకోకూడదు. తెలిసో తెలియకో ఇప్పటివరకు చేసిన పాపాలు గంగాస్నానంతో పోగొట్టుకుని,  ఇక మీదట ఎటువంటి పాపపు పనులు చేయకుండా నన్ను నేను నియంత్రించుకునే శక్తినీయవలసిందిగా భగవంతుని వేడుకోవాలి.

అదే ధర్మాచరణం. వద్దన్న పని వదిలిపెట్టడమే ధర్మాచరణ. అది విష్ణువుకు ప్రీతిపాత్రం. ముత్తుస్వామి దీక్షితార్‌ వారు గంగపై కీర్తన చేస్తూ... ‘‘గంగే మాం పాహి గిరీశ శిర స్థితే/గంభీర కాయే గీత వాద్య ప్రియే/అంగజ తాత ముదే అసి వరుణా మధ్యే/అక్రూర పూజితే అఖిల జనానందే...’’ అన్నారు.  గంగమ్మ గొప్పదనాన్ని చెబుతూ... అక్రూరపూజితే అని కూడా అన్నారు.



గంగను కీర్తిస్తూ అక్రూరుడి ప్రస్తావన ఎందుకు తెచ్చినట్టు ..?  మిగిలిన పురాణాలన్నింటినీ వ్యాస భగవానుడు రాస్తే... విష్ణు పురాణాన్ని పరాశర మహర్షి ఇచ్చాడు. శమంతకోపాఖ్యానం దీనిలోనిదే. అయితే ఇక్కడ గమ్మత్తయిన ఒక విషయం చెప్పుకోవాలి. వినాయక చవితినాడు వ్రత మహాత్మ్యంలో మనం ఒక కథ చదువుకుంటూంటాం.

ఒక పసిపిల్ల ఉయ్యాల్లో ఉందనీ, ఆ పిల్లను కృష్ణుడు పెళ్ళి చేసుకున్నాడనీ, ఆమే జాంబవతి అనీ... ఇలా సాగుతుంది.. కానీ నిజానికి విష్ణు పురాణంలో చెప్పింది వేరు. ఉయ్యాల్లో ఉన్నది పసిపిల్లవాడు. దానిని ఊపుతున్న యవ్వని జాంబవతిని కృష్ణపరమాత్మ పెళ్లి చేసుకున్నాడు. వినాయక చవితి రోజున మిగిలిన కథను పూర్తిగా చదివినా చదవకపోయినా...‘‘...తవ హియేషా శమంతకః’’ అంటూ ముగిస్తారు.



నిజానిక శ్రీకృష్ణుడు శమంతక మణివల్ల ఎన్ని కష్టాలుపడాలో అన్ని కష్టాలు పడ్డాడు. అటు సత్యభామకు దూరమయిపోయాడు, ఇటు జాంబవతికీ దూరమయ్యాడు. శమంతక మణిని కృష్ణుడే కాజేసాడని వారిద్దరే కాదు, బలరాముడు, ఇతర బంధువులు, ద్వారకానగరవాసులూ అందరూ అనుమానించారు. ఇంతకూ అసలు శమంతకమణి ఎక్కడుంది? అక్రూరుడి దగ్గర. అక్రూరుడు ఎక్కడున్నాడు? అంటే... ఆ మణికి ఒక నియమం ఉంది.

బాహ్యాభ్యంతర శౌచం ఎవరికుంటుందో వారిదగ్గర అది బంగారం పెడుతుంది, దాన్ని దాచుకోకుండా లోకసంక్షేమం కోసం వెచ్చించే పరమ భాగవతోత్తముడి దగ్గర ఉంటుంది. లేకపోతే చంపేస్తుంది. ప్రసేనుడు, సత్రాజిత్తు అలాగే చచ్చిపోయారు. కాబట్టి అది ఉన్నచోట నిత్యాన్నదానాలతో నవ వసంతశోభ ఉంటుంది. అలా కాశీ వెలిగిపోతున్నది కాబట్టి అక్కడ అక్రూరుడు ఉంటాడని భావించి ‘అక్కడికి వెళ్ళి అక్రూరుడిని పిలుచుకురండి’ అని కృష్ణుడు ఆదేశించాడు.

గంగను పూజిస్తూ గంగలో స్నానం చేస్తున్న అక్రూరుడికి కృష్ణుడి సందేశం వినిపించగానే.. అక్రూరుడు వెళ్ళి ఆ శమంతకమణిని ఇవ్వబోతే...‘‘అంతః శౌచం, బాహ్య శౌచం’ నీలో ఉన్నాయి కనుక అది నీవద్దే ఉంచుకో’ అని కృష్ణుడు చె΄్పాడు. అక్రూరుడు ద్వారకానగరం వదిలిపెట్టాల్సి వచ్చినప్పుడు కాశీ వెళ్ళి అక్కడే ఉండిపోయాడు గంగకోసం. పరమ భక్తితో రోజూ పూజిస్తూ నిత్యం గంగలో స్నానం చేసేవాడు.  శాస్త్రాలు చదవకపోయినా గంగానది ఒడ్డున గురువుగారి శుశ్రూషలో ఇన్ని విషయాలు తెలుసుకున్న దీక్షితార్‌ వారి కీర్తనల్లో అనేక శాస్త్ర రహస్యాలను ప్రస్తావిస్తారు. వాటిలో గంగను స్తుతిస్తూ చేసిన ఈ కీర్తన ఒకటి.                



బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
Ganga River
sin
Brahma Sri Chaganti Koteswara Rao
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

భారత్‌కు బంగ్లా టెన్షన్‌.. పద్మా నదిపై చైనా ప్లానేంటి?

భారత్‌కు బంగ్లా టెన్షన్‌.. పద్మా నదిపై చైనా ప్లానేంటి?

గంగా నదిలో మాఘమేళా.. బాస్మతి, అఫ్సానా వైరల్‌..

గంగా నదిలో మాఘమేళా.. బాస్మతి, అఫ్సానా వైరల్‌..

కొనసాగుతున్న ముమ్మర గాలింపు

కొనసాగుతున్న ముమ్మర గాలింపు

 కలియుగ శ్రవణ కుమారుడు

కలియుగ శ్రవణ కుమారుడు

పుణ్యకార్యం...  పాపకార్యం

పుణ్యకార్యం... పాపకార్యం

పాప ప్రక్షాళన కోసం..  అద్భుతమైన ఆలయం

పాప ప్రక్షాళన కోసం.. అద్భుతమైన ఆలయం

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.