మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు యూఎస్ కాన్సులేట్ అకాడమీ ఫర్ ఉమెన్ ఎంట్రప్రెన్యూర్స్ ప్రోగ్రామ్(AWE)చక్కటి అవకాశం కల్పిస్తోంది. యూఎస్ పూర్వవిధ్యార్థులతో ఇన్-క్లాస్ డిస్కషన్, మెంటరింగ్ వంటి ట్రైనింగ్ సెషన్‌ను నిర్వహిస్తుంది. యుఎస్ కాన్సులేట్ జనరల్ సహకారంతో కళింగ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, టెక్నాలజీ బిజినెస్ ఇంక్యుబేటర్స్ (KIIT-TBI) సంయుక్తంగా ఈ ప్రొగ్రామ్‌ను నిర్వహిస్తుంది.అయితే ఈ ట్రైనింగ్ సెషన్‌కు హాజరు కావాలంటే అభ్యర్థులు జూన్ 30లోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
వరంగల్, భువనేశ్వర్, విశాఖపట్నం, తిరుపతి వంటి నాలుగు నగరాల్లో మొత్తం 100 మంది ఔత్సాహిక, మహిళా పారిశ్రామికవేత్తలను గుర్తించి వారికి అకాడమీ ఫర్ ఉమెన్ ఎంట్రప్రెన్యూర్ ఈ ట్రైనింగ్ సెషన్‌ను అందిస్తుంది. ప్రతి లొకేషన్లో 25మంది పాల్గొనొచ్చు. కాబట్టి అభ్యర్థులు ముందుగానే ఆన్లైన్లో తమ పేరును రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది.
ఎవరెవరు ఈ ట్రైనింగ్‌కు అర్హులు?
♦ ట్రైనింగ్ సెషన్‌కు హాజరయ్యే వాళ్ల మహిళల వయసు 18-50 ఏళ్ల మధ్య ఉండాలి.
♦ అప్లికేషన్‌ను జూన్ 30లోగా ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకోవాలి.
♦ అభ్యర్థులు డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. చివరి సంవత్సరం చదవుతున్న వాళ్లు కూడా అప్లై చేసుకోవచ్చు
♦ ముందుగానే ఏ బిజినెస్ చేయాలి? ఎలా చేయాలి వంటివాటిపై అవగాహన కలిగి ఉండాలి.
అప్లికేషన్ ఆన్లైన్లో https://awe.kiitincubator.inలో అందుబాటులో ఉంది. పూర్తి సమాచారం కోసం https://forms.gle/zqSFnhZ6veNq7JQV7 వెబ్‌సైట్‌ను వీక్షించండి.
Don’t miss out! We only have a few seats left in our Academy of Women Entrepreneurs (AWE) program in Telangana, Andhra Pradesh, and Odisha. Aspiring women entrepreneurs are encouraged to apply. Application deadline is Friday, 30 June.
More details: https://t.co/Q2vyoS7tRa https://t.co/0wtqiZrXAL— U.S. Embassy India (@USAndIndia) June 27, 2023