Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Family
  3. Family Home
ADVERTISEMENT 

టీవి స్టార్‌గా పేరు తెచ్చుకుంటూనే.. ఎంట్రపెన్యూర్‌గా రాణిస్తున్న ఆష్క

Family Sakshi User Sakshi Sakshi Time Jul 14, 2023 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
lady_20boss.jpg

నేషనల్‌ స్కూల్‌ ఆఫ్‌ డ్రామా (ఎన్‌ఎస్‌డీ) స్టూడెంట్‌ అయిన ఆష్క గొరాదియకు బాలీవుడ్‌లో బ్రేక్‌ రాలేదు. అయితే ఆ అసంతృప్తి ఆమె మాటల్లో ఎప్పుడూ తొంగి చూసేది కాదు. ప్రతి అడుగులో ఆత్మవిశ్వాసం కనిపించేది. ఆ ఆత్మవిశ్వాసమే ఆమెను వ్యాపార రంగం వైపు నడిపించింది. ‘రెనీ కాస్మెటిక్స్‌’తో ఎంటర్‌ప్రెన్యూర్‌గా ఘనవిజయాన్ని సాధించింది..

బాల నటిగా కెరీర్‌ మొదలు పెట్టింది ఆష్క గొరాదియ. తన ప్రయాణంలో రకరకాల సవాళ్లు, కష్టాలు ఎదురైనా వెనక్కి తగ్గలేదు. వాటివల్ల పోరాటం ఎలా చేయాలో తనకు తెలిసింది. హిందీ సినిమాల్లో నటిస్తున్న కాలంలోనే హాలీవుడ్‌ కలలతో అమెరికా వెళ్లింది. అక్కడ పెద్దగా అవకాశాలు రాకపోవడంతో తిరిగి ఇండియాకు వచ్చింది. బాలీవుడ్‌ సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసి, ఎన్నో టీవి సీరియల్స్‌లో నటించి ‘టీవి స్టార్‌’గా పేరు తెచ్చుకున్న ఆష్క ఎంటర్‌ప్రెన్యూర్‌గా ప్రయాణం మొదలుపెట్టాలనుకుంది. అయితే అది అంత తేలిక కాదనేది తనకు తెలియని విషయమేమీ కాదు. తన కళ్ల ముందే ఎన్నో అనుభవాలు ఉన్నాయి.

అయితే అవేమీ తనకు అడ్డు కాలేదు.  మొదటి అడుగుగా సొంతంగా ప్రొడక్షన్‌ కంపెనీ మొదలుపెట్టిన ఆష్క ఎన్నో సక్సెస్‌ఫుల్‌ టీవీ షోలు చేసింది. ఆ తరువాత ట్రావెలర్స్‌ కోసం ఒక మొబైల్‌ యాప్‌ వెంచర్‌ను లాంచ్‌ చేసింది. ఆ తరువాత స్నేహితులతో కలిసి ప్రారంభించిన ‘రెనీ కాస్మెటిక్స్‌’ ఆమెను స్టార్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌గా మార్చింది.ఎంటర్‌ప్రెన్యూర్‌గా ఆష్క ఘనవిజయం ఎంతోమంది ఔత్సాహికులకు స్ఫూర్తి ఇచ్చింది. ఎంటర్‌ప్రెన్యూర్‌గా రాణించాలనుకునే వారికి ఆమె చెప్పిన కొన్ని సలహాలు..

కల కనాలి... ముందుకదలాలి: ఒకరి నుంచి స్ఫూర్తి పొందిన తరువాత కల శ్రీకారం చుట్టుకుంటుంది. అయితే అది సాకారం కావాలంటే ఆచరణలోకి రావాలి. పనికి సంబంధించి స్థాయిని పెంచుకుంటూ పోవాలి.

అంకింతభావం ప్లస్‌ కష్టం: నటన అయినా వ్యాపారమైనా సక్సెస్‌ కావాలంటే అంకితభావంతో పాటు బాగా కష్టపడాలి. ఒకవేళ  విజయం సాధించకపోయినా మనం కన్న కలకు దూరం కావద్దు. ఓటమి నేర్పే పాఠాలతో ముందుకు వెళ్లాలి. సానుకూల ఆలోచనలకు ప్రాధాన్యత ఇవ్వాలి.

రిస్క్‌కు భయపడితే రిస్క్‌: ఈతకొట్టడానికి నీళ్లలోకి దిగిన తరువాత నీళ్లకు భయపడితే ఎలా! వ్యాపారం అన్నాక రిస్క్‌ ఉంటుంది. అంతమాత్రాన వెనక్కి తగ్గనవసరం లేదు. మూస ఆలోచనలకు భిన్నంగా కొత్తగా ఆలోచిస్తే విజయం మన చెంతకు నడిచొస్తుంది.

కోవిడ్‌ కల్లోల సమయంలో ఎన్నో వ్యాపారాలలాగే మా వ్యాపారం కూడా దెబ్బతింది. ‘ఇక నీకు నటనే దిక్కు’ అనేవాళ్లు. అయితే నేనెప్పుడూ నమ్మకం కోల్పోలేదు. మంచిరోజులు వస్తాయని గట్టిగా నమ్మాను. అది నిజమైంది.

నెట్‌వర్క్‌: నటనకైనా, వ్యాపారానికైనా పదిమందితో పరిచయం ముఖ్యం. ఈవెంట్స్, వర్క్‌షాప్‌లకు హాజరుకావడంతో పాటు ఆన్‌లైన్‌ కమ్యూనిటీలతో టచ్‌లో ఉండాలి. సామాజిక సంబంధాల ద్వారా కొత్త విషయాలు తెలుస్తాయి. ఆలోచన పరిధి విస్తరిస్తుంది. ముందుకు వెళ్లడానికి కావాల్సిన ధైర్యం లభిస్తుంది. 

యుఎస్పీ: ‘మా బ్రాండ్‌ ఇది’ అని మాత్రమే కాదు ‘మా యూఎస్పీ ఇది’ అని గర్వంగా చెప్పుకోగలగాలి. మా బ్రాండ్‌ విషయానికి వస్తే హై–క్వాలిటీ, గతంలో ఎప్పుడూ చూడని ప్యాకేజీ, పాకెట్‌–ఫ్రెండ్లీ ప్రైస్‌ అనేవి మా యూఎస్పీ. మార్కెట్‌ ప్లేస్‌లకు వెళుతూ ఎప్పటికప్పుడు ట్రెండ్స్‌ తెలుసుకోవాలి.

ఆష్కకు నటన, యోగా, పోల్‌ డ్యాన్స్, ట్రావెల్‌ అంటే ఇష్టం. ఇక ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ అనేది వాటికంటే రెండు రెట్లు ఎక్కువ ఇష్టమైనది. సినిమాలు, టీవీ సీరియల్స్‌లో ఆష్క‘బిజినెస్‌ ఉమన్‌’ పాత్ర ధరించలేదు. అయితే నిజ జీవితంలో మాత్రం ఆమె ‘బిజినెస్‌ ఉమన్‌’గా అద్భుత విజయాన్ని సాధించింది. ‘ది బాస్‌ లేడీ’ అని స్నేహితులతో పిలిపించుకుంటోంది.

(చదవండి: పద్నాలుగేళ్లకే ఎలన్‌ మస్క్‌ కంపెనీలో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా..)

ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
National School of Drama
Student
enterprenuers
tv actress
turned
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

షాక్‌ అనాలా?.. అద్భుతం అనాలా??.. 'ఇది నా పేపర్‌ కాదు' అనుకుంది!

షాక్‌ అనాలా?.. అద్భుతం అనాలా??.. 'ఇది నా పేపర్‌ కాదు' అనుకుంది!

అమెరికాలో తెలంగాణా విద్యార్థి అరుణ్‌ సాయి రెడ్డి హఠాన్మరణం

అమెరికాలో తెలంగాణా విద్యార్థి అరుణ్‌ సాయి రెడ్డి హఠాన్మరణం

ఇంజినీరింగ్.. వెయిటింగ్

ఇంజినీరింగ్.. వెయిటింగ్

కాలేజీకెళ్లినా.. బతుకుదువు బిడ్డా!

కాలేజీకెళ్లినా.. బతుకుదువు బిడ్డా!

ఒత్తిడితో నీట్‌ విద్యార్థిని ఆత్మహత్య

ఒత్తిడితో నీట్‌ విద్యార్థిని ఆత్మహత్య

‘నీట్’ మరో షాక్: ఒడిశా విద్యార్థినికి 1500 కి.మీ దూరంలో సెంటర్!

‘నీట్’ మరో షాక్: ఒడిశా విద్యార్థినికి 1500 కి.మీ దూరంలో సెంటర్!

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.